గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, డిసెంబర్ 2023, ఆదివారం

సదమల,తదనిశమ,విర్రవీగు,బిగిచెడు,చెదురు,వినువీధి,నీచతా,గర్భ "-వరదామ"-వృత్తము. "వరదామ"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్.

 సదమల,తదనిశమ,విర్రవీగు,బిగిచెడు,చెదురు,వినువీధి,నీచతా,గర్భ

"-వరదామ"-వృత్తము.

                   "వరదామ"-వృత్తము.

                           రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
                                                    జుత్తాడ.

పగ తగదు జీవ ధాత్రిన్!వగపే గల్గించు తుదిన్!వదలును పురుషార్ధముల్!
సగ మెరిగి మాట లాడన్!జగతిం నీచుండునగున్!సదమల మది పాడగున్!
తగుదు నని విర్రవీగన్!తగునా వాచాలతయున్!తదనిశ మప రాధమౌ!
సెగ లెగయు నాక శానన్!జిగి మాపుం దైవమిలన్!చెదురును వరదామమున్!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"
ఛందము లోనిది.ప్రాస నియమము కలదు.పాదమునకు27"అక్షరము
లండును యతులు10,18,అక్షరములకు చెల్లును.

1,గర్భగత"తగనిపగ"-వృత్తము.

పగ తగదు జీవ ధాత్రిన్!
సగమెరిగి మాటలాడన్!
తగుదు నని విర్రవీగన్!
సెగ లెగయు నాకశానన్!

అభిజ్ఞా  ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

2.గర్భగత"-+సగమెరుగు"వృత్తము.

వగపే గల్గించు తుదిన్!
జగతిం నీచుండు నగున్!
తగునా!వాచాలత యున్!
జిగి మాపుం!దైవ మిలన్!

అభిజ్ఞా ఛందమునందలి"అనుష్టుప్ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"8"అక్షరములుండును.

3.గర్భగత"-సెగలెగయు"వృత్తము.

వదులును పురుషార్ధములున్!
సదమల మది పాడగున్!
తద నిశ మపరాధ మౌ!
చెదురును వర దామమున్!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు9"అక్షరము లుండును.

4.గర్భగత"-వగపేల"వృత్తము.

పగ తగదు!జీవ ధాత్రిన్!వగపే!గల్గించు తుదిన్!
సగ మెరిగి మాట లాడన్!జగతిని నీఛుండు నగున్!
తగుదు నని విర్రన్ వీగం!తగునా!వాచాలతయున్!
సెగ లెగయు నాకశానన్!జిగి మాపుం దైవమునున్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"10"వ యక్షరమునకు చెల్లును.

5,గర్భగత"-వాచాలత"వృత్తము.

వగపే గల్గించు తుదిన్!పగ తగదు జీవ ధాత్రిన్!
జగతిం!నీచుండు నగుం!సగ మెరిగి మాటలాడన్!
తగునా!వాచాలత యున్!తగునని విర్ర వీగన్!
జిగి మాపుం దైవమునుం!సెగ లెగయు నాకశానన్!

అణిమా ఛందమునందలి"అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.ప17,క్రఅక్షరములుండును.
యతి"9"వయక్షరమునకు చెల్లును.

6,గర్భగత"-జిగి మాయు"-వృత్తము.

పగ తగదు జీవ ధాత్రిం!వదులును పురుషార్ధముల్!!
సగ మెరిగి మాటలాడం!సదమల మది పాడగున్!
తగుదు నని విర్ర వీగం!త దనిశ మప రాధమౌ!
సెగ లెగయు నాకశానం!చెదురును వర దామమున్!

అణిమా ఛందమునందలి"ధృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి"10,వ యక్షరమునకు చెల్లును.

7,గర్భగత"వదులు"-వృత్తము.

వదులును పురుషార్ధముల్!పగ తగదు జీవ ధాత్రిన్!
సదమల మది పాడగుం!సగ మెరిగి మాట లాడన్!
త దనిశ మపరాధ మౌ!తగుదు నని విర్ర వీగన్!
చెదురును వర దామముం!సెగ లెగయు నాక శానన్!

అణిమా ఛందమునందలి"-ధృతి ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"18"అక్షరములుండును.
యతి"10"వ యక్షరమునకు చెల్లును.

8,గర్భగత"-సదమల"-వృత్తము.

వగపే గల్గించు తుదిం!వదులును పురుషార్ధముల్!
జగతిం నీచుండు నగుం!సదమల మది పాడగున్!
తగునా!వాచాలత యుం!త దనిశ మపరాధమౌ!
జిగి మాపుం దైవమునుం!చెడును వర దామమున్!

అణిమా ఛందమునందలి"అత్యష్టి"ఛందములోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"9"వ యక్షరము నకు చెల్లును.

9,గర్భగత"తదనిశ"వృత్తము.

వదులును పురుషార్ధముల్!వగపే గల్గించు తుదిన్!
సదమల మది పాడగుం!జగతిం!నీచుండు నగున్!
త దనిశ మప రాధమౌ!తగునా!వాచాలత యున్!
చెడును వరదామముం!జిగి మాపుం దైవమునున్!

అణిమా ఛదమునందలి"-అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17,అక్షరము లుండును.
యతి10,వ యక్షరమునకు చెల్లును.

10,గర్భగత"విర్రవీగు"వృత్తము.

వగపే గల్గించు తుదిం!పగ తగదు జీవ ధాత్రిం!వదులును పురుషార్ధముల్!
జగతిం నీచుండు నగుం!సగ మెరిగి మాటలాడం!సదమల మది పాడగున్!
తగునా!వాచాలతయుం!తగుదు నని విర్ర వీగం!త దనిశ మప రాధమౌ!
జిగి మాపుం!దైవమునుం!సెగ లెగయు నాకశాన!చెదురును వర దామమున్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"9,18,యక్షరములకు చెల్లును.

11.గర్భగత"-బిగి చెడు"వృత్తము.

పగ తగదు జీవధాత్రిం!వదులును పురుషార్ధముల్!వగపే గల్గించు తుదిన్!
సగ మిరిగి మాటలాడం!సదమల మది పాడగుం!జగతిం నీచుండు నగున్!
తగుదు నని విర్ర వీగం!త దనిశ మప రాధమౌ!తగునా!వాచాలత యున్!
సెగ లెగయునాకశానం!చెదురును వరదామముం!జిగి మాపుందైవమునున్!

అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26,అక్షరములుండును.
యతులు10,19,అక్షరములకు చెల్లును.

12,గర్భగత"-చెదురు"-వృత్తము.

వదులును పురు షార్ధముల్!పగ తగదు జీవ ధాత్రిం!వగపే గల్గించు తుదిన్!
సదమల మది పాడగుం!సగ మెరిగి మాటలాడం!జగతిం నీచుండు నగున్!
తదనిశ మపరాధమౌ!తగుదునని విర్ర వీగం!తగునా!వాచాలత యున్!
చెదురును వరదామముం!సెగ లెగయు నాకశాన!జిగి మాపుందైవమునున్!

అనిరుద్ఛందము నందలిఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు10,19,అక్షరములకు చెల్లును.

13"గర్భగత"విను వీధి"-వృత్తము.

వగపే గల్గించు తుదిం!వదులును పురుషార్ధముల్!పగ తగదు జీవ ధాత్రిన్!
జగతిం నీచుండు నగుం!సదమల మది పాడగుం!సగ మెరిగి మాటలాడన్!
తగునా!వాచాలతయుం!తదనిశ మపరాధమౌ!తగుదు నని విర్ర వీగన్!
జిగి మాపుం దైవమునుం!చెదురు వరదామముం!సెగ లెగయు నాకశానన్!

అనిరుద్ఛందము నందలిఉత్కృతి"ఛందములోనిది.
ప్రాస నియమముకలదు.పాదమునకు,26"అక్షరములుండును
యతులు,9,18,అక్షరములకు చెల్లును.

14,గర్భగత"-నీచతా"-వృత్తము.

వదులును పురుషార్ధ ముల్!వగపే గల్గించు తుదిం!పగ తగదు జీవధాత్రిన్!
సదమలమది పాడగుం!జగతిం నీచుండు నగుం!సగ మెరిగి మాట లాడన్!
తద నిశ మప రాధమౌ!తగునా!వాచా లతయుం!తగుదు నని విర్ర వీగన్!
చెదురును వర దామముం!జిగి మాపుం దైవమునుం!సెగలెగయు నాకశానన్!

అనిర్ద్ఛందమునందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరములుండును.
యతులు.,10,18,అక్షరములకు చెల్లును.

జైహింద్.

"-చలువరేని"-వృత్తము"- "-చలువ రేని"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్

 "-చలువరేని"-వృత్తము"-   "-చలువ రేని"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

బూది బూసి మరుభూమిని!భూతిదాత వైతి వీవు!భూతనాధ పరమశివా!
చేదు జీవ మెడ మేర్చెదు!శీత వాత బాధ బాపి!చేతు వీవు సుఖ మమరన్!
జోదు వీవు పరమార్ధత!జోత లందె దెల్ల వేళ!చూతు మోక్ష మమర హరా!
మోదమాంబ యొడ లొప్పగ!మోతు గంగ శీర్షమందు!మోతగాదు చలువ
                                                                                            సుమా!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతియందలి,అనిథుద్ఛందాంతర్గత
ఉత్కృతి"-ఛందము లోనిది.ప్రాసనియమము కలదు.
పాదమునకు26,అక్షరములుండును.యతులు10,18అక్షరములకు
చెల్లును.

1,గర్భగత"-భూతనాధ"-వృత్తము.

బూది బూసి మరు భూమిని!
చేదు జీవ మెడ మేర్చెదు!
జోదు వీవు పరమార్ధత!
మోదమాంబ యొడ లొప్పగ!

అభిజ్ఞా ఛందమందలి"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"9"-అక్షరము లుండును.

2,గర్భగత"-బూది"-వృత్తము.

భూతి దాత వైతి వీవు!
శీత వాత బాధ బాపి!
జోత లందె దెల్ల వేళ!
మోతు గంగ శీర్ష మందు!

అభిజ్ఞా ఛంద మందలి"అనుష్టుప్ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"8"అక్షరము లుండును.

3,గర్భగత"-జోదు"వృత్తము.

భూత నాధ పరమ శివా!
చేతు వీవు సుఖ మమరన్!
జూతు మోక్ష మమర శివా!
మోతగాదు చలువ సమా!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"8"అక్షరములుండును.

4"గర్భగత"మోదమాంబ"వృత్తము.

బూది బూసి మరు భూమిని!భూతి దాత వైతి వీవు!
చేదు జీవ మెడ మేర్చెదు!శీత వాత బాధ బాపి!
జోదు వీవు పరమార్ధత!జోత లందె దెల్ల వేళ!
మోద మాంబ యొడ లొప్పగ!మోతు గంగ శీర్షమందు!

అణిమా"ఛందము నందలి"అత్యష్టి"ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు17"అక్షరములుండును.
యతి"10,వ యక్షరమునకు చెల్లును.

5,గర్భగత"వాత బాధ"-వృత్తము.

భూతి దాత వైతి వీవు,బూది బూసి మరు భూమిని!
శీత వాత బాధ బాపి! చేదు జీవ మెడ మేర్చెదు!
జోత లందె దెల్ల వేళ! జోదు వీవు పరమార్ధత!
మోతు గంగ శీర్ష మందు!మోదమాంబ యొడ లొప్పగ!

అణిమా"ఛందమునందలి"అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి""9"వ యక్షరమునకు చెల్లును.

6,గర్భగత"-జోతలందు"-వృత్తము.

బూది బూసి మరు భూమిని!భూత నాధ పరమ శివా!
చేదు జీవ మెడ మేర్చెదు! చేతు వీవు  సుఖ మమరన్!
జోదు వీవు పర మార్ధత!జూతు మోక్ష మమర హరా!
మోద మాంబ యొడ లొప్పగ!మోత గాదు చలువ సుమా!

అణిమా"-ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి10,వ యక్షరమునకు చెల్లును.

7;గర్భగత"-సుఖ చేతన"-వృత్తము.

భూత నాధ పరమ శివా!బూది బూసి మరు భూమిని!
చేతు వీవు సుఖ మమరన్!చేదు జీవ మెడ మేర్చెదు!
జూతు మోక్ష మమర హరా!జోదు వీవు పరమార్ధత!
మోత గాదు చలువ సుమా!మోదమాంబ యొడ లొప్పగ!

అణిమా ఛందమునందలి"ధృతి"-ఛందములోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు,18,అకషరము లుండును.
యత,10,వ యక్షరమునకు చెల్లును.

8,గర్భగత"-భారవాహి"-వృత్తము.

భూతి దాత వైతి వీవు!భూత నాధ పరమ శివా!
శీత వాత బాధ బాపి!చేతు వీవు సుఖ మమరన్!
జోత లందె దెల్ల వేళ!జూతు మోక్ష మమర హరా!
మోతు గంగ శీర్షమందు!మోత గాదు చలువ సుమా!

అణిమా ఛందమునందలి"-అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"17,అక్షరము లుండును.
యతి"9,వ యక్షరమునకు చెల్లును.

9,గర్భగత"-మరుభూమి"-వృత్తము.

భూత నాధ పరమ శివా!భూతి దాత వైతి వీవు!
చేతు వీవు సుఖ మమరం!శీత వాత బాధ బాపి!
జూతు మోక్షమమర హరా!జోత లందె దెల్ల వేళ!
మోతగాదు చలువ సుమా!మోత గంగ శీర్షమందు!

అణిమా ఛందమునందలి"-అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"17,అక్షరము లుండును.
యతి"10,వ యక్షరమునకు చెల్లును.

10,గర్భగత"-చేతనా"-వృత్తము.

భూతి దాత వైతి వీవు!బూది బూసి మరుభూమిని!భూత నాధ పరమ శివా!
శీత వాత బాధ బాపి!చేదు జీవ మెడ మేర్చెదు!చేతు వీవు సుఖ మమరన్!!
జోత లందె దెల్ల వేళ!జోదు వీవు పరమా ర్ధత! జూతు వీవు పరమ హరా!
మోతు గంగ శీర్ష మందు!మోదమాబ యొడ లొప్పగ!మోత గాదు చలువ
                                                  :                                       సుమా!

అనిర్ద్ఛందాంతర్గత "ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరములకు చెల్లును.

11.గర్భగత"సర్వకాల"-వృత్తము.

బూది బూసి మరు భూమిని!భూత నాధ పరమ శివా!భూతి దాత వైతి వీవు!
చేదు జీవ మెడ మేర్చెదు!చేతు వీవు సుఖ మమరన్!శీత వాత బాధ బాపి!
జోదు వీవు పరమార్ధత!జూతు వీవు పరమ హరా!జోత లందె దెల్ల వేళ!
మోదమాంబ యొడలొప్పగ!మోత గాదు చలువ సుమా!మోతు గంగ శీర్ష
                                                                                           మందు!

అనిరుద్ఛందాంతర్గత"-ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు26,అక్షు లుండును.
యతులు,10,19,అక్షరములకు చెల్లును.

12,గర్భగత"జడ ధారి"-వృత్తము.

భూత నాధ పరమ శివా!బూది బూసి మరుభూమిని!భూతి దాత వైతి వీవు!
చేతు వీవుసుఖ మమరన్!చేదు జీవ మెడ మేర్చెదు!శీత వాత బాధ బాపి!
జూతు వీవు పరమ హరా!జోదు వీవు పరమార్ధత!జోత లందె దెల్ల వేళ!
మోత గాదు చలువ సుమా!మోదమాంబ యొడ లొప్పగ!మోతు గంగ
                                                                                 శీర్ష మందు!

అనిరుద్ఛందాంతర్గత"-ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"10,19,అక్షరములకు చెల్లును.

13,గర్భగత"భూతిదాత"-వృత్తము.

భూతి దాత వైతి వీవు!భూత నాధ పరమ శివా!బూది బూసి మరుభూమిని!
శీత వాత బాధ బాపి!చేతు వీవు సుఖ మమరన్!చేదు జీవ మెడ మేర్చెదు!
జోత లందె దెల్ల వేళ!జూతు వీవు పరమ హరా!జోదు వీవు పరమార్ధత!
మోతు గంగ శీర్ష మందు!మోత గాదు చలువ సుమా!మోదమాంబ యొడ
                                                                                       లొప్పగ!

అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు,26,అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరములకు చెల్లును.

14,గర్భగత"శిరోవారి"-వృత్తము.శీలించి

భూతనాధ పరమ శివా!భూతి దాత వైతి వీవు!బూది బూసి మరు భూమిని!
చేతు వీవుసుఖ మమరన్!శీత వాత బాధ బాపి!చేదు జీవ మెడ మేర్చెదు!
చూతు మోక్ష మమర హరా!జోత లందె దెల్ల వేళ!జోదు వీవు పరమార్ధత!
మోతగాదు చలువ సుమా!మోతు గంగ శీర్షమందు!మోదమాంబ యొడ
                                                                                        లొప్పగ!

అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతివఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు,26,అక్షరములుండును.
యతులు10,18,అక్షరములకు చెల్లును

జైహింద్.

ఆ యంత్రం తెలుఁగు నేలనుంచే. ...

0 comments

 జైశ్రీరామ్

కం.  అంబరముతాకుచుండె చి

దంబరులను తలఁప ముదము హనుమకు సరి వీ

రంబాసులలఘుమతులు,

సంబరమున చేయు రామ సత్కార్యములన్.

ఈ మహనీయులకు, రామభక్తులైన ప్రతీ సహృదయునకు నా కైమోడ్పులు.

చింతా రామకృష్ణారావు.

జైహింద్.


30, డిసెంబర్ 2023, శనివారం

జన్మ ప్రభృతి యత్కించిత్! ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  జన్మ ప్రభృతి యత్కించిత్!

చేతసా ధర్మ మాచరేత్!

సర్వంతు నిష్ఫలం యాతి!

ఏకహస్తాభివాదనాత్!! (విష్ణు పురాణం)

తే.గీ.  ఏకహస్తాభివాద మూహించనంత

దుష్ఫలంబిడు గమనింప దురితమద్ది,

పూర్వపుణ్యమంతయుకూడ పోవు నిజము.

హస్తములుమోడ్చి పెద్దలకంజలించు.

భావము.  పుట్టినది మొదలుకొని గావించుతూ వచ్చిన ధర్మము 

ఏకొంచెమున్నను అదికూడా ఒక్కచేతితో పెద్దలకు అభివాదనము 

చేయుటవల్ల నశించిపోతుంది. ఎందువల్లనంటే ఏకహస్తాభివాదనమందు 

అవినయమే భాసిస్తుంటుంది.దానివల్ల సర్వధర్మములు నిష్ఫలమైపోతాయి.

జైహింద్.

28, డిసెంబర్ 2023, గురువారం

సజ్జనా ఏవ సాధూనాం .... మేలిమి బంగారం మన సంస్కృతి.

0 comments

జైశ్రీరామ్.

శ్లో.  సజ్జనా ఏవ సాధూనాం - ప్రథయంతి గుణోత్కరం ౹

పుష్పాణాం సౌరభం ప్రాయ - స్త నుతే దిక్షు మారుతం ౹౹ 

తే.గీ.  సజ్జనులు సాధు సంతులు సరసమతులు,

గుణములను వ్యాప్తి చేసెడి ఘనులు చూడ,  

పంచు  పూ వాసనల్  గాలి వరల దిశల

మంచివారలన్ గాలిగా నెంచవచ్చు.   

భావము.  సజ్జనులు సాధు సంతుల పెద్దరికాన్ని ప్రచారం చేస్తారు.

పువ్వుల సుగంధాన్ని గాలి మాత్రమే అన్నిపక్కలకు వ్యాపింపజేస్తుంది.

గాలికి సజ్జనులకు ఇక్కడ పోలిక ఉంది.సజ్జనులు గాలిలా 

సత్కార్యాలు చేయడములో ఎప్పుడూ ములిగివుంటారు.

జైహింద్.

20, డిసెంబర్ 2023, బుధవారం

సత్యనిష్ఠ Satya Nishta Play by Sri A C P Sastry#SMARANEEYAM#AIRHyderabad

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

సంస్కృతం గురించి మనకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు | Facts of Sanskrit l...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

చిత్రకావ్యబంధోదయ.

0 comments

 

జైశ్రీరామ్.
భువనేశ్వర్ రాష్ట్ర పురావస్తు ప్రదర్శన శాలలో👇
జైహింద్.

కామాదుల,రక్షణము,శోధ్యము,బోధనా,ఆధ్యాత్మిక,అనఘా,పునరపి,సునిశిత,,వినుతిగను,పరమం,విభుద,దీవన,వెరపెరుగని,వరాంబుధీ,గర్భ "విద్యాధర "వృత్తము రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్. 


అరి షడాదుల ద్వేషింప!ఆధ్యాత్మ విభుదుండునౌ!అనఘు పరమాత్ము
                                                                                  నెంచున్!
పురము రక్షణ జేకూరు!బోధ్యంబు హరి చింతనౌ!పునరపె వరాల
                                                                                 నొందున్!
సురలు దీవన లందింప!శోధ్యంబు పరమం బగున్!సునిశిత సుబోధ
                                                                                లందున్!
వెరపెరుంగను లేదింక!విద్యాధరులు మెచ్చగన్!వినుతి గను దైవ
                                                                               ప్రీతిన్!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతియందలి "అనిరుద్ఛందాంతర్గత
ఉత్కృతి"ఛందము లోనిది.ప్రాసనియమము కలదు.
పాదమునకు"26"అక్షరములుండును.యతులు"10,18"అక్షరములకు
చెల్లును.

1,గర్భగత"-కామాదుల"-వృత్తము.

అరిషడాదుల ద్వేషింప!
పురము రక్షణ జేకూరు!
సురలు దీవన లందింప!
వెరపెరుం గను లేదింక!

అభిజ్ఞా ఛందమునందలి"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

2,గర్భగత"-రక్షణము"-వృత్తము.

ఆధ్యాత్మ విభుదుండునౌ!
బోధ్యంబు హరి చింతనౌ!
శోధ్యంబు పరమంబగున్!
విద్యా ధరులు మెచ్చగన్!

అభిజ్ఞా ఛందమునందలిఅనుష్టుప్ఛందము"-లోనిది.
ప్రాసనియమము కలదు పాదమునకు"8"అక్షరము లుండును.

3,.గర్భగత"-శోధ్యము"-వృత్తము.

అనఘు పరమాత్ము నెంచున్!
పున రపి వరాల నొందున్!
సునిశిత సుబోధ లందున్!
వినుతి గను దైవ ప్రీతిన్!

అభిజ్ఞా ఛందమునందలి"బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరములుండును.

4,గర్భగత"-బోధ్యము"-వృత్తము.

అరి షడాదుల ద్వేషింప!ఆధ్యాత్మ విభుదుండు నౌ!
పురము రక్షణ చేకూరు!బోధ్యంబు హరి చింతనౌ!
సురలు దీవన లందింప!శోధ్యంబు పరమంబగున్!
వెర పెరుంగను లేదింక!విద్యా ధరులు మెచ్చగన్!

అణిమా ఛందమునందలి"అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"10,వ యక్షరమునకు చెల్లును.

5,గర్భగత"-ఆధ్యాత్మిక"-వృత్తము.

ఆధ్యాత్మ విభుదుండునౌ!అరి షడాదుల ద్వేషింప!
బోధ్యంబు హరి చింతనౌ!పురము రక్షణ చేకూరు!
శోధ్యంబు పరమంబగున్!సురలు దీవన లందింప!
విద్యాధరులు మెచ్చగన్!వెర పెరుంగను లేదింక!

అణిమా ఛందమునందలి"-అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు పాదమునకు"17,అక్షరము లుండును.
యతి" 9"వ యక్షరమునకు చెల్లును.

6,గర్భగత"-అనఘా"-వృత్తము.

అరి షడాదుల ద్వేషింప!అనఘు పరమాత్ము నెంచున్!
పురము రక్షణ జేకూరు!పునరపె వరాల నొందున్!
సురలు దీవన లందింప!సునిశిత సు బోధ లందున్!
వెర పెరుంగను లేదింక!వినుతి గను దైవ ప్రీతిన్!

అణిమాఛందము నందలి"ధృతి"ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు18,అక్షరము లుండును.
యతి"10,వ యక్షరమునకు చెల్లును.

7,గర్భగత"-పునరపి"-వృత్తము.

అనఘు పరమాత్ము నెంచున్!అరి షడాదుల ద్వేషింప!
పునరపి వరాల నొందున్!పురము రక్షణ జేకూరు!
సునిశిత సు బోధ లందున్!సురలు రీవన లందింప!
వినుతి గను దైవ ప్రితదిన్! వెర పెరుంగను లేదింక!

అణిమా ఛందము నందలి "-ధృతి"ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"18"అక్షరములుండును.
యతి"10,అక్షరము నకు చెల్లును.

8,గర్భగత"-సునిశిత"-వృత్తము.

ఆధ్యాత్మ విభు దుండునౌ!అనఘు పరమాత్ము నెంచున్!
బోధ్యంబు హరి చింతనౌ!పునరపి వరాల నొందున్!
శోధ్యంబు పరమంబగున్!సునిశిత సు బోధ లందున్!
విద్యా ధరులు మెచ్చగన్!వినుతి గను దైవ ప్రీతిన్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"-ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"9"వ యక్షరమునకు చెల్లును.

9,గర్భగత"-వినుతి గను"-వృత్తము.

అనఘు పర మాత్ము నెంచున్!ఆధ్యాత్మ విభుదండు నౌ!
పున రపి వరాల నొందున్!బోధ్యంబు హరి చింతనౌ!
సునిశిత సు బోధ లందున్!శోధ్యంబు పరమంబగున్!
వినుతి గను దైవ ప్రీతిన్!విద్యా ధరులు మెచ్చగన్!

అణిమా ఛందమునందలి"-అత్య ష్టి"ఛందములోనిది.
ప్రాసనియమము కలధు.పాదమునకు"-17,అక్షరము లుండును.
యతి"10,వ యక్షరమునకు చెల్లును.

10,గర్భగత"-పరమం"-వృత్తము.

ఆధ్యాత్మ విభుదుండునౌ!అరి షడాదుల ద్వేషింప!అనఘు పరమాత్ము
                                                                                   నెంచున్!
బోధ్యంబు హరి చింతనౌ!పురము రక్షణ చేకూరు!పునరపి వరాల
                                                                                నొందున్!
శోధ్యంబు పరమంబగున్!సురలు దీవన లందింప!సునిశిత సు బోధ
                                                                               లందున్!
విద్యా ధరులు మెచ్చగన్!వెర పెరుంగను లేదింక!వినుతిగను దైవ
                                                                                ప్రీతిన్!

అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరములుండును.
యతులు"9,19,అక్షరములకు చెల్లును.

11,గర్భగత"-విభుద"-వృత్తము.

అరి షడాదుల ద్వేషింప!అనఘు పరమాత్ము నెంచున్!ఆధ్యాత్మ
                                                                   విభుదుండు నౌ!
పురము రక్షణ చేకూరు!పునరపి వరాల నొందున్!బోధ్యంబు హరి
                                                                             చింతనౌ!
సురలు దీవన లందింప!సునిశిత సు బోధలందున్!శోధ్యంబు
                                                                 పరమంబగున్!
వెర పెరుంగను లేదింక!వినుతి గను దైవ ప్రీతిన్!విద్యా ధరులు
                                                                    మెచ్చగన్!

అనిరుద్ఛందాంతర్గత"-ఉత్కృతి"ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"10,19,అక్షరములకు చెల్లును.

12,గర్భగత"-దీవన"-వృత్తము.

అనఘు పరమాత్ము నెంచున్!అరి షడాదుల ద్వేషింప!ఆధ్యాత్మ
                                                                  విభుదుండునౌ!
పునరపి వరాల నొందున్!పురము రక్షణ చేకూరు!బోధ్యంబు హరి
                                                                        చింతనౌ!
సునిశిత సు బోధ లందున్!సురలు దీవన లందింప!శోధ్యంబు
                                                              పరమంబగున్!
వినుతి గను దైవ ప్రీతిన్! వెర పెరుంగను లేదింక!విద్యా ధరులు
                                                               మెచ్చగన్!

అనిరుద్ఛందాంతర్గత"5ఉత్కృతి"ఛందములోనిది.
ప్రిసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"10,19"అక్షరములకు చెల్లును.

13,గర్భగత"-వెరపెరుంగని"వృత్తము.

ఆద్యాత్మ విభుదుండునౌ!అనఘు పరమాత్ము నెంచున్!అరి షడాదుల
                                                                          ద్వేషించు!
బోధ్యంబు హరి చింతనౌ!పునరపి వరాల నొందున్!పురము రక్షణ
                                                                           చేకూరు!
శోధ్యంబు పరమంబగున్!సునిశిత సుబోధ లందున్! సురలు దీవన
                                                                       లందింప!
విద్యా ధరులు మెచ్చగన్!వినుతి గను దైవ ప్రీతిన్!వెరపెరుంగను
                                                                        లేదింక!

అనిరుద్ఛందాంతర్గత"-ఉతకృతి"ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"-9,18,అక్షరములకు చెల్లును.

14,గర్భగత"-వరాంబుధీ"-వృత్తము.

అనఘు పరమాత్ము నెంచన్!ఆధ్యాత్మ విభుదుండు నౌ!అరి షడాదుల
                                                                         ద్వేషింప!
పునరపి వరాల నొందున్!బోధ్యంబు హరి చింతనౌ!పురము రక్షణ
                                                                        చేకూరు!
సునిశిత సుబోధ లందున్!శోధ్యంబు పరమంబగున్!సురలు దీవన
                                                                     లందింప!
వినుతి గను దైవ ప్రీతిన్!విద్యా ధరులు మెచ్చగన్!వెర పెరుంగను
                                                                     లేదింక!

అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కరదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు10,18,అక్షరములకు చెల్లును.

జైహింద్.


17, డిసెంబర్ 2023, ఆదివారం

న కశ్చిదపి జానాతి ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

జైశ్రీరామ్. 

శ్లో.  న కశ్చిదపి జానాతి కిం కస్య శ్వో భవిష్యతి ।

అతః శ్వః కరణీయాని కుర్యాతద్యైవ బుద్ధిమాన్ ॥

తే.గీ.  ఎఱుగఁగా నేరరెవ్వరు నెపుడదేమి

రేపు జరుగనో యనునది, విజ్ఞులార!

బుద్ధిమంతులు చేయుత పుడమిపైన

రేపు చేసెడి దీనాడె ప్రీతితోడ.

భావము.  రేపటి రోజున ఎవరికి ఏమి జరుగుతుందో ఎన్నటికీ తెలియదు.

అందుచేత, బుద్ధిమంతుడైన వాడు రేపటి రోజున చేద్దామనుకున్న కార్యాలను 

ఈ రోజునే చేయవలెను.

జైహింద్.

జానాతి వివిధాః భాషాః ... మేలిమి బంగారం మన సంస్కృతి.

0 comments

జైశ్రీరామ్. 

శ్లో.  జానాతి వివిధాః భాషాః  -  జానాతి వివిధః కలాః,

ఆత్మానం నైవ జానాతి  -  యో న జానాతి సంస్కృతమ్.

తే.గీ.  వివిధ భాషలు తెలియనౌన్ సవివరముగ,

వివిధ కళలును తెలియనౌన్ విశ్వమునను

సంస్కృతము రానివారికి చక్కనైన

యాత్మసుజ్ఞానమెఱుగంగనవదు, నిజము.

భావము.

వివిధములైన భాషలు తెలియుచున్నవి.  వివిధములైన కళలు 

తెలియుచున్నవి.  ఎవరికయితే సంస్కృతము తెలియకున్నదో 

వారికి ఆత్మజ్ఞానము కూడా తెలియదు.

జైహింద్.

ఆధునిక సాంకేతిక రంగంలో సంస్కృతభాషా వైశిష్ట్యం||95NEWS

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

15, డిసెంబర్ 2023, శుక్రవారం

శాంతి మంత్ర ప్రతిపదార్థభావములు.

0 comments

 
జైశ్రీరామ్.
జైహింద్.

ఈడ,ఏడ,ఏలిక,పాలయ,తోడుకొను,తూలని భక్తి,పేలవ,పాడియైన,సౌరులు పాడుకొను,వీడజాల,పారద్రోలు,గీతిక,నావాడ,గర్భ"-పాలయమాం" రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

0 comments

జైశ్రీరామ్.

ఈడ,ఏడ,ఏలిక,పాలయ,తోడుకొను,తూలని భక్తి,పేలవ,పాడియైన,సౌరులు పాడుకొను,వీడజాల,పారద్రోలు,గీతిక,నావాడ,గర్భ"-పాలయమాం" వృత్తము

                           రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
                                                  జుత్తాడ.

ఈడ నిన్ను గొల్చెదెన్నడున్!ఏడకేగినావు శంకరా!ఏలిక నావాడ వీవు!
పీడ లెల్ల ద్రోల రావయా!వీడజాల నిన్నుమా ధవా!పేలవమా నాదు భక్తి!
తోడు నీడ నీవె నా కయా!తోడుకొంటి భక్తి సౌ రుచుల్!తూలని నిస్వార్ధ చింత!
పాడియైన కోర్కె దీర్చవా!పాడుకొందు నీదు గీతికల్!పాలయమాం విశ్వ నాధ!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతియందలిఅనిర్ద్ఛందాంతర్గత"-ఉత్కృతి"-
ఛందములోనిది.ప్లాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము
లుండును.యతులు"10,19,అక్షరములకు చెల్లును.

1,గర్భగత"-ఈడ"-వృత్తము.

ఈడ నిన్ను గొల్చె దెన్నడున్!
పీడ లెల్ల ద్రోల రావయా!
తోడు నీడ నీవె!నా కయా!
పాడియైన కోర్కె దీర్చవా!

అభిజ్ఞా ఛందాంతర్గత బృహతీ ఛందమునందలిది.
పాదమునకు "9"అక్షరములుండును.ప్రాసనియమము కలదు.

2.గర్భగత"-ఏడ"-వృత్తము.

ఏడ కేగి నావు శంకరా!
వీడ జాల నిన్నుమా ధవా!
తోడు కొంటి భక్తి సౌ రుచుల్!
పాడు కొందు నీదు గీతికల్!

అభిజ్ఞా ఛందమునందలి"-బృహతి"ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరములుండును.

3,గర్భగత"-ఏలిక"-వృత్తము.

ఏలిక నా వాడ వీవు!
పేలవమా!నాదు భక్తి!
తూలని నిస్వార్ధ చింత!
పాలయమాం విశ్వ నాధ!

అభిజ్ఞా ఛందమునందలి"అనుష్టుప్ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"8"అక్షరములుండును.

4.గర్భగత"-పాలయ"-వృత్తము.

ఈడ నిన్ను గొల్చె దెన్నడున్!ఏడ కేగి నావు శంకరా!
పీడ లెల్ల ద్రోల రావయా!వీడ జాల నిన్నుమా ధవా!
తోడు నీడ నీవె!నా కయా!తోడు కొంటి భక్తి సౌ రుచుల్!
పాడియైన కోర్కె దీర్చవా!పాడు కొందు నీదు గీతికల్!

అణిమా ఛందము నందలి"-ధెతి"-ఛందములోనిది
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి"-10,వ యక్షరమునకు చెల్లును.

5,గర్భగత"-తోడు కొను"-వృత్తము.

ఏడ కేగి నావు శంకరా!ఈడ నిన్ను గొల్చె దెన్నడున్!
వీడ జాల నిన్నుమా ధవా!పీడ లెల్ల ద్రోల రావయా!
తోడు కొంటి భక్తి సౌ రుచుల్!తోడు నీడ నీవె!నాకయా!
పాడు కొందు నీదు గీతికల్!పాడియైన కోర్కె దీర్చవా!

అణిమా ఛందమునందలి"ధృతి"-ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18,"అక్షరములుండును.
యతి"10"వ యక్షరమునకు చెల్లును.

6,గర్భగత"-తూలని భక్తి,"వృత్తము

ఈడ నిన్ను గొల్చె దెన్నడున్!ఏలిక నా వాడ వీవు!
పీడ లెల్ల ద్రోల రావయా!పేలవమా!నాదు భక్తి!
తోడు నీడ నీవె!నా కయా!తూలని నిస్వార్ధ చింత!
పాడి యైన కోర్కె దీర్చవా!పాలయమాం!విశ్వ నాథ!

అణిమాఛందమునందలి"-అత్యష్టి"ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరములుండును.
యతి..10"వయక్షరమునకు చెల్లును.

7,గర్భగత"-పేలవ"-వృత్తము.

ఏలిక నావాడ వీవు!ఈడ నిన్ను గొల్చె దెన్నడున్!
పేలవమా!నాదు భక్తి!పీడ లెల్ల ద్రోల రావయా!
తూలని నిసవార్ధ చింత!తోడు నీడ నీవె!నాకయా!
పాలయమాం!విశ్వ నాథ!పాడియైన కోర్కె దీర్చవా!

అణిమా ఛందమునందలి"-అత్యష్టి"-ఛందములోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"17"అక్షరములుండును.
యతి"9"వ యక్షరమునకు చెల్లును.

8,గర్భగత"-పాడియైన"-వృత్తము.

ఏడ కేగినావు శంశరా!ఏలిక నావాడ వీవు!
వీడ జాల నిన్నుమా ధవా!పేలవమా!నాదు భక్తి!
తోడు కొంటి భక్తి సౌరుచుల్!తూలని నిస్వార్ధ చింత!
పాడు కొందు నీదు గీతికల్!పాలయమాం!విశ్వ నాథ!

అణిమా ఛందమునందలి"అత్యష్టి"-ఛందములోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"17"అక్షరములుండును.
యతి"10"వ యక్షరమునకు చెల్లును.

9,గర్భగత"-సౌరులు"-వృత్తము.

ఏలిక నావాడ వీవు!ఏడ కేగి నావు శంకరా!
పేలవమా!నాదు భక్తి!వీడ జాల నిన్నుమా ధవా!
తూలని నిస్వార్ధ చింత!తోడు కొంటి భక్తి సౌరుచుల్!
పాలయమాం!విశ్వ నాథ!పాడు కొందు నీదు గీతికల్!

అణిమాఛందము నందలి "అత్యష్టి"-ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"-9;వయక్షరమునకు చెల్లును.

10,గర్భగత"పాడుకొను"-వృత్తము.

ఏడ కేగి నావు శంకరా!ఈడ నిన్ను గొల్చె దెన్నడున్!ఏలిక నావాడ వీవు!
వీడ జాల నిన్నుమా ధవా!పీడలెల్ల ద్రోల రావయా!పేలవమా!నాదుభక్తి!
తోడు కొంటి భక్తి సౌరుచుల్!తోడు నీడ నీవె నాకయా!తూలని నిస్వార్ధ చింత!
పాడు కొందు నీదు గీతికల్!పాడియైన కోర్కె దీర్చవా!పాలయమాం!విశ్వనాథ!

అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"-ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరములుడును.
యతులు"10,19,అక్షరములకు చెల్లును.

11"గర్భగత"-వీడజాల"-వృత్తము.

ఈడ నిన్ను గొల్చె దెన్నడున్!ఏలిక నా వాడ వీవు!ఏడ కేగి నావు శంకరా!
పీడ లెల్ల ద్రోల రావయా!పేలవమా!నాదు భక్తి!వీడ జాల నిన్నుమా ధవా!
తోడు నీడ నీవె నా కయా!తూలని నిస్వార్ధ చింత!తోడుకొంటి భక్తి సౌ రుచుల్!
పాడియైన కోర్కె దీర్చవాతూలని నిస్వార్ధ చింత!పాడ్కొందు నీదు గీతికల్!

అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"-ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరములుండును.
యతులు"10,18"అక్షరములకు చెల్లును.

12.గర్భగత"-పారద్రోలు"-వృత్తము.

ఏలిక నావాడ వీవు!ఈడ నిన్ను గొల్చె దెన్నడున్!ఏడ కేగినావు శంకరా!
పేలవమా!నాదు భక్తి!పీడ లెల్ల ద్రోల రావయా!వీడజాల నిన్నమా ధవా!
తూలని నిస్వార్ధ చింత!తోడు నీడ నీవె నాకయా!తోడుకొంటి భక్తి సౌ రుచుల్!
పాలయమాం!విశ్వనాథ!పాడియైన కోర్కె దీర్చవా!పాడుకొందు నీదు గీతికల్!

అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"-ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరములుండును.
యతులు"9,18,యక్షరములకు చెల్లును.

13.గర్భగత"-గీతిక"-వృత్తము.

ఏడ కేగి నావు శంకరా!ఏలిక నావాడ వీవు!ఈడ నిన్ను గొల్చె దెన్నడున్!
వీడ జాల నిన్నుమా ధవా!పేలవమా!నాదు భక్తి!పీడలెల్ల ద్రోల రావయా!
తోడుకొంటి భక్తి సౌరుచుల్!తూలని నిస్వార్ధ చింత!తోడు నీడ నీవె!నాకయా!
పాడుకొందు నీదు గీతికల్!పాలయమాం!విశ్వ నాథ!పాడియైన కోర్కె దీర్చవా!

అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరములుండును.
యతులు"10'18,యక్షరములకు చెల్లును.

14,గర్భగత"-నావాడ"-వృత్తము.

ఏలిక నావాడ వీవు!ఏడ కేగినావు శంకరా!ఈడ నిన్ను గొల్చె దెన్నడున్!
పేలవమా!నాదు భక్తి!వీడజాల నిన్నుమా ధవా!పీడలెల్ల ద్రోల రావయా!
తూలని నిస్వార్ధ చింత!తోడుకొంటి భక్తి సౌ రుచుల్!తోడు నీడ నీనె నాకయా!
పాలయమాం!విశ్వనాథ!పాడుకొందు నీదు గీతికల్!పాడియైన కోర్కె దీర్చవా!

అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరములుండును.
యతులు"-9'18"అక్షరములకు చెల్లును.

జైహింద్.

నిరత,శక్తినెంచు,భాగ్యమేల?,భోగభూషణా,నేలిక,కటాక్షము,తావీవు,ఓలని సేవ,ఓడిపోని,తావి,ఎడమోము,చాలిక,నీవాడ,ఏగినంత,గర్భ "-ఓడనిభక్తి"- వృత్తము.. రచన . శ్రీవల్లభవఝల అప్పలనరసింహమూర్తి.

0 comments

జైశ్రీరామ్. 

నిరత,శక్తినెంచు,భాగ్యమేల?,భోగభూషణా,నేలిక,కటాక్షము,తావీవు,ఓలని సేవ,ఓడిపోని,తావి,ఎడమోము,చాలిక,నీవాడ,ఏగినంత,గర్భ      "-ఓడనిభక్తి"- వృత్తము..  రచన . శ్రీవల్లభవఝల అప్పలనరసింహమూర్తి.

ఏగి నంత గొల్చినా సరే! ఏలిక నీవాడ నేను!ఎడ మోమ దేలనో?శివా!
సాగినంత భక్తి నెంచెదన్!చాలు కటాక్షంబునిమ్ము! జడిపించ నేల భద్రుడా!
భోగభాగ్య మేల?నీదరిన్!పూలకు తావీవు గాదె?పోడిమంబుపెంచు మోక్షదా!
యోగి గాను భోగభూషణా!ఓలను నీసేవలోన!ఓడిపోను భక్తి యందునన్!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతియందలి అనిరుద్ఛందాంతర్గత
ఉత్కృతి ఛందములోనిది.ప్రాసనియమము కలదు.
పాదమునకు 26,అక్షరములుండును.యతులు10,18,అక్షరములకు
చెల్లును.

1.గర్భగత"-నిరత"-వృత్తము.

ఏగినంత గొల్చినా సరే!
సాగినంత భక్తి నెంచెదన్!
భోగ భాగ్య మేలనో?శివా!
యోగిగాను భోగ భూషణా!

అభిజ్ఞాఛందాతర్గత బృహతీ ఛందములోనిది.ప్రాసనియమము కలదు.
పాదమునకు 9,అక్షరములుండును.

2,గర్భగత"-శక్తినెంచు"-వృత్తము.

ఏలిక నీవాడ నేను!
చాలు కటాక్షంబు నిమ్ము!
పూలకు తావీవు గాదె?
ఓలను నీ సేవ లోన!

అభిజ్ఞా ఛందాంతర్గత"అనుష్టుప్ఛందములోనీది
ప్రాసనియమము కలదు.పాదమునకు,8"అక్షరములుండును.

3.గర్భగత"-భాగ్య మేల?వృత్తము.

ఎడమోమదేలనో?శివా!
జడిపించ నేల?భద్రుడా!
పోడిమంబు పెంచు మోక్షదా!
ఓడిపోను భక్తి యందునన్!

అభిజ్ఞాఛందమునందలి"బృహతి"ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు,9,అక్షరములుండును.

4.గర్భగత"భోగభూషణ"-వృత్తము.

ఏగి నంత గొల్చినా సరే!ఏలిక నీ వాడ నేను!
సాగినంత శక్తి వెంచెదన్!చాలు కటాక్షంబు నిమ్ము!
భోగ భాగ్య మేల?నీదరిన్!పూలకు తావీవు గాదె?
యోగిగాను భోగ భూషణా!ఓలను నీ సేవలోన!

అణిమా ఛందాంతర్గత,అత్యష్టీ"ఛందములోనిది.
పాదమునకు,17,అక్షరము లుండును.ప్రాసనియమము కలదు.
యతి,10,వయక్షరమునకు చెల్లును.

5.గర్భగత"-ఏలిక "-వృత్తము.

ఏలిక నీవాడ నేను!ఎడమోమదేలనో?శివా!
చాలు కటాక్షంబు నిమ్ము!జడిపించ నేల భద్రుడా!
పూలకు తావీవు గాదె?పోడిమంబు పెంచు మోక్షదా!
ఓలను నీ సేవ లోన!ఓడిపోను భక్తి యందునన్!

అణిమా ఛందాంతర్గత"అత్యష్టీ"-ఛందములోనిది,
పాదమునకు,17,అక్షరములుండును.ప్రాసనియమము కలదు.
యతి,9,వ యక్షరమునకు చెల్లును.

6,గర్భగత"-కటాక్షమ"-వృత్తము.

ఎడమోమదేలనో?శివా!ఏగినంత గొల్చినా సరే!
జడిపించ నేల?భద్రుడా!సాగినంత శక్తి నెంచెదన్!
పోడిమంబు పెంచు మోక్షదా!భోగభాగ్యమేల?నీదరిన్!
ఓడిపోను భక్తి యందునన్!యోగిగాను భోగ భూషణా!

అణిమా ఛందాంతర్గత"- ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు,18,అక్షరములుండును.
యతి"10,వ యక్షరమునకు చెల్లును.

7,గర్భగత"తావీవు"-వృత్తము.

ఏగినంత గొల్చినా సరే?ఎడమో మదేలనో?శీవా!
సాగినంత శక్తి నెంచెదన్!జడిపించ నేల?భద్రుడా!
భోగ భాగ్య మేల?నీదరిన్!పోడిమంబు పెంచు మోక్షదా!
యోగి గాను భోగ భూషణా!ఓడిపోను భక్తి యందునన్!

అణిమా ఛందాంతర్గత"ధృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు 18,అక్షరము లుండును.
యతి"10,వ యక్షరమునకు చెల్లును.

8,గర్భగత"-ఓలని సేవ"-వృత్తము.

ఎడమోమదేలనో?శివా!ఏలక నీవాడ నేను!
జడిపించ నేల?భద్రుడా!చాలు కటాక్షంబు నిమ్ము!
పోడిమంబు వెంచు మోక్షదా!పూలకు తావీవు గాదె?
ఓడిపోను భక్తియందునన్!ఓలను నీ సేవ లోన!

అణిమా"ఛందాంతర్గత అత్యష్టీ"ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు,17,అక్షరములుండును.
యతి10,వ యక్షరమునకు చెల్లును.

9,గర్భగత"-ఓడిపోని"-వృత్తము.

ఏలిక నీవాడ నేను!ఏగినంత గొల్చినా సరే!
చాలు కటాక్షంబు నిమ్ము!సాగినంత శక్తి నెంచెదన్!
పూలకు తావీవు గాదె?భోగ భాగ్యమేల?నీ దరిన్!
ఓలను నీ సేవ లోన!యోగి గాను భోగ భూషణా!

అణిమా ఛందాంతర్గత"-అత్యష్టీ"-ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు.పాదమునకు,17,అక్షరములుండును.
యతి"9,వ య్కషరమునకు చెల్లును.

10,గర్భగత"-తావి"-వృత్తము.

ఏలిక నీవాడ నేను!ఎడమోమదేలనో?శివా!ఏగినంత గొల్చినా సరే!
చాలు కటాక్షంబు నిమ్ము!జడిపించ నేల?భద్రుడా!సాగినంత శక్తి నెంచెదన్!
పూలకు తావీవు గాదె?పోడిమంబు పెంచు మోక్షదా!భోగభాగ్య మేల?నీదరిన్
ఓలను నీ సేవలోన!ఓడిపోను భక్తియందునన్!యోగిగాను భోగ భూషణా!

అనిరుద్ఛందాంతర్గత,ఉత్కృతి"ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరములుండును.
యతులు;9,18,అక్షరములకు చెల్లును.

11,గర్భగత"ఎడమోము"-వృత్తము.

ఎడమోమదేలనో?శివా!ఏగినంత గొల్చినా సరే!ఏలిక నీవాడ నేను!
జడిపించ నేల?భద్రుడా!సాగినంత శక్తి నెంచెదన్!చాలు కటాక్షించు నన్ను!
పోడిమంబు పెంచు మోక్షదా!భోగభాగ్యమేల?నీదరిన్!పూలకు తావీవు గాదె!
ఓడిపోను భక్తి యందునన్!యోగిగాను భోగ భూషణా!ఓలను నీసేవలోన!

అనిరుద్ఛందాంతర్గత""ఉత్కృతి"-ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరములుండును.
యతులు10,19,అక్షరములకు చెల్లును.

12.గర్భగత"చాలిక"-వృత్తము.

ఏగినంత గొల్చినాసరే! ఎడమోమదేలో?శివా!ఏలిక నీ వాడ నేను!
సాగినంత శక్తి  నెంచెదన్!జడిపింప నేల?భద్రుడా!చాలు కటాక్షంబు నిమ్ము!
!భోగ భాగ్య మేల?నీదరిన్!పోడిమంబుపెంచు మోక్షపూదాలకు తావీవు గాదె
యోగిగాను భోగ భూషణా!ఓడిపోను భక్తియందునన్!ఓలను నీ సేవలోన!

అనిరుద్ఛందాంతర్గత"-ఉత్కృతి"-ఛందములోనిది.
ప్రాసనియమమము కలదు.పాదమునకు"26"అక్షరములుండును.
యతులు"10,18,అక్షరములకు చెల్లును.

13,గర్భగత"-నీవాడ"-వృత్తము.

ఎడమోమదేలనో?శివా!ఏలిక నీవాడ నేను!ఏగినంత గొల్చినా సరే!
జడిపించ నేల?భద్రుడా!చాలు కటాక్షంబు నిమ్మ!సాగినంత శక్తి వేడెదన్!
పోడిమంబు పెంచు మోక్షదా!పూలకు తావీవుగాదె!భోగ భాగ్య మేల?నీదరిన్
ఓడిపోను భక్తి యందునన్!ఓలను నీ సేవలోన!యోగిగాను భోగభూషణా!

అనిర్ద్ఛందాంతర్గత"ఉత్కృతి"ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరములుండును.
యతులు,10,18,అక్షరములకు చెల్లును.

14,గర్భగత"-ఏగినంత"-వృత్తము.

ఏలిక నీవాడ నేను!ఏగినంత గొల్చినా సరే!ఎడమో మదేలనో?శివా!
చాలు కటాక్షంబు నిమ్ము!సాగినంత శక్తి నెంచెదన్!జడిపించనేల?భద్రుడా!
పూలకు తావీవు గాదె!భోగ భాగ్యమేల?నీదరిన్!పోడిమంబు పెంచు మోక్షదా!
ఓలను నీ సేవలోన!యోగిగాను భోగ భూషణా!ఓడిపోను భక్తియందునన్!

జైహింద్

8, డిసెంబర్ 2023, శుక్రవారం

బాలబోధిని | Episode 26 | షడ్వింశః పాఠః = ఇరువదియాఱవ పాఠము |By Mylavarap...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

బాలబోధిని | Episode 25 | పంచవింశః పాఠః = ఇరువదిమైదవ పాఠము | By Mylavara...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

బాలబోధిని | Episode 24 | చతుర్వింశః పాఠః = ఇరువదినాలుగవ పాఠము | By Myla...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

బాలబోధిని | Episode 23 | త్రయోవింశః పాఠః = ఇరువదిమూఁడవ పాఠము | By Mylava...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

బాలబోధిని | Episode 22 | By Mylavarapu Lakshmi Narasimham

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

బాలబోధిని | Episode 21 | ఏకవింశః పాఠః = ఇరువదిమెుకటవ పాఠము | By Mylavara...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

బాలబోధిని | Episode 20 | వింశః పాఠః = ఇరువదవ పాఠము | By Mylavarapu Lak...

0 comments

జైశ్రీరామ్
జైహింద్.

బాలబోధిని | Episode 19 | ఏకోనవింశః పాఠః = పందొమి్మదవ పాఠము | By Mylavar...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

బాలబోధిని | Episode 18 | అష్టాదశః పాఠః = పదునెనిమిదవ పాఠము | By Mylava...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

బాలబోధిని | Episode 17 | సప్తదశః పాఠః = పదునేడవ పాఠము | By Mylavarapu L...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

బాలబోధిని | Episode 16 | షోడశః పాఠః = పదునాఱవ పాఠము | By Mylavarapu Lak...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

బాలబోధిని | Episode 15 | పంచదశః పాఠః = పదునేనవ పాఠము | By Mylavarapu Lak...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

బాలబోధిని | Episode 14 | చతుర్ధశః పాఠః = పదునాలుగవ పాఠము | By Mylavarap...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

బాలబోధిని | Episode 13 | త్రయోదశః పాఠః = పదుమూడవ పాఠము | By Mylavarapu ...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

బాలబోధిని | Episode 12 | ద్వాదశః పాఠః = పన్నెండవ పాఠము | By Mylavarapu L...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

బాలబోధిని | Episode 11 | ఏకాదశః పాఠః = పదునొకండవ పాఠము | By Mylavarapu L...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

బాలబోధిని | Episode 10 | దశమః పాఠః = పదియవ పాఠము | By Mylavarapu Lakshmi...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

బాలబోధిని | Episode 9 | నవమః పాఠః = తొమ్మిదవ పాఠము | By Mylavarapu Laks...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

బాలబోధిని | Episode 8 | అష్టమః పాఠః = ఎనిమిదవ పాఠము | By Mylavarapu Laks...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

బాలబోధిని | Episode 7 | సప్తమః పాఠః = ఏడవ పాపము | By Mylavarapu Lakshmi ...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

బాలబోధిని | Episode 6 | షష్ఠః పాఠః = ఆరవ పాఠము | By Mylavarapu Lakshmi...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

బాలబోధిని | Episode 5 | పంచమః పాఠః = ఐదవ పాఠము | By Mylavarapu Lakshmi N...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

బాలబోధిని | Episode 4 | చతుర్థః పాఠః = నాల్గవ పాఠము | By Mylavarapu Laks...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

బాలబోధిని | Episode 3 | తృతీయః పాఠః = మూడవ పాఠము | By Mylavarapu Lakshm...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

బాలబోధిని | Episode 2 | ద్వితీయః పాఠః = రెండవ పాఠము | By Mylavarapu Lak...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

బాలబోధిని | Episode 1 | ప్రథమః పాఠః = మొదటి పాఠము | By Mylavarapu Laks...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

వందారు భక్తజన మందారమా! (శ్రీ అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము) లో 2...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

7, డిసెంబర్ 2023, గురువారం

తే.19 . 11 . 2023న.ఉదయం తొమ్మిది గంటలనుండి అమ్మమ్మతో నేను లో నా అర్థాంగి శ్రీమతి చింతా విజయలక్ష్మి మనుమరాలు శ్రీవైష్ణవితో కలిసి చేసిన చివరి వీడియో(Last video with ammamma)

3 comments

జైశ్రీరామ్.
అమ్మమ్మతో నేను లో నా అర్థాంగి శ్రీమతి చింతా విజయలక్ష్మి మనుమరాలు శ్రీవైష్ణవితీ చేసిన చివరి వీడియో. 
తే.19 . 11 . 2023న.ఉదయం తొమ్మిది గంటలనుండి ఈ వీడియో చేసి, వీడియో రికార్డింగ్ పూర్తి అవగానే గదిలోనికి వచ్చి మంచముపై పడుకొని త్రేంచుచుండగా (గేస్ త్రేనుపులు ఆమెకు సహజమే) ఏమైందండత్తగారూ అని మాకోడలు అడుగగా ఏమో ఏమౌతోందో తెలియటం లేదు అని అన్నారు. ఆ మాటలు వినిన నేను తటాలున దగ్గరకు వెళ్ళి రా మనం హాస్పటల్కు వెళ్దామన్నాను. పడుకుంటే తగ్గిపోతుంది. నన్ను పడుకోనివ్వండి అన్నారు. అలా కాదు లే అని లేవదీస్తే, నాకు వాంతయేలాగుంది అన్నారు. సరే చేసేసుకో అన్నాను. మంచముపైనే చేసేసారు. మళ్ళీ పడుకుంటానని పడుకున్నారు. అలా కాదు మనం వెంటనే హాస్పటల్కి వెళ్ళాలని లేవదీసాను. మోషనయేలాగుంది అన్నారు. కోడలు తీసుకువెళ్ళింది. మోషనయినతరువాత ఆమెయే కడుక్కొని బైటకు కోడలి సహాయంతో రాగా నేనూ నా కోడలు ఆమెను హాలులో కుర్చీలో కూర్చోపెట్టాము. అంతే ఒళ్ళంతా చల్లబడిపోతోంది. మా పెద్దమ్మాయి బీపీ పరీక్ష చేయగా సున్నా చూపించింది. ఆక్సిజన్ మీటంతో చూడగా అదికూడా సరళరేఖే వస్తోంది కాని అంకెలు రాలేదు. వెంటనే పసుపు మర్దనా చేస్తూ నేను బిగ్గరగా అరిచి నావైపు చూడమన్నాను. ఊఁ అని తలపైకి తేల్చి కన్నులతో ఆకాశంవైపు చూసింది. ఇంతలో మా అబ్బాయి వీల్ చైర్ తేగా దానిలో కూర్చోపెట్టి కారుదాకా తీసుకొనిపోయి, కారు ఎక్కమన్నాను. ఆమె కారు ఎక్కి పడుకున్నారు. ఐదు నిమిషాలలో దగ్గరలో ఉన్న హాస్పటల్కు తీసుకువెళ్ళగా వారు పరీక్షించి ప్రథమ చికిత్స అందిస్తూనే ఇది సివియర్ హార్ట్ ష్ట్రోక్ వెంటనే మరో హాస్పత్రికి తీసుకు పొమ్మన్నారు. క్షణం ఆలస్యం చెయ్యక అంబులెంసులో ఏ.ఐ.జీ. హాస్పటల్కు తీసుకు వెళ్ళగా వారు వెంటనే జాయిన్ చేసుకొని పరీక్షలు చెయ్యడం ష్టంట్ వెయ్యడం మత్తుమందివ్వడం చేసి (సరిగా ఉదయం పది గంటలనుండి) ఐసీయూలో పెట్టారు. 
తే. 20 . 11 . 2023. రాత్రి 9.49.నిమిషములకు మరణించినట్లు తెలియజేసారు. నాబ్రతుకును చూకటిలోనికి నెట్టి తాను కార్తీకసోమవారముపూటా ఆ లలితాపరాభట్టారికలో లీనమైపోయారు.

చం.  చక్కని సూచనాళిని ప్రశాంతిగ చేసితి వింతదాక, నీ
కెక్కడి నుండి చేరె సతి! యీ విధి నిన్ గొనిపోవు మృత్యు వీ
యొక్కక్షణంబు మాత్రమునె? యుల్కును పల్కును లేక మమ్ము నీ
విక్కటులందు ముంచి, పరమేశ్వరిలోనికి చేరిపోతివా?

శివశివా    శివశివా   శివశివా.

6, డిసెంబర్ 2023, బుధవారం

శబ్దబ్రహ్మమహత్వమున్ దెలియుడీ! సద్భావులారా! యిటన్. CYMATICS: Science Vs. Music - Nigel Stanford

0 comments


జైశ్రీరామ్.


శా.  శబ్దబ్రహ్మమె మూలమై జగతినే శాశించునంచున్ ఋషుల్
శబ్దోపాసననోంకృతింసతతమున్ జ్ఞానార్తులై చేసి, ని
శ్శబ్దంబందున శబ్దశక్తిఁ గొనుచున్ నిర్వాణమున్ గాంచిరా
శబ్దబ్రహ్మమహత్వమున్ దెలియుడీ!  సద్భావులారా! యిటన్.

జైహింద్.

24, నవంబర్ 2023, శుక్రవారం

శ్రీశైలంలో అష్టావధానం. Brahmasri Madugula Nagaphanisarma gari Ashtavadhanam 17-11-2023

0 comments

జైశ్రీరామ్.


14, నవంబర్ 2023, మంగళవారం

శ్రీరాముని ఎంత చక్కగా ప్రశంసిస్తూ గానంచేన్నారో ఈ మహిళామణి. వీరికి రామానుగ్రహం పుష్కలంగా ఉంటుంది.

0 comments

 

జైశ్రీరామ్.
జైహింద్.

13, నవంబర్ 2023, సోమవారం

కీ.శే.కాళ్ళూరి రామారావు గారి పద్యము గానము.

0 comments

 జైశ్రీరామ్.


నేనొకపరి పిఠాపురంలో ఉండగా బ్రహ్మశ్రీ కాళ్ళూరి రామారావుగారు బ్రహ్మశ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యం గారూ నేనక్కడున్నానని తెలిసి నన్ను కలవడానికి వచ్చినప్పుడు రామారావుగారు ఆశువుగా నాపై ఒక పద్యం పాడారు. వినండి.

వారి అభిమానాన్ని చూరగొన్న నేను వారికి సమర్పించిన పంచరత్నాలు.

శ్రీరస్తు                                         శుభమస్తు                                అవిఘ్నమస్తు.

బ్రహ్మశ్రీ కాళ్ళూరి శ్రీ సూర్య వేంకట రామారావు గారికి

అభినందన చందన చర్చ.

రచన. చిత్రకవితాసామ్రాట్ చింతా రామకృష్ణారావు.  8247384165

శా. శ్రీమద్వాణి దయాసుధార్ణవముమీ చెంతన్ బ్రశాంతిన్ సదా

మీ మందస్మితపూర్వ భాషణమునన్మీ గానతేజంబునన్,

ప్రేమన్ వాసము చేయుచుండెనొలసద్విజ్ఞానమీ కబ్బెనే

కామాక్షీకృప? రామరావు విభవా! కాళ్ళూరి వంశోద్భవా!

 

మ. ఘనమౌ దుందుభి సుస్వనంబు గళమున్కాంతుల్ శరీరంబునన్,

మనమందున్ శుభ భావనాగరిమసమ్మాన్యత్వమున్ వృత్తిలో,

ప్రణవంబెన్నగ జ్ఞానతేజసమునన్ప్రఖ్యాతిగా నిల్చె

ద్గుణపూర్ణాశుభ సంతతుల్ పడయుఁడీకూర్మిన్ ననున్ గాంచుడీ!

 

శా. ప్రేమన్ మీరలు పంపినట్టి ఘనమౌ శ్రీ సాయి కర్ణామృతం

బే మాన్యత్వము నొప్పు రాగ సుధయౌన్. విఖ్యాతితోనొప్పెడున్.

శ్రీమాతా కరుణోపలబ్ధ ప్రతిభన్ శ్రీమన్మహా రాగముల్

సామర్ధ్యంబున వెల్వరించిరిగ శ్రీ సాయీశు మెప్పొందగన్.

 

ఉ. చేకొన నాకొసంగితిరి శ్రీకర నర్తన శాల నాటకం

బేకరణిన్ త్వదీయ కృపనెన్నఁగ జాలుదునయ్య నేనుమీ

రాకకు వేచియుందు. నటరాజు కృపన్గననుంటి మిమ్ము. న

స్తోక శుభంబులన్ గనుచు శోభిలుఁడీరు సతంబు ధాత్రిపై.

 

ఉ. మంగళ కారకంబయిన మాన్య సురాగములాలపించుచున్,

నింగికిఁ బ్రాకఁ జేసి వరణీయ మహత్కళ కీర్తి తేజమున్,

పొంగఁగ భారతాంబ గుణ పూజ్యులుగా వెలుగొందుడయ్య! సన్

మంగళమూర్తి శ్రీహరి యమంద శుభాస్పదుఁడౌత మీయెడన్.   

       స్వస్తి.       

తేదీ. 15 01 2018.

జైహింద్.