గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2018, గురువారం

నేడు శ్రీ వినాయక చతుర్థి. మీకు నా శుభాకాంక్షలు

 జైశ్రీరామ్.
ఆర్యులారా! శుభోదయమ్.
నేడు శ్రీ వినాయక చతుర్థి. ఈ సందర్భముగా మీకందరికీ ఆ గణనాథుని ఆచల్లని చూపులు లభించి సుఖసంతోషలతో మీరంతా వెలుగొందాలని మనసారా కోరుకొనుచు 
మీకు నా శుభాకాంక్షలు తెలియఁ జేయుచున్నాను.
అశ్వధాటి. శ్రీపార్వతీ తనయ నీ పాద సేవలను దీపించనీ సుజనులన్.
నీ పాదసేవలె మహా పాప నాశకము లీపాటి చేయఁ దగదా?
యే పాపముల్ తెలియ వేపాటివారమయ? నీపాపలైన మములన్
దీపింపఁ జేయుమయ. కోపించకెన్నఁడును.నే పిన్ననయ్య. కనుమా.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మీకు , మామరదలు పిల్లకి, మేకోడలు , మేనల్లుళ్ళకీ , మనవలకి అందరికి వినాయక చవితి శుభాకంక్షలు
" అశ్వధాటి చాలా బాగుంది " [చాలారోజుల తర్వాత అశ్వధాటి కనిపించింది ] ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.