గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, నవంబర్ 2009, శుక్రవారం

చెప్పుకోండి చూద్దాం 16.

ప్రియ సాహితీ ప్రియులారా!
ఈ క్రింది గీత పద్యంలోని ప్రశ్నకు సమాధానం కనుక్కోండి చూద్దాం.
వెంటనే పోష్ట్ చెయ్యండి.

తే:-
ఒక్క పురము పేరొప్పు నైదక్కరములు.
మొదటి మూడును వత్సరమునకు పేరు.
చివరి రెండును వీధికి చెల్లు వేణి
యగు ద్వితీయాంతముల చెప్పుడాపురంబు.

జైహింద్.
Print this post

2 comments:

Sandeep P చెప్పారు...

మీ ప్రశ్నకు సమాధానం:

తే||
ఇంద్రకీలాద్రి పైదేవి యెవ్వరయ్య?
కరుణ కృష్ణగ పొంగించు కనకదుర్గ
వాడలన్నిటిలోనయే వాడ గొప్ప
విశ్వనాథుని గన్నట్టి విజయవాడ

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఎందరు చదువగ వచ్చును.
సందీపుని వోలె పలుకు సౌమ్యులు ఘనులై
యందరి కెఱుగగ తెలుపుదు
రందరి కే నంజలింతు బతులిత ప్రీతిన్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.