పుణ్యాత్ములు ధన్యజీవు లయిన మీకు సకుటుంబము శ్రీమన్నారాయణ సమేత లక్ష్మీ కరుణాకటాక్ష వీక్షణములు సమృద్ధిగా లభించుఁ గాక!//
కామేశ్వరరావు పోచిరాజు.
వాణీ. భద్రాచలం.
శ్రీ చింతా రామకృష్ణ రావు గారిపై, వారి "శ్రీ లక్ష్మీ సహస్రనామ వివరణ" కు ఈ పద్యం:
ఉ. శ్రీ కరమైన లక్ష్మికి ప్రసిద్ధిని గన్న సహస్ర నామముల్
శ్రీకర భాష్యమున్ రచన జేసిన ధీయుత సత్ కవీద్రులే,
రాకను బోకయున్ సతము రాగిలు భక్తికి మెచ్చుకొంచునా
వాకున సూక్తులల్లెనట వాణియె మెచ్చగ రామకృష్ణుడే!
భావం:
శ్రీకరమైన లక్ష్మీదేవి సహస్ర నామాలకు మంగళకరమైన భాష్యాన్ని రచించిన బుద్ధిమంతుడు రామకృష్ణ రావు గారు. ఎప్పుడూ చెక్కుచెదరని భక్తికి మెచ్చి, సరస్వతీ దేవి సైతం మెచ్చుకునేలా ఆయన వాక్కులో సూక్తులు అల్లారు.
అభినందనలతో
వాణి. భద్రాచలం.
వెంకట్ టీచర్.
చివరి పద్యం చాలా అద్భుతంగా ఉంది గురువుగారు. వరప్రసాది అయినటువంటి నారాయణి స్తుతి లో భాగంగా ఈ పద్యాన్ని ప్రతినిత్యము పఠించిన వారికి అన్నీశుభములు జరుగుతాయి. అనే మంచి భావము, మంచి పదజాలం, ఈ పద్యంలో కూర్చారు. చదివి ధన్యుడనయ్యాను 🙏🙏.
భాస్కర రావు మాష్టారు.
🙏🙏🙏. మీ కృషి అద్భుతం. అనన్య సమాన్యం. శుభోదయం
డా. మాడుగుల అనిల్ కుమార్ అవధాని. తిరుపతి.
శుభోదయ నమస్కారములు ఆర్యా! మీ పద్యాలు ఆదర్శాలు, పుణ్యదాయకాలు. అద్భుతం. 🙏🙏🙏 ధన్యవాదాలు
మచ్చా అనూరాధ.
అమ్మవారి కృపా కటాక్షం లో మీ పై నిండుగా ఉన్నాయి. సార్
అమ్మవారికి ప్రియ పుత్రులు మీరు.
సముద్రాల.
ఈ వయస్సులో మీరెంతో కష్టపడి లోకానికోసం లెక్కలేనన్ని పద్యాలు వ్రాసి అందరితో పంచుకున్న మీ జీవితం ధన్యమైంది రామకృష్ణారావు గారూ. ఆ జగన్మాత మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులందరినీ చల్లగా కాపాడాలని మనసారా కోరుకుంటున్నానండి. నమస్కారమండి..
🙏🙏
మాన్యశ్రీ గురువు గారూ!
అమ్మ వారి నామాలను పద్యరూపంలో వ్రాసి అందరికీ పంచిన తమకు అనేక ధన్యవాదాలతో నమస్కృతులు!!
👏👏💐💐 శేషకుమార్ 🙏🙏
సహస్రనామాలు, సరళంగ సులభశైలిలో అర్ధమైనట్లు ప్రతి నామమును వ్రాసారు, అభినందనలండి.
గంగామాత.🙏
వ్రాసినది



0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.