గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, నవంబర్ 2026, మంగళవారం

తెలుగు భాషా కృషీవలా! రామ కృష్ణ వరేణ్యా! రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి, జుత్తాడ,

జైశ్రీరామ్.


1.మ;-గత జన్మంబున!జేసి నట్టి!హితమే!---కర్మాను గుణ్యంబునై!

        స్థితమౌ!ప్రజ్ఞకు మూల కంబ మగుచున్---క్షేమంబు జేకూర్చిలన్!

       బ్రతుకే!తారల మథ్య చంద్రు నటులన్---భాసిల్లు!శోభాయమై!

       మతిని న్మెచ్చిన మిత్రమా!కవి వరా!---మార్మ్రోగె!మీ మేథయున్!!


2.మ:-వరమౌ!సంస్కృతి సాంప్రదాయములిలన్---వహ్వా!యనంజేయగన్!

          తిరమౌ!దీక్షనుఁ బూని!తెన్గుఁదనమున్---తేజంబు!పెంపేర్చగన్!

          సుర సమ్మోదత!సూరి మిత్ర తతులన్---శోభిల్లిరే!మిత్రమా!

          కరము న్వాక్సతి !మెచ్చ!మీ కవితలున్---కల్గించె!నానందమున్!!


3.మ:-తెనుఁగే ఛంద మనోజ్ఞ దివ్య వనమై---తేజంపు బీజంబులన్

         ఘనమౌచాంధ్ర తపః ఫలంబు నగుచున్---కర్మార్థి సౌకర్యమై,

         దినముల్ స్తవ్యతఁ గూర్చుచుం బలిదమై---దీక్షారతిన్ సర్వమున్

        మనుజాళిం తిర మేర్చిగూర్చు కవితై---కల్యాణముల్గూర్చుతన్!


4.మ:-వర పాండిత్య ప్రకర్షచే దనరగన్---భాషామ తల్లెంతయో?

         గురు కీర్తిం గడియింపఁ జేయు నవనిన్---కొం గ్రొత్త ఛందంబులన్

         స్థిర ప్రజ్ఞాన్విత గర్భ చిత్ర కవితల్----జేకూర్చు జేజే లిలన్

         వరదామున్ ఘన రామ కృష్ణ కవినిన్---వాగ్దేవి రక్షించుతన్!!


5.మ;-  మనసా సత్యము, నిర్మలత్వ మరయన్---నీత్యుక్త వాచ్యంబులన్

           తన నెయ్యంబది ప్రాణ సఖ్య మనగా---తత్వార్థ జ్ఞానంబునన్

           జనతానందము నొందు మేథ నిధినిన్----సర్వేశు దీక్షా రతున్

           ఘన నెయ్యు న్మనసార దీవన లిడన్----కైవల్యు నర్ధించెదన్!!


నాపై అవ్యాజానురాగముతో హృదయపూర్వకమైన ఆశీస్సులందించిన శ్రీ వల్లభవఝల అప్పల నరసింహమూర్తి మహోదయులకు ధన్యవాదపూర్వక నమస్సులు.

జైహింద్. 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.