గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, జూన్ 2026, మంగళవారం

16.అష్టి ఛందము, (వెలసిన వృత్తములు,65.536.). వివరణ ... రచన శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,

జైశ్రీరామ్.

 16.అష్టి ఛందము

పాదమునకు 16.అక్షరము లుండును,ప్రాస నియమము కలదు,

1.శితజన పోషక వృత్తము,


                శ్రీ కర!సుగుణాకర!శిత జన వరిపోషా!

               మావర దభి రామత!మమత సమత నిమ్మా!

               కావరమున నీల్గుచు!కలి దనరిట!చూడన్!

              జీవన వరదంబిడు!చివురిల సుఖ శాంతుల్!


శిత జన పోషక వృత్తము,భ,స,స,న,స,గ,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-16095.


2.భారతోర్వీ వృత్తము,


              మంచి వార్ని చెడ్డ జేయు!మాంత్రిక లోకంబాయెనే!

             కుంచి తాగ్ర బుద్ధి నొప్పి!కొంపలు గూల్పం జూతురే!

             మంచి లేదు!చెడ్డ లేదు!మాటలు స్వార్ధంబంటెనే!

             పంచ పాతకాళి నిండె!భారతి నీవె ట్లోర్చెదే?


భారతోర్వీ వృత్తము,ర,జ,ర,స,త,గ,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం;-17991.


3.నేటి తీరు,వృత్తము,


    1.     జాతి నంటి నీతి పారె!సత్యమంటి సాగ లేకన్!

           నేత నైజ మంటి యొప్పె!నీతి సామ్య మెంచదాయెన్!

            భూతి నింపు ధోరణాయె!భూత శాంతి భూమివీడెన్!

            చేతి వాట భూటకాల!జీవ ధాత్రి చిందు లేసె!ధాత్రిన్!


2.       తల్లి చాటు బిడ్డలంచు!తన్మయత్వ మొంద కమ్మా!

          కల్లు త్రాగి విఱ్ఱ వీగు!కల్యుగంపు బిడ్డ లమ్మా!

           పిల్ల లంచు మోజు చూప!పిప్పి యౌను!శ్రేయ మెల్లన్!

          అల్ల నాటి ఖ్యాతి మాయు!అమ్మ మెచ్చ మెల్గు మంచిన్!


నేటి తీరు,వృత్తము,ర,జ,ర,జ,ర,గ,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం;-10923.


4.లోకతీరు వృత్తము,


          పంచ వర్ష ప్రాభవంబే?ప్రాపు నేపు!పెంపు నిడన్?

          ఎంచరేమి?ముప్పదేండ్లున్!యీడ్పు తాపు సేవకులన్!

          పంచ తంత్ర మిత్ర భేదమ్!పట్టె లోక సంకటమై!

         కంచి మేయు చేను తీరై!కాటకంపు భావి యవన్!


లోకతీరు వృత్తము,ర,జ,మ,జ,భ,గ,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-27139.


5.పరమ హంస వృత్తము,


              పరమ హంస లేమొకో?పట్టి జూడ!గాన దాయెన్!

              నిరత కాకి మూకలే?నిండె లోక సర్వ మందున్!

             చరమ గీతి పాడగా?సాగు చుండె!తీతి కాళే!

             కరము భక్త సంతతిన్?కావ రావె?చంద్ర మౌళీ!


పరమ హంస వృత్తము,న,ర,జ,జ,ర,గ,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-11096.


6.స్వార్ధ నీతి వృత్తము,


            చదువు కొన్న వారికే?చదువు నేర్పు జాతాయెనే!

            పదును లేని తెల్వికే?పదవి నొందు తీరాయెన్!

            చదిర నేర్పు కాటాయెన్!జగము మిథ్య శూచ్యంబై!

           ముదిరె!స్వార్థ నీతిలన్?ముదము గాచు!న్యాయంబున్!


స్వార్ధ నీతి వృత్తము,న,ర,జ,స,య,గ,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-5976.


7.తత్వ మార్పు వృత్తము,


            రక వికార రంజిత!రాజ్యమాయె?పరంతపా!

           వెకిలి చైద సాదృశమా!వేద భాష్య వెలుంగిదా?

           నక శికాశ్రి తంబమరే!!నర్మ కర్మ నిధానమా!

            నకిలి తత్వ మాప నికన్!నాట్యరాజుయె!రావలెన్!


తత్వ మార్పు వృత్తము,న,ర,స,జ,జ,గ,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-23256.


8.వరస్వార్థ వృత్తము,


        ఓట్ల సంఖ్య కుల సంఖ్యె?యున్నతేర్చు!నీత దాయెన్!

        పాట్లు బీద కలమంగ!!పారె ధర్మ మెంతొ ?దూరమ్!    

         ఏట్లు వేట్లవి చరిందె?యిచ్ఛతన్?బలీయ మౌచున్!

         కోట్లు స్వార్థ వరదంబె?కొంప కొల్లగొట్టె!శ్రేయమ్!


వర స్వార్థ వృత్తము,ర,న,మ,జ,ర,గ,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం;-10811.


9.ఆర్త నాథ వృత్తము,


          అండ పిండ బ్రహ్మాండ మంతన్!ఆర్త నాథ !శ్రీలయెన్!

          కొండ ముచ్ఛు లనంత మౌచున్!కోరి కీడు కోరగన్!

          బండ నైజము ఛెండ నౌనే?పాపి మూక రాపిడిన్!

         నిండు స్వేచ్ఛ!నెండమావై!నేర్మి దీర్చు శ్రీహరీ!


ఆర్త నాథ వృత్తము,ర,య,య,ర,జ,గ,గణములుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-21579.


10.పంచ ఛామర వృత్తము,


             తరింపు లేని జన్మరా!ధరాతలంబురా!యిదీ!

             నిరంత చింత మంతనౌ!నిరీక్షదేల?శ్రీలకున్!

             పరంతపా!యనంగదే?పరంబదే?సుఖంబురా!

             తరించు జన్మ మానవా!తరాలు మెచ్చు నిచ్చెలున్!


పంచ చామర వృత్తము,జ,ర,జ,ర,జ,గ,గణములుండును,

యతి9.వ,యక్షరము,వృ,సం:-21846.


11.పటు ర్నవ వృత్తము,


            తటి ర్లతా గుల్మ!సదా నంద మోద!సంపన్నమై!

            పటుర్నవోన్మేష!ప్రభావంబు దీప్తిలన్!భోద్యమై!

            కటాక్ష వీక్షంబు!ప్రకాశంబు శర్వమై!పర్వగన్!

             నటానుకూల్యంబు!ననంతంబు!పర్వమై!వెల్గిడున్!


పటు ర్నవ వృత్తము,జ,త,య,జ,త,గ,గణములుండును,

యతి,8.వ యక్షరము,వృ,సం;-19046.


12.మెరుగిడు వృత్తము,


             గాలి కెగయు వృక్షముల్!కనం కూలు గేహములే?

            కాల మహిమ మేనొకో?కఠోరంపువర్తనమో?

           జాతి గనని జాగృతా! జిగి న్మాపు ! క్రోధ మిదా!

           మేలుకొనవె!భారతీ!మెరుం గేర్చు!మానవతన్!


మెరుగిడు వృత్తము,న,స,జ,త,భ,గ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-26996.


13.నిరక్షర,వృత్తము,


         నిశానీల కేలనో?నేల నేలు కాంక్ష కల్గెనే!

        విశాలంపు ధాత్రిలో?విద్వ దంశ!కీడు నొందెనే!

        గాశిలె న్సువిద్యయున్!కంటకంబు దృశ్య శ్రావ్యతన్!

       వాసి గాంచె!యంత్రముల్!పల్క లేని మమ్మి జీవమై!


నిరక్షర వృత్తము,ర,జ,త,ర,జ,గ,గణములుండును,

యతి,8.వ,యక్షరము,వృ,సం:-21703.


14.లోక మాయ వృత్తము,


            వట్టి గొడ్డు పాలిచ్చునే?పాపి మూక మంచెంచునే?

            మట్టి బుఱ్ఱ దిట్టతిడన్?మాయ లోక తీరాయెనే?

            చెట్ట పట్టి సౌభాగ్యమున్!ఛీదరించి చెల్వొందిరే?

            వట్టి మాట!గొప్పేర్చెనే?వాదులాడ!లే రిద్ధరన్!


లోక మాయ వృత్తము,ర,య,య,జ,త,గ,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-19019.


15.సద్వర్తనా వృత్తము,


           సన్మార్గ మెంచి మన్నుడీ!సత్యమే!నిత్య నిర్మలమ్!

          కన్మోయి!సామ్య వాదమున్!గాంచెదే?సత్య మిద్ధరన్!

          చిన్మాత్ర జీవితంబిదే?చేర్చుమీ స్వర్గ ధామమున్!

         పెన్మాయ వేద బోధలన్!పెన్నిధై నిండు నొందెదే?


సద్వర్తనా వృత్తము,త,ర,య,య,న,గ,గణములుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం;-29269.


16.నిలుపేర్చు వృత్తము,


            నిండైన నూరేండ్లకు నిలుపేర్చు! జీవితంబిదే!

            పండైన పూర్ణాశ్రిత!పరిపక్వ మేపు!తా గనన్?

            మెండైన సర్వార్థ సుమ సరై జనన్ప్రభావతన్!

             కొండైన కీర్తీవన!గురు తత్వ మౌను!మంచినిన్!


నిలు పేర్చు వృత్తము,భ,త,న,ర,జ,గ,గణములుండును,

యతి,8.వ,యక్షరము,వృ,సం:-21991.


17నడవడి వృత్తము,


           1.  .సోదరాదర బుద్ధినిన్!సూరివై. విలసిల్లుమా!

                ఆదరంబున!సర్వమున్!అంతు చిక్కని నెయ్యమౌ!

                 బీద సాదల నాదుకో!పేరు నిల్చు యుగాంతమున్!

                 ఛీదరించుమి ద్రోహులన్!చేర బోకుమి?నీచులన్.


      2.     మొండి వాదన దండుగౌ!మూర్ఖమే?యురి కంబమౌ!

              ఛండ భానుని తీవ్రతన్!సర్వ భక్షణ చేకురున్!

              బండ రాయివి!గాకుమా?భద్ర శూన్యుడ వౌ దిలన్!

              గండి గొట్టు తటాకమౌ!కల్ము లేగును!సర్వమున్!


నడవడి వృత్తము,ర,స,య,జ,జ,గ,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-13131.


18.జయ మిడు వృత్తము,


            నయము లేని వినయమ్!దయ లేని!ధర్మ మగున్!

            భయము లేని బ్రతుకే?పడ దోయు ఖ్యాతిలన్!

            రయము లేని ధనమే?రహిని మించి ద్రోహ మిడున్!

           స యశమెంచు నడతే?జయ మిచ్చి బ్రోవు నినున్!


జయ మిడు వృత్తము,న,భ,జ,జ,భ,గ,గణములుండును,

యతి,9.వ,యకషరము,వృ,సం;-27512.


19.నయజీవనా వృత్తము,


             పనస కాయ!సదును పనికిరాదు!నెయ్యుడా!

             వినయ జీవితమది!వినుతి కెక్కు తెల్సికో?

             తనియు మంచికిలను!తరములే?వరామమౌ!

             మనుజ జాతి మనది!మమత పెంచు సర్వదా!


నయ జీవనా వృత్తము,న,భ,న,స,జ,గ,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-22520.


20.అణకువ వృత్తము,


       1     స్పర్ధ పెంచి చదువుమా!జగము మెచ్చు నిచ్చెలున్!

              వర్థమాన!జగతికిన్!ప్రభలు గూర్చు నెన్నడున్?

              అర్థ మిచ్చు తెలివి నిన్!అణుకు వొందు!బాలకా!

               వ్వర్థ పుచ్చ సమయమున్!వదులు జ్ఞాన సంపదల్!


    2.     కాని పోని పనులవే?కడకు హాని నీయవే?

           తాను సర్వ మనుకొనీ!తడుమ నొడ్ల కృత్యముల్

           మానవాళి బ్రతుకుకే? మరువ రాని దెబ్బగున్!

           దాన దీన తడుమకన్?తగిన హద్దు నొప్పుమా!


అణకువ వృత్తము,ర,న,జ,స,జ,గ,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-22395.


21.నిపుణతా వృత్తము,


                పచ్చని చేలతో!పాడి పంట నెలవు!భారతిన్

                స్వ చ్ఛత కాట పట్టౌచుసర్వ మొదవు శాంతినిన్!

               కచ్ఛిత మౌచు!సర్వంబు!కార్య కరణ నైపుణిన్!

                మెచ్చగ జీవ యానాన!మంచి దలచి!మించిరే!


నిపుణతా వృత్తము,భ,ర,ర,న,జ,గ,గణములుండును,

యతి,9.వయక్షరము,వృ,సం;-24215.


22.పేరొనరు వృత్తము,


             కర్కశంపు!తర్క జీవమ్!కల్మషాత్మ నేర్చు నిలన్!

            అర్క కాంతి మంట లీనన్!హర్షమౌనె?యెంచు మయా!

            పేర్కొనంగ!జాతి నీతిన్!చిత్త మొప్ప?సాగ వలెన్!

            పేర్కొనెండు మార్గ మెంచన్!ప్రీతి పాత్రు డౌదు!రసన్!


పేరొనరు,వృత్తము,ర,జ,మ,జ,భ,గ,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-27179.


23.చంచల వృత్తము,

            

             చంచలమ్!సర్వ మీశ్వరమ్!సాగుచుండు!సర్వమిహమ్!!

             వంచి తంబేల?శ్రీలకున్?పారు నీటివాటమదియే!

            సంచి తార్థాలవే?పాపతన్!సర్వ శూన్యమేర్చుతుదిన్!

            ఎంచుమా మంచినే!సౌమ్యతన్!ఈర్ష్య వీడు మయా!


చంచల వృత్తము,ర,ర,య,జ,భ,గ,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-31315.


24.భీభత్స వృక్షము,


            పంతు లేని విషాధ ప్రళయము!గూర్చెన్!భువినిన్!

            వింతయౌ?చర శక్తి!వికటిత భీభత్స మిడెన్?

            అంత మేర్చె!సమస్త!యవనిని నీటం దేల్చెనే!

            సుంత నీతి!విశేష శుభగత!గావన్రా!శివా!


భీభత్స వృత్తము,ర,స,న,య,భ,గ గణములుండును,

యతి,8.వ,యక్షరము,వృ,సం;-26557.


25.విమలతా వృత్తము,

        

           పసగల జీవనంబు!ప్రణుతింగను!ధాత్రినిన్!

           వెస సరివారి యందు!విమలంబది!మేలిడున్!

           కసి గొనరాదు!జాతి!కల తేలయ?మాన్పుమా!

           దెసలకు కీర్తి పెంచు!తిరమౌనది!బాలకా!


విమలతా వృత్తము,న,జ,భ,జ,జ,గ,గణములుండును,

యతి.9.వ,యక్షరము,వృ,సం;-23352.


26.నీతి నిర్వహణ వృత్తము,


              పైకి నెయ్యమ్!లోన ద్వేషమ్ !పట్టి కుడిపి తీరదే?

             చీకు చింతే?లోకమింతే!చేటు గల్గు స్వేచ్ఛకున్!

             చాక చక్యంబైన జీవమ్!సర్వ సమత నెంచు చోన్?

             నీకు మించే వాడు లేడే?నిర్వహణము నీతిలన్!


నీతి నిర్వహణ వృత్తము,ర,త,మ,న,జ,గ,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం;-24159.


27.కలిమి లేముల వృత్తము,


           కాల చక్ర మాగునా?కలిమి లేమి!ధాత్రియందున్!

          నీలి మేఘ మీయదే?నిరుప మంపు నీటి నెంతో?

          పాలిపోని జీవతాపమ్!హరమౌచు!భుక్తి గూర్చున్!

          చీల నీకు!శాంతి నిన్!సిరినిల్చు!ప్రోవు నౌచున్!


కలిమి లేముల వృత్తము,ర,జ,భ,జ,ర,గ,గణములుండును,

యతి,8.వ,యక్షరము,వృ,సం;-11179.


28.సుమేథా వృత్తము,


           దైవ శక్తి ధిక్కరించే!దండి నంచు తృళ్ళె దేలనో?

          నీ వశంబె?శక్తి నాపన్!నీల్గు జాతి శ్రేయ మెల్లన్?

          కాని పోని యూహ లాపన్!కల్మి పెంచు మార్గ మౌగా!

          జ్ఞాన శక్తి మంచి మించన్?సర్వ శ్రేయ మేర్చి తీర్చున్!


సుమేథా వృత్తము,ర,జ,మ,జ,ర,గ,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం;-10799.


29.అతి తెల్వి    వృత్తము,


              తీరు తెన్ను లన్ని మారెన్!తిండి దోషంబు నిండెనే!

              పేరు లేని రోగ జాలమ్!పిండి పిప్పేర్చె!జాతినిన్!

             కోరి సేంద్రియాల పంటల్!కొంప లంటించె!చూడగన్!

             సారమైన మేథ తీర్పే?సర్వ శూన్యంబు నేర్చెనో?


అతి తెల్వి వృత్తము,ర,జ,ర,మ,జ,గ,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం;-20523.


30.దీక్షిత వృత్తము,


          నలిను రాణి వాణినిన్!నాద ట్రహ్మ నటరాజున్!

          కలుము లమ్మ శ్రీ సతిన్!గౌర వించి మను!నీతిన్!

          తిలకు డీవు!ధాత్రినిన్!తీరు దీర్చుసుర లెల్లన్!

          మెలుకు వొందు!జ్ఞానివై!మేథ పెంచు గురు భక్తిన్!


దీక్షిత వృత్తము,న,ర,య,జ,స,గ,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-14936.


31.మంచెంచని వృత్తము,


                మద మనర్ధము గూర్చునే!మంచెంచని తీరునై!

                విధి విధానపు మార్పుకే?వేధించు జనాలనే!

                పదిల మన్నది!పట్టదే!పాపాత్మక ధృష్టినిన్!

                కదలు దుష్టత!సర్వదా!కాటేయుగ లోకమున్!


మంచెంచని వృత్తము,న,భ,ర,త,జ,గ,గణములుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం;-22717.


32.నీతి నెంచు వృత్తము,


               వంచితంబే!సంచితార్ఠమ్!వల్ల మానిన భూతిడన్!

               మంచినెంచే!దేల నయ్యా?మాయజాల మదోత్కృతిన్!

                పెంచరేమో?మంచి కొంచెమ్!భీషణత్వ భిభీషతన్!

                కొంచెమైనా!నీతి లేదే?కూర్చు మంచిని దైవమా!


నీతి నెంచు వృత్తము,ర,జ,మ,జ,జ,గ,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-23073.


33.దోష వాసనా వృత్తము,


                శ్రీ మంతుల పంచ స్వీచ్ఛ!నిత్య దాసి యాయెచూడన్!

                శ్రీ మాయ విశేష మేమొ?చేరదాయె?బీద నేమో?

               రామంబది వీడె!భూమిన్!రాగ ద్వేషతా వలంభై!

               కామార్తి ప్రబోధ జిక్కెన్?కాన రాని దోష చర్యన్!


దోష వాసనా వృత్తము,త,జ,ర,జ,ర,గ,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-10925.


34.భవిష్య వాణి వృత్తము,


            పాసి జిహ్వ  వాస మైతీవు!వాసి శ్రీ లింపే?పెంపై!

           దాసి భూత లోక వాశీవు!ధర్మమే?దుర్మార్గానన్!

           వేసడంపు గంథ సామ్యాన!విశ్వమంతా!మాయాయెన్?

           భాసిలెంసదా విఘాతాలు!భావి జీవా లేమౌనో?


భవిష్య వాణి వృత్తముర,జ,త,ర,మ,గ,గణములుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-1323.


35.చరశ్రీ వృత్తము,

         

          శుచి శుభ్ర విభ్రమాలు!చూచి విసిగి శ్రీ లవే?

          వచనానృతుల జేరి!వాసి గనెను దోషతన్!

          పచనంబు గాని వంట!పంటి తెరగు భాసిలెన్!

          కచరాళి తీరు మారె!కాల మెపుడు?నీతిలున్!


చర శ్రీ వృత్తము,స,జ,ర,న,జ,గ,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం;-24236.


36.సామ్యమా?వృత్తము,

       

             పూట బత్తెమ్!పుల్ల వెల్గై!వెల్గు జాతి నుద్ధరింపన్!

            మేటి వైనం జాలు భూమిన్!మేలు గల్గు సామ్య వాదమ్!

            భూటకంబౌ!స్వార్ధ చింతే?బుగ్గి  జేసె!బీద సంఘమ్!

            కోటు లున్నం బీదలంచున్?కొంగు జాచు!లోక మాయెన్!


సామ్యమా?వృత్తము,ర,త,మ,జ,ర,గ,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-10787.


37.మాయా లోక వృత్తము,


             బీదరికము మాయునా?పిచ్చి స్వార్ధ లోకానన్!

            మోదమదియు శ్రీలకే?ముద్దు నిచ్చి బ్రోవు చుండన్?

            చేదు నిజము!ధర్మమే?శ్రీల వైపు మ్రొగ్గు చూపన్!

            ఆదరణపు నీతియే?హంత మాయెనో?యనంగన్?


మాయా లోక వృత్తము,భ,స,య,జ,ర,గ,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృసం;-10847.


38.లోక రక్షక వృత్తము,


            అసంబద్ధ ప్రలాపాలు!అశ్లీల దృశ్య భాష్యాలే!

           వెసంజేరి ప్రతాపాన!పెన్ముప్పు భావ్య మేర్చంగన్!

           పసందంచు విఘాతాల!పాడెంచి మెల్గ భీమంబౌ!

           వెసం బ్రోవ సదా నీతి!విధ్వంస మాప!రా వేగన్!


లోక రక్షక వృత్తము,య,స,ర,ర,య,గ,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-5275.


39.మృదుల వృత్తము,


            హర హర సుర వర!అతులిత లావణ్య ధీ!

            పుర రిపు వరమయ!భువనము లీవే నయా!

            కురు వరదములను!కువలయ మొప్పంగ!శ్రీ

            నిరతము తిరముగ!నిలు హృది!మల్లేశ్వరా!


మృదుల వృత్తము,న,న,న,న,త,గ,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-20480.


40.కూర్మిలు వృత్తము,


           కంటి తుడుపు మాటలే!కాల హరణ మేర్చగన్!

           వెంట నడచు రోగముల్!వీడు సురల మోదమున్!

           పంటి పలుకు నీతిలన్!వారిదములు భుక్తిడున్!

           కొంటి బ్రతుకు నంటకన్!కూర్మి నడచు!బాలకా!


కూర్మిలు వృత్తము,భ,స,య,న,జ,గ,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-24159.


41.సు బోధా వృత్తము,


          పరులు మెచ్చ బ్రతుకుమా!భంగ పడవు!ధాత్రిన్!

          గురులు మెచ్చ చదువుమా!కోవిదుడవు!నీవే!

          సిరులు బొంది!మిడియుచో!జీవనమది!శూన్యమ్!

          కరము భక్తి నడువుమా!కాచు సురలు సర్వదా!


సు బోధా వృత్తము,న,భ,స,భ,స,గ,గణములుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-15708.


42.భాగ్య ప్రభ,వృత్తము,


             ఓగిరంబొందు జాగిలమ్!ఒంటి కాలు లేచు నటుల్!

            బాగ సంపత్తి నొప్పెడిన్!భాగ్య శీలి డెప్ప రగున్!

            సాగ శక్తున్న!దేశమున్!సారధౌచు!దీప్తి.! గనున్!

            త్యాగ హీను డైనచో?ధర్మ దూరుడౌను!భువిన్!


భాగ్య ప్రభ వృత్తము,ర,ర,య,జ,భ,గ,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-27209.


43.నీతి పాత్ర వృత్తము,


           కల్మి యున్న లేని యీవి!గట్టు తెగిన కాసారమ్!

           బల్మి యున్న నోడె దీవె!పట్టు సడల కుస్తీలన్!

           తాల్మి లేని జీవ మెల్ల!తాడి యొసగు నీడేరా!

           చెల్మ బల్మి నెట్ట బోకు!చేర రెవరు?కష్టాలన్!


నీతి పాత్ర వృత్తము,ర,జ,ర,న,య,గ,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-7851.


44.జీవ,ధాత్రి వృత్తము,


           జ్ఞాన దీప కాంతులవే?సారావళీ జీవ యానమ్!

          మాన నీయ శాంతి యదే!మర్త్యాళికిన్ శోభ నీయన్!

          దీన బంధు వీవనగా!తీరు న్సదా!బ్రోవు మోయీ!

         కాని మాయ వీడుమయా!కల్మియదే?జీవధాత్రిన్!


జీవ ధాత్రి వృత్తము,ర,జ,య,ర,ర,గ,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-9319.


45.మించు మంచి వృత్తము,


             నేల వీడి!సాము మాను!నీతి నొప్పు బాలకుడా!

             మేలు కోరు వారి మంచి!మించి సేయు శక్తి యుతిన్!

             చాలి నంత!పొంద వచ్చు!సర్వ హింస!తప్ప దగున్!

             కాల మెల్ల కల్మి లేమి! కాక రంబు నెంచు మికన్!


మించు మంచి వృత్తము,ర,జ,ర,జ,భ,గ,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం;-27307.


46పాప కలన వృత్తము,


           వ్రీడ లేని బ్రతుకేల?పీడ భవిత సామ్యతన్!

          దాడి నెంచు తపనేల?తప్పు నెసగు చూడుమా!

           పాడి గాని పలుకేల?పాప కలన మేకొనున్!

           చీడ జన్మ గన నేల?జీర గలవె?మోక్షమున్!


పాప కలన వృత్తము,ర,న,ర,న,జ,గ,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం;-24251.


47.చెడు విడు వృత్తము,


              గడుస రంచు మిడియన్!కడకు తెడ్డె మిగులున్!

             పడెదు కష్ట మవనిన్!పనికి రాని బ్రతుకౌ!

             నడువు నీతి చరితన్!నరులు మెచ్చ నవనిన్!

             చెడును చేప కెపుడున్!స్థిర మతిం దనరుమా!


చెడు విడు వృత్తము,న,భ,జ,స,న,గ,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం;-30584.


48.సద్వర్తనా వృత్తము,


          మంచి బ్రతుకు మాన్యమౌ!మామక ఫల ప్రాప్తదే!

           కుంచిత గుణ మేలయా?కోరుమి పర శ్రేయమున్!

           చంచల. మనసోపకన్?సార మరయు విద్యలన్!

            పంచు మమత!సర్వదా!బాధిల బడ వెన్నడున్!


సద్వర్తనా వృత్తము,భ,స,య,న,జ,గ,గణములుండును,

యతి.9.వ,యక్షరము,వృ,సం:-24259.


49.సమయమరయు వృత్తము,


                  శ్వాస చరిత జీవితమ్!సమయ మెరుగ నౌనే?

                  వాసనలకు జిక్కినన్!వసుమతి దురిత మేర్చున్!

                   గాసిల పని లేదయా!ఘన మతి! సురల గొల్వన్!

                   వాసము సరి తీర్చుకో!వరలును!సుఖము లెల్లన్!


సమయ మరయు వృత్తము,భ,స,జ,స,న,స,గ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృసం:-16223.


50.కలిమిలు వృత్తము,


              మానవత్వము లేని మూర్ఖమ్!మంట కాలెడు కాష్టమే?

               దాన వత్వము!దగ్ధ మేర్చున్!ధర్మ దేవత!తీర్పునన్!

                కానవోయీ?నీతి మార్గమ్!కల్మి బల్మియు!నద్దియే!

                కాని పోనీ!యూహ లేలన్?కర్మ సక్రమ మేర్చుమా!


కలిమిలు వృత్తము,ర,త,మ,జ,జ,గ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం;-23075.


51.స్వాలోచనా వృత్తము,


              బిడియ మేది?మానవా!బెడగు లేదాయె నేలో?

             జడ పదార్ధ చేతలే?జగమునే?మార్చి వేయన్!

             కడకు నూహ భ్రష్టమౌ!గమనమే?యంత్ర మౌచో?

            నడుము మంచి యూహలన్!నవత శ్రేయంబదే!యౌ.


స్వాలోచనా వృత్తము,న,ర,జ,న,ర,గ ,గణము లుండును

యతి,9.వ,యక్షరము,వృ,సం:-4072.


52.తర్కిలు వృత్తము,


          ఊహ లేని యంత్రములే!యుర్వి నేలెన్!తెల్వి తేటన్!

         ఊహ యున్న మానవుడా!యూర్జితంపు బుద్ధి లేదే?

         సాహ చర్య తర్కమునే?సర్వ పర్వ మేర్చు నోయీ!

         దేహ శక్తి మేథ యుతిన్!దివ్య తేర్చు!మానవత్వమ్!


తర్కిలు వృత్తము,ర,జ,య,జ,ర,గ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-10859.


53.జన్యు ప్రభ వృత్తము,


          జన్యు జనన దోషమా!జగద్యిచ్ఛ!స్వేచ్ఛ తీరా?

         మాన్య జడధి లంఘనే?మహాత్మ్యంబు మారు తొందెన్!

          ధన్య తవని వీడెనే?తగం లేని!వాల మేనో?

          మాన్య ధనులు పుట్టరే?మహి న్కీర్తి!వెల్గి డంగన్!


జన్యు ప్రభ వృత్తము,ర,స,జ,త,ర,గ,గణము లుండును,

యతి.9.వ,యక్షరము,వృ,సం:-10587.


54.నేటి జగం,వృత్తము,


           తోక లేని కోతు లౌచు!తుక్కు జేసి వనములన్!

          మేక పోతు భేషజాన!మేయ జూచు వర నరుల్!

          సాక నీరు ధర్మ మాత!సాక్ష్య దోష! మొర వడిన్!

          కాక నిండె!దుర్మదంబు!కల్యుగంబు!గరళమై!


నేటి జగం వృత్తము,ర,జ,ర,జ,న,గ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం;-31403.


55.చెడు మేథ,వృత్తము,


            వేప విత్తు!మఱ్ఱి యౌనె?వెఱ్ఱి యూహ పడుటే యౌ!

           యేపు నాపు నీర్ష్య యూహె!యెల్ల సంకర జాతౌ!

           చేప నేల?దుష్ట. తంత్ర జీవితాలు!పడి చెడున్లే!

           పాప మోపు!ధర్మ గ్లాని!భంగ మౌను!భావి సౌఖ్యమ్!


చెడు మేథ,వృత్తము,ర,జ,ర,జ,ర,గ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-10917.


56.నీతి చెడు వృత్తము,


           జాతి కులా లేక మౌచో?జగతి సంకరంబే యౌ!

          నీతి చెడున్?చీలి పోవున్!నిశిత కర్మ నాశంబౌ!

          పాతు నిలన్!వేద జ్ఞానమ్!పరితపించు!సర్వంబున్!

          భూతి గొనన్!చిత్ర చింతల్!పుర హరంపు!నూహే?యౌ!


నీతి చెడు వృత్తము,ర,జ,త,స,య,గ,గణము లుడును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-5931.


57భాగ్య శీలి వృత్తము,


           ఓగిరం బొందు!జాగిలమ్!ఒంటి కాలు లేచు నటుల్!

           బాగ సంపత్తి నొప్పెడిన్!భాగ్య శీలి!గొప్ప యగున్!

          సాగు శక్తున్న దేశమున్!సారధౌచు!దీప్తి గనున్!

          త్యాగ హీనుండు!నైనచో?ధర్మ దూరు డౌను!భువిన్!


త్యాగ శీలి వృత్తము,ర,ర,య,జ,భ,గ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-27209.


58.తెల్వి పెంచు వృత్తము,


              తెల్వి నెంచి పెంచు యూహ!జగతి ప్రగతి తీర్చు లే!

             పల్విధాల మంచి చర్చ!పచ్చ దనము పెంచురా!

             గెల్వ నెంచు!తెల్వి యందు!క్షేమ మదియె!ధాత్రికిన్!

             చెల్వ మందు జీవ మెంతొ?సేవ నడుము!బాలకా!


తెల్వి పెంచు వృత్తము,ర,జ,ర,న,జ,గ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-20395.


59.మాతృ వేదనా వృత్తము,


              కాలం జేసెన్!స్వేచ్ఛంచున్!కంట తడి పెట్టె దేలమ్మా?

              నీలో లేవా?రత్నంబుల్!నీర్ష్యె గద? మూల  మెంచగన్!

             కాలంబే?మారున్!శ్రీలే కారుణ్యత భావి!తీరునౌ!

             ఫాలాక్షుండే!నీపక్షం బాయె!నిక శాంతి నీదియే!


మాతృ వేదనా వృత్తము,మ,మ,మ,స,య,గ,గణములుండును,

యతి,8.వ,యక్షరము,వృ,సం:-5633.


60.యంత్ర మోజు వృత్తము,


             పది మంది పొట్ట గొట్టి!పని సుళు వంచెంచగా!

             గుది బండ జీవ మౌను!కొర నగు!నూహింపుకున్!

            బదులేది?తేరి చూడ!వగ పగు!విజ్ఞానమున్!

            నిదురేల?తెల్వి పెంచు!నెడ మిడు యంత్రంబులన్!


యంత్ర మోజు.వృత్తము,స,జ,భ,న,త,గగణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-20396.


61.చతురిమ వృత్తము,


            స్ఫర్థే కావలె!విద్యార్ధీ!చతురత్వ మదే!సుమా!

            అర్థం చేసుకొ!పాఠాలన్!అమరంబగు దీక్ష తోన్!

            వ్యర్థం చేయకు!కాలంబున్!అది తిర్గియు రాదయా!

            అర్థం బేర్చును!విద్యేగా!అమితంబది!తెల్సికో!


చతురిమ వృత్తము,మ,స,త,జ,జ,గ,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-23321.


62.బేలౌటేల వృత్తము,


           మేలౌ విద్యను నేర్చికో!మేటి జీవన భాగ్యమౌ!

           బేలవౌ టేలన్?తెల్విలో?బీటు వారును జీవితమ్!

           కాలం తీరది శోధనన్!కన్గొనందగు!తెల్వినిన్!

           మేలౌ!వర్తన చేకురున్!మేథయోచన మోదతన్!


బేలౌటేల వృత్తము,మ,స,య,జ,జ,గ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-13129.


63.జ్ఞానాంబుధీ వృత్తము,


               తొలి కోడి కూయంగనే!తొలి సంథ్య!బ్రహ్మం బదే!

              వెల పెంచు పొత్తంబులన్!పెను దీక్ష నభ్యాసివై!

              తెలి వొంది!లోకంబునన్!దివురంగ తోడ్పాటగున్!

             నిలు తీవు!జ్ఞానాంబుధై!నెలకొందు లోకంబునన్!


జ్ఞానాంబుధీ వృత్తము,స,య,జ,జ,త,గ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-17276.


64.నీతి నాశక వృత్తము,


             పాతకంబు బ్రహ్మ హత్య!పరముడే?పుఱ్ఱె బట్టెన్!

            చేత కాని దోష చర్య! చివరికిన్!దోష మొప్పున్!

           నీతి నాశంబు సేయ!నిలుతువే?ధాత్రి యందున్!

          ఆత తాయి గాకు నీవు!అలరుమా!సామ్య వాదమ్!


నీతి నాశక వృత్తము,ర,జ,భ,స,ర,గ,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-10155.


65.మంచి బాల,వృత్తము,


            మాట జార నీకు మయ్య!మహిమ తగ్గు నీ కిలన్!

           చేటు చేయ నెంచ కోయి!చెడుదు వీవె!తొందరన్!

           పాటు నెంచి దీక్ష సేయ!పటుత గల్గు!వృత్తినిన్!

           మాట మీరి దాట బోకు!మహిత కీర్తి మాయమౌ!


మంచి బాల వృత్తము,ర,జ,భ,స,జ,గ,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-22443.


66.తెల్వి తేజం వృత్తము,


             నేటి పని చేయొ నేడే!నీ తెల్వికి!తేజంబదే?

             పాటు పడు!బుద్ధి తోడన్!పట్టౌను!విద్యార్థికిన్!

             చేటు కెడ మేగు!మోయీ!చెన్నొందు!బుద్ధి న్సదా!

            మేటి గురు బోధ జ్ఞానమ్!మేలేర్చు!జీవాంతమున్!


తెల్వి తేజం వృత్తము,భ,జ,మ,భ,త,గ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-19503.


67.కల్తీ కలి,వృత్తము,


          పాలు కల్తి!నీరు కల్తి!పరమ కల్తీ మాటలున్!

         చాల వంచు కల్తి జన్మ!కరము కోరే రేలనో?

         పాల కాళి!గెల్పు టాశ!భవిత చేర్చే దేడకో?

         చాలు,కట్టు దిట్టమైన!జననికాచు న్శ్రీ హరే!


కల్తీ కలి వృత్తము,ర,జ,భ,స,త,గ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం;-18347.


68.కలత లాపు వృత్తము,


            జాతులతో చెలగాటమ్!సాగు మతాల కల్లోలమ్!

            మాత సదా మమతెంచన్!మాను మయా!వికారాలన్!

            ఖ్యాతి గనన్!సమ న్యాయం సాయపడున్!చరింపంగన్!

            భూతి మదిన్!విడనాడన్!భూమి జనమ్!పరం బెంచున్!


 కలత లాపు వృత్రతము;-,భ,భ,మ,స,య,గ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము.వృ,సం;-5691.


69.సంకర సామ్యతా వృత్తము,


               కులాచారమ్!కూలి పోవున్!కోరి యేకము సేయగన్!

              తలంచేవో?సంకరత్వమ్!దారి తప్పును ధర్మమున్!

              కలం గల్పే బుద్ధి గెల్పా?కర్మ భూమిది! సోదరా!

              ఇలం సౌఖ్యమ్!సోదరత్వమ్!యేల?లేదను కొంటివే?


సంకర సామ్యతా వృత్తము,త,త,మ,జ,జ,గ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-13074.


70.సద్దు మణుగు వృత్తము,


                సాంకేతిక లోపానన్!సద్దు మణుగు!యంత్రా లెల్లన్!

               పంకంబగు!జన్మాంతమ్!పట్టు సడలు విజ్ఞానంబున్!

               జంకేలయ?తెల్వొందన్!సర్వ మిలను!శాంతంబేయౌ!

               పంకేరుహ!మృద్వత్వమ్!పాతి రిలను!యంత్రాలంచున్!


సద్దు మణుగు వృత్తము,త,య,త,త,మ,గ,గణము లుండును,

యతి,8.వ,యక్షరము,వృ,సం:-909.


71.అడియాశా వృత్తము,


              నమ్మిన జనావనిని!నర్మత!మాయ జేయుచో?

             పమ్మిన వరా శలవి నాశము గాక పోవునే?

             చిమ్మగను చీకటిల!చేరదు శాంతి భూమినిన్!

              వమ్మునగు స్వార్ధ మిది!బాగును కోరు నందువే!


అడియాశా వృత్తము,భ,జ,స,స,జ,గ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం;-16385.


72.వారసత్వ వృత్తము,


              వానర భాష చేష్టలున్!వారసత్వ మేడ కేగునే?

              కానల పూర్వ చర్యలన్!కాస్త మంచితృంచ వన్యమ్!

             మానవ మేథ యేమయెన్?మాడి పోవె?పంట లెల్లన్!

             కానగ వర్ష లేమినిన్!కాస్త పెంచు వృక్ష రాశినిన్!


వారసత్వ వృత్తము,భ,ర,య,జ,ర,గ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృసం:-10848.


73.పల్లవించు వృత్తము,


            నాటి కోతి చేష్ట లే నాటికైన?మారు నందువే!

            పాటు స్వేచ్ఛ తంత్రమై!పల్లవించి శోభ  గూర్చునే!

            కాటి ముందు మ్రుగ్గటుల్!కాల చక్ర దోషమే?యిదా!

            తోటి వారి మేలుగన! తుల్య తేర్చ రావె!శంకరా!


పల్లవించు వృత్తము,ర,జ,త,ర,జ,గ,గణము లుండును,

యతి,8.వ,యక్షరము,వృ,సం:-21803.


74.ఆకలి కేక వృత్తము,


              కడుపు నింపు ధోరణే?కలిని పీడింప బడున్!

             ఒడుఫు జూచి తిండికై!ఉరుకు చున్నారు!జనమ్!

             తడుపు భూమి నీటితో!ధరణి భుక్తీయు! హరా!

             బడుగు బీద సర్వులున్!పరవశంబొంద!శివా!


ఆకలి కేక వృత్తము,న,ర,జ,స,భ,గ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-26454.


75.విను మయ,వృత్తము,


           పెద్దల యనుభవంబు!వెతలార్చు!నెరుంగుమా!

          కొద్దిగ విని వడెంచ!గురు చేష్ట చెడుం గిడున్!

          వద్దిక చెడు చరంబు!వర జీవన   మెంచగన్!

          పద్ధతి నడు!జనంబు!పరముం డని మెచ్చగన్!


విను మయ,వృత్తము,భ,న,ర,జ,జ,గ,గణము లుండును,

యతి,9.వయక్షరము,వృ,సం:-23221.


76.శ్రీ ప్రభ,వృత్తము,


         నీతి నాతి ధర్మ మాత!నేవగింపే!కారణంబా?

         భూతి నిచ్చు శ్రీల చెంత!బోలె పట్టె!కర్మ యేమో?

          జాతి నాశ హేతు భూతి!సర్వ స్వేచ్ఛే?కానదాయెన్!

         పోతరంపు నీర్ష్య ద్వేష!భుక్తిమూలంబా?యదేమో?


శ్రీ ప్రభ వృత్తము,ర,జ,ర,య,ర,గ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-8875.


77.పెంపింపు వృత్తము,


             పట్టు గోరి సంస్థ లన్ని!పంచ వర్షంపు!ప్రాపొందెన్!

             కొట్టు మిట్టు లాడ జేసి!కొల్ల గొట్టెండు!నూహాయెన్!

            గట్టు నిల్చి బెడ్డ లేయ!కాచి గాసిల్లం!మోదంబో?

           పుట్టలోని నాగు లౌచొ?పుంజుకో నొనే?స్వేచ్ఛెంచన్!


పెంపింపు వృత్తము,ర,జ,ర,య,య,గ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-4779.


78.క్రమ శిక్షణా వృత్తము,


           చిన నాటి నుండియు!చెడు విడి!నడ యాడు మయా!

          మనె దీవు మంచిగ!మనుజులు కొనియాడగన్!

          మన సుంచి నేర్చిన!మహి మగు చదువు లబ్బున్!

          ఘన కీర్తి!చేకురు! కలుము లమరు బాలకా!


క్రమ శిక్షణా వృత్తము,స,జ,న,న,జ,గ,గణము లుండును,

యతి,8.వ,యక్షరము,వృ,సం:-24476.


79.భవిత మేలు,వృత్తము,


              వినకు కనకు చెడున్!వెతలు కల్గు భవితన్!

              మనుము సుగుణ జతన్!మనెదు మంచి మహిన్!

              కనుము నిజము సదా!ఖనివి యౌదు!ధరలోన్!

               మనసు పదునిడగన్!వలయు నయ్య గణితమ్!


భవిత మేలు వృత్తము,న,న,జ,స,న,గ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-30592.


80 పూజ్యతా వృత్తము,


          ఎదుగు లేని సొదలు!యెప్పుడుండు నరులకున్!

          పదిల మైన మనసు పట్టు వీడ దగునొకో?

         కదులు నీతి సమత!కర్మ కారి వనుచిలన్!

        బుధులు మెత్తు రవని!పూజ్యు డౌదు!భవిత లోన్!


పూజ్యతా వృత్తము,న,భ,స,జ,న,గ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-31448.


81.చెనంగు వృత్తము,


               అనర్ధ చర్య వ్యర్ధ మై!యార్పు భావి బ్రతుకులున్!

              అనంత కోటి జీవముల్!హర్షిలంగ నడువుమీ!

              చెనంగ రాదు మంచినిన్!జీవ శాంతి కొదువగున్!

             ధనంపు టాశ పాశముల్!తప్పటంచు!నెరుగుమా!


చెనంగు వృత్తము,జ,ర,య,జ,న,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-31518.


82.త్రాత మెచ్చు,వృత్తము,


            నీతి స్వచ్ఛ పాత్రమై!నిల్వ సర్వసామ్య దృష్టినిన్!

            పాతు బడ్డ వైభవమ్!భారతాంబ!నొందు నిచ్చెలున్!

           కోతి చైద చేష్టలే?కొంప లార్పి!జాతి మాపదే!

           త్రాత మెచ్చ మానవా!ధర్మ ధృష్టి చూడు లోకులన్!


త్రాత మెచ్చు వృత్తము,ర,జ,త,ర,జ,గ,గణము లుడును,

యతి,8.వ,యక్షరము,వృ,సం:-21803.


83.పరహిత వృత్తము,


           పరహితమే!విధి నుత వరము!శ్రేయంబదే!

          సురవరులే?సరియన!సతత మానంద మౌ!

          కరి వరదంబిడె!హరి!కని మనంగా వలెన్!

         చెరచకు నీతి నిల!చెడెదు!హీనుండనన్!


పరహిత వృత్తము,న,జ,న,న,త,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-20464.


84.కాని తలపు,వృత్తము,


            క్షయ,పస్మార,గుల్మాది,సకల రోగ జన్యులన్!

           భయము వీడి కల్పంగ!వసుధ సర్వ శూన్యమౌ!

          నయము గాని రోగాల!నవత జన్మ పాడునౌ.

          రయము గూర్చుసర్వత్ర!రమత!శ్రేయ మేర్చగా!


కాని తలపు వృత్తము,స,ర,భ,స,జ,గ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం;-22420.


85.శోభ చెడు వృత్తము,


              కులము లేకము జేసి కొరివి తలగోకగా!

             వెలుగు భారతి శోభ!వినుతి చెడు!తథ్యమున్

             తెలివి తేటలు పాడు!దిగుడు నౌను శీలతల్!

             బలిమి నైక్యత!భంగ పరచుటగు!నెంచుమా!


శోభ చెడు వృత్తము,న,భ,భ,న,జ,గ,గణము లుండును,

యతి,9.వ,పక్షరము,వృ,సం:-24504.


86.హేయ జన్మ వృత్తము,


                  రొచ్చు తుచ్ఛ జీవ జన్మ!రోగ పూర్ణ కళేబరమ్!

                 మచ్చ లేని జన్మ నొంద!మంచి నెంచి చరింపుమా!

                 మెచ్చు కోలు సర్వ శ్రేయ మెంతకేని?వరంబిడున్!

                చిచ్చు తెల్వి జాతి నంత!చీల్చు నేకత!యోచిలన్!


హేయ జన్మ వృత్తము,ర,జ,ర,జ,జ,గ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-22231.


87.కూర్మి నడు వృత్తము,


            భూరి సత్వుడ!నంచెంచి!పోరు గోరకు!బాలకా!

            మేర మీరకు!మంచెంచు!మేటి విద్యను నేర్చుమా!

           కోర కయ్య!విరోధమ్ము!కూర్మి నెంచి చరించుమా!

           తీరు నేర్చుమ విద్యార్ధి!తెల్వి నొందుమి!పట్టునన్!


కూర్మి నడు వృత్తము,ర,స,ర,జ,జ,గ,గణము లుండును,

యతి,9.వయక్షరము,వృ,సం:-23195.


88.వివేక వృత్తము,


            సద్వరామ సు మోదమౌ! సద సద్వివేకీవునై!

           విద్వదార్ష ప్రమోదతన్!విధి నెంచి మంచెంచుమా!

          సద్వధాన్యుల మేథకున్?జయ మేర్చ!శ్రీమంతంబౌ!

          సద్వివేకము నొందుమా!సమ సామ్య వాదీవు నై!


వివేక వృత్తము,ర,స,జ,జ,త,గ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-19291.


89.పరమోహ వృత్తము,


           సొమ్ములంటే?గోవులేగా?చూడవేమి?కర్షకాళిన్!

          ఇమ్మునౌ!జీవంబు నొందన్!యింటి వానిన్!మెచ్చ వేలన్?

         అమ్మ భూమాత!సు సేథ్యమ్!అంత హేయంబేర్చె దేలన్?

         కమ్మె!పాశ్చాత్యం బదేమో?కల్మషాత్మా కర్షితంబై!


పరమోహ వృత్తము,ర,త,మ,య,ర,గ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-8739.


90.భిన్న సాంప్రదాయ వృత్తము,


                  కుల గోత్ర సాంప్రదాయ!కూర్మ చరాదు లెంచుచున్!

                  కల కాల జీస యాత్ర!గౌరవతన్!చలించిరే?

                  విలు వేది?నేటి జీవి! వెకిలియై!వివేకనన్?

                 వెల లేని?మేత వాంఛ!విశిదమౌ! దురాశతన్!


భిన్సన సాంప్రదాయ వృత్తము.స,,జ,ర,జ,జ,గ, గణము లుడును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-23212.


91,నీతి నడు వృత్తము,


               దయార్ద్ర హృదయ మదే?ధర్మాన్ని వీడ దెన్నడున్?

              పయోథి వరదు డనన్?వర్ణాశ్ర ధర్మ కాంక్షియౌ!

              నియంత యనక!సదా!నిర్మాణ ధృష్టి యోచిలున్!

             ప్రయాశ పడడు!పనినిన్!పరార్థమెంచి వర్తిలున్!


నీతి నడు వృత్తము,జ,న,య,ర,జ,గ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-21630.


92.మేలు కోరు,వృత్తము,


                 మంచి పట్టు చెడు నెట్టు!మంచి నెయ్య మదే!మేలౌ!

                 పెంచు మంచి తగు రీతి!మేలు కోరుటదే?ముఖ్యమ్!

                వంచి తాళి కెడ మేగు!వర్ధమాన మదే?బాలా!

                పెంచు తెల్వి!వరదీక్ష!ప్రీతి నొందుమి!లోకంబున్!


మేలు కోరు వృత్తము,ర,న,ర,జ,య,గ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-6843.


93.స్నీహ బాల వృత్తము,


             కాని పోని వానియందు!కల్గ జేసుకో కోయీ?

             మాను మోయి!దుష్ట చర్య!మంచి నెంచు వినయతన్!

            చేను చెట్టు పుట్టలందు!సంచరింప!తగ దయ్యా!

           జ్ఞాన మిచ్చు పుస్తకాలు!చక్కగా!చదువు కొమ్మా!


స్నేహ బాల వృత్తము,ర,జ,ర,జ,స,గ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం;-15009.


94.పాడూహ వృత్తము,


               ఎండమావి నీరుగోరు!హేయ చింతే?దుష్ఫలంబౌ!

               పండువంటి జన్మ నెత్తి!పాడు టూహే?పాపంబౌలే!

               తిండి బట్ట లోటు లేని!తీరు గూర్ప న్ముక్తే!ర్చున్గా!

              ఛండ స్వార్థ!మెండగట్ట!సాధ్యమౌగా!సర్వా.ర్ధంబుల్!


పాడూహ వృత్తము,ర,జ,ర,జ,మ,గ,గణము లుండును,

యతి,9.వ యక్షరము,వృ,సం:-2731.


95.కంట గింపు,వృత్తము,


           కంటి కింపౌ!దోష చర్యల్!కాలమేఘ!సు వృష్టియా?

           పంటి కింపౌ!సర్వ మెల్లన్?పర్వమౌనె?జగానికిన్!

          కొంటి చేష్టే?కంటగింపౌ!కట్టి కుడ్పు!జనార్తియై!

         వంటి తీటే? రుద్ద జూడన్!భ్రష్టమౌ!నిక సృష్టియే!


కంటగింపు వృత్తము,ర,త,మ,జ,జ,గ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-29075.


96.జగద్రక్ష వృత్తము,


            నవ నాడులు కృంగగా!నర్మ చేష్షలు గాన్పించున్!

           భవ బంధము లూడగా!పాప కర్మలు వెన్నంటున్!

           జవ క్రోధము ఛిద్రమౌ!చావు రోజులు!హేయంబౌ.

           శివ మేర్చుమి!జన్మకున్!జీవ ధాత్రియె!రక్షించున్!


 జగద్రక్ష వృత్తము,స,స,య,జ,య,గ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-6748.

97.విష తెల్వి,వృత్తము,


              సాటి జన్ము లెల్లరున్?సర్వ సామ్య మన్ని టంటేలన్?

              పాటు పడ్డ చాలదే?పల్కు వేరు!చర్య !స్వార్ధంబే?

             మేటి ప్ర జ్ఞ! భూమినిన్!మింటి నంటె!తంత్ర స్వేచ్ఛాయెన్

             చేటు భావ బంధియై!చీల్చె జాతి ! సర్వ శూన్యానన్!


విష తెల్వి వృత్తము,ర,జ,త,ర,య,గ,గణము లుండును,

యతి,8.వ,యక్షరము,వృ,సం:-5419.


98.ధనిక మనసు,వృత్తము,


              కూడు గుడ్డ లేని బీదె!కోరి బ్రతుకు నీతినిన్!

              మేడి పండు వాట మొప్పు!మేటి ధనికు లెందరో?

             చూడ కుళ్ళు నిండి యుండు! చేయ రితరి సాయమున్!

            నాడి బట్టి జూడ!నీతి !నాటు కొనదు!శ్రీయుతున్!


ధనిక మనసు,వృత్తము,ర,జ,ర,న,జ,గ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-24135.


99.శ్రీల సీమ వృత్తము,


              భూతి నింపు ధోరణియే!భూమి నొప్పె నెల్లెడన్!

              నీతి లేని లోకమయెన్!నేర్పునొందు!రూకలకున్!

             పాతి పెట్టి సత్య మిలన్!పారు చుండె!బీదరికమ్!

             చేతు వెట్లు?భారతినిన్!శ్రీల సీమ!నెంచ వలెన్!


శ్లీలసీమ వృత్తము,ర,జ,య,జ,భ,గ,గణము లుడును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-27243.


100.భద్రమిడు వృత్తము,


              రాగోద్భాసిత రత్న సాను!రంజిత తటీ ఝరీ!

              వాగోద్ధారిత బ్రహ్మ దీప్తి!వర్ధిత రమంబునౌ!

             శ్రీగంథంబది విద్య నెల్ల!చెల్వము పఠించుమా!

            ప్రాగోద్భాసితు భాను తేజ!భద్ర మది!బాలకా!

 

భద్రమిడు వృత్తము,మ,స,జ,భ,జ,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-26897.


101.బాల జ్ఞాన వృత్తము,


              తత్వార్ధంబది తెల్యును!ధన్యత చేకూరు నయ్యా!

             సత్యంబే!మది నిండును!సర్వద శ్రేయంబు!నీదౌ!

            కృత్యంబే?బహు నీతిని!కీలక మేర్చు న్సుథౌచున్!

           పీత్వంబౌ!సుర జ్ఞానము!ప్రీతిగ!జీవంబు సాగున్!


బాల జ్ఞాన వృత్తము,మ,స,స,స,ర,గ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-9945.


102.నరతత్వ వృత్తము,


               మనిషి తత్వ మార్పదే?మహియు మార్పందు వేలన్?

              ఘనత నొందు కాంక్షయే?కలిమి కోరెండు!జాఢ్యమ్!

             తినక పెట్ట కొడ్లకున్?దిగులు జీవం బదేలన్?

             జనని మెచ్చు నీతదే?జగము!పెంపేర్చు నోయీ!


నర తత్వ వృత్తము,న,ర,జ,స,ర,గ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-10072.


103.నీతి నడత వృత్తము,


              చదువు నందు శ్రద్ధ!సమకూర్చురా!జ్ఞాన మెంతో?

             బదులు పల్క బోకు!పడ దోతురే?మాయ లోనన్!

            మెదడు నందు తెల్వి!మితి మీరి యూహింప!పెంపౌ!

            వెదుకు నీతి!ధర్మతను!పెంచు!జీవంబు!మేలౌ!


నీతి నడత వృత్తము,న,ర,న,ర,య,గ,గణము లుండును,

యతి,8.వ,యక్షరము,వృ,సం:-5592.


104.జన్మ తీరు,వృత్తము,


                ధనియాలు రుచి వేరు!తగ నాట!చెప్పు దెబ్బన్!

               మొనకెత్తు రుచెంచ?మునువాట!మార్పిడౌతన్!

               కన వేమి?పనితీరు!కలిగించు!భోగ పాశన్!

              మను నీతి విడ నాడ!మహి పాప!హేతువే!యౌ!


జన్మ తీరు వృత్తము,స,న,భ,జ,ర,గ,గణము లుండును,

యతి,9.వ యక్షరము,వృ,సం:-11196.


105.తన్మర్మ వృత్తము,


             ధనపిచ్చి ఘన పిచ్చి!ధర్మంబునే!పిచ్చెక్కించున్!

             మను జాతి గుణ మార్పి!మర్మార్ధియై మాయం ద్రోయున్!

             జన యార్తి నిలు పోప!నేమార్చదే?జన్మాంతంబున్!

             తన పట్టు!ధర నిల్పు!తన్మర్మమే!గానౌ నేమో?


తన్మర్మ వృత్తము,స,న,జ,ర,మ,గ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-1214.


106.కష్టే ఫలి వృత్తము,


             కష్టే ఫలి!జీవ నాశ్రి!కాని పోని వేల?కోరున్!

            సృష్టించే?బ్రహ్మ తీరె!శ్రేష్టు నంచు!మార్చ జూడన్!

           భ్రష్టుండగు!బద్ధకాన!వద్దనండు!యిచ్చు రూకల్!

           కష్టించను మాన్ప తప్పు!కాని యూహ కాల్చు లోకమ్!


కష్టే ఫలి వృత్తము,త,జ,ర,జ,ర,గ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-10945.


107.శ్రీయతా వృత్తము,


              చర్మ చక్షు గోచరమా!జన్య జనక సృష్టినిన్!

              కర్మ జీవి కర్తృకమే!గాసిలును!విశేషమై!

             నర్మ చర దోషమునై!నాశంబిడు!నరాళినిన్!

             జీరబోవు!ధర్మ మదే?శ్రేయంబగు!నుమా ధవా!


శ్రీయతా వృత్తము,ర,జ,య,భ,జ,గ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం;-23453.


108.చెరప చెడుదు,వృత్తము,


                 పరహింసే?దీర్ఘ రోగమ్!భంగ మిడు మరు జన్మన్!

                 చెరయే!నౌ!జన్మ జన్మన్!చేర విక పరమాత్మన్!

                చెరపేవా?చేటు గల్గున్!సిగ్గిలుమి!చెడు చేయన్!

                పరతత్వమ్!పట్టె నోయీ!భద్రత!కరు వేర్చెన్!


చెరప చెడుదు వృత్తము,స,త,మ,న,స,గ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-15908.


109.మారిన లోకమ్!వృత్తము,


              లంచ గొండి లోకమిది!లంచమే?లంఛనాయెనే?

              ఎంచ రించుకేని?పరహింస పాపంబదేమొకో?

             చంచలంపు.   తత్వ మయె!సత్య!వాగ్మాత్ర మాయెనే?

             కించ దెంచ మంచి నిల!కిల్భిషం బేర్చు నీతయెన్?


మారిన లోకమ్,వృత్తము,ర,జ,స,య,జ,గ,గణము లుండును,

యతి.9.వ,యక్షరము,వృ,సం:-21227.


110.మేటి భూటక వృత్తము,


                   మాటలు కోటలు దాటు!మరి చేతలు శూన్యమే!

                   భూటక మేటుల పాటు!పొర పొక్కెము లేలనే!

                  ఆటక నాటక మాయ!అరచేతిలొ స్వర్గమై!

                  పాలక వాటము నెంచ!పదిలం బన రాక నై!


మేటి భూటక వృత్తము,భ,భ,భ,జ,జ,గ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-27479.


111.జన స్రవంతి వృత్తము,


               కేటుగాడు వేటెసగు!కీడు చింత మంతనానన్!

              పాట గాడు మంచెసగి!బాగు సేయు జీవ ధాత్రిన్!

              కాటు వాట నాగ మవ!కాన నౌనె?భావి సౌఖ్యమ్!

            చేటు లేని జీవ మిల!సేయు మయ్య!భూత నాథా!


జన స్రవంతి వృత్తము,ర,జ,స,జ,ర,గ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-10957.


112.సోదలు విడు,వృత్తము,


                  మది నుదయించు భావాల్!మంచి చెడ్డల మిశ్రమమ్!

                  వదలి చెడున్?జరింపన్!వన్నె గూర్చు నిజానికిన్!

                 సొదలు విడున్?విభూతిన్!సూరి వౌదు!ధరా తలిన్!

                విధిని సదా!సునీతిన్!వెల్గ దైవము మెచ్చ గన్!


సొదలు విడు వృత్తము,న,జ,మ,జ,జ,గ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-23088.


113.రామ రక్షా వృత్తము,


                 ఏమి జూచి గొప్ప నీకు!యీజీవం బస్థిరంబురా!

                 నీమ నిష్ట లేక!నొప్ప!నీయానమ్?నిష్ఫలంబగున్!

                 కామ క్రోధ లోభ చర్య!కాటేయుం? నాగమౌచునిన్!

                 రామ నామమెంచు మయ్య!రమ్యంబౌ!జీవి తాంతమున్!


రామ రక్షా వృత్తము,ర,జ,ర,మ,జ,గ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-20601


114.స్వార్ధ తెల్వి వృత్తము,


                కుల సామ్యతని బల్కి!కొలిమిని రాజేసిరే?

               తిలకంబు నగునొకొ?తెలివైన స్వార్థం బిదే?

               విలువేది?వెల నౌనె?పెను ముప్పు వేర్పాటదే?

               బలమౌనె?పలు జాతి!బ్రతుకంత నీఱేర్చుటే?


స్వార్ధ తెల్వి వృత్తము,స,న,భ,న,త,గ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-20412.


115.లోక శాంతి వృత్తము,


                అప్పు పరపతి పెంపు!అడ్డు తిరుగ!ముప్పగున్!

                చెప్పు కొనగను గొప్ప!చిప్ప భవిత కిచ్చుటౌ?

                తప్పక పరిశ్రమ లొప్ప!ధాత్రి సుఖత!భాసిలున్!

               చొప్పడు పధకమెంచ!భావి జగము!శాంతిలున్!


లోక శాంతి వృత్తము,భ,న,ర,న,జ,గ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-24255.


116.దోష హరణ వృత్తము,


              కాల సర్ప దోష ప్రభా!కలి మేథా! విధానమా!

              నేల నీతి సారమిదా!నిలు పేర్చే!ప్రభావమా!

              కాలనేమి కాటకమా!ఖల చర్యా!విచారమా!

              శూల పాణి!వీవె సుమా!సరి జేయన్వలె న్భువిన్!


దోష హరణ వృత్తము,ర,జ,జ,య,జ,గ,గణము లుడును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-29477.


అణిమా ఛందాంతర్గత,అష్టీ ఛందమునందు116.ఛందములు మాత్రమే.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.