గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, మార్చి 2009, ఆదివారం

ఉద్యోగుల హేండ్ బుక్


sembah
ఉద్యోగుల హేండ్ బుక్. మఱియు వైద్య రాయితీ పొందుటకు వీలు కల్పించు చున్న ప్రభుత్వ ఉత్తరువులు వివరిస్తూ బిల్లులు ఏ విధంగా పొందగలమో తెలియ జేసే పుస్తకము చోడవరం గ్రామస్తులు శ్రీ యస్. వేంకట రావు గారు మనకు అందుబాటులో వుంచారు.

1. ఊద్యోగుల హేండ్ బుక్ మఱియు మెడికల్ రి యెంబర్స్ మెంట్ { రెండు పుస్తకములు.):-
ఈ పుస్తకమునందు ఉద్యోగ పరిపాలన ( ఎష్టాబ్లిష్ మెంట్ )కు సంబంధించిన ముఖ్యాంశములు:-
పండుగ అడ్వాన్స్,విద్యా ఋణము , విద్యా రాయితీ, వివాహ ఋణం, గృహ నిర్మాణ ఋణం, మోటరు సైకిలు, మోటరు కారు, మోపెడ్, కంప్యూటరు ఋణం, కుటుంబ లబ్ధి నిధి (ఎఫ్.బీ.ఎఫ్.), ఏ విధంగా పొంద వలెనో, వాటి మంజూరు ఉత్తరువులు, మఱియు వాటికి సంబంధించిన నిబంధనలు వివరముగా ఇవ్వడమైనది.
వీటితో పాటు 1958 నుండి 2005 వరకు వేతన స్థిరీకతణలు ఏవిధముగా చేయ బడినవో తెలుపుతూ వాటికి సంబంధించిన నిబంధనలు వివరింపబడినవి.
వివిధ బిల్లులకు సంబంధించిన సర్టిఫికెట్లు, మఱియు బిల్లు ఫారములు క్షుణ్ణముగా ఇవ్వ బడినవి.
సర్వీస్ , కుటుంబ పింఛను దరఖాస్తు చేయు విధానము వివరముగా ఇవ్వ బడినది.
ఇంకను అనేక ఉపయోగకరమగు విషయములతో ఈ పుసకము ముద్రింప బడినది.

పై రెండు పుస్తకములు దిగువ చిఱునామా ద్వారా పొందగలము
కేరాఫ్ శ్రీమతి యస్. లక్ష్మి,
ఎక్సైజ్ పోలీస్ ష్టేషన్ వెనుక,
బోళ్ళ వీధి,
చోడవరం,
విశాఖ పట్టణం జిల్లా,
పిన్ కోడ్:-
531036

సంప్రదించ వలసిన ఫోన్ నెంబర్లు:-
9963793312
08934246100
జైహింద్.
babai Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.