గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, జులై 2020, శుక్రవారం

ద్రౌపది...నాటకము.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

30, జులై 2020, గురువారం

భక్తిసాధనమ్ నిర్వహణలో తాతా సందీప్ శర్మ అష్టావధాని గారి అశ్వమేధపర్వము .. వివరణ .. అష్టావధాని .. తాతా సందీప్ శర్మ

0 comments

జైశ్రీరామ్.
 జైహింద్.

29, జులై 2020, బుధవారం

జైశ్రీరామ్.

0 comments

డయాబెటిస్ నియంత్రణ కోసం సాధారణ జీవనశైలిలో కొన్ని మార్పులు (Life style ch...

0 comments

శివపార్వతులపై పద్యములు.... నిర్వహణ....భక్తి సాదనమ్

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

28, జులై 2020, మంగళవారం

దృక్పథం మారాలి ... శ్రీ ఎన్సీహెచ్ చక్రవర్తి.

0 comments

జైశ్రీరామ్.
దృక్పథం మారాలి   ...   శ్రీ ఎన్సీహెచ్ చక్రవర్తి.         
మిత్రులకు నమస్సులు.
ఇటీవల నేనున్న సాహిత్యబృందాల్లో (లేనివాట్లలోనూ) కొందరు కొన్ని ప్రశంసాపత్రాలను పోస్ట్ చేస్తున్నారు. వారి రచనా ప్రయత్నాన్ని నేను స్వాగతిస్తాను. స్వాగతిస్తూనే ఉన్నాను. కానీ ఈ ప్రశంసల పేరుతో ప్రదర్శితం అయ్యే పత్రాలు రకరకాలుగా ఉంటున్నాయి. 1. బహుమతులు గెల్చుకున్నవి.2. పోటీల్లో పాల్గొన్నందుకు ప్రశంస. 3. మూకుమ్మడి కవిసమ్మేళనాల్లో పాల్గొన్న ప్రశంస. 4. సాహిత్యకార్యక్రమాల్లో పాల్గొన్నందుకు ప్రశంస. 5.లేదా నిర్వహించిన పోటీల్లో వివిధ విభాగాల(అతిథుల్లాగానే ఆత్మీయ,గౌరవ ఇలాగ)పురస్కారాలు. ఇంకా వివిధ రూపాల్లో ఉంటున్నాయి. ప్రధాన లక్ష్యం ఏమంటే పాల్గొన్న ఎవ్వరినీ రిక్తహస్తాలతో పంపకుండా అందరిని సంతృప్తి పరచడం. వీలైతే వారి వారి అవకాశాన్ని బట్టి ఒక బిరుదును తగిలించడం. నా శిష్యుడు ఒకాయన ఆ మధ్య రెండుమూడు బిరుదులు పెట్టుకుని వ్రాస్తూండగా ఆ బిరుదులకు అర్థం అడిగాను.అందులో ఒకటి వంద లేదా వెయ్యి మందికవులకి నెచ్చెలి అని అర్థం వచ్చేది. ఆ అర్థము ఆయన చెప్పలేక పోయారు. అది ఒక విషయం. ఏమీలేదు ఒక వంద కవితలు అవి ఎలా ఉన్నా ఏవైనా (వాక్యాలైనా సరే) వాళ్లకు పంపితే  సిద్ధంగా ఉంచుకున్న సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. బాగానే ఉంది. ఆ బిరుదులు చూపి మరిన్ని బిరుదులు పొందడం. వాటిద్వారా కొన్ని అవార్డులకు అర్హత పొందడం.ఇలా సాగుతున్నది.
ఈ వ్యక్తులు లేదా సంస్థలు సాహిత్య సేవ పేరుతో పరస్పరం సహకార పద్ధతిలో గౌరవాలు చేసుకుంటూ బిరుదులు ఇచ్చుకుంటూ ఉండేవి కూడా ఉన్నాయి. కొందరు కొంత పుచ్చుకుంటూ(ఖర్చులు ఉంటాయిగా) ఇస్తున్నారని ఒకరిద్దరు చెప్పారు.
  అన్ని సందర్భాల్లోనూ అన్నీ వర్తిస్తాయని కాదు. నిజాయితీగా ఉండవనీ కాదు. సమస్య ఎక్కడంటే కవిత్వం లేకున్నా రాశిని బట్టి లేదా వారివారి ప్రయోజనాలబట్టి ఇచ్చుకుంటూ పోవడం కాల మహిమ అనే చెప్పాలి. కళాకారులకు బిరుదులూ సత్కారాలపట్ల వ్యామోహం అతి అయిపోడం కూడా ఆలోచింపచేస్తున్నది. ఇది ఒక బలహీనతగా ఎవరూ భావిస్తున్నట్లు లేదు. ఇలా బిరుదుల దొంతరలను పేర్చుకొని తద్వారా లేని కవిత్వాoశను తమలో ఆపాదించుకునే వారి గురించే ఎన్ని విమర్శలు వచ్చినా!! పులిని చూచి నక్క వాతలు పెట్టుకొడమే కాదు అది పులి చేసే పని చెయ్యలనుకోడం కుదరదు కదా!!ఈ సందర్భంలో కృష్ణమాచార్యులు గారు వ్రాసిన *బిడాలమోక్షం* కావ్యం గుర్తుకు వస్తుంది.  మా చదువుల కాలంలో కాశీ కృష్ణాచార్యులు గారికి *మహామహోపాధ్యాయ* బిరుదు ఉండేది. ఇంకా ఒకరిద్దరు మాన్యులకూ ఉండడం విన్నాం. ఇప్పుడు ఆ బిరుదునూ కులసంఘాలు ఇచ్చేస్తున్నాయి.
స్థితి ఇలా ఉంది.
   యువతకు(అందరికి కాదు సుమా!) అధ్యయనం లేదు. కవిత్వ మర్మాలు తెలియవు.  భాషపై పట్టూ ఉండదు. పదాలు ఎక్కడ హ్రస్వమో ఎక్కడదీర్ఘమో ఎక్కడ మహాప్రాణమో ఎక్కడ అల్పప్రాణమో తెలియని  (అల్పప్రాణులూ)వారికీ ఒకటి రెండు బిరుదులు ఉంటాయి. అవిలేనిదే నిద్రలేని స్థితి..అలాగే పక్కవారికి ఉంటే తమకూ ఉండి తీరాలని కొందరి తాపత్రయం.
అలా బిరుదులు పొందిన వారి వ్రాతల్లో కవిత్వం అన్నది మనం వెతుక్కుంటూ కవిత్వ నిర్వచనాలు  మార్చుకోవలసిందే తప్ప వారు సుప్రతిష్ఠీతమైన కవి నిర్వచనాలకూ కవిత్వ సిద్ధాoతాలకో లొంగి రాజీపడరు.
  సాహిత్యం గుంపుల్లో కొందరు ఎప్పుడూ ఏమీ వ్రాయరు. కేవలం ఈ సమ్మాన సత్కార బిరుదాదికాల ప్రదర్శనకు పరిమితమై ఉంటారు. మా గుంపులో అలా ఉన్న ఒకరిద్దరిని ఆ విషయమే అడిగాను. ఎప్పుడు ఎక్కడ ఏమి వ్రాసారో తెలుసుకుందామని. ఆ సమాధానాలు కేవలం వారికి ఆత్మ సంతృప్తి కలిగిస్తాయి అనేది గ్రహించవచ్చు. అంతవరకూ నయమే!!కనీసం ఆత్మనైనా సంతృప్తి పరచుకుంటున్నారు.
   నన్ను పట్టిపీడించే కొన్ని ప్రశ్నలు ఇప్పటికైనా పంచుకోకపోతే బాగుండదనుకున్నాను.
అసలు ఈ బిరుదులు లేకపోతే ఏమి జరుగుతుంది?? అనర్హబిరుదులు పొందాలనుకోడం ఒక మానసిక రుగ్మత కాదా!!,దీనికి చికిత్స లేదా!! ఇచ్చేవాళ్లకు ఏమి సంతృప్తి?? ఇది ఏ కోవలోకి వచ్చే బలహీనత?? సంస్థలు కొన్ని రాశి నింపితే బిరుదులు పంచిపెట్టడం మంచికా??చెడుకా?? దీనివల్ల భాషకూ కవిత్వానికి మేలా??కీడా?? పిల్లితన మెడలో మృగరాజు అని బోర్డ్ వ్రాసుకుని తగిలించుకున్నట్లు ఈ తగిలించుకు తిరగడం లో కలిగే ఆనందాన్ని ఏమనాలి?? తమద్వారా బిరుదులకు కానీ లేదా బిరుదుల ద్వారా తమకు కానీ కలిగే అప్రతిష్ఠల గురించి ఏన్నడైనా ఆలోచించారా?? సాహిత్యలోకం, బృందాలూ చాలా ఆలోచించవలసిన సమయం వచ్చింది. కవిసమ్మేళనాలు అంటారు.ఒకపక్క స్టేజి పై కవితలు అనుకుంటూ చదువుతుంటే ఒక పక్కన శాలువాల వితరణ జరిగిపోతూనే ఉంటుంది. ఒకరిది ఒకరు వినరు. శాలువా మెమెoటో తీసుకుని వెళ్లిపోవాలి.అయినా వందలమందివి వినడానికి ఎంత దమ్ము కావాలి. ఆ మధ్య నేను (ఒకేఒకసారి)ప్రపంచస్థాయి అని జరిగిన సాహిత్య సభలకు వెళ్ళాను. 3 రోజుల కవిసమ్మేళనాల్లో నమోదుకు తొక్కిసలాట జరిగినంత పనయింది. ప్రాణనష్టం జరగకుండా పోలీసులజోక్యం తప్పదేమో అన్నంతగా!!
ఇది సిగ్గుపడవలసిన విషయం.  నిర్వహించే సంస్థలకూ పాల్గొనేవారికి కొద్దిగా ఉండాలి కద!! నిర్మొగమాటంగా చెప్తే చేతులున్న ప్రతివారూ వ్రాయాలనుకోడం ఎలాంటిదో
చెవులున్న  ప్రతివారికీ వినిపించాలనుకోడమూ అలాంటిదే!!
 పై విషయాలు బాగా వ్రాసేవారికి,వ్రాస్తున్నవారికీ,కవిత్వం పండిస్తున్నవారికీ నిజమైన కవులకూ కవయిత్రులకూ వర్తించవని సవినయంగా విన్నవించుకుంటున్నాను. అర్హులకు సత్కారసమ్మానాలు అవసరం. అది మన సంస్కృతి. అర్హులు కానివారికి చేయడమూ అంతే అపచారం. దీనివల్ల కళలకు మేలు జరగదు.
ఈ స్థితి నుండి మనం అందరం బయటపడాలి.  వర్ధిష్ణువులమైన మనం ఇంకా బాగా వ్రాసి భాషాసేవచేద్దాం. రాశి అసలు వద్దు. వాసి పై దృష్టిపెడదాం. పెద్దల సూచనలు తీసుకుందాం
 వ్రాస్తున్నవాళ్ళo అధ్యయనం బాగా పెంచి,ఈ అల్పపు జాడ్యాలనుండి బయటపడాలి. బిరుదులు పొందడంలో పోటీపడవద్దు. ప్రమాణకవిత్వం వ్రాయడంలో పోటీపడదాం. సత్కారాలూ శాలువాల లెక్క వద్దు. వ్రాసేదానిలో ప్రామాణికుల మెప్పులు పొందినవి ఎన్నో లెక్క చూచుకుందాం.
 మనలో మార్పు రావాలి. సాహిత్య బృందాల్లోనూ మార్పు రావాలి. మన దృక్పథం మారాలి.

N. CH. చక్రవర్తి
జైహింద్.

మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ సాహితీ సేవా పురస్కారము.

0 comments

జైశ్రీరామ్.
నాకు సేవా భాగ్యమును కలుగ చేసిన సంస్థ నిర్వాహకులకు ధన్యవాదములు.
జైహింద్.

27, జులై 2020, సోమవారం

పీ.వీ.మన ఠీవి. శతపద్యార్చన.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

26, జులై 2020, ఆదివారం

భక్తిసాధనమ్ అవధానాదుల నిర్విరామప్రసారములో శతదినోత్సవము.....భక్తిసాధనమ్.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

25, జులై 2020, శనివారం

కొండొండోరి సెరువుల కాడా......పాట అర్థం.

2 comments

జైశ్రీరామ్.
కొండొండోరి సెరువుల కాడా......పాట అర్థం.

నిజంగా మన తెలుగు కవుల చేతి రాతలో ఎంత ఆధ్యాత్మిక భావన తొంగి చూసేదో ఈ పాట అర్థం తెలుసుకుని వింటే అర్థమవుతుంది.

మన వారు మాట్లాడిన, పాట పాడిన ఎప్పుడూ ఎరుక కలిగి పారమార్థిక చింతనతో జీవనం సాగించే వారు అనడానికి చక్కని నిదర్శనం ఈ పాట.

ఈ పాట 1983 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడెమీ ప్రచురించిన జానపద గేయాలలో చివరిది.
సంపాదకురాలు కళాప్రపూర్ణ శ్రీమతి ఎం. అనసూయాదేవి.

ఇది ప్రధానంగా ప్రతీకాత్మకంగా చమత్కారపు బాటలో నడిచిన పాట.

11 చరణాల ఈ పాటలో మొదటి రెండు పంక్తులు ముగ్గురిని గురించి చెబుతుంటే , మిగిలిన రెండు పంక్తులు రెండింటిని గూర్చి చెబుతుంటాయి.
విచిత్రమేమిటంటే ఆఖరుగా ఉన్న రెండు పంక్తులు మొదటి మూడింటి ఫలితాలగురించి వివరిస్తుంటాయి.

1. కొండొండోరి సెరువుల కాడా
సే సిరి ముగ్గురు ఎగసాయం యొకడికి (త్రి మూర్తులు 1. బ్రహ్మ, 2. విష్ణువు, 3. మహేశ్వరుడు.)
కాడి లేదు రెండు
దూడాలేదు
అనంతకోటి బ్రహ్మాండాలలో (కొండొండోరి సెరువుల) త్రిమూర్తులు సృష్టి వ్యవసాయం మొదలుపెట్టారు.
వ్యవసాయానికి కాడి, దూడా ఉండాలి కదా ! కాని వీరి వ్యవసాయానికి అవిలేవు. (మిగతా చరణాలన్నింటిలోను ఇదేరీతిగా స మన్వ యించుకోవాలి)

2. కాడిదూడా లేనెగసాయం
పండెను మూడు పంటాలొకటి (1. సత్త్వము, 2. రజస్సు, 3. తమస్సు)
వడ్లు లేవు రెండు
గడ్డీ లేదు
పంటలకి వడ్లు , గడ్డీ ఉండాలి కదా ! కాని 1. సత్త్వము, 2. రజస్సు, 3. తమస్సు అను పంటలకు వడ్లు , గడ్డీ లేవు.

3. వడ్లు గడ్డీ లేని పంటా
ఇశాఖపట్నం సంతలో పెడితే( విశాఖ= ఔన్నత్యపు శాఖలు లేని సంసారం)
వట్టి సంతేకానీ సంతలో
జనం లేరు
(సత్వ రజస్తమోగుణాల పంటను శాఖలు లేని సంసారంలో పెట్టారు. జనం వాటిలో మునిగిపోయారు. ప్రపంచం ఉన్నది కాని ప్రపంచంలో సంసారపు ఊర్ధ్వమూలాన్ని ఆలోచించటానికి ఎవరూ లేరని భావం)
4. జనంలేని సంతలోకి
వచ్చిరి ముగ్గురు షరాబు లొకరికి( షరాబులు= కంసాలులు 1. అగ్ని, 2. వాయువు, 3. సూర్యుడు.)
కాళ్ళు లేవు రెండు
సేతుల్లేవూ

5. కాళ్ళు చేతులు లేని షరాబు
తెచ్చిరి మూడు కాసూలొకటి( త్రిదండాలు 1. వాగ్దండము (మౌనము), 2. మనోదండము (ఆశ లేకుండుట), 3. కాయదండము (స్వధర్మాచరణము))
వొలాల్లొల్లదూ రెండు
సెల్లాసెల్లవు ( త్రిదండాలకు ఈలోకంలో చెల్లుబాటు లేదని భావం)

6. ఒల్లాసెల్లని కాసులు తీసుకు
ఇజయనగరం ఊరికిబోతె
ఒట్టి ఊ రేగాని ఊళ్ళో
జనం లేరు
( విజయ అనగా మిక్కిలి గెలుపు. సహస్రార చక్ర భేదనమనే ఊరు. ఈలోకంలో చాలామంది దృష్టిలో పనికిరాని ఆ త్రిదండాలను ఆచరించి ఉత్తమ యోగాభ్యాసంతో ఆ సహస్రార చక్ర భేదనమనే ఊరుకు వెళదామని చూస్తే ఆ ఊరు చేరిన వారు లేరు. యోగులెవరు లేరని భావం)

7. జనం లేని ఊల్లోను
ఉండిరి ముగ్గురు కుమ్మల్లొకడికి(త్రికాలాలు 1. భూతకాలము, 2. భవిష్యత్కాలము, 3. వర్తమానకాలము.)
తల లేదు - రెండు కి
మొలాలేదు
(ఉత్తమ యోగాభ్యాసము చేసే వారు ఎవరూ లేకపోయినా తలా మొలా లేని- అనగా ఆకారం లేని త్రికాలాల కుమ్మర్లు వస్తూనే ఉంటారని భావం. )

8. తల మొల లేని కుమ్మర్లు
చేసిరి మూడు భాండాలొకటికి(1. భూలోకము, 2. స్వర్గలోకము, 3. పాతాళ లోకము.)
అంచులేదూ. రెంటికి
అడుగు లేదు
( కాలం సృష్టించిన లోకాలకు అంచులేదు. అడుగు లేదు.)

9. అంచు అడుగు లేని భాండాల్లో
ఉంచిరి మూడు గింజలొకటి (త్రిదోషాలు శ్లేష్మం, పిత్తం, వాతం.)
ఉడకా ఉడకదు రెండు
మిడకామిడకావూ
(ఈ లోకాలలో జీవులతో ఆడుకోవటానికి కాలం శ్లేష్మం, పిత్తం, వాతం అను మూడు గింజలను ప్రతి జీవిలోను ప్రవేశపెట్టింది)

10. ఉడకని మిడకని మెతుకులు తినుటకు
వచ్చిరి ముగ్గురు సుట్టాలొకడికి (1. మనస్సు, 2. వాక్కు, 3. కర్మ. త్రికరణాలు)
అంగుళ్లేదూ రెండు
మింగుళ్లేదూ
(శ్లేష్మం, పిత్తం, వాతం అను అనువాటిని త్రికరణాలు జీవుల చేత అనుభవింప చేస్తున్నాయి)

11. అంగుడుమింగుడు(= లోకుత్తుక) లేని సుట్టాలు
తెచ్చిరి మూడు సెల్లాలొకటి (1. ధర్మము, 2. అర్థము, 3. కామము.-త్రిగణము)
సుట్టు లేదు , రెండు
మద్దెలేదు .
(అంచుల్లేని సన్నని బట్టను సెల్లా అంటారు. 1. ధర్మము, 2. అర్థము, 3. కామము.-త్రిగణములు అటువంటివి సెల్లాలు. వీటిని తెచ్చిన వారు త్రికరణాలు. 1. ధర్మము, 2. అర్థము, 3. కామములకు చుట్టూలేదు. అనగా ఒక పరిధిలేదు. మధ్య లేదు. )
జైహింద్.

24, జులై 2020, శుక్రవారం

సహస్రపద్యార్చనోత్సవము....భక్తిసాధనమ్.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్

23, జులై 2020, గురువారం

తిగుళ్ళ శ్రీకాంత్ శర్మగారిచే సుందరకాండ ప్రవచనము....నిర్వహణ..భక్తిసాధనమ్.

0 comments

జైశ్రీరామ్.
 జైహింద్.

22, జులై 2020, బుధవారం

డా.దాశరథి జయంతి సందర్భముగా వారిని సంస్మరించుకొనుచు,

1 comments

జైశ్రీరామ్.
డా.దాశరథి జయంతి సందర్భముగా వారిని సంస్మరించుకొనుచు,

వర తెలగాణ బిడ్డడయి భాసిలినట్టి మహాగ్నిధార, ధీ
వర మహితుండు దాశరథి, పాపుల పాలిట రుద్రవీణ, సు
స్థిర మహనీయ తేజము ప్రసిద్ధమహాద్భుత గ్రంథ రూపియై
వరలుచు నుండె నేడు. కవిభాస్కరమూర్తికినంజలించెదన్.

సద్విధేయుఁడు
చింతా రామకృష్ణారావు. 
జైహింద్.

ఆరుగురు అవధానులు...అంశాలు నాలుగు. ఏకకాల<లో ౩...,,నిర్వహణ..భక్తిసాధనమ్.

0 comments

జైశ్రీరామ్.
 జైహింద్.

21, జులై 2020, మంగళవారం

డా.ముదిగొండ అమరనాథ శర్మగారి ప్రవచనం...భాగవత మధురిమలు...నిర్వహణ..భక్తిసాధనం.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

20, జులై 2020, సోమవారం

భద్రకా,సమాశ్రీ,రజినీకర,ఆశ్వాదయా,యతిర్నవసుగంథి,కీర్తిసౌరుల,అశాశ్వతకళావిహీన,కేళినీ,సద్దురాగమ,గర్భ"-తద్దురాన"-వృత్తము.రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్.
భద్రకా,సమాశ్రీ,రజినీకర,ఆశ్వాదయా,యతిర్నవసుగంథి,కీర్తిసౌరుల,అశాశ్వతకళావిహీన,కేళినీ,సద్దురాగమ,గర్భ"-తద్దురాన"-వృత్తము.రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.  జుత్తాడ.
                         
"-తద్దురాన"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.త.ర.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
గౌరవ సంస్కార దూరులై!గద్దె కీర్తి మాపుజేయ!కారుకూత లేల?కూతురో!
పౌరుల బాగోగు లెంచకన్!పద్దు లేక!హద్దు మీరి!పౌరుషాన కీడు చైదులై!
సారవిహీనంపు కృత్యతన్!సద్దురాగమంబు సేయ!సౌరు లెల్ల నాశమౌ!గదే?
తారకమంచెంచ రాదుగా?తద్దురాన గెల్వ నౌనె?దారిలేదు!చేర మోక్షమున్?
అర్ధములు:-
సద్దురాగమంబు=సత్యమనునది చెడుగ వచ్చిన,తద్దురాన=తత్పరమాత్మ
తో పోరున,చైదులు=చేష్టితులు,సౌరులు=ఆర్థిక వనరులు,గద్దె కీర్తి=సింహా
సన ప్రతిష్ఠ,సారవిహీన=నిస్సామైన,
1.గర్భగత"-భద్రకా"-వృత్తము.
బృహతీఛందము.భ.త.ర,గణములు.వృ.సం.167.
ప్రాసనియమము కలదు.
గౌరవ సంస్కార దూరులై!
పౌరుల బాగోగు లెంచకన్?
సార విహీనంపు కృత్యతన్!
తారకమం చెంచ రాదుగా!
2.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
గద్దె కీర్తి మాపుజేయ!
పద్దు లేక హద్దు మీరి!
సద్దు రాగమంబు సేయ!
తద్దురాన!గెల్వ నౌనె?
3.గర్భగత"-రజినీకర"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
కారుకూత లేల?కూతురో!
పౌరుషాన కీడు చైదులై!
సౌరులెల్ల!నాశమౌ గదే?
దారి లేదు!చేర మోక్షమున్?
4.గర్భగత"-ఆశ్వాదయా"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.త.ర.ర.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
గౌరవ సంస్కార దూరులై!గద్దె కీర్తి మాపు సేయ!
పౌరుల బాగోగు లెంచకన్?పద్దు లేక!హద్దు మీరి!
సార విహీనంపు కృత్యతన్!సద్దురాగమంబు సేయ!
తారకమంచెంచ రాదుగా?తద్దురాన!గెల్వ నౌనె?
5.గర్భగత"-యతిర్నవ సుగంథి"-వృత్తము
అత్యష్షీఛందము.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
గద్దె కీర్తి మాపు సేయ!కారు కూత లేల?కూతురో!
పద్దు లేక హద్దు మీరి!పౌరుషాన కీడు చైదులై!
సద్దు రాగమంబు సేయ!సౌరు లెల్ల!నాశమౌ గదే?
తద్దురాన!గెల్వ నౌనె?దారి లేదు!చేర మోక్షమున్?
6.గర్భగత"-కీర్తిసౌరుల"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.ర.య.స.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
గద్దె కీర్తి మాపు సేయ!కారు కూత లేల?కూతురో!గౌరవ సంస్కార దూరులై!
పద్దు లేక!హద్దు మీరి!పౌరు షాన కీడు చైదులై!పౌరుల బాగోగు లెంచకన్?
సద్దు రాగమంబు సేయ!సౌరులెల్ల!నాశ మౌ గదే?సారవిహీనంపు కృత్యతన్!
తద్దురాన!గెల్వ నౌనె?దారి లేదు!చేర మోక్షమున్?తారకమం చెంచ రాదుగా!
7.గర్భగత"-అశాశ్వత"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.భ.త.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కారు కూత లేల?కూతురో!గారవ సంస్కార దూరులై!
పౌరుషాన కీడు చైదులై! పౌరుల బాగోగు లెంచకన్?
సౌరు లెల్ల!నాశమౌ గదే?సార విహీనంపు కృత్యతన్!
దారిలేదు!చేరమోక్షమున్?తారక మంచెంచ రాదుగా?
8.గర్భగత"-కళా విహీన"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.భ.త.ర.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కారుకూత లేల?కూతురో!గౌరవ సంస్కార దూరులై!గద్దె కీర్తి మాపు సేయ!
పౌరుషాన!కీడు చైదులై!పౌరుల బాగోగు లెంచకన్?పద్దు లేక!హద్దు మీరి!
సౌరులెల్ల!నాశమౌ గదే?సార విహీనంపు కృత్యతన్!సద్దురాగమంబు సేయ!
దారిలేదు!చేర మోక్షమున్?తారక మంచెంచ రాదుగా?తద్దురాన!గెల్వ నౌనె?
9.గర్భగత"-కేళినీ"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.స.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
గద్దె కీర్తి మాపు సేయ!గౌరవ సంస్కార దూరులై!
పద్దు లేక!హద్దు మీరి!పౌరుల బాగోగు లెంచకన్?
సద్దురాగమంబు సేయ!సార విహీనంపు కృత్యతన్!
తద్దురాన!గెల్వ నౌనె?తారక మంచెంచ రాదుగా?
10,గర్భగత"-సద్దురాగమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.స.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18,
ప్రాసనియమము కలదు.వృ.సం.
గద్దె కీర్తి మాపుసేయ!గౌరవ సంస్కార దూరులై!కారుకూత లేల?కూతురో!
పద్దులేక!హద్దు మీరి!పౌరుల బాగోగు లెంచకన్?పౌరుషాన కీడు చైదులై!
సద్దురాగమంబు సేయ!సార విహీనంపు కృత్యతన్!సౌరులెల్ల?నాశమౌ గదే?
తద్దురాన!గెల్వ నౌనె?తారక మంచెంచ రాదుగా?దారి లేదు!చేర మోక్షమున్!

స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
 జైహింద్.

19, జులై 2020, ఆదివారం

డా.గీ.యం.రామశర్మగారి అంతర్జాల అష్టావధానమ్య్. నిర్వహణ భక్తిసాధనమ్.

0 comments

జైశ్రీరమ్.
జైహింద్.

18, జులై 2020, శనివారం

డయాబెటిక్ గురించి అవగాహన కల్పించే వీడియో.....కుమారి సాధు శ్రీవైష్ణవి.

1 comments

JaiSree Ram.
డయాబెటిక్ గురించి అవగాహన కల్పించే వీడియో.....కుమారి సాధు శ్రీవైష్ణవి.
Jaihind

ప్రమాణీ ద్వయ,వారిద ద్వయ,యతి ర్నవ పంచ ఛామర ద్వయ, కాటేయుద్వయ,కాటువేయుద్వయ,కాళికా,వేటజాగిల,చరయాజిరా,చేటిలుద్వయ,రయంచరద్వయ,కరాళినీద్వయ,ఘాతుకద్వయ,రాజినాద్వయ,శీతవాతతా,రసికా,రయమెంచు,,గర్భ"-జరాజిత ద్వయవృత్తములు,రచన శ్రీ:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్.
ప్రమాణీ ద్వయ,వారిద ద్వయ,యతి ర్నవ పంచ ఛామర ద్వయ, కాటేయుద్వయ,కాటువేయుద్వయ,కాళికా,వేటజాగిల,చరయాజిరా,చేటిలుద్వయ,రయంచరద్వయ,కరాళినీద్వయ,ఘాతుకద్వయ,రాజినాద్వయ,శీతవాతతా,రసికా,రయమెంచు,,గర్భ"-జరాజిత ద్వయవృత్తములు,రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
                         
"-జరాజిత ద్వయ"-వృత్తములు.
ఉత్కృతిఛందము.జ.ర.జ.ర.జ.త.ర.ర.లగ.గణములు.యతులు.9,17,22.
ప్రాసనియమము కలదు.వృ.సం.
1.
కరోనమారి రక్కసీ!కరాళ రాత్రి కాళమా!కాటు వేయకే?ఘాతుకంబునన్!
విరోధి మానసంబునన్!విరించి సృష్టి మాపగా!వేట కుక్కవై!భీతిలంగడున్!
చిరాకుపెట్ట కేగుమా?స్థిరంబు నిల్వ లేవిలన్!చేటు నొందెదే?శీత వాతతన్!
పురోగమంబు!లేదులే?పురాలు వీడు!చావకన్!పోటుధాటికిన్!భూత
                                                                                   నాథు చేన్?
2.
కరాళరాత్రి కాళమా!కరోనమారి రక్కసీ!కాటు వేయకే?ఘాతుకంబునన్!
విరించి సృష్ఠి మాపగా!విరోధి మానసంబునన్!వేట కుక్కవై!భీతిలంగడున్! స్థిరంబు నిల్వ లేవిలన్?చిరాకు పెట్ట కేగుమా?చేటు నొందెదే?శీతవాతతన్?
పురాలు వీడు!చావకన్? పురోగమంబు!లేదులే?పోటు ధాటికిన్!భూత
                                                                                 నాథు చేన్?

1.గర్భగత"-ప్రమాణీద్వయ"-వృత్తములు.
అనుష్టుప్ఛందము.జ,ర,లగ,గణములు.వృ.సం.86.
ప్రసనియమము కలదు.
1.కరోనమారి రక్కసీ!            2.కరాళ రాత్రి కాళమా!
  విరోధి మానసంబునన్!          విరించి సృష్టి మాపగా!
  చిరాకుపెట్ట కేగుమా!             స్థిరంబు నిల్వ లేవిలన్?
  పురోగమంబు!లేదులే?           పురాలు వీడు! చావకన్?
2.గర్భగత"-వారిద ద్వయ"-వృత్తములు
సుప్రతిష్ఠాఛందము.ర.లగ.గణములు.వృ.సం.11.
ప్రాసనియమము కలదు.
1.కాటు వేయకే?              2.ఘాతుకంబునన్!
   వేట కుక్కవై!                    భీతిలం గడున్!
   చేటు నొందెదే?                శీత వాతతన్!
   పోటు ధాటికిన్!              భూత నాథు చేన్?
3.గర్భగత"-యతిర్నవ పంచఛామర ద్వయ"-వృత్తములు.
అష్టీఛందము.జ.ర.జ.ర.జ.గ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాస నియమము కలదు.వృ.సం.
1.కరోనమారి రక్కసీ!కరాళ రాత్రి కాళమా!
   విరోధి మానసంబునన్!విరించి సృష్ఠి మాపగా!
  చిరాకు పెట్ట కేగుమా!స్థిరంబు నిల్వ లేవిలన్?
  పురోగమంబు!లేదులే?పురాలు వీడు!చావకన్?
2.కరాళ రాత్రి కాళమా!కరోన మారి రక్కసీ!
   విరించి సృష్ఠి మాపగా!విరోధి మానసంబునన్!
   స్థిరంబు నిల్వ లేవిలన్?చిరాకు పెట్ట కేగుమా?
   పురాలు వీడు! చావకన్?పురోగమంబు!లేదులే?
4.గర్భగత"-కాటేయు ద్వయ"-వృత్తములు.
   పంక్తిఛందము.ర.య.జ.గ.గణములు.యతి.6.వ.యక్షరము
ప్రాసనియమము కలదు.వృ.సం.
1.కాటు వేయకే?ఘాతుకంబునన్?
   వేట కుక్కవై! భీతిలం గడున్?
   చేటు నొందెదే?శీత వాతతన్!
  పోటు ధాటికిన్?భూత నాథు చేన్?
2.ఘాతుకంబునన్?కాటు వేయకే?
   భీతిలం గడున్?వేట కుక్కవై!
   శీత వాతతన్!చేటు నొందెదే?
  భూత నాథుచేన్? పోటు ధాటికిన్?
5.గర్భగత"-కాటువేయు ద్వయ"-వృత్తములు.
ప్రకృతిఛందము.జ.ర.జ.ర.జ.త.ర.గణములు.యతులు.9,17.
ప్రాసనియమము కలదు.వృ.సం.
1.కరోనమారి రక్కసీ!కరాళ రాత్రి కాళమా!కాటు వేయకే?
  విరోధి మానసంబునన్!విరించి సృష్ఠి మాపగా!వేటకుక్కవై!
  చిరాకుపెట్ట కేగుమా!స్థిరంబు నిల్వ లేవిలన్?చేటు నొందెదే?
  పురోగమంబు!లేదులే?పురాలు వీడు!చావకన్!పోటు ధాటికిన్?
2కరాళ రాత్రి కాళమా!కరోనమారి రక్కసీ!కాటు వేయకే?
  విరించి సృష్ఠి మాపగా!విరోధి మానసంబునన్?వేటకుక్కవై!
  స్థిరంబు నిల్వ లేవిలన్?చిరాకు పెట్ట కేగుమా!చేటు నొందెదే?
  పురాలు వీడు! చావకన్?పురోగమంబు!లేదులే?పోటు ధాటికిన్!
6.గర్భగత"-కాళికా"-వృత్తము.
అతిజగతిఛందము.జ.ర.య.జ.గ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కరాళ రాత్రి కాళమా!కాటు వేయకే?
విరించి సృష్ఠి మాపగా వేట కుక్కవై!
స్థిరంబు నిల్వ లేవిలన్?చేటు నొందెదే?
పురాలు వీడు!చావకన్?పోటు ధాటికిన్?
7.గర్భగత"-వేటజాగిల"-వృత్తము.
ధృతిఛందము.జ,ర.య.జ.త.ర.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కరాళరాత్రి కాళమా!కాటు వేయకే?ఘాతుకంబునన్!
విరించి సృష్ఠి మాపగా!వేట కుక్కవై!భీతిలం గడున్?
స్థిరంబు నిల్వ లేవిలన్?చేటు నొందెదే?శీత వాతతన్?
పురాలు వీడు!చావకన్?పోటు ధాటికిన్!భూతనాథు చేన్?
8.గర్భగత"-చరయాజిరా"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.ర.య.జ.త.ర.జ.ర.లగ.గణములు.యతులు.
9,14,19, ప్రాసనియమము కలదు.వృ.సం.
కరాళరాత్రి కాళమా!కాటువేయకే?ఘాతుకంబునన్?కరోనమారి రక్కసీ!
విరించి సృష్ఠి మాపగా!వేట కుక్కవై!భీతిలంగడున్?విరోధి మానసంబునన్?
స్థిరంబు నిల్వ లేవిలన్?చేటు నొందెదే?శీతవాతతన్?చిరాకు పెట్ట కేగుమా!
పురాలు వీడు!చావకన్?పోటు ధాటికిన్!భూత నాథు చేన్?పురోగమంబు
                                                                                          లేదులే?
9.గర్భగత"చేటిలు "'-ద్వయ వృత్తములు.
ధృతిఛందము.ర.య.జ.ర.జ.ర.గణములు.యతి.11.వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
1.కాటు వేయకే?ఘాతుకంబునన్!కరోన మారి రక్కసీ!
   వేట కుక్కవై!భీతిలంగడున్? విరోధి మానసంబునన్?
   చేటు నొందెదే?శీత వాతతన్?చిరాకు పెట్ట కేగుమా!
   పోటు ధాటికిన్!భూత నాథు చేన్?పురోగమంబు లేదులే?
2.ఘాతుకంబునన్?కాటు వేయకే?కరోనమారి రక్కసీ!
  భీతిలం గడున్?వేట కుక్కవై!విరించి సృష్ఠి మాపగా!
  శీత వాతతన్?చేటు నొందెదే?స్థిరంబు నిల్వ లేవిలన్?
  భూత నాథు చేన్?పోటు ధాటికిన్!పురోగమంబు!లేదులే?
10,గర్భగత"-రయంచర"-ద్వయ వృత్తములు.
ఉత్కృతిఛందము.ర.య.జ.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.6,11,19,
ప్రాసనియమము కలదు.వృ.సం.
1.
ఘాతుకంబునన్?కాటు వేయకే?కరాళ రాత్రి కాళమా!కరోన మారి రక్కసీ!
భీతిలం గడున్?వేట కుక్కవై!విరించి సృష్ఠి మాపగా!విరోధి మానసంబునన్!
శీత వాతతన్? చేటు నొందెదే?స్థిరంబు నిల్వ లేవిలన్?చిరాకు పెట్ట కేగుమా!
భూత నాథు చేన్?పోటుధాటికిన్!పురాలు వీడు! చావకన్?పురోగమంబు
                                                                                           లేదులే?
2.
కాటు వేయకే?ఘాతుకంబునన్?కరోనమారి రక్కసీ!కరాళ రాత్రి కాళమా!
వేట కుక్కవై!భీతిలం గడున్?విరోధి మానసంబునన్!విరించి సృష్ఠి మాపగా!
చేటు నొందెదే?శీత వాతతన్?చిరాకు పెట్ట కేగుమా!స్థిరంబునిల్వ లేవిలన్?
పోటు ధాటికిన్!భూతనాథు చేన్?పురోగమంబు!లేదులే?పురాలు వీడు!
                                                                                చావకన్?
11.గర్భగత"-కరాళినీద్వయ"-వృత్తములు.
అతిజగతీఛందము.ర.జ.ర.జ.గ.గణములు.యతి.6.వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
1.ఘాతుకంబునన్?కరోనమారి రక్కసీ!
   భీతిలం గడున్?విరోధి మానసంబునన్!
   శీత వాతతన్?చిరాకు పెట్ట కేగుమా!
   భూతనాథు చేన్!పురోగమంబు!లేదులే?
2. కాటు వేయకే?కరోనమారి రక్కసీ!
    వేట కుక్కవై!విరోధి మానసంబునన్!
    చేటు నొందెదే?స్థిరంబు నిల్వ లేవిలన్?
   పోటు ధాటికిన్!పురాలు వీడు! చావకన్?
12.గర్భగత"-ఘాతుక ద్వయ"-వృత్తములు.
ప్రకృతిఛందము.ర.జ.ర.జ.ర.జ.ర.గణములు.యతులు.6,14.
ప్రాసనియమము కలదు.వృ.సం.
1.ఘాతుకంబునన్?కరోనమారి రక్కసీ!కారాళ రాత్రి కాళమా!
   భీతిలం గడున్?విరోధి మానసంబునన్!విరించి సృష్ఠి మాపగా!
  శీత వాతతన్?చిరాకు పెట్టకేగుమా!స్థిరంబు నిల్వ లేవిలన్?
  భూతనాథు చేన్?పురోగమంబు!లేదులే?పురాలు వీడు! చావకన్?
2.కాటు వేయకే?కరాళ రాత్రి కాళమా!కరోనమారి రక్కసీ!
   వేట కుక్కవై!విరించి సృష్ఠి మాపగా!విరోధి మానసంబునన్!
   చేటు నొందెదే?స్థిరంబు నిల్వ లేవిలన్?చిరాకుపెట్ట కేగుమా!
  పోటు ధాటికిన్!పురాలు వీడు!చావకన్?పురోగమంబు!లేదులే?
13.గర్భగత"-రాజినా"-ద్వయ వృత్తములు.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.ర.జ.ర.ర.లగ.గణములు.యతులు.6,14,22.
ప్రాసనియమము కలదు.వృ.సం.
1.
కాటు వేయకే?కరోనమారి రక్కసీ!కరాళ రాత్రి కాళమా!ఘాతుకంబునన్?
వేట కుక్కవై!విరోధి మానసంబునన్!విరించి సృష్ఠి మాపగా!భీతిలం గడున్?
చేటు నొందెదే?చిరాకు పెట్ట కేగుమా!స్థిరంబు నిల్వ లేవిలన్?శీత వాతతన్?
పోటు ధాటికిన్!పురోగమంబు!లేదులే?పురాలు వీడు!చావకన్?భూత
                                                                                     నాథు చేన్?
2.
కాటు వేయకే?కరాళరాత్రి కాళమా!కరోనమారి రక్కసీ!ఘాతుకంబునన్
వేటకుక్కవై!విరించి సృష్ఠి మాపగా!విరోధి మానసంబునన్!భీతిలంగడున్?
చేటు నొందెదే?స్థిరంబు నిల్వ లేవిలన్?చిరాకు పెట్ట కేగుమా!శీతవాతతన్?
పోటు ధాటికిన్!పురాలు వీడు! చావకన్?పురో గమంబు!లేదులే భూత
                                                                                    నాథుచేన్?
14.గర్భగత"-శీతవాతతా"-వృత్తము.
ప్రకృతిఛందము.ర.జ.ర.జ.ర.జ.ర.గణములు.యతులు6,14,
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాటువేయకే?కరోన మారి రక్కసీ!కరాళ రాత్రి కాళమా!
వేట కుక్కవై!విరోధి మానసంబునన్!విరించి సృష్ఠి మాపగా!
చేటు నొందెదే?చిరాకు పెట్ట కేగుమా!స్థిరంబు నిల్వ లేవిలన్?
పోటుధాటికిన్!పురోగమంబు!లేదులే?పురాలు వీడు! చావకన్?
15.గర్భగత"-రసికా"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.జ.త.ర.గణములు.యతి.13,వ.యక్షరము.
.ప్రాసనియమము కలదు.వృ.సం.
ఘాతుకంబునన్?కరాళ రాత్రి కాళమా!కాటు వేయకే?
భీతిలం గడున్?విరించి సృష్ఠి మాపగా!వేటకుక్కవై!
శీతవాతతన్?స్థిరంబు నిల్వ లేవిలన్?చేటు నొందెదే?
భూత నాథు చేన్?పురాలు వీడు!చావకన్!పోటు ధాటికిన్?
16.గర్భగత"-రయమెంచు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.త.ర.జ.ర.లగ.గణములు.యతులు.6,14,19,
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఘాతుకంబునన్?కరాళ రాత్రి కాళమా!కాటు వేయకే?కరోనమారి రక్కసీ!
భీతిలం గడున్?విరించి సృష్ఠి మాపగా!వేట కుక్కవై!విరోధి మానసంబునన్!
శీతవాతతన్?స్థిరంబు నిల్వ లేవిలన్?చేటు నొందెదే?చిరాకుపెట్ట కేగుమా!
భూతనాథు చేన్?పురాలు వీడు!చావకన్?పోటు ధాటికిన్?పురోగమంబు!
                                                                                         లేదులే?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్. 

17, జులై 2020, శుక్రవారం

సమస్యాపృచ్ఛక చక్రవర్తి శ్రీ కంది శంకరయ్య మహోదయుల సప్తతి

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! నేడు సమస్యాపృచ్ఛక చక్రవర్తి శ్రీ కంది శంకరయ్య మహోదయుల సప్తతి సందర్భముగా వీరి  అభిమానులమైన మనందరి తరపున జరిగిన సత్కార కార్యక్రమము తిలకించండి.
ఈ కార్యక్రమమును తన భుజస్కంధములపై వేసుకొని నిర్వహించిన శ్రీ అవుశుల భానుప్రకాశ్ గారిని మనసారా అభినందిస్తున్నాను.
 జైహింద్.

సందేశ సంహిత...డా.ధూళిపాళ మహదేవమణి.

0 comments

జైశ్రీరామ్.
సందేశ సంహిత...డా.ధూళిపాళ మహదేవమణి.
మంచిని తెలియ చెప్పడమే సందేశమంటే. ఆ మంచి ఏమిటనేదే మనల్నందరినీ ఒక త్రాటిపై నడవనియ్యడం లేదు. మంచి అనేది నిత్యసత్యం కావాలి. ఒకరికి మంచిదై మరొకరికి చెడువస్తే అది సరైన మంచి కాదు. కనుక ప్రతివ్యక్తీ తన ఆలోచనల మేరకు తాను నిర్ణయించినదే, తాను ఆచరించడమే మంచి అనుకోవడం అవివేకమే అవుతుంది. అందరికీ ఒకేలాంటి ఫలితాన్నిస్తూ అమృతమార్గాన్ని చూపించేదే అసలైన మంచి. మన ఆలోచనలన్నీ మృతమార్గంలో ఉండకూడదు. అనగా చనిపోతూ తిరిగి పుడుతూ మళ్లీమళ్లీ చావు బ్రతుకుల చక్రంలో గిర్రున తిరుగుతూ ఉండడం మృతమార్గమే అవుతుంది. అనగా తిరిగి పుట్టించేది మృతమార్గం. పుట్టుక లేకుండా చేసేది అమృతమార్గం. అలాంటి అమృత మార్గాన్ని అందించి ఈ కలియుగానికి ప్రధాన ఆచార్యస్థానం వహించిన వారు శ్రీశంకర భగవత్పాదులు. వారు చాలా చిన్నచిన్న మాటలతో సందేశాల్ని అందించిన మహనీయులు. వారి ఒక ఉపదేశం చూద్దాం.
లబ్ధావిద్యా రాజమాన్యా తతః కిమ్?
ప్రాప్తా సంపత్ ప్రాభవాఢ్యా తతః కిమ్?
భుక్తా నారీ సుందరాంగీ తతః కిమ్?
యేన స్వాత్మా నైవసాక్షాత్కరోభూత్
1. మహారాజులు గౌరవించే గొప్ప విద్యారాశి నీకు లభించింది. అయితే ఏమిటి?
2. అనేక భోగభాగ్యాల్ని అనుభవింప చేసే అఖండమైన ఐశ్వర్యం లభించింది. సరే! తర్వాతేమిటి?
3. త్రిభువన సుందరి వంటి గొప్ప అందకత్తె నీకు వశమై గొప్ప ఆనందాన్ని అనుభవించావు. అయితే ఏమిటి?
ఇవన్నీ మన తాత్కాలిక ఆనందాలు మాత్రమే. ఈ జన్మకు మాత్రమే లభించిన అదృష్టాలు. ఆయువు తీరింది. అప్పుడు కూడా మనకి పై వైభవాలు అనుసరించి వస్తాయా? మరోజన్మలో తిరిగి ఇవి లభిస్తాయని నమ్మకం ఉందా? ఒక రెండుగంటల పాటు సినిమా చూశాం. ఆ సమయం అంతా అది మంచి చిత్రం కావడంతో ఆనంద తన్మయులం అయ్యాం. తిరిగి బైట ప్రపంచంలోకి వచ్చాం. ఆ ఆనందం కొన్నిరోజుల పాటు స్మృతిలో ఉండి తరువాత కనుమరుగు ఐపోతుంది. మన ఈ జీవితమూ అంతే. మన జన్మల సముద్ర జల బిందువుల్లో ఇది ఒక్క బిందువు మాత్రమే. తిరిగి తిరిగి భవదుఃఖాలు అనుభవింపక తప్పదు. ఇదంతా మృతమార్గం. మరి చావులేని మార్గం ఏమిటి?
‘మన ఆత్మను మనం దర్శింప గలగడం.’ ఆ ఆత్మదర్శనం వల్ల ఈ జీవాత్మలన్నీ పరమాత్మ కాంతి కిరణాలే అని తెలుస్తుంది. ఆ ఎరుక కలిగితే ‘అహం బ్రహ్మాస్మి’ నేనే ఆ పరబ్రహ్మను అన్న ప్రజ్ఞానం కలుగుతుంది. దానివల్ల జీవునికి ముక్తస్థితి వస్తుంది. నిత్యవస్తువును తెలుసుకొన్న బ్రహ్మానంద స్థితి కలుగుతుంది. అప్పుడింక ముక్తితో నిత్యసత్యమైన, అమరమైన అఖండానంద బ్రహ్మంలో లీనమౌతాం. దానికోసం ఈ జన్మలో కనీసం ఒక్క అడుగు పడినా చాలు. అదే తరువాత జన్మలకీ మూలమై క్రమంగా మోక్షం అనే అమృతస్థితి వస్తుంది. కనుక ఎంత ప్రాభవాన్ని ఈ జన్మలో మనం పొందగలిగినా ఎవరైతే ఆత్మసాక్షాత్కారం పొందలేరో... అప్పుడివన్నీ నిష్ప్రయోజనాలే అంటున్నారు ఆచార్య శంకరులు. ఇది మన జీవనసాఫల్య సూత్రాల్లో ప్రధానమైన మొదటి సూత్రం.

"ఆచార్య శంకరుల"శ్లోకానికి
వ్యాఖ్యానం
స్వస్తి
ధూళిపాళ మహాదేవమణి.
జైహింద్.

16, జులై 2020, గురువారం

నీతినడుమా"-శీర్షికన"----చతుర్వింశతి"- రత్న మాలికా రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్
నీతినడుమా"-శీర్షికన"----చతుర్వింశతి"- రత్న మాలికా 
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
                         
1. రజినీకరప్రియ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
.ప్రాసనియమము కలదు.వృ.సం.
నింగి నేల లక్ష్య పెట్టకన్!నీతి నాతి మూతి మూయుచున్!
పంగ నామ ధోరణిం జనన్!పాతి పెట్టి సామ్య వాదమున్!
మంగళంబు జాతి నంటగన్?మాత ఖ్యాతి మట్టు పెట్టుచున్!
గంగ మాంబ వల్లభా! హరా! ఘాతు కాళి చూచు చుంటివే?
2.రజినీకర ప్రియవృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
రౌతు బట్టి గుఱ్ఱమో!యనన్?వ్రాత బట్టి జీవ మొప్పదే?
పాత నీతి గాన దాయెనే?వాత రోగ మావరించె నే?
నీతి నిండు భక్తి గావలెన్?నీ తపంబు మెచ్చుకో లవన్?
శీత, వాత ధాత్రి నిత్యమై!చేతలందు నిండు మేలునన్!
3.చూడరయా"-వృత్తము.
కృతిఛందము.భ.స.జ.త.స.ర.లగ.యతి.11,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పాడు తలపు టూహ గాములై!వాడి వేడి దూషితంబులన్!
నీడ నెడము జేసి మాపగా?నీడ వీవె?కావు దైవమా!
గాడి విడిచె స్వార్థ చింతనన్!కాడి వీడ పంట పండునే?
చూడ మరచి నాడవా!శివా!చూడు ధాత్రి  శాంతి నిండవన్?
4.పురోగమా"-వృత్తము.
అతిధృతి ఛందము.జ.త.ర.జ.ర.జ.గ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పరాన్నభు గ్జీవితంబులన్!పరోపకార బుద్ధి లేదయెన్?
పరార్థమే!గాన రాదయెన్?వరాశ కంతు కానదాయెనే!
స్థిరంబు లేదాయె!మాటకున్!చిరాకు నొందవేల?శూలివై!
పురోగమం బేది?చూడగన్!పురాంతకా!జపంబు జేతు నిన్!
5.నిరోధినీ"-వృత్తము.
అతి ధృతి ఛందము.జ.ర.జ.భ.స.జ.గ.గణములు.యతి.11.వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కరోన'-నైన లెక్క జేయకన్?కలిసి జీవించు తీరయెన్?
దురాశ పాశ బద్ధ మాయెనే!తులకు రానట్టి చర్యలన్!
నిరోధ మాప శక్తి జాలకన్?నెలకొనెన్!ధైర్యమింతయే?
సురాధినాథ చూడు చర్యలన్!సులభమా!జీవితంబులున్?
6.మాయవీడు"-వృత్తము.
అతిధృతి ఛందము.ర.జ.ర.న.ర.జ.గ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తల్లి'దండ్రి, దైవ భక్తియే?ధరను బ్రోచు నీతి మార్గతన్!
చెల్లు లోక తీరు నైజమై!చెరిగి పోదు ఖ్యాత దెన్నడున్?
మెల్లనైన మాట తీరునన్?మెరసిపోవు జన్మ కాంతినిన్?
కల్లబొల్లి మాయ వీడుచో?కరము నీతి నిల్చు ధాత్రినిన్!
7.తాడినీ"-వృత్తము.
అతిధృతిఛందము.ర.న.జ.త.ర.జ.గ.గణములు.యతి.11.వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పాడు బుద్ధి విడిచి యొప్పుమా!భావ పూర్ణ తేజ మందుమా!
చూడు సాటి జనుల దైవమున్!సూవె నీవు జ్యోతి లోకమున్!
మాడ మేడ లనకు స్వార్థతన్!మా'-విశేష కీర్తి వాటిలున్!
తాడి నీడ తులవు గాకుమా?తావకంబు నెంచు సర్వదా!
8.నీతదే?"-వృత్తము.
ధృతిఛందము.న.న.భ.భ.జ.ర.గణములు.యతి.11.వ.యక్షరము.
గరికె తినెడి గాడిదయే?కనులు మూయు నేస్తమా!
గరికె మొలచు చావదులే?కనుము నీత దేనురా?
పిరికి! జనుడు భూతలిన్?వినును శూన్య చేతనన్!
పెరక వలదు నీతి నిలన్?పెనుగులాడి దోషివై!
9.నిల్వని"-వృత్తము.
కృతిఛందము.ర.స.జ.భ.న.స.లగ,గణములు.యతి.11.వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చావు పుట్టుక లిక్క డేను లే!సమత మమతలు పెంచుమా!
నీవు నీవుగ!నిల్వ లేకనే? నిమిరి కులమను మాటలన్!
చావు దెబ్బను తీతు వేలన్?శమము గనకను ద్వేషతన్!
బావు కొందువె?జీవితాంతమ్!భములు కలుగును తధ్యమున్!
10,రోధ ఘోషణా"-వృత్తము.
ప్రకృతిఛందము.స.స.జ.భ.న.జ.ర.గణములు.యతి.11.వయక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చెడు కర్మలు కోరి జేయుచున్!చెడును కలికి'-నంట జేతువా!
విడ నేరని స్వార్థ చింతనన్?విడువ బడని స్వా పరంబులన్!
దడ గల్గెను మాత గుండెలున్!తడిసె నెడద నశ్రు ధారలన్!
విడునే?గ్రహణంబు!యోచిలన్!పిడికిలి బిగియించు దైవమా!
11.తిలకమా"-వృత్తము.
అతిజగతీ ఛందము.ర.జ.న.త.గ.గణములు.యతి.7,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఉన్న మాటలాడ ఉలికి పాటేలనో?
తిన్నదింక చాలు! తిలకమై నిల్వుమా!
మన్ననంబు నొంద మలుచుకో!లోకమున్!
చెన్ను నొందు మయ్య!చెలిమినిం!దేశమున్!
12.రజినీకరప్రియ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తోలు బొమ్మలాట జీవితమ్!తూలిపోకు నిచ్ఛ మీరగన్
మేలుకొల్పు మానవాళినిన్!మేలనంగ?జాతి మెచ్చగన్!
నీలి మబ్బు వాన తీరునన్!నేల పాడి పంట లొప్పగన్!
జాల మేలు తెల్వి తేటలన్?చాలు నింక వక్ర భాషణల్!
13.యతిర్నవ సుగంథి"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కర్మజీవి మానవుండు!కర్మ మాను చర్య దోషమౌ?
ధర్మ మేది?రూకలీయ!తర్మివేయు!నీతి చేతనన్!
దుర్మదంబు పెచ్చు పెర్గు!తుర్మి వేయుశక్తి యుక్తులన్!
వర్మణీయ మౌను బుద్ధి!పర్ము దుర్బలంబు నిండునన్!

వర్ణీయమౌను బుద్ధి=బుద్ధియనుదానిని కదలనీయని కవచమౌను,

14.సంఘీభావ వృత్తము.
కృతిఛందము.న.ర.జ.త.న.ర.లగ.గణములు.యతి.11,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సమ సమాజ స్థాపనమ్ము నన్!చక్క బరచు లోక కీర్తినిన్!
భముల నొందు వారి కావుమీ!బక్క జనుల బాగు చూడుమా!
నిముర బోకు?పాపి మూకలన్!నిక్క మిలను నీతి నిల్పుమా!
తమము వీడి!శాంతి నాశిలన్?దక్కు పరమభోగ భాగ్యముల్!
15.సౌహార్ధతా"-వృత్తము.
కృతిఛందము.న.భ.భ.య.జ.జ.గగ.గణములు.యతి.12.వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కలిని'-కర్ములు కర్త లవగా!గౌరవం బది?కుంఠి దాయెన్?
నిలువ దాయెను నీతి జగతిన్!నీరు గారెను ధర్మ మార్గమ్!
తులువ చైదపు చేష్ట లలమెన్!దూర మాయెను భక్తి తత్వమ్!
చెలువ మేదియు?గాన దాయెన్!చీరె సఖ్యత!కల్మి దంష్ట్రల్!
16.ఆరనీకుమా"-వృత్తము.
అతిధృతి ఛందము.భ.న.ర.త.భ.ర.గ.గణములు.యతి.11.వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కర్తలకు భువి కర్మ పట్టెన్!కారణం బది!దోష చర్యే?
వర్తిలెను కలి ధర్మ మింతే?వారణంబును జేయ నౌనే?
భర్తలను!భ్రమ దేల్చి రింతే!భార మాయెను జీవ భ్రాంతుల్!
యార్తి జనులను బ్రోవ రండీ!ఆరనీకుడి?పూజ్య భావమ్!
భర్తలను=పతులను,ఏలికలను,

17.భేదిల్లు"-వృత్తము.
అతిధృతి ఛందము.ర.స.జ.జ.భ.ర.గ.గణములు.యతి.11.వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నాది నాదను మాట!స్వార్థము! నాదనే దిల లేనె లేదే?
మాది మాదని మాతృ శోభను!మాధవుం డిల మెచ్చి తీరున్!
బీద సాదల నుద్ధ రించిన! భేదిలం బడ దెంచ?ధర్మమ్!
వాదనంబులు కట్టి పెట్టుడి!పాదులై భువి కీర్తి నిల్పన్?
18.ధీరవాచా"-వృత్తము.
కృతిఛందము.ర.స.య.న.భ.న.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తీరు లేక?న యాచితంబుల్!తినుట పాపము తెలిసి కొమ్మా!
కోరి స్వార్ధపు పంపకంబౌ?కొనుట దోషము పురుష సింహా!
నీఱు జేయకు?నీదు శక్తిన్!నిను యనాధగ దలచు టే లే?
పౌరుషంబున!స్వార్జి తంబే!వనథి ధీరత నిలుపు నీతిన్!
19,జీనివీవ"-వృత్తము.
అతిధృతిఛందము.ర.స.న.త.భ.ర.గ.గణములు.యతి.11.వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
దాన కర్ణులు లేరు?కలిలోన్!దాన మీయగ!పోషిలంగన్!
మేన బ్రాణము దాల్చు దనుకన్?మీన మేషపు లెక్క లేలన్?
చేను మేసెడి కంచె తులనౌ?జీని వౌదువు!నుల్కు లేకన్?
మానుషంబును వీడ?దొసగౌ!మానుకొమ్మిక!యాచ నంబున్?

అర్థములు:-
జీనివౌదువు=ఉలుకు పలుకు లేని బొమ్మ(శిల),దొసగౌ=తప్పు అగును.

20,రసయాద్వయ"-వృత్తము.
ధృతిఛందము.ర.స.య.ర.స.య.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
బీద యెవ్వడు?లోకమందున్?భేద భావమె?కూర్చె ముష్టిన్?
చీదరించకు?సాటి వారిన్?చేదు తీపగు?పెంచు మంచిన్?
క్రోధ ద్వేషము లేల?జీవా!క్రోధిలం గడు నైచ్య మేలే?
మోదమందుము!సామ్య వాదీ!మోదిలందగు?జీవితాంతమ్!
21.బుద్ధ్యాత్మనా"-వృత్తము.
కృతిఛందము.న.ర.జ.త.భ.స.లగ.గణములు.యతి.11.వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అరి షడాదు లంట నీకుమా!ఆత్మ,బుద్ధి వశము జేయుచున్?
పరమ నిష్ఠ కర్మ జేయుమా!వాత శీత వశిత జీవితమ్!
చిరము దాటు యోగ నిష్ట చేన్!చిన్మయంపు సొబగు గూర్చుమా!
వర మయూఖ కాంతి భాసిలన్?భావ జారి సుర వరాముడా!
22.సౌందర్యమ"-వృత్తము.
ధృతిఛందము.భ.భ.ర.భ.త.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అన్నుల మిన్నీవు దైవమా!అన్నిట నీవుందు వందురే?
కన్నుల నీ రూపు గాంచగా!కానవే మయ్య?శ్రీ హరీ!
చెన్నగు సౌందర్య రూపమా!చిన్ని కృష్ణుండ వేవెగా!
దన్ను నా కీవె! నమ్ముమా!దండములం గొంచు గావుమా!
23.వెసగొను"-వృత్తము.
కృతిఛందము.న.న.ర.జ.ర.ర.లగ.గణములు.యతి.12,వ.యక్షరము.
ప్రాసనియమభు కలదు.వృ.సం.
దొసగు పొసగు కర్మ జీవులన్?దురాశ!తార స్థాయి జేర్తువే!
విసుగు కనవు దోష చర్యలన్!వినాశ మెంచ తొంద రొందవే?
వెసను గొనెదు స్థాయి మీరినన్!బిరాన గూల్తు విశ్వ రక్షకా!
వశివి యగుదు!భక్త యోగికిన్!విశేష శక్తి!లీన మేర్తువే?
24.నయాకర"-వృత్తము.
అతిధృతిఛందము,న.న.ర.న.య.జ.గ.గణములు.యతి.11.వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సచివులు సలహాలు మాని!స్వయముగా! రాజ్య మేలగన్?
వచితములకు లోటు రాదు!పయనమే రీతి?నేగునో?
సచరితము కనంగ నౌనొ?సు యశమో?వేచి చూడుడీ!
పచనము రుచి దైవమెంచు!భయపడం!లాభ మౌ నొకో?

స్వస్తి
మూర్తి.జుత్తాడ.
జైహింద్

15, జులై 2020, బుధవారం

వ్యాకరణ పఠనావశ్యకత....శ్రీ ధూళిపాళ మహదేవమణి

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

14, జులై 2020, మంగళవారం

సమస్యా పూరణ, వర్ణన, నిర్వహణ...భక్తిసాధనమ్.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

12, జులై 2020, ఆదివారం

శ్రీమతి నేదునూరి రాజేశ్వరి అక్కయ్య, న్యూజెర్సీ మనకిక లేరు.

1 comments

 నమశ్శివాయ,
ఆర్యులారా! ఒక అప్రియమగు వార్త తెలియఁ జేయుటకు బాధగా ఉంది.
మన అక్కయ్య 

శ్రీమతి నేదునూరి రాజేశ్వరి న్యూజెర్సీలో నిన్నను శివైక్యం చెందేరు.
దివంగత అక్కయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియఁ జేయుచున్నాను.
శివశివా.
ఓం శాంతిః శాతిః శాంతిః

కర్తృ కావ్య నామగోపన రథబంధ చిత్రము ... శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారు

1 comments

                                       జైశ్రీరామ్. 
కవి, కావ్య నామగోపన రథబంధ చిత్రము
శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారి ‘చిత్రభారతము’ కావ్యం 
భీష్మపర్వము నుంచి
సీ.  శ్రీకుముద సువీర శిశిరామరాళీశ
శుచి శుభేక్షణ ధన్వి సుభుజ సుఖద
సుందర కుందర కుందారవిందాక్ష
రుచిరాంగద ముకుంద శుచి శమ శివ
యమ యజ్ఞభృదతీంద్రియాశోకకపికపీం
ద్ర కపిలకరణ కవి కథితకృతి
రోచిష్ణు విష్ణు విరోచనేజ్యపవిత్ర
పరమేశ పరమేష్ఠి భావ భయహ
గీ.  వేద సర్వప్రహరణాయుధాది రుచిర
నామజపపరాయణుల పుణ్యంబు నెంత
యనుచు వర్ణింపనోతు; మహాత్ముఁ డా కృ
తాత్ము దయఁగల్గు శోకరతాత్మసుకృతి.
                   
                                               జైహింద్.

11, జులై 2020, శనివారం

నవవిధ భక్తులు..డా.దోర్బల ప్రభాకరశర్మ గారు....భక్తిసాధనమ్ నిర్వహణలో.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

10, జులై 2020, శుక్రవారం

అంతర్జాల అవధాన ప్రక్రియలలో వర్ణనాంశము.... భక్తిసాధనమ్ నిర్వహణలో.

0 comments

9, జులై 2020, గురువారం

భక్తి సాధనమ్ లో అవధానత్రయముచే అష్టావధానము.

0 comments

జైశ్రీరమ్
జైహింద్.

8, జులై 2020, బుధవారం

శ్రీ లోకా జగన్నాథ శాస్త్రిగారి అంతర్జాల అవధానమ్....భక్తిసాధనంలో.

0 comments

 జైశ్రీరామ్.
 జైహింద్.

7, జులై 2020, మంగళవారం

శ్రీవిశాఖ పట్నము(జిల్లా),చోడవరము(మం).జుత్తాడ గ్రామ విశిష్టత,రచన:-శ్రీ వల్లభవఝల శ్రీరామ చంద్ర మూర్తి.

0 comments

జైశ్రీరామ్.
శ్రీవిశాఖ పట్నము(జిల్లా),చోడవరము(మం).జుత్తాడ గ్రామ మందలి అతిపురాతన శ్రీ,శ్రీ,శ్రీ,ఉమా మల్లేశ్వర స్వామి                 వారి,ఆలయ,గ్రామముయొక్కవిశిష్టత,రచన:-వల్లభవఝల శ్రీరామ చంద్ర మూర్తి.  చోడవరము..                         

1.తే.గీ:-మల్లి నాథుని సేవించి మహిమ లలర
శారదా నది కంఠహారమై సరగె పురిని
ప్రజకు భగవంతు సేవించు భాగ్య మమరె
అరయ జుత్తాడ భువి యందు నపర కాశి!
2.తే.గీ:-దవళ లింగంబు బ్రహ్మ సూత్రంబు దనరె
కొంగు బంగార మౌచును కోర్కె దీర్చు
అమ్మ ఉమ తోడ వెల్గొంది యార్త జనుల
కాచి రక్షించు మల్లేశు కరుణ నెపుడు!
3.తే.గీ:-పట్టమాంబిక పట్టుగ ప్రజల నెల్ల
సర్వ శోభల పుర మెల్లచక్క గాచి
కరువు కాటక మిచ్చట కనగ నీక
పసిడి పంటల శోభల వరల గాచు!
4.తే.గీ;-సిరి వరామ విశాఖ నా జిల్ల యందు
చోడవర దరి జుత్తాడ శుభగ సీమ
శివుడు,కేశవు లిరువురు సిరులు పంచ
భూతలపు స్వర్గ!కైలాశ భ్రాంతి గొల్పె!
5.తే.గీ:-బ్రహ్మ సూత్రము వెలిగెడు భాను తేజ
మూడు నామాలు నిలువుగ మురిపె మొలుక!
బ్రహ్మ చారిక లున్నట్టి పావన హర
ముగ్ధ మోహన మమ్మేలు మోహనాంగ!
6.తే,గీ:-వక్ర తుండుడు వెలసెను వరదు డగుచు
తొమ్మి దడుగులు!తోరపు టుదర మమర
మంద హాసము చిందించి మముల గావ
మహిత భక్తిని పూజించు భాగ్య మమరె!
7తే.గీ:-సఖులు శ్రీదేవి భుదేవి సహితుడగుచు
ఏక శిలపైన వెలసిన !వేంకటేశు
దేవళమ్మును నిర్మించె దివిజ వరులు
భక్త జనులను బ్రోవంగ వసుథ యందు!
8.ఆ.వె:-భువిని పుట్టు జనులు పుణ్యంబు నందగ
ఇటను అటను తిరుగ నేమి ఫలము?
ఒక్కసారి దీని చక్కగ గాంచిన
పుణ్యగతులు కలుగు పూర్ణ ముగను!
9.తే.గీ:-మత్స్య వంశీయు లేలిన మాన్య సీమ
చిహ్న ములు దేవళంబుల చెక్కి నారు
అట్టి ఱుత్తాడ జుత్తాడ యనిరి నేడు
భక్తి కీర్తంప మోక్షంబు  బరగు నిజము!

స్వస్తి
శ్రీరామచంద్ర మూర్తి.
చోడవరము.
జైహింద్.

6, జులై 2020, సోమవారం

మత్తరజినీద్వయ,మృదు మానస,రజోరజా"-ఖ్యాతిచీలు ద్వయ,సయోజనాద్వయ,రజినీకరప్రియ,కోటులంటు,గర్భ"-రసాస్వాదయా వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

 జైశ్రీరామ్.
మత్తరజినీద్వయ,మృదు మానస,రజోరజా"-ఖ్యాతిచీలు ద్వయ,సయోజనాద్వయ,రజినీకరప్రియ,కోటులంటు,గర్భ"-రసాస్వాదయా వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
                           

"-రసాస్వాదయా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.స.య.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
గూడువీడ కుక్కచావగున్!కూలెదీవు కరోనచే!కోటులంటు మారణంబులున్!
నేడు కన్న దౌనె?రేపటన్!నేల బీద రికంబగున్!నేటి కైన మెల్గు మంచిగాన్!
చీడ పీడలందు!లోకమున్!చీలు ఖ్యాతి పురోగతుల్!చేటుకోర రాదదెన్నడున్!
పోడిమంబు మాయు ధాత్రినిన్!బోలెచేరు కరంబులన్!పోటరీవు గావు  జబ్బుకున్!
                                                                                 
1.గర్భగత"-మత్తరజినీద్వయ"-వృత్తములు.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ,సం.171.
ప్రాసనియమము కలదు.
గూడు వీడ కుక్క చావగున్!             కోటులంటు మారణంబులున్!
నేడు కన్నదౌనె?రేపటన్!                  నేటి కైన మెల్గు మంచిగాన్!
చీడ పీడ లందు లోకమున్!             చేటు కోర రా దదెన్నడున్?
పోడిమంబు మాయు ధాత్రినిన్!       పోట రీవు గావు జబ్బుకున్!
2.గర్భగత"-మృదుమానస"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.స.లగ.గణములు.వృ.సం.91.
ప్రాసనియమము కలదు.
కూలెదీవు!కరోన చే!
నేల బీదరికంబగున్?
చీలు ఖ్యాతి పురోగతుల్!
బోలె చేరు కరంబులన్!
3.గర్భగత"-రజోరజా"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.జ.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
గూడు వీడ కుక్క చావగున్!కూలె దివు కరోన చే!
నేడు కన్నదౌనె?రేపటన్!నేల బీదరికంబగున్?
చీడ పీడ లందు లోకమున్!చీలు ఖ్యాతి పురోగతుల్?
పోడిమంబు మాయు ధాత్రినిన్!బోలె చేరు కరంబులన్!
4.గర్భగత"-ఖ్యాతిచీలు ద్వయ"-వృత్తములు.
అత్యష్టీఛందము.ర.స.య.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కూలె దీవు కరోన చే!కోటులంటు మారణంబులున్!
నేల బీదరికం బగున్?నేటికైన మెల్గు మంచిగాన్!
చీలు ఖ్యాతి పురోగతుల్!చేటు కోర రాదదెన్నడున్?
బోలె చేరు కరంబులున్!పోటరీవు గావు జబ్బుకున్!

కూలె దీవు కరోన చే!గూడు వీడ కుక్క చావగున్?
నేల బీద రికంబగున్?నేడు కన్న దౌనె?రేపటన్!
చీలు ఖ్యాతి పురోగతుల్?చీడ పీడ లందు లోకమున్!
బోలె చేరు కరంబులన్!పోడిమంబు మాయు ధాత్రినిన్!
5.గర్భగత"-సయోజనాద్వయ"-వృత్తములు.
ఉత్కృతిఛందము.ర.స.య.జ.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కూలెదీవు కరోనచే!కోటులంటు మారణంబులున్!గూడువీడ కుక్క చావగున్!
నేల బీద రికంబగున్?నేటికైన మెల్గు మంచిగాన్?నేడు కన్నదౌనె?రేపటన్?
చీలు ఖ్యాతి పురోగతుల్!చేటుకోర రాదదెన్నడున్?చీడపీడలందు లోకమున్!
బోలె చేరు కరంబులన్!పోటరీవు గావు జబ్బుకున్!పోడిమంబు మాయు ధాత్రినిన్!
                                                                                   

కూలెదీవు కరోనచే!గూడువీడ కుక్కచావగున్?కోటులంటుమారణంబులున్?
నేల బీద రికంబగున్?నేడు కన్న దౌనె?రేపటన్!నేటి కైన మెల్గు మంచిగాన్!
చీలు ఖ్యాతి పురోగతుల్?చీడపీడలందు లోకమున్!చేటు కోరరాదదెన్నడున్?
బోలె చేరు కరంబులన్!పోడి మంబు మాయు ధాత్రినిన్!పోట రీవు గావు జబ్బుకున్?
                                                                                 
6.గర్భగత"-రజినీకరప్రియ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కోటు లంటు మారణంబులున్?గూడు వీడ కుక్క చావగున్!
నేటి కైన మెల్గు మంచిగాన్!నేడు కన్న దౌనె?రేపటన్!
చేటు కోర రాదదెన్నడున్?చీడ పీడ లందు లోకమున్!
పోటరీవు గావు జబ్బుకున్?పోడిమంబు మాయు ధాత్రినిన్?
7.గర్భగత"-కోటులంటు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.ర.స.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కోటులంటు మారణంబులున్?గూడువీడ కుక్కచావగున్?కూలెదీవు కరోనచే!
నేటికైన మెల్గు మంచి గాన్!నేడు కన్న దౌనె?రేపటన్! నేల బీద రికంబగున్?
చేటుకోర రాదదెన్నడున్?చీడ పీడలందు లోకమున్!చీల ఖ్యాతి పురోగతుల్!
పోటరీవు గావు!జబ్బుకున్?పోడియంబు మాయు ధాత్రినిన్?బోలె చేరు కరంబులన్!

స్వస్తి
మూర్తి.జుత్తాడ.
 జైహింద్.

5, జులై 2020, ఆదివారం

వందే గురు పరంపరామ్.

0 comments

  జైశ్రీరామ్.
అల సదాశివుమదిలోననరసి కొలుతు
 వ్యాసభగవానునెన్నుదు వరలఁ జేయ
శంకరున్ మది కొలుతు శుభంకరముగ
నేటి గురువులఁ ధ్యానింతునిండు మదిని.
ఆర్యులారా! నేడు గురుపూర్ణిమ. మానవ జన్మకు సార్థకత కలిగే విధంగా సన్మార్గదర్శులైన గురువులు వ్యాసాది మహర్షులతోపాటు గౌరవింపబడే రోజు. ఈ సందర్భముగా మీకందరికీ శుభాకాంక్షలు.
ఏ సద్బోధనచే గురూత్తములు తా మీశానుఁ జూపింతురో
యా సద్బోధనె యా గురూత్తములనే యీశానుఁ జేయుగా.
ధ్యాసన్విద్యను నేర్చుచున్ గురువులన్ద్యానించువారిద్ధరన్
మోసంబీ జగమంచెఱింగినిజమౌ ముక్తిన్ గనన్ యోగ్యులౌన్..
సద్గురుదేవులకందరికీ వినమ్ర ప్రణామములు.
జైహింద్.


4, జులై 2020, శనివారం

డా.జీ.యం.రామశర్మ గారి గజేంద్ర మోక్షము ... నిర్వహణ. భక్తిసాధనమ్.

0 comments

 జైశ్రీరామ్.
డా.జీ.యం.రామశర్మ గారి గజేంద్ర మోక్షము 3వభాగము.
 జైహింద్.

3, జులై 2020, శుక్రవారం

శ్రీకృష్ణ లీలలు...శ్రీ లోకా జగన్నాథశాస్త్రి. ప్రవచనము...నిర్వహణ....భక్తిసాధనమ్.

0 comments

జైశ్రీరమ్.
జైహింద్.

2, జులై 2020, గురువారం

డా.దోర్బల ప్రభాకరశర్మగారిచే వాల్మీకిరామాయణం బాలకాండ ప్రవచనము....నిర్వహణ...భక్తిసాధనమ్.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్

1, జులై 2020, బుధవారం

ామన చరిత్ర ప్రవచనము.శ్రీ గన్నవరపు లలితాదిత్య....నిర్వహణ..భక్తిసాధనమ్

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.