గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, మే 2023, సోమవారం

TANAలో అనంతచ్ఛందము ద్వారా నా పద్యపఠనము.

0 comments

 

జైశ్రీరామ్.


౮౮. మానస భంజని    భ  ర  య  స  జ  గ    యతి ౯వ అక్షరము.

మానవ ధర్మమెన్ని, ప్రేమంగనుటొప్పగున్ ధరన్

జ్ఞాన సుధా స్రవంతి లోకాన రహింపగన్ ప్రభన్

దీనజనాళియున్  బ్రశాంతిన్ స్థిరమై రహించుతన్

శ్రీనరసింహమా దయాశ్రీ కురిపించుమా కృపన్.

౮౯. సురాసురవంద్య.        జ   జ   జ   జ   జ   వ,   యతి ౯వ అక్షరము.

ఉమాధవుఁడేలను రాడొ కనంబడ పేదలకున్

బ్రమోదమొ వారికి భారము మోపుట కష్టములన్

సమంచిత వృద్ధిఁ బ్రశస్తముగా నిడి బీదలకున్.

సమస్త సుఖంబులు శాశ్వత భోగము గొల్పదగున్.

౯౯. వీణార.   త   జ   జ   జ   జ   జ   జ   జ.   యతి  ౧౦.   ౧౯ అక్షరములు,

లోకంబున ధర్మము వర్ధిలు మార్గము నీశ్వరు నిచ్చలు తెల్ప, గ్రహించి,

శ్రీకారమునందున నారసి మూలము చిత్తము పొంగ చిదాత్ముని గాంచి,

లోకాత్ముని చెంతను వర్తిలు చిత్తము శాంతిగ వర్ధిలు, దక్షత తోడ

లోకాన రచించుచు వెల్గులు మెల్గెడిమూర్తుల, మేలుగ నిద్ధరఁ గొల్తు. 

జైహింద్.

28, మే 2023, ఆదివారం

శ్రీ శివ సహస్ర నామములకు చంద్రికా భాష్యము వ్రాసిన శ్రీ అంబాళం పార్థ సారథిగారు మా యింటికి వచ్చి మా గృహాన్ని పావనం చేశారు.

0 comments

జైశ్రీరామ్. 

ఓం నమో నారాయణాయ.

అంబాళాన్వయ! పార్థసారథి మహాత్మా! స్వాగతమ్మీకు, జ్ఞా
నం బాశంకర దత్తమై శివుని శ్రీ నామాళి సాహస్రమున్
సాంబుండే పులకింపగా వివరణన్ సంస్తుత్యమానంబుగా
శంభోశంకరయంచు వ్రాసిరికదా, శర్వాణియుప్పొంగగా.

మీ రాకన్ శుభ సంహతుల్ గలుగు సామీ! జ్ఞాన వారాశియే
మీ రూపంబున వచ్చి నన్ గృపగనెన్, మేలున్ సదా గొల్పగా,
ధీరోదాత్త శివంకరుండు దయతో దీర్ఘాయువున్ గొల్పుచున్
శ్రీరమ్యాక్షరసేవ చేయగ మిమున్ జిజ్ఞాసతోఁ బ్రోచుతన్.

చక్కని గ్రంథమునిచ్చిరి
మక్కుతో నన్ను గనిరి మహనీయుండా!
నిక్కముగా మీ ప్రేమను
వక్కాణింపంగ చాల, భద్రము మీకున్.

చింతా రామకృష్ణారావు.
జైహింద్.


24, మే 2023, బుధవారం

అక్షరామృతం ఉచ్చారణతో ఆరోగ్యం.

0 comments

 జైశ్రీరామ్.


జైహింద్.

21, మే 2023, ఆదివారం

నిరంతర సాధనతో గుర్తింపు పొందిన డా.బీ.హె.చ్వీ. రమాదేవి (కవయిత్రి)

0 comments

 

జైశ్రీరామ్.
నిరంతర సాధనతో గుర్తింపు పొందిన ఈ స్త్రీమూర్తికి నా అభినందనలు.
జైహింద్.

20, మే 2023, శనివారం

తెలుఁగు పద్యంలో క్రొత్త వృత్తాలు. తానా ప్రపంచ సాహిత్యవేదిక.

0 comments

 

జైశ్రీరామ్.
జైహింద్.





శ్రీకృష్ణుఁడు సత్యభామకు బహూకరించిన పారిజాతవృక్షము నేటికీ ఉన్నదిగా చెప్పబడుతున్నది ఇదే.

0 comments

 

జైశ్రీరామ్.
జైహింద్.

19, మే 2023, శుక్రవారం

ముప్పదిమూడుకోట్లసురముఖ్యులు వీరలె, మీరెఱుంగుడీ.

0 comments

 

జైశ్రీరామ్.
ఈ చిరంజీవికి జగన్మాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.
జైహింద్.

18, మే 2023, గురువారం

శివునిలో అంతర్భాగమయిన భవానీ ప్రార్థనా గర్భితమగు శివలింగబంధ ఉత్పలమాల.. రచన .. చింతా రామకృష్ణారావు.

0 comments

జైశ్రీరామ్. 

ఓం నమశ్ళివాయ.

కను నను భవాని! నిను గొలిచెదను.

శ్రీ(క)ర! భా(ను)తేజ!(న)ను జేరగనీ ని(ను) ముక్తి గాంచగా,

యేక్రియ నీ(భ)వాంబుధి గతింతు న(వా)రితరీతి? ధీ (ని)ధీ!

నీక(ని) నే(ను)మున్(గొ)లుతు నీ(లి)సుకంధర! ప్రో(చె)దీవె యం

చే కరణిన్(ద)యన్ గనుదొ?యీశ్వరుడా! వి (ను) తింతు నిన్నిలన్.


జైహింద్.

10, మే 2023, బుధవారం

గీత పారాయణానంతరము గీతా మాహాత్మ్యము పఠించనిచో పారాయణ నిష్ఫలమే.

0 comments

జైశ్రీరామ్. 

శ్లో.   గీతాయాః పఠనం కృత్వా మాహాత్మ్యం నైవ యః పఠేత్ |                                     వృథాపాఠో భవేత్ తస్య శ్రమ ఏవ హ్యుదాహృతః || 21 ||

క. గీతా పఠన మహత్వము
నేతరి చదువకను గీత నెంత చదివినన్
ఖ్యాతిని గొలపదు. సరికద
యాతని శ్రమ వ్యర్ధమిలను. హరినుత భక్తా!

భావము.

గీతని పఠించి పిదప మహత్యమును ఎవరు పఠించకుందురో 
అట్టి వారి గీతా పఠనము వ్యర్ధమే(నిష్ఫలమే). అట్టివారి 
గీతాపఠనము శ్రమ మాత్రమేనని చెప్ప బడినది.

జైహింద్.

18, ఏప్రిల్ 2023, మంగళవారం

అవధాని ChintaRama krushna Rao avadhanam

0 comments

14, ఏప్రిల్ 2023, శుక్రవారం

శ్రీ అష్టోత్తర శత సతీ అశ్వధాటి. (సతీ శతకము) 6వ పద్యము.

0 comments

3, ఏప్రిల్ 2023, సోమవారం

అవధాన విద్యా వికాస పరిషత్ భాగ్యనగరం l ‘క్షిప్రావధాని' శ్రీ ముద్దు రాజయ్...

0 comments

31, మార్చి 2023, శుక్రవారం

మా యింటికి వచ్చి మా గృహాన్ని పావనం చేసిన శ్రీలక్ష్మీనరసింహార్చకస్వామి శ్రీ దీవి శ్రీనివాసాచార్యులవారు

0 comments

 జైశ్రీరామ్.

మా యింటికి వచ్చి మా గృహాన్ని పావనం చేసిన శ్రీలక్ష్మీనరసింహార్చకస్వామి శ్రీ దీవి శ్రీనివాసాచార్యులవారు


శ్రీ లక్ష్మీ నరసింహ సంస్తుతమతుల్ శ్రీ దీవి వంశాన్వయుల్,
హేలన్ సద్వర శ్రీనివాస విబుధుల్ హృద్యంపు సద్రీతిలో
శ్రీలన్ గొల్పగవచ్చినారు కృపతో చెల్వొంద మాయింటికిన్,
శ్రీలక్ష్మీనరసింహదేవుఁడనగా చిత్తంబులో గొల్చితిన్.
జైహింద్.

వందారు భక్తజన మందారమా! (శ్రీ అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము) లో 2...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

శ్రీ సీతారామకల్యాణమహోత్సవము సందర్భముగా మా మనుమరాలు చిరంజీవి చింతా శ్రీవిజయలహరి చేసిన కూచిపూడి నాట్యము...RAAMAAYANAM NAATYAM CHIRANJEEVI CHINTA SREE VIJAYALAHARI IN SILP...

0 comments

జైశ్రీరామ్.
మానివాస స్థానమయిన సిల్పా'స్ ఆర్వీ ధర్మిష్ఠాలో. శ్రీ సీతారామకల్యాణమహోత్సవము సందర్భముగా మా మనుమరాలు చిరంజీవి  చింతా శ్రీవిజయలహరి చేసిన కూచిపూడి నాట్యము తిలకించి ఆశీర్వదించగలరని ఆశింతును.
జైహింద్.

29, మార్చి 2023, బుధవారం

కర్తవ్యంచైవ కర్తవ్యం......మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

శ్రీరామ్.

 శ్లో.  కర్తవ్యంచైవ కర్తవ్యం ప్రాణైః కంఠ గతైరపి;

అకర్తవ్యం న కర్తవ్యం ప్రాణైః కంఠ గతైరపి.

తే.గీ.  చేయవలసిన పనులను చేయవలయు

ప్రాణములు దేహమందున వరలు వరకు,

చేయకూడని పనులను చేయరాదు 

ప్రాణములుపోవుచుండినన్, భావ్యమదియె.

భావము.  

ప్రాణాలు పోయే వరకూ మనం ధర్మమే పాటించాలి.చేయకూడని పని 

చేయకూడదు.

జైహింద్.

27, మార్చి 2023, సోమవారం

"ఆశీస్సులు" ప్రభావంను... పద్యం లో వ్రాయoడి

0 comments

జైశ్రీరామ్.

 "ఆశీస్సులు" ప్రభావంను... పద్యం లో వ్రాయoడి

ఉ.  వందన మాచరించు తరి బ్రహ్మము నెన్నుచు చేయు వారికిన్

వందన మందువార లది బ్రహ్మకునర్పణ చేసి, పిమ్మటన్

బంధుర రీతి దీవనలు పల్క ననంత మహత్వ సత్ఫలం 

బందగ జేయు నిక్కమిది, యాత్మను శ్రీహరి దల్చి పల్కుటన్.

జైహింద్.

కవిః కరోతి కావ్యాని . ...మేలిమి బంగారం మన సంస్కృతి

0 comments

 

జైశ్రీరామ్.
శ్లో.  కవిః కరోతి కావ్యాని .. రసం జానాతి పణ్ణితః|

తరుః సృజతి పుష్పాణి .. మరుద్వహతి సౌరభమ్.

తే.గీ.  కవులు చేయగ సత్కావ్య కల్పనలను

కావ్యసారమున్  బండితుల్ గాంతురెన్ని,

వృక్షములు చక్కనైనట్టి విరులు పూయ

పరిమళము వ్యాప్తిచేయును వాయువిలను.

భావము.

కవి కావ్యాలను వ్రాయును. పండితుడు అందలి సారమును తెలుసుకొనును.

చెట్టు పుష్పములను పుష్పించును- వాయువు వాటి సుగంధమును వ్యాపింపజేయును.
జైహింద్.

23, మార్చి 2023, గురువారం

శ్రీ అన్నపరెడ్డిగారి ఉగాది పద్యాలు

0 comments

21, మార్చి 2023, మంగళవారం

విశ్వనాధ సత్యనారాయణ గారి స్వరం

0 comments

16, మార్చి 2023, గురువారం

శారదామాత స్తుతి,రచన. శ్రీ తోపెల్ల బాలసుబ్రమణ్యం గారు..గళం. దోర్బల బాలసుజ...

0 comments

14, మార్చి 2023, మంగళవారం

విశాలనేత్రాలు రచన. చింతా రామకృష్ణారావు గారు.గానం.దోర్బల బాలసుజాత|| AKHAN...

0 comments

10, మార్చి 2023, శుక్రవారం

అవధాన కళానిధి శ్రీ ఆముదాల మురళి గారి 4వ శతావధానం | రెండవ సభ

0 comments

9, మార్చి 2023, గురువారం

రాగీ కర్మఫలప్రేప్సుర్లుబ్ధో - ...18 - 27...//... అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో - ...18 - 28,,,//.....అథాష్టాదశోధ్యాయము - మోక్షసంన్యాసయోగము

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  రాగీ కర్మఫలప్రేప్సుర్లుబ్ధో హింసాత్మకోऽశుచిః|

హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః. || 18-27 ||

తే.గీ.  రాగి, లోభి, ఫలాపేక్ష గ్రాలువాడు,

హింసచేసెడివాడు, మహినశుచియు,

దుఃఖసుఖములకుకలగు దుస్స్వభావి,

రాజసికుడని యెరుగుము, రాజపుత్ర.

భావము.

రాగంతో కూడి ఫలం కోరుతూ, పిసినిగొట్టు తనమూ, హింసా స్వభావం కలిగి, అశుచి అయి, 

సుఖదుఃఖాలకు లోనయ్యే కర్త --రాజసికుడని చెప్ప బడుతుంది.

శ్లో.  అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో నైష్కృతికోऽలసః|

విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే. || 18-28 ||

తే.గీ.  నిగ్రహము లేని, పామరుని, మొరటును, వి

షాదపూర్ణు, సంకుచితమౌ ఖేదగుణుని,

బద్ధకస్తుని, మొండిని,  ప్రబల మోస

గానినిల కాల యాపకున్,  గాంచ తామ

సికులుగా జెప్ఫనొప్పును స్థిరగుణాఢ్య!

భావము.

ఎలాటి నిగ్రహం లేని వాడు, పామరుడు, సంకుచిత స్వభావం కలవాడు, మొండివాడు, 

మోసగాడు బద్ధకస్తుడు, విషాదంలో ఉండి ప్రతి దానికి కాలయాపన చేసే కర్త, 

తామసికుడని చెప్ప బడతాడు.

జైహింద్.

అనుబన్ధం క్షయం హింసా - ...18 - 25...//... ముక్తసఙ్గోనహంవాదీ - ...18 - 26,,,//.....అథాష్టాదశోధ్యాయము - మోక్షసంన్యాసయోగము

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  అనుబన్ధం క్షయం హింసా మనపేక్ష్య చ పౌరుషమ్|

మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే. || 18-25 ||

తే.గీ.  క్షయము ననుబంధమున్ హింస, శక్తి గనక

మించి చేయుట మోహమున్ మించి మొదలు

పెట్టుటివి తామసికమగు విజయ! నిజము

నీవు గ్రహియింపుమీ భువి నేర్పు మీర.

భావము.  

బంధనంలో ఇరికించేది, నాశనాన్ని హింసను కలుగచేసేది శక్తి సామర్ధ్యాలు 

లెక్కించకుండా చేసేది, మోహంతో ఆరంభించబడినదీ అయిన కర్మ 

తామసిక కర్మ అని చెప్ప బడుతుంది.

శ్లో.  ముక్తసఙ్గోనహంవాదీ ధృత్యుత్సాహసమన్వితః|

సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్త్విక ఉచ్యతే. || 18-26 ||

తే.గీ.  సంగముక్తు డహము లేక సదయనొప్పి,

పట్టుదల దీక్ష నొప్పుచు బరగువాడు,

నిరతముత్సహియై, జయ ధరనపజయ

ములకచలచిత్తుడేసాత్వికుడరయుమిది.

(ల-డ.లకుప్రాసయతి)

భావము.

సంగభావం నుండి ముక్తుడైన వాడు, అహంకారం లేని వాడు, పట్టుదల 

ఉత్సాహం ఉన్నవాడు, జయాపజయాల వలన చలించని వాడు అయిన కర్త 

సాత్వికుడని చెప్పబడతాడు.

జైహింద్.

శ్రీమతి కరి వసంతలక్ష్మిగారు ఆలపించిన శ్రీమల్లక్ష్మీసహస్ర నామ స్తోత్రము.

0 comments


జైశ్రీరామ్.
శ్రీమతికరి వసంతలక్ష్మిగారు ఆలపించిన శ్రీమల్లక్ష్మీసహద్రనామ స్తోత్రము.
జైహింద్.