గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, సెప్టెంబర్ 2018, ఆదివారం

సామని,తారాడు,భూధర,త్వగతి,మాయాతి,శ్రీపాలనా,రారయ,రయాతిగ,భ్రాంతిలు,రాయజ,గర్భ"-మాయాతంత్ర"-వృత్తము.రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
సామని,తారాడు,భూధర,త్వగతి,మాయాతి,శ్రీపాలనా,రారయ,రయాతిగ,భ్రాంతిలు,రాయజ,గర్భ"-మాయాతంత్ర"-వృత్తము.రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
               
"-మాయాతంత్ర"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.త.త.త.త.మ.య.య.గగ.గణములు.
యతులు.10,18.ప్రాసనీమముగలదు.
శ్రీపాల!నాపాల!గోపాల!జీవేశ!లోకేశ!శ్రీశా!చింతలం బాపి గావ రావా?
భూపాళి సద్బుద్ధి నీవయ్య!బ్రోవంగ లోకంబు నీతిం!పొంతనంబేది? వీరి చర్యన్?
పాపాత్ములం మాపి రక్షించు!వావెంచ మానేరు నీచుల్!పంతమే ముఖ్య మాయె!నెంచన్?        
దీపంబు వెల్గించు శాసించి!దేవాది దేవా!శుభాంగా!తెంతు రివ్వారు ముక్తి మార్గా!
                                                                                     
1.గర్భగత"-సామని"-వృత్తము.
బృహతీఛందము.త.త.త.గణములు.వృ.సం.293.ప్రాసగలదు.
శ్రీపాల నాపాల గోపాల!
భూపాళి సద్భుద్ధి నీవయ్య!
పాపాత్ములం మాపి రక్షించు!
దీపంబు వెల్గించు శాసించి!

2.గర్భగత"-తారాడు"-వృత్తము.
అనుష్టుప్ఛందము.త.త.గగ.గణములు.వృ.సం.37.ప్రాసగలదు.
జీవేశ  లోకేశ   శ్రీశా!
బ్రోవంగ లోకంబు నీతిన్!
వావెంచ మానేరు నీచుల్!
దేవాది దేవా శుభాంగా!

3.గర్భగత"-భూధర"-వృత్తము.
బృహతీఛందము.ర.ర.య.గణములు.వృ.సం.75.ప్రాసగలదు.
చింతలం బాపి గావ రావా?
పొంతనం బేది?వీరి చర్యన్!
పంతమే ముఖ్య మాయె!నెంచన్?
తెంతు రివ్వారు ముక్తి మార్గా!

4.గర్భగత"-త్వగతి"-వృత్తము.
అత్యష్టీఛందము.త.త.త.త.త.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
శ్రీపాల నాపాల గోపాల!జీవేశ  లోకేశ  శ్రీశా!
భూపాళి సద్బుద్ధి నీవయ్య!బ్రోవంగ లోకంబు నీతిన్
పాపాత్ములన్ మాపి రక్షించు!వావెంచ మానేరు నీచుల్!
దీపంబు వెల్గించి శాసించు!దేవాది దేవా!శుభాంగా!

5.గర్భగత"-మాయారి"-వృత్తము.
అత్యష్టీఛందము.త.త.మ.య.జ.గగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
జీవేశ లోకేశ శ్రీశా!చింతలం బాపి గావ రావా?
బ్రోవంగ లోకంబు నీతిం?పొంతనంబేది? వీరిచర్యన్!
వావెంచ మానేరు నీచుల్?పంతమే ముఖ్య మాయె!నెంచన్?
దేవాది దేవా!శుభాంగా! తెంతు రివ్వారు ముక్తి మార్గా!

6.గర్భగత"-లఘ్వంత-శ్రీపాలనా"-
ఉత్కృతిఛందముత.త.మ.య.జ.మ.ర.ర.గల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
జీవేశ లోకేశ శ్రీశా!చింతలం బాపి గావ రావా!శ్రీపాల నాపాల గోపాల!
బ్రోవంగ లోకంబు నీతిం?పొంతనం బేది వీరి చర్యం!భూపాళి సద్బుద్ధి నీవయ్య!
వావెంచ మానేరు నీచుల్?పంతమే ముఖ్య మాయె!నెంచన్?పాపాత్ములం మాపి రక్షించు!
దేవాదిదేవా!శుభాంగా!తెంతు రివ్వారు ముక్తి మార్గా!దీపంబు. వెల్గించు! శాసించి !

7,గర్భగత"-రారయ"-వృత్తము.
ధృతిఛందము.ర.ర.ర.త.త.త.గణములు.యతి.10,వ,యక్షరము.
చింతలం బాపి గావ రావా!శ్రీపాల నాపాల గోపాల!
పొంతనంబేది?వీరిచర్యం!భూపాళి సద్బుద్ధి నీవయ్య!
పంతమే ముఖ్య మాయె!నెంచన్?పాపాత్ములం మాపి రక్షించు!
తెంతు రివ్వారు ముక్తి మార్గా?దీపంబు వెల్గించు శాసించి!

8,గర్భగత"-రయాతిగ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.ర.య.త.త.త.త.త.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
చింతలం బాపి గావ రావా!శ్రీపాల నాపాల గోపాల!జీవేశ లోకేశ శ్రీశా!
పొంతనంబేది?వీరిచర్యం!భూపాళి సద్బుద్ధి నీవయ్య!బ్రోవంగ లోకంబు నీతిన్?
పంతమే ముఖ్య మాయె?నెంచం?పాపాత్ములం మాపి రక్షించు!వావెంచ మానేరు  నీచుల్!
తెంతు రివ్వారు ముక్తి మార్గా!దీపంబు వెల్గించు శాసించి!దేవాది దేవా! శుభాంగా!

9,గర్భగత"-భ్రాంతిలు"-వృత్తము.
అత్యష్టీఛందము.త.త.మ.ర.ర.గల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
జీవేశ లోకేశ శ్రీశా!శ్రీపాల నాపాల గోపాల!
బ్రోవంగ లోకంబు నీతిం?భూపాళి సద్ద్బుద్ధి నీవయ్య!
వావెంచ మానేరు నీచుల్!పాపాత్ములం మాపి రక్షించు!
దేవాది దేవా శుభాంగా!దీపంబు వెల్గించు శాసించి!

10.గర్భగత"-రాయజ"-వృత్తము
ఉత్కృతిఛందము.త.త.మ.ర.ర.ర.య.జ.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
జీవేశ లోకేశ శ్రీశా!శ్రీపాల నాపాల గోపాల!చింతలం బాపి గావ రావా?
బ్రోవంగ లోకంబు నీతిం?భూపాళి సద్బుద్ధి నీవయ్య!పొంతనంబే లేని వీరి చర్యల్!
వావెంచ మానేరు నీచుల్?పాపాత్ములం మాపి రక్షించు!పంతమే ముఖ్యమాయె నెంచన్?                                       దేవాదా దేవా శుభాంగా!దీపంబు వెల్గించు శాసించి!తెంతు రివ్వారు ముక్తి మార్గా!
స్వస్తి
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
" శ్రీపాల నాపాల గోపాల " బాగుంది.
జీవేశ లోకేశ శ్రీశా అద్భుతముగా నున్నవి పాండితీ స్రష్టకు ప్రణామములు . శ్రీ చింతా వారికి అభినందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.