గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, మార్చి 2023, బుధవారం

కర్తవ్యంచైవ కర్తవ్యం......మేలిమిబంగారం మన సంస్కృతి.

శ్రీరామ్.

 శ్లో.  కర్తవ్యంచైవ కర్తవ్యం ప్రాణైః కంఠ గతైరపి;

అకర్తవ్యం న కర్తవ్యం ప్రాణైః కంఠ గతైరపి.

తే.గీ.  చేయవలసిన పనులను చేయవలయు

ప్రాణములు దేహమందున వరలు వరకు,

చేయకూడని పనులను చేయరాదు 

ప్రాణములుపోవుచుండినన్, భావ్యమదియె.

భావము.  

ప్రాణాలు పోయే వరకూ మనం ధర్మమే పాటించాలి.చేయకూడని పని 

చేయకూడదు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.