గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, జులై 2020, ఆదివారం

కర్తృ కావ్య నామగోపన రథబంధ చిత్రము ... శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారు

                                       జైశ్రీరామ్. 
కవి, కావ్య నామగోపన రథబంధ చిత్రము
శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారి ‘చిత్రభారతము’ కావ్యం 
భీష్మపర్వము నుంచి
సీ.  శ్రీకుముద సువీర శిశిరామరాళీశ
శుచి శుభేక్షణ ధన్వి సుభుజ సుఖద
సుందర కుందర కుందారవిందాక్ష
రుచిరాంగద ముకుంద శుచి శమ శివ
యమ యజ్ఞభృదతీంద్రియాశోకకపికపీం
ద్ర కపిలకరణ కవి కథితకృతి
రోచిష్ణు విష్ణు విరోచనేజ్యపవిత్ర
పరమేశ పరమేష్ఠి భావ భయహ
గీ.  వేద సర్వప్రహరణాయుధాది రుచిర
నామజపపరాయణుల పుణ్యంబు నెంత
యనుచు వర్ణింపనోతు; మహాత్ముఁ డా కృ
తాత్ము దయఁగల్గు శోకరతాత్మసుకృతి.
                   
                                               జైహింద్.
Print this post

1 comments:

కందుల వర ప్రసాద్ చెప్పారు...

అద్భుతంగా నున్నదండి శ్రీ మురళీధరరావు కవీశుల నామగోపన రథబంధము, వారికి అభినందన వందనములు, తమరికి ధన్యవాద శతములు 🙏🙏🙏🌹🌹🌹🌹

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.