జైశ్రీరామ్.
1.కం:-బీజము తేజోమయ మిల!
బీజాన్విత మంత్ర మిలను---ప్రీతినిఁగూర్చున్!
భూ జన్య జనక శక్తది?
రాజిత నటరాజు!ఢమరు!రావ నినాధమ్!!
2.కం:-భువి భూత!భాతి జృంభణ!
జవ మేర్చుచు జీవ సౌఖ్య!---సారము పెంచున్!
శివ నాట్యోద్భవ! శక్తది?
రవళించు!గురూప దేశ!రాజిత శక్తై!!
3.కం:-శక్తి గల మంత్ర భావము!
యుక్తిగ వివరింప దగదు!----యొద్దను టేలన్?
ముక్తిడు గురు నుపదేశమె?
భక్తికి తా ఫలిత మిచ్చు!----పద్ధతి నడుమా!!
4.కం:-పొత్తము లొత్తిన మంత్రము
కత్తియు లేనట్టి పోరు---గనునిది!నిజమే!
చిత్తము నవహేళన గను
పొత్తుకు దూరంబు జనగ---పూజ్యము!నిడకన్?!.
5.కం:-మంత్రిత మైనది!మంత్రము!
మంత్రా విష్కృత!ప్రభావ----మందుట!వశమా!
తంత్రపు యంత్రపు రోజుల!
మంత్రము లవి! నిష్ట లేమి!---మాయా!ఫలమౌ!!
6.కం:-జ్ఞానుల నుపదేశంబది!
మానిత ఫలంబొసంగి---మంగళ మేర్చున్!
నానా భోజ్యులు నేర్చిన!
కానని కష్టాల పాలు---కలిగించు!గదే!!
7.కం:-బీజోచ్ఛారణ!దోషము!
తేజంబును మాపి!భూమి---తెచ్చు న్ముప్పున్!
రాజీ పడదిల?బీజము!
బీజంబే!ఓజ మోయి!---ప్రీతిం గనుమా!!
8.కం:-నిర్మల మనసున ధ్యానము!
కర్మము!ధర్మము!ముడి పడ!---కల్గును!మోక్షమ్!
దుర్మతిఁ జేసెడి!దీక్షది?
పర్మాత్మకు!క్రోధ మిడును!---పరగదు!మోక్షమ్!!
9.కం;-తేజోమయ బీజ శక్తిని!
రాజీ పడ బోక?నడుమి----రాణింప!నిలన్!
జేజెలు బలుక!దెల్పుమి!
బీజంబే?శక్తి యంచు----విశ్వము మెచ్చన్!!
జైహింద్.
Print this post
వ్రాసినది



0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.