గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, నవంబర్ 2009, బుధవారం

చెప్పుకోండి చూద్దాం 10

పాఠకాగ్రణీ! మీరాసక్తితో ఆంధ్రామృతాన్ని గ్రోలుతున్నందుకు చాలా సంతోషం.
మీ కోసం మరొక ప్రశ్న మీముందుంచుతున్నాను.
అంతాచదివి చక్కగ ఆలోచించి సమాధనం చెప్పుకోండి చూద్దాం.

కం:-
కాయ మీద మ్రాను, కడు రమ్యమై యుండు.
మ్రాను మీద లతలు మలయుచుండు.
లతల మీద వ్రేళ్ళు లాస్యమాడుచు నుండు.
దీని భావమేమి తిరుమలేశ.

ఆసక్తితో సమాధానం తెలుసుకో గోరే పాఠకుల కొఱకు మీ సమాధానాలు పంపండి.

జైహింద్.
Print this post

2 comments:

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

బొబ్బిలి దేనికి నెలవౌ
అబ్బురమౌ అమరగాన మహిమను పెంచన్
అబ్బెడునే వాయిద్యము
అబ్భారతి కరములందు అద్భుత రీతిన్

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అడిగిన దానికి బదులుగ
నడుగుచు గ్రహియింపమనిరి అడిగిన దానిన్.
అడిగిన దానికి నడుగుచు
వడిచూపితి ఫణి కుమార! పండిత వర్యా!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.