గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, మార్చి 2009, మంగళవారం

ఉగాది సందర్భంగా మీ రచనలకాహ్వానం.

sembahప్రియ సాహితీ బంధువులారా!
కొన్ని రోజులుగా గ్రామాంతరం వెళ్ళిన కారణంగా యీ మన బ్లాగులో క్రొత్త అంశాల నుంచలేక మీకు నిరాశ కలిగించినందుకు క్షంతవ్యుడను.

ప్రస్తుతం మనమంతా రాబోతున్న ఉగాది కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం కదా! మనమందరం కూడా నూతన వత్సరాదికి స్వాగతం పలుకుదాం.

మీరు కూడా మీ భావావేశాన్ని అణచుకోక పద్య రూపంలో గాని, గేయ రూపంలో గాని, ఈ మన బ్లాగులో నిక్షిప్తం చేయ గలిగితే నేను మీ పేరుతో సహా ప్రచురించే ప్రయత్నం చేయగలను. తద్వారా మనమందరం ఆనంద ఉగాదిని అనుభవిద్దాం. తప్పక పంపుతారుకదూ?
జైహింద్.babai Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.