గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, మార్చి 2009, సోమవారం

శ్రీ నల్లమోదు శ్రీదర్ కు జన్మదిన శుభాకాంక్షలు.

ros
శ్రీ నల్లమోదు శ్రీదర్ కు జన్మదిన శుభాకాంక్షలు.
:-
ఇంటరు నెట్టు శాసకుడు , ఈభువి తెల్గు వచించు వారికిన్
కంటకమైన యాంగ్లమును కాదని తెల్గున నెట్టు గుట్టులన్
కంటికి నింపుగా మదికి కమ్మగ జూపిన నల్ల మోదుకున్
జంటగ నుండి దైవము సజావుగ జీవన భాగ్యమిచ్చుతన్.

:-
పుట్టిన రోజు నేడతని పుట్టుక నెట్టుకు గట్టి పట్టు కాన్
గట్టిగ గుట్టుగా కృషిని కాదన కుండ యొనర్చి నేర్పి, నన్
దిట్టగ చేసినాడ ! సుధీమణి యీ మన నల్లమోదు. తా
నిట్టులె నూరు వత్సరము లీ భువి వెల్గుత! దైవ సత్ కృపన్.

:-
శ్రీధర! కావగ నిలుమా!
శ్రీధరునిల శుభములొసగి, శ్రేయస్కరుడై
యీ ధరణి తెలుగు బ్లాగుల
కాధారముగా రహించి యలరగనిమ్మా!
జైహింద్.
తేదీ. ౦౩ -౦౩ -2009.
celebrate Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.