జైశ్రీరామ్.
1.ఉ:-అక్షర జ్ఞానమే యిసుము---యామడ దూరము నున్న వారలే!
దక్షులు రాజకీయ!రణ!---ధార్మిక వర్గము! స్వచ్ఛ జ్ఞానతన్!
భక్షక జ్ఞాన భాస్వకులు!---భద్ర యశో విభవాభి రాములై!
చక్షుల చిమ్మ చీకటుల--- స్వచ్ఛత గానని!స్వేచ్ఛ దిద్దగన్!!
2.ఉ:-అప్పుల నొప్పు కుప్పలను---హర్మ్యము లంటగ జేసి!ధాత్రినిన్!
ఒప్పుల జాగృతిం గనని ఒయ్యరి భామగ త్రిప్పి త్రిప్పి, తా
చిప్పలు భావికిం గుదుర---జెట్టుల మంచును చాటి చెప్పుచున్!
మెప్పగు రీతి నొప్పుటది!మేలన!నౌనొకొ? మిధ్య యే!సుమా!!
3.ఉ:-:-లంచము లేని జీవనము---లాలన లేనటి నౌకిరీ యయెన్!
వంచిత మాయె ధర్మ మిల!---పంచక మొందెను నీతి జాతినిన్!
కుంచిత బుద్ధి కంటకుల---కోఱల చిక్కితి!స్వేచ్ఛ మాతరో?
తెంచితి భావి సౌఖ్యమును---తెల్వరి మాటల!త్రొక్కి నొక్కుచున్!!
4.ఉ:-పండిన జ్ఞాన! ధీ !నిధుల---పాలన లేదయె!నేటి కాలమున్!
షండులు స్వార్ధ సంకుచిత---జ్ఞాన పయోనిథు లాట పాటయెన్!
ముండన మేర్చి భావితర---మోదము మాపి,పరాయి ప్రాంతముల్
కొండొక రీతి సాగు నటు---కూర్మి ఘటించుట!న్యాయమా?భువిన్!!
5.ఉ;-గెల్చిన చాలు నొక్కపరి---కొండకు నిచ్చెన వేయుటే?యగున్!
పల్చన గాని జీవ ప్రభ---భాసిలు జీవిత మంత కాలమున్!
నిల్చును పూర్ణ శ్రీ లవియు---నింగికి నెత్తును భోగ భాగ్యతన్!
తల్చుట కల్ల సాటి జన---ధాతృత కండ్లవి నెత్తి కెక్కగన్!!
6.ఉ:-అందరు నీచులం టదియు---హర్షము గాదు తలంప!భూమినిన్!,
కొందరి చెడ్డ నైజమది---కూల్చెను!స్వచ్ఛత!స్వార్థ పూర్ణతన్!
ముందుగ నూహ జేయ వలె!---మూర్ఖుల గెల్పుకు సాయ మేర్చకన్!
తొందరపాటు తప్పు నగు---తుచ్ఛుల నాపుడి!ఓటు వేయకన్!!
7.చం:-కుల మత రాజకీయములు---కొంపలు ముంచెను దేశ స్వేచ్ఛకే?
తలపగ సర్వ సామ్యమను---తప్పుడు మాటలు!ద్రోహ తత్వతన్!
బలిమిని ఓట్ల"-నంటె నిల!---పద్ధతి యౌనొకొ?యూహిలం వలెన్!
పలువుర సొత్తు! కొందరికె?---భాగ్యత గూర్చుట!తప్పు గాదొకో?
8.ఉ:-లోకము నందు బీదలును---లోభులు,భాగ్యులు,సామ్యమౌ టెటుల్!
ఆకలి సామ్య మెల్లరిది----ఆదరణంబని హద్దు మీరుటే?
చీకును చింతనుం గనును---చేదు నిజంబిది!యెంతకాలమీ
బూకర జీవితం బెసగు?,---బుద్ధులు మార్చవె!భూ వరామరో?!
9.ఉ:-కంటివి సర్వ జీవములు---కల్మష బుద్ధులు!సిద్ధులై రిటన్!
కంటివె?వీరి తెల్వి నిట---గాడిద గంథపు ఘ్రాణ తీరయెన్!
మింటిని మ్రింగ నెంచిరని---మీటగ మాని, సహించు టేలనే?
గంటిడి ద్రోహ సంకటము---కావవె!లోకము!మాత!భూతలీ!!
10.సీ:-అర్థ జ్ఞాన మదేల?వ్యర్థ జీవము గాదె?
నిండు జ్ఞానము నొంద!---పండు సుఖము!
అర్థమే?జన్మగా!---యవధి మీరి గడింప!
దొరల పాలు నగును---పరువు పోవు!
సమయ పాలన లేని!---సంసార జీవంబు!
విమల ఖ్యాతికి మచ్చ---వెడలు!సుఖము!
అచ్చు గుద్దిన యట్టి---యాబోతు గాకుమా!
మెచ్చ రింటి జనులు---మేలు కొమ్మ!
తే,గీ:-అమ్మ!భరతమ్మ!వేదాశ్రి!---యాత్మ జ్ఞాని!
జ్ఞాన సంపన్ను డీవన్న!---చరిత నొంది!
దేశ!విఖ్యాతి!నల్దిశల---దీప్తు లలర!
తీర్చి దిద్దుమ!బాలుడా!దివ్య తేజ!!
11.ఉ:-సేవక వృత్తి!స్వచ్ఛమయ!---జీవన సార సమోన్న తేయగున్!
పావన కీర్తి కాంతిదము---భద్రము!శుద్ధ తపో ఫలంబునై!
జీవన తృప్తి శాంతిమయ---శ్రీకర భాగ్య విశేష కౌముదుల్!
తావకమై జనంగ!---వసు ధర్మ వరాంచిత!సోమరాజియౌ!!
12..సీ:-పరుల భుక్తము లాగి---పరమాత్ము డేనన్?
ప్రజలు మెత్తు రనుట---భ్రాంతి!సుమ్మ!
అరుల విరుల దండ---హాయి నీయు ననుట!
నాగ భూషణ మయ్య!--- నర్మ మెరుగు!
పగ బూనకు మయ్య!---పాడౌను!సర్వంబు!
పంతమేల?చెడకు----వదిలి పెట్టు!
బుధుల మాటలు విని---బుద్ధితో!తర్కించి!
మంచి మార్గము నెంచు---మామక మదె?
తేగీ;-కాక తీరిన యోధులే?----కదన భూమి!
ప్రాణములు వీడినారంచు---భయము లేదె?
ఆదరాభి మానాలవి!----ఆత్మ వరము!
కలిసి కదులుట కీ వెల్ల?---తలచు!బాల!!
13.ఉ:-వేద విధాం వరాళికిల!---విస్తును గూర్చెడి!లోక కంటకుల్!
మేథకు బూజునై దనర---మేథిని మాయ వికార కారియై!
శ్రీ ధర మాయె!జాతి యమ---చిత్త మనోజ్ఞ సదాను కూలయై!
బోధిలు నీచ తర్కమది---పుత్తడి బొమ్మయె?---పాడు లోకమున్!!
14.ఉ:-అక్కర బట్టి నీతి జనె!---హక్కయె!పెక్కగు నీచ సంఖ్యకున్!
తుక్కును జేసె!ధర్మమును---తోరపు బొజ్జల రూక లాశకున్!
అక్కట?కల్కి సచ్ఛరిత!---కల్లల కొల్లలు!మోయు చుండెనే?
నిక్కము టక్కు టెక్కెమిది!---నీల్గను జేయవె!నీశ్వరా!వడిన్!!
15.సీ:-కూడు,గుడ్డయు,తిండి---గూడు యున్నను,చాలు!
కోట్లాశ దేలయా?---కోరు మంచి!
నిర్మల జీవిగా---నిరు పేద జీవన!
శ్రమియించి పనిచేయు---శక్తి నిడును!
దొరల దొంగల భీతి---దొరకొన దేనాడు?
శాంత జీవి యనగ---జగతి మెలగు!
తప్పు చేయడు!వాడు---ధర్మమే?మదినెంచు!
కూర్మి జీవన నొందు!---ధార్మి కుండు!
తే,గీ;-మనును పరమ నిష్ట భువిని!---మానవునిగ!
కనగ!దైవ మతండెపో?---కనుము!మదిని!
అట్టి బీదకు సాయమే?---అమర మగును!
సాటి జనులను ద్వేషింప---సరియు!కాదు!!
16..ఉ;-పురహిత వేష భూషలవి!---పూజ్యత గూర్చునటంచు భ్రాంతిలన్!
కరమరుదెంచగా!బడదు!---కానగ!నూంఛము!భీత ప్రతాపమౌ!
తిరిపెము కన్న!తక్కుడగు---ధీవర!కోరకు!దాస్య వృత్తినిన్!
అరకొర జీవితం బదియె?---హంసలు కాకుల తీరునౌ!సుమా!
(పౌరోహిత్యము,బంటురికము వంటిది,ఎంత జ్ఞానివైన కాకుల సరి లోకుల
నడుమ చులకనై,అరకొర జీవన మందెదవు.)
17..సీ;-అత్తపై కోపము ---దుత్తపై!జూపింప!
అధికార మిచ్చునా?---అత్త నీకు!
నీతిపై దండెత్తి---నీకులం బేపేర్చ!
ధర్మ దేవత!నిన్ను---దంచి కొట్టు!
పాత రోతని చెప్పు---పాపాత్మ!నీజీవ
భంగిమే?బ్రద్ధలై---బ్రతుకు చెరచు!
పుఱ్ఱె పుఱ్ఱె గుణము---పుడక ల్టిన గాని,
పోవునా?దశ్చర్య ----బుద్ధి నెంచ!
తే,గీ:-అచ్చు!కల్మష మద్దిన---హాయి గాదు!
చరిత!చర్విత మను మాట---జగతి!బోధ!
బండ్లు యోడలు!యోడలు---బండ్లు నగును!
కాల !శాసన! నీవల్ల---కాదు!బాలా!!
18.సీ:-రాతిగ దర్శనంబిడిన!---దైవము!ధర్మము గాచు నెట్లనన్?
చేతన లిచ్ఛ మీరి జన---జీవ ప్రతిష్టను!హేళ జేయుటౌ!
పాతును జీవ సంఘమును---పట్టుకు చిక్కక!భూ ప్రకోపతన్!
భూతము లెల్ల!కోపిలుచు----బుగ్గిని జేయును!తెల్సి కొండికన్!!
19.ఉ;-పోయెడు కాల మందు!మన---పొత్తును కోరదు!దేహ వస్త్రమే!
నేయులు రారు వెంట!తన--- నెచ్చెలి రోధిలు నింటి లోననే!
నాయక మౌళి వైన సరె---నల్వురె?మోతురు!కాటి చెంతకున్!
శ్రేయ మదేది?జీవి కిల!---చెంచల బుద్ధిని వీడి!మన్నుమా!!
20.చం:-:-కరణమె!కారణంబగును---కర్మ మదే!యని!తెల్వి మన్నుచో?
చరిత మనోజ్ఞ ధీ వరత---శాంతిని,దాంతిని!గూర్చు!సర్వమున్!
వర తప మౌని బృంద మది---వహ్వ యనంగను!వెల్గి!భూతలిన్!
పరగగ జూడ వేమిటికి?---పాపము జేసెదు!తెల్సి దుర్మతిన్!!
21.ఉ;-తాతలు నాటి కాలమది!---తత్పర మంబది!నీతి యాయెనే!
పాతర వేసి నీతి నిట---వాటము మార్చిరి!నేటి మానవుల్!
భూతి వికార మందె నిల---పూజ్యత గానక!పొంక మూనుచున్!
చేతలు ద్రోహతం గనెను---జీవుల!జన్యత!కల్మ షార్తులన్!
22.ఉ;-కర్తయు భర్త తా నవగ---కమ్మటి రాగ,సరాగ!భోగులై!
వర్తిలి!గౌరవం బమర---కర్మ సుథామృత జీవ జాగృతిన్!
కర్తరి దోష మంటగను---కల్ములు!ధర్మ విధానతన్,సదా!
భర్తలు దర్తలై మనిరి---వర్ధిల భావి తరాల శ్రేయులై!!
23.ఉ;-నాటికి నేటికిం జగము---నర్మ వచో విభవాభి రామమై!
భూటక!జాగృతిం దనరె---పుణ్యము,పాపము!పాత రోతనన్?
హాటకు గర్భు రాణి యిట---యాకలి మూకల చేత జిక్కితా!
పాటవముం జెడం వగచె!---భద్రుడు,రుద్రుడు!జూచునం చిలన్!!
24.ఉ:-మంచిగ మారు!లోకమని---మాన్యులు పూజ్యులు తొల్లి వారలున్!
యెంచిరి!జేసి నోములను---యేమిది?కర్మమో!జాత వేద,! నీ
వెంచవె?జాతి తీరు!భువి!---వేగమె!ధర్మము!మంచి రీతినిన్!
పెంచుమి!ధాత్రి ధర్మమును---వీడని భక్తితొ?గొల్తు నీశ్వరా!!
25.చం:-నిపుణత నొందు!శాస్త్రమున---నీతిగ జాతికి!మేలు శోధనన్!
విపులత!జీవ సౌఖ్య మిడు!---విజ్ఞత!సుజ్ఞత!సజ్జనుండవై!
స్వ పర!విభావ దూరమున---సర్వము!మానవ!శ్రేయమం చిలన్!
సు పధ మెసంగు!జీవనము---శుద్ధత నొందుమి!బాలకాగ్రణీ!!
26.ఉ;-పెద్దల జీవ కాలమున---పెన్నగు!కష్ట సుఖంబు లన్నిటిన్!
బుద్ధితొ?చాక చక్యమున---పూజ్యత నొందిరొ?దెల్సి కొంచు! నీ
వద్దిర?కాల మార్పిడికి----పట్టుమి!యద్దము!బుద్ధి మంతతన్!
శుద్ధత గాని!కార్యముల---జోలికి పోకను!శోభ లొందుమా!!
27.ఉ;-మేరను మీరు!చర్య లవి---మేలొన రింపక!కీడు సేయు! నీ
భారము మోయగా!నవని---బాధిలు రోధిలు!చీదరించురా!
జీరకు!పాప కూపమును---జన్మది?హేయము!నెంచు!నీతినిన్!
చేరకు!దుర్జనంబులను---జీవన భాగ్యము!శ్రేయమెంచుమా!
జైహింద్.
Print this post
వ్రాసినది



0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.