గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, జనవరి 2022, శనివారం

యది మామప్రతీకార.. ||1-46||..//..ఏవముక్త్వార్జునః సఙ్ఖ్యే.. ||1-47||..//. అర్జున విషాద యోగము.

0 comments

 జైశ్రీరామ్. 

శ్లో.  యది మామప్రతీకారమశస్త్రం శస్త్రపాణయః |

ధార్తరాష్ట్రా రణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్ ||1-46||

తే.గీ.  కన  ప్రతీకార బాహ్యునై కౌరవులను

చంపనెంచక శస్త్రముల్ చయ్యనవిడి

యుండ  నన్ గౌరవుంల్ సంపిన నది

మేలె నాకెంచగాఁ దలుప, నీల దేహ!

భావము.

ప్రతీకారం చేయక నిరాయుధడనై ఉన్న నన్ను శస్త్రాలు చేపట్టి 

కౌరవులు యుద్ధంలో నన్ను చంపినా, దానివలన ఎక్కువ నాకు 

మేలే  జరుగుతుంది.

సఞ్జయ ఉవాచ |

సంజయుఁడు ఇట్లు పలికెను.

శ్లో.  ఏవముక్త్వార్జునః సఙ్ఖ్యే రథోపస్థ ఉపావిశత్ |

విసృజ్య సశరం చాపం శోకసంవిగ్నమానసః ||1-47||

కందపద్య గర్భ తేటగీతి. 

అని పలికి యర్జునుండట మనమున విల

పించుచు ఖిల మానసుడయి, భీతిని హరి

నుడువులు రథమును విన కను దిగి

యమ్ములు నిక విల్లు విడిచె, హా యనుచును.

తేటగీతిలో ఉన్న కందపద్యము.. 

అని పలికి యర్జునుం డట 

మనమున విలపించుచు ఖిల మానసుడయి, భీ

తిని హరి నుడువులు రథమును 

వినకను దిగి, యమ్ములు నిక విల్లు విడిచె, హా!

భావము. 

సంజయుడు ఇలాపలికాడు; అర్జునుడు ఇలా పలికి శోకంతో 

నిండి యున్న మనస్సుతో యుద్ధభూమిలో బాణాలతో సహా

ధనస్సుని వదిలి రధం వెనుక భాగంలో కూర్చున్నాడు..

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు

బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే

అర్జునవిషాదయోగో నామ ప్రథమోऽధ్యాయః ||1|

జైహింద్ 

ఉత్సన్నకులధర్మాణాం.. ||1-44||..//..అహో బత మహత్పాపం.. ||1-45||..//..అర్జున విషాద యోగము.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన |

నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమ ||1-44||

కం.  కులధర్మమువీడిన లో

కులు నరకము పొంది మిగుల కుములుదురటగా

కలకాలము,, వింటినటుల,

జలజాతేక్షణ! ముకుంద! సజ్జన పూజ్యా!

భావము.

జనార్ధనా కులధర్మాలు తొలగిపోయిన మనుష్యులు కలకాలం 

నరక వాసులౌతారని విన్నాము. 

శ్లో.  అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయమ్ |

యద్రాజ్యసుఖలోభేన హన్తుం స్వజనముద్యతాః ||1-45||

ఆ.వె.  అకట! రాజ్య సుఖమునాశించి యిప్పుడు

స్వజనులను వధింప నిజముగానె

సిద్ధపడితిమికద, ఛీయెంత పాపంబు

చేయఁ బూనితిమిగ, శ్రీముకుంద!

భావము.

అకటా! రాజ్య సుఖం కోసం స్వజనాన్ని వధించడానికి సిద్ధమైన 

మనం ఎంతటి మహాపాపానికి ఒడి గట్టుతున్నాము.

జైహింద్ 


సఙ్కరో నరకాయైవ.. ||1-42||..//..,దోషైరేతైః కులఘ్నానాం.. ||1-43||..//..అర్జున విషాద యోగము.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  సఙ్కరో నరకాయైవ కులఘ్నానాం కులస్య |

పతన్తి పితరో హ్యేషాం లుప్తపిణ్డోదకక్రియాః ||1-42||

తే.గీ. వర్ణ సాంకర్యమగుటచే వర్ణమునకు,

కులవినాశన మూలమౌ కారకులకును

నరకమే గతి, పితరులి నరకమొందు

దురుగపిండోదకవిహీనులౌదురు కన.

భావము.

సాంకర్యం వలన కులానికి, కులాన్ని నాశనం చేసినవారికి నరకమే గతి.

వీరి పితరులు పిండోదక క్రియలు లేక నరకంలో పడతారు.

శ్లో.  దోషైరేతైః కులఘ్నానాం వర్ణసఙ్కరకారకైః |

ఉత్సాద్యన్తే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః ||1-43||

తే.గీ. వర్ణ సంకర హేతువౌవారిదోష

మునను శాశ్వత కుల ధర్మ ములు నశించు,

జాతి ధర్మంబులు నశించు, ఖ్యాతి చెడును,

దుస్స్థితుల నుండి కాపాడు తోయజాక్ష!

భావము.

వర్ణసంకరానికి కారకులైన కులనాశకుల దోషాల వలన 

శాశ్వతమైన  జాతి ధర్మాలు, కులధర్మాలు పెకలింప బడతాయి. 

జైహింద్ 

4, జనవరి 2022, మంగళవారం

కులక్షయే ప్రణశ్యన్తి.. ||1-40||...//..అధర్మాభిభవాత్కృష్ణ.. ||1-41||..//. అర్జున విషాద యోగము.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  కులక్షయే ప్రణశ్యన్తి కులధర్మాః సనాతనాః |

ధర్మే నష్టే కులం కృత్స్నమధర్మోऽభిభవత్యుత ||1-40||

తే.గీ.  కుల వినాశనము వలనకూలిపోవు

మన సనాతన ధర్మము,మహినధర్మ

మున నడుతురుగ పాపులై మన కులజులు

చింతఁ జేయుము నీవును శ్రీకరుండ!

భావము.                                                                                                 

కులక్షయం వలన సనాతనమైన ధర్మం నశిస్తుంది

ధర్మం నశించినపుడు యావత్కులంఅధర్మం వైపు తిరుగుతుంది.

శ్లో.  అధర్మాభిభవాత్కృష్ణ ప్రదుష్యన్తి కులస్త్రియః |

స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసఙ్కరః ||1-41||

తే.గీ.  వ్యాప్తమగు నధర్మముననే యాడువారు

చెడుదు రద్దానిచేతను చెడును కులము.

వర్ణ సంకరమేర్పడు, వసుధపైన

నీవు చింతింపుమో కృష్ణ! ధీవరేణ్య!,

భావము. 

కృష్ణాఅధర్మం వ్యాపించడంతో కులస్త్రీలు చెడిపోతారు

కులస్త్రీలు చెడితే వర్ణసంకరం ఏర్పడుతుంది.

జైహింద్                                                                                                                                   

3, జనవరి 2022, సోమవారం

యద్యప్యేతే న పశ్యన్తి.. ||1-38||..//..కథం న జ్ఞేయమస్మాభిః.. ||1-39||..//. అర్జున విషాద యోగము.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  యద్యప్యేతే పశ్యన్తి లోభోపహతచేతసః |

కులక్షయకృతం దోషం మిత్రద్రోహే పాతకమ్ ||1-38||

తే.గీ. లోభమునఁజేసి కానరు లోతుగాను,

కులవినాశన కార్యము కొలుపు దోష

ము నిక చేయు ,మిత్రద్రోహమునకు కలుగు

పాపఫలమును నరకపు కూపముకద.,

భావము. 

లోభంచేత తెలివి తప్పిన వీళ్ళు కులక్షయం వలన కలిగే 

దోషాన్నిమిత్ర ద్రోహం వలన కలిగే పాపాన్ని చూడలేక 

పోయినప్పటికీ,

శ్లో.  కథం  జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుమ్ |

కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన ||1-39||

తే.గీ.  ఓ జనార్దనా! కులనాశ మొదవునంచు

తెలిసియున్నట్టి మనమేల తెలివితప్పి

యిట్టిపాపంబు చేయగానేల చెపుమ,

పాపదూరులమై యుంటపద్ధతికద.

భావము. 

జనార్ధనాకులక్షయం వలన ఏర్పడే దోషాన్ని తెలిసిన మనం 

 పాపం నుండి ఎందుకు తొలగ కూడదు?

జైహింద్                                                                                                                                                                                         

1, జనవరి 2022, శనివారం

చిత్రగర్భకవితావతంశులు,గౌరవశ్రీ!చింతారామకృష్ణవరేణ్య!విరచిత"శ్రీమన్నారాయణ శతకము"-పై నూతన ఛందోగర్భ కవితాసుమపారిజాతము.

1 comments

జైశ్రీరామ్.

నర్తన,మనోరమ,సుభిక్ష,దదామీతి,వర్ఛశ్వినీ,సంస్తుత్య,హేతుభూత,చిదానందసమ్మోదినీ,ముక్తిహేతు,గర్భ-"జన్మధన్య"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ

"  జన్మధన్య-వృత్తము."

ఉత్కృతిఛందము.మ.భ.స.మ.య.య.త.ర.లగ.గణములు.

యతులు.10,18.ప్రాసనీమముగలదు.

శ్రీమన్నారాయణ స్ఫురణం?చిదానంద!సమ్మోదమౌ!జీవన్ముక్తిహేతు!భూతమౌ

మా' మాధుర్యంబగు!మహిమం!మదార్తిం!దొలగించుగా!మావద్దివ్యసంస్తుతింజనున్!

రామా!  మీదౌ! శతక"  మిలం!  రథారోహణంబౌ!,ఘనా!    ప్రావర్ఛశ్వులం! వెలుంగిడున్!

దామంబౌదివ్యు!గళముం!దదామీతి"మోక్షంబనం?తావజ్జన్మ!ధన్యతం గనెన్!

భావము:-శ్రీమన్నారాయణ!స్ఫురణము!మనస్సున కానంద మొసగును.

జీవన్ముక్తికి!హేతుభూతమదియే!ఈశతకము,శ్రీమన్మహాలక్ష్మిమహిమచే

మాథుర్యము సంతరించుకొనును.నాయొక్కయనగాఆత్మాకమైన(ఆత్మగల

ప్రతీజీవికి)కష్టములనుతొలగించును కదా!లక్ష్మీప్రదమైన,మనోహరమైన

స్తుతితోనలరారును.రామా=శ్రీయుతులురామకృష్ణార్యా!మీచేరూపుదిద్డ

బడిన!మీదైన!శ్రీమన్నారాయణ శతకము!ఈ రసాతలమున క్రొత్తకాంతులతో!

వెలుగులిడును.జ్ఞానప్రబోధయగును.కంఠహారముగా!సురలగళాకంఠవమై

దనరును.మోక్షదాయినియైన!మీకృతివలన మీజన్మ ధన్యత నందెను.

1.గర్భగత"-నర్తనా"-వృత్తము.

బృహతీఛందమమ.భ.స.గణములు.వృ.సం.241.ప్రాసగలదు.

శ్శ్రీమన్నారాయణ స్ఫురణం!

మా"-మాథుర్యంబగు మహిమన్!

రామా! మీదౌ!  శతక.    మిలన్!

దామంబౌ! దివ్యు  గళమున్?

2.గర్భగత"-మనోరమ"-వృత్తము.

అనుష్టుప్ఛందము.య.య.లగ.గణములు.వృ.సం.74.ప్రాసగలదు.

చిదానంద సమ్మోదమౌ?

మదార్తిం తొలంగించుగా!

రథారోహణంబౌ!ఘనా!

దదామీతి! మోక్షంబనన్?

3.గర్భగత"-సుభిక్ష"-వృత్తము.

బృహతీఛందము.మ.జ.ర.గణములు.వృ.సం.169.ప్రాసగలదు.

జీవన్ముక్తి హేతు భూతమౌ?

మావద్దివ్య!సంస్తుతిం జనున్?

ప్రావర్ఛశ్వులం!వెలుంగిడున్?

తావజ్జన్మ!ధన్యతం గనెన్?

4.గర్భగదదాదదామీతి"-వృత్తము.

అత్యష్టీఛందము.మ.భ.స.య.య.లగ.గణములు.యతి.10.వ.యక్షరము.

ప్రాసనీమముగలదు.

శ్రీమన్నారాయణ స్ఫురణం?చిదానంద సమ్మోదమౌ?

మా"-మాథుర్యంబగుమహిమం!మదార్తిందొలంగించుగా!

రామా!మీదౌ శతక మిలం?రథారోహణంబౌ!ఘనా?

దామంబౌ దివ్యు గళముం?దదామీతి మోక్షంబనన్?

5.గర్భగత"-వర్ఛశ్వినీ"-వృత్తము.

అత్యష్టీఛందము.య.య.య.త.ర.లగ.గణములు.యతి.9.వ.యక్షరము.

ప్రాసనీమముగలదు.

చిదానంద సమ్మోదమౌ?జీవన్ముక్తి హేతు భూతమౌ?

మదార్తిం దొలంగించుగా!మా"-వద్దివ్య సంస్తుతిం జనున్!

రథారోహణంబౌ!ఘనా!ప్రావర్ఛశ్వులం?వెలుంగిడున్!

దదామీతి"-మోక్షంబనం?తావజ్జన్మ!ధన్యతం  గనెన్!

6.గర్భగత"-సంస్తుత్య"-వృత్తము.

ఉత్కృతిఛందము.య.య.య.త.ర.య.మ.న.లగ.గణములు.

యతులు.9.18.ప్రాసనీమముగలదు.

చిదానంద సమ్మోదమౌ!జీవన్ముక్తి హేతుభూతమౌ!శ్రీమన్నారాయణ స్ఫురణం!

మదార్తిం దొలంగించుగా!మా"-వద్దివ్య సంస్తుతింజనుం?మా,మాథుర్యంబగు  మహిమన్?

రథారోహణంబౌ!ఘనా!ప్రావర్చశ్వులంవెలుంగిడుం!రామా!మీదౌ శతకమిలన్!

దదామీతి!మోక్షంబనం?తావజ్జన్మ!ధన్యతంగనెం!దామంబౌ!దివ్యు గళమున్!

7.గర్భగత"హేతుభూత"-వృత్తము.

ధృతిఛందము.మ.జ.ర.మ.భ.స.గణములు.యతి.10,వ.యక్షరము.

ప్రాసనీమముగలదు.

జీవన్ముక్తి! హేతుభూతమౌ? శ్రీమన్నారాయణ  స్ఫురణం?

మా"-వద్దివ్యసంస్తుతిం!జనుం?మా"-మాథుర్యంబగు!మహిమన్?

ప్రావర్ఛశ్వులం వెలుంగిడుం!రామా! మీదౌ ! 'శతక ' మిలన్?

తావజ్జన్మ! ధన్యతం గనెం? దామంబౌ! దివ్యు  గళమున్!

8.గర్భగత"-చిదానంద"-వృత్తము.

ఉత్కృతిఛందము.మ.జ.ర.మ.భ.స.య.య.లగ.గణములు.

యతులు.10,19.ప్రాసనీమముగలదు.                                                                                        జీవన్ముక్తి!హేతుభూతమౌ!శ్రీమన్నారాయణస్ఫురణం!చిదానంద!సమ్మోదమౌమా'-వద్దివ్య!సంస్తుతిం జనుం!మా'మాధుర్యంబగు!మహిమం!మ'దార్తిం!దొలంగించుగా?ప్రావర్ఛశ్వులం!వెలుంగిడుగా!రామా!మీదౌ'శతక'మిలం?రథారోహణంబౌ!  ఘనా!                                            తావజ్జన్మ!ధన్యతం గనెం?దామంబౌ దివ్యు గళముం?దదామీతి!మోక్షంబనన్                  

9.గర్భగత"-సమ్మోదినీ"-వృత్తము.

అత్యష్టీఛందము.య.య.య.మ.న.లగ.గణములు.యతి.9.వ.యక్షరము.

ప్రాసనీమముగలదు.

చిదానంద!సమ్మోదమౌ!శ్రీమన్నారాయణ!స్ఫురణం?

మ'దార్తిం!దొలంగించుగా?మా"-మాథుర్యంబగు?మహిమన్!

రథారోహణంబౌ!ఘనా!రామా!  మీదౌ!'శతక ' మిలన్?

దదామీతి మోక్షంబనం? దామంబౌ! దివ్యు గళమున్!

10.గర్భగత"-ముక్తి హేతు"-వృత్తము.

ఉత్కృతిఛందము.య.య.య.మ.న.య.త.ర.లగ.గణములు.

యతులు.9.18.ప్రాసనీమముగలదు.

చిదానంద!సమ్మోదశ్రశ్రీమన్నారాయణ!స్ఫురణం?జీవన్ముక్తిహేతుభూతమౌ?మ'దార్తిం!దొలంగించుగా?మా"-మాథుర్యంబగు!మహిమం!మా"-వద్దివ్య  సంస్తుతిం జనున్!రథారోహణంబౌ!ఘనా!రామా!మీదౌ'శతక'మిలం?ప్రార్ఛశ్వులలం! వెలుంగిడుగా!                                            

దదామీతి మోక్షంబనం?దామంబౌ!దివ్యు గళముం!తావజ్జన్మ!  ధన్యతం!గనెన్!

భక్తి ప్రబోధాత్మకమైన!మీకృతియాచంద్రతారార్కమీపుడమిని నిలుచుటయేగాక!శ్రీమన్నారాయణునికరుణాకటాక్షములు లోకమునకుప్రసరించునుగాత!సమస్త సన్మంగళాని భవంతు!సర్వేజస్సుఖినోఃభవంతు!

ఇట్లు,                                                                                                                          తమవిశ్వసనీయుడు......                                                                                                         మూర్తి.జుత్తాడ                                                                                                                              జైహింద్..                                                                                       

నిహత్య ధార్తరాష్ట్రాన్నః.. ||1-36||..//..తస్మాన్నార్హా వయం హన్తుం. ||1-37||..//..అర్జున విషాద యోగము.

0 comments

 

జైశ్రీరామ్.

శ్లో.  నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాజ్జనార్దన

పాపమేవాశ్రయేదస్మాన్హత్వైతానాతతాయినః ||1-36||

తే.గీ.  ధార్తరాష్ట్రులఁ జంపిన దాని వలన

సంతసంబేమికలుగును సన్నుతాత్మ!

ఆతతాయినం జంపిన నదియు మనకు

పాపఫలమునే యిచ్చును పరమపురుష!

భావము. 

జనార్ధనాదృతరాష్ట్ర కుమారులను చంపడం వలన మనకి ఏమి 

సంతోషం కలుగుతుంది?ఆతతాయులను చంపినా మనకి పాపమే 

వస్తుంది.                                                                                                                          

శ్లో.  తస్మాన్నార్హా వయం హన్తుం ధార్తరాష్ట్రాన్స్వబాన్ధవాన్ |

స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ ||1-37||

తే.గీ. తలప ధార్తరాష్ట్రులఁ జంపఁ దగదు మనకు,

వారు బంధుసమేతులై వరలిరిచట

మన జనంబులన్ చంపిన మనమదెటుల

సుఖము పొందగలారము? సుజనపాల!,

భావము.

అందువలన బంధు సమేతులైన దార్తరాష్ట్రులను చంపడం తగదు

మన వాళ్ళను చంపడం వలన మనం ఎలా సుఖపడ గలము.

జైహింద్