గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, నవంబర్ 2009, బుధవారం

చెప్పుకోండి చూద్దాం 19.

సాహితీ ప్రియులారా!
ఈ క్రింది పద్యములో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోండి చూద్దాం.

సీ:-
ఏమి చేయక వృధా ఏటినీరేగును ? { కట్ట కట్టక.}
భూపాలుడేటికి పుట్టువొందు ? { నేల నేలనే.}
తుంగ ముస్తెల ప్రీతి తొలకాడు వేనికి ? { కిటి కోటికి.}
సభవారి నవ్వించు జాణ యెవడు ? { వికట కవి.}
కలహంస నివసించు కాసార మెయ్యెది ? { సుర సరసు.}
వీరుడెద్దానిచే విజయమందు ? { చేతి హేతిచే.}
లజ్జ యెవ్వరికమూల్యపుటలంకారంబు ? { కుల స్త్రీలకు.}
దేవాంగులకు దేన జీవనంబు ? { నేత చేతనే.}
గీ:-
అన్నిటికిఁ జూడ నైదేసి యక్షరములు.
ఒనర నిరుదెసచదివిన నొక్కరీతి.
చెప్ప గలిగినవారెల్ల గొప్పవారు.
చెప్ప దలచెడి వారును గొప్పవారె.

సమాధానం వెంటనే పంపగలరు. సమాధానం తెలుకో లేకపోతే , తెలుసుకోవాలనే టేంక్షన్ ఆపుకో లేకపోతే ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది. వెతికి తెలుసుకొని, పంపండి .

జైహింద్.
Print this post

6 comments:

బృహఃస్పతి చెప్పారు...

రామకృష్ణారావు గారూ, సమాధానాలన్నీ జల్లెడలో మీటపా చూడక ముందే కనపడుతున్నాయండీ... ఫాంట్ కలర్ మార్చినా జల్లెడలో బాగానే కనపడతాయి.

యడవల్లి శర్మ చెప్పారు...

ఒక ప్రశ్నకు సమాధానం: వికటకవి

కంది శంకరయ్య చెప్పారు...

8 ప్రశ్నల్లో కేవలం మూడింటికి మాత్రం సమాధానాలు తెలిసు.
1. కట్టకట్టక
4. వికటకవి
5. సురసరసు

కంది శంకరయ్య చెప్పారు...

8 ప్రశ్నల్లో కేవలం మూడింటికి మాత్రం సమాధానాలు తెలిసు.
1. కట్టకట్టక
4. వికటకవి
5. సురసరసు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శంకరయ్య! మీరు చక్కగా చెప్పిరి.
మూడు ప్రశ్నలకును ముచ్చటగను.
మిగిలినవి గనుడయ. మీ మౌసు నొక్కుతూ
సీస పద్యమందు. చిద్విలాస!

కంది శంకరయ్య చెప్పారు...

మౌజు నొక్కి ముందుకు సాగు మర్మమిపుడు
మీరు చెప్పఁగాఁ దెలిసెను మిగిలినట్టి
ప్రశ్నలకు సమాధానముల్ వచ్చెనండి
ఘనులు రామకృష్ణారావు గారు! నుతులు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.