గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, మే 2023, బుధవారం

గీత పారాయణానంతరము గీతా మాహాత్మ్యము పఠించనిచో పారాయణ నిష్ఫలమే.

జైశ్రీరామ్. 

శ్లో.   గీతాయాః పఠనం కృత్వా మాహాత్మ్యం నైవ యః పఠేత్ |                                     వృథాపాఠో భవేత్ తస్య శ్రమ ఏవ హ్యుదాహృతః || 21 ||

గీతా పఠన మహత్వము
నేతరి చదువకను గీత నెంత చదివినన్
ఖ్యాతిని గొలపదు. సరికద
యాతని శ్రమ వ్యర్ధమిలను. హరినుత భక్తా!

భావము.

గీతని పఠించి పిదప మహత్యమును ఎవరు పఠించకుందురో 
అట్టి వారి గీతా పఠనము వ్యర్ధమే(నిష్ఫలమే). అట్టివారి 
గీతాపఠనము శ్రమ మాత్రమేనని చెప్ప బడినది.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.