గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, మార్చి 2009, బుధవారం

లహరి బ్లాగ్ ద్వారా శుభాకాక్షలందించిన అందరికీ ధన్యవాదములు.

doaనా అర్థాంగి శ్రీమతి విజయను నాకు తోడుగా ఆ పరమాత్మ సంధాన పరచిన శుభదినం సందర్భంగా లహరి బ్లాగులో శ్రీ వైష్ణవితో పాటు ఆ బ్లాగు ద్వారా శుభాకాంక్షలందఁ జేసిన స హృదయు లందరికీ మా ఉభయుల హృదయ పూర్వక ధన్యవదములు తెలియఁ జేసుకొంటున్నాము.

మా సాహితీ బంధువుల అభినందనలు:-
1) కొత్త పాళీ said...అభినందనలు!
2) krishna rao jallipalli said...హార్దిక శుభాకాంక్షలు
3) సిరిసిరిమువ్వ said...మీ అమ్మమ్మ గారికి, తాతయ్య గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు.వైష్ణవి నువ్వు రామకృష్ణారావు గారి మనవరాలివా!భేష్ తాతకు తగ్గ మనవరాలివన్నమాట.
4) durgeswara said...పెద్దలు సుకవులు రామకృష్ణారావుగారికి వారి సతీమణి గారికి శుభాకాంక్షలు.
5) జీడిపప్పు said...శ్రీ చింతా. రామ కృష్ణా రావు దంపతులకు ౩౩ వ పెళ్లి రోజు శుభాకాంక్షలు.
6) revanth said...హాయ్ శ్రీ వైష్ణవి! మీ అమ్మమ్మగారికీ , మీ తాతగారికి ౩౩ వ పెళ్ళిరోజు శుభాకాంక్షలు.
7) Ramu. hello dear vaishu nana . How are you ? PLEASE CONVEY MY REGARDS TO YOR TATAYA AND AMUMA ON THEIR MARRIAGE DAY.
8) పరిమళం said...వైష్ణవి!మీ అమ్మమ్మ గారికి, తాతయ్య గారికి 33 వ పెళ్ళిరోజు శుభాకాంక్షలు.3,3,33...3+3+3+3=3.very nice!
9) జ్యోతి said...మీ అమ్మమ్మ గారికి, తాతయ్య గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు.
రామకృష్ణగారు, మరి విజయగారికి పట్టుచీరో,పసిడి తునకో ఇచ్చారా లేక ఓ పద్యం ఇచ్చి సర్దుకో అన్నారా.
10)sobha said...vaishu thalli gadu....mee ammagariki,tata gariki pelli roju subhakanshalu cheppu..

ప్రియ సాహితీ బంధువులారా! మీ హృదయంలో మాపై గల ప్రేమకు ఏ విధంగా మేము కృతజ్ఞత చెప్పుకున్నా అది తక్కువే ఔతుంది. ఐనా నా మనసులోని కృతజ్ఞతా భావన ఒక సీస మాలిక ద్వార మీకు తెలియఁ జేసుకొంటున్నాను. దయతో గ్రహించవలసినదిగా మనవి.

సీ:-
విజయ లక్ష్మియె నన్ను విధి నెంచి వరియించె.
ముప్పది మూడేండ్లు ముందు గడిచె.

కొత్త పాళియె మాకు కోరిక లీడేర
అభినందనలు ప్రేమ నందఁ జేసె.

జల్లిపల్లి ఘనుడు సహృదయంబున శుభా
కాంక్షలందగఁ జేసె కరుణ తోడ.

సిరిసిరిమువ్వయు చిఱుసవ్వడుల శుభా
కాంక్షలందగఁ జేసె ఘనతఁ జూపి.

దుర్గేశ్వరులు మాకు భర్గుని కైవడి
శుభము లాకాంక్షించి శోభఁ గొలిపె.

జీడిపప్పురుచిని చూడంగఁ జేసి తా
శుభము లాకాంక్షించె నభవునివలె.

రేవంతుమహనీయ శ్రీమంతమగునట్లు
కాంక్షించి మాపైన కరుణఁ జూపె.

రాము తనకు తాను ప్రేమతో శుభముల
నాకాంక్షఁ జేసెను ప్రాకటమవ.

పరిమళంబులు గొల్పె పరిమళమే మాకు
గణనమందున మాదు ఘనత పెంచె.

జ్యోతిసోదరి లసద్యోగంబు కోఱుచు
పట్టు చీర, పసిడి పెట్టఁ జేసె.

శోభగారును మమ్ము శోభిల్ల జేయగా
నాకాంక్షలను తెల్పె ప్రాకటముగ.

పెండ్లి రోజని మమ్ము కండ్లలో నిడుకొని
అభినందనలు తెల్పి రసదృశముగ.

గీ:-
లహరి బ్లాగు వైష్ణవి సహృదయమున
పెండ్లిరోజును వివరించి వెలయఁ జేయ
శుభము కాంక్షించె నెందరో శోభ గొలిపె.
ధన్య వాదంబు లార్య సన్మాన్యులార!
జైహింద్.doadoa Print this post

4 comments:

రాఘవ చెప్పారు...

రామకృష్ణారావుగారూ నాకు ముందు తెలియలేదాయె. ఆలస్యంగానైనా మీ దంపతులకి పెండ్లిరోజు శుభాకాంక్షలు. ఆ భగవంతుని ఆశీస్సులు మీకూ, మీ ఆశీస్సులు మాలాంటి పిల్లకాయలకి ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ...
మీ
రాఘవ

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

చ:-
తెలుపగలేదు నే. లహరి తెల్పెను మాదగు పెండ్లి రోజు. మీ
రలుగకుడయ్య తెల్పమికి. అందరి యట్టులె మీరు కూడ మా
విలువను పెంచి తెల్పిరిగ! ప్రీతిగ మీ శుభ కాంక్ష లీయెడన్.
సలలిత భావ పూర్ణ! విలసన్నుత! రాఘవ! ధన్య వాదముల్.

ఆత్రేయ కొండూరు చెప్పారు...

రామకృష్ణారావుగారూ మీ దంపతులకి పెండ్లిరోజు శుభాకాంక్షలు. !!

ఓ చిన్న కానుక.. తప్పులు మన్నించ గలరు..
మనసులోని భావాన్ని కందంలో బందించడం కష్టమనిపించింది
ఐనా ప్రయత్నించాను.

పావని తోడయె రాముకు
సేవకు డయి.పా ర్ధునికడ చేరెను హరియే
బావగ సుఖములు జేయన్‌
ఆవిధి మీసతి కూడగ ఆనం దమయా

బంధం అన్యోన్యం గా
అందం చిందిం చుచుండు ! అంబర వీధిన్‌
ఇందుడు తారల సహితము
అందముగ మెరయు విధి ఇది అందరి భావం!!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

chinta vijaya
కి ఆత్రేయ

వివరాలను చూపించు 10:41 AM (0 నిమిషాల క్రితం)


జవాబివ్వు


ప్రియ ఆత్రేయా! చాలా ఆనందం. ధన్యవాదాలు.
పద్య రచన బాగుంది. ఐతే
మొదటి పద్యంలో ఆఖరి పాదంలో మూడవ గణం జగణం చిన్న మార్పుతో తేగలిగితే మరీ అద్భుతంగా కంద నియమ బద్ధంగ వుండి రాణిస్తుంది.

ఆవిధి మీసతి కూడగ ఆనం దమయా---> ఆవిధి మీసతియె కూడె నానందమయా.
మీ అభిమానానికి మా ఉభయుల ధన్యవాదాలు. మీకు మా శుభాశీశ్శులు.
ఇట్లు
చింతా రామ కృష్ణా రావు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.