గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, సెప్టెంబర్ 2018, శనివారం

చేష్టిత,రసభాతి,చైతన్య,రతిమా,రసాయన,భూటక,రతభరా,పుల్లవెల్గు,రసభర,కుంటియ గర్భ "-రతిమజయా"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

జైశ్రీరామ్.
చేష్టిత,రసభాతి,చైతన్య,రతిమా,రసాయన,భూటక,రతభరా,పుల్లవెల్గు,రసభర,కుంటియ గర్భ
"-రతిమజయా"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

        "-రతిమజయా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.త.మ.జ.య.స.య.ర.లల.గణములు.యతులు.9,18,
ప్రాసనీమముగలదు.
పూట భుక్తము పుల్ల వెల్గై!పొక్కు వారల దిక్కేదిర?భూటకంబౌ!భారతమ్మున!
కాటు వేసే నాగు లౌచుం!కక్కు చుండగ ప్రత్యేకత?కాటకంబుల్గాన కేమగు?
పేట రౌడీ రాజ్య మౌచో?పెక్కు కోర్కెలు నీఱౌ నిల?వేటు వేయం!ప్రజ్ఞ గీడ్పడు!
మేటి సంస్కారంబు!మాయుం!మెక్కు కుంటిగ ప్రాబల్యము!మేటివారిం ముంచునీటను!
9
ప్రత్యేకత=రిజర్వేషనన్, నీఱౌ=బూడిదగును,ప్రజ్ఞగీడ్పడు=తెలిికికీడు
కల్గును,
                                                                                      
1.గర్భగత"-చేష్టిత"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.త.గగ.గణములు.వృ.సం.35.ప్రాసగలదు.
పూట భుక్తము!పుల్ల వెల్గై!
కాటు వేసే!నాగు లౌచున్!.
పేట రౌడీ రాజ్య మౌచో?
మేటి సంస్కారంబు మాయున్?

2.గర్భగత"-రసభాతి"-వృత్తము.
బృహతీఛందము.ర.స.భ.గణములు.వృ.సం.411.ప్రాసగలదు.
పొక్కు వారల దిక్కేదిర?
కక్కుచుండగ ప్రత్యేకత?
పెక్కు కోర్కెలు నీఱౌ నిల!
మెక్కు కుంటిగ ప్రాబల్యం?

3,గర్భగత"-చైతన్య"-వృత్తము.
బృహతీఛందము.ర.త.భ.గణములు.వృ.సం.419.ప్రాసగలదు.
భూటకంబౌ!భారతమ్మున!
కాటకంబుల్గాక!నేమగు?
వేటు వేయం ప్రజ్ఞ గీడ్పడు!
మేటివారిం!ముంచు నీటను!

4.గర్భగత"-రతిమా"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.త.మ.జ.య.లల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
పూట భుక్తం పుల్ల వెల్గై!పొక్కు వారల దిక్కేదిర?
కాటువేసే!నాగు లౌచుం?కక్కు చుండగ ప్రత్యేకత!
పేట రౌడీ రాజ్య మౌచో?పెక్కు కోర్కెలు నీఱౌనిక?
మేటి సంస్కారంబు మాయుం!మెక్కు కుంటిగ ప్రాబల్యము!

5.గర్భగత"-రసాయన "-వృత్తము.
అత్యష్టీఛందము.ర.స.య.ర.ర.లల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
పొక్కు వారల దిక్కేదిర?భూటకంబౌ!భారతమ్మున?
కక్కు చుండగ ప్రత్యేకత?కాటకంబుల్గాక!నేమగు?
పెక్కు కోర్కెలు నీఱౌనిక?వేటు వేయం ప్రజ్ఞ గీడ్పడు!
మెక్కు కుంటిగ ప్రాబల్యము!మేటివారిం ముంచు నీటను!

6.గర్భగత"-భూటక"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.భ.ర.త.భ.ర.త.గగ.గణములు.యతులు.10,19,
ప్రాసనీమముగలదు.
పొక్కు వారల దిక్కేదిర?భూటకంబౌ!భారతమ్మున!పూటభుక్తం!పుల్ల వెల్గై?
కక్కుచుండగ ప్రత్యేకత?కాటకంబుల్గాక!నేమగు?కాటువేసే!నాగు లౌచున్?
పెక్కు కోర్కెలు నీఱౌ నిక?వేటు వేయం ప్రజ్ఞ గీడ్పడు!పేట రౌడీ రాజ్యమౌచోన్?
మెక్కు కుంటిగప్రాబల్యము!మేటివారిం!ముంచు నీటను!మేటి సంస్కారంబు మాయున్!

7,గర్భగత"-రతభరా"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.త.భ.ర.త.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
భూటకంబౌ?భారతమ్మున!పూటభుక్తం!పుల్ల వెల్గై!
కాటకంబుల్గాక!నేమగు?కాటువేసే!నాగు లౌచున్?
వేటువేయం!ప్రజ్ఞ గీడ్పడుపపేటరౌడీ!రాజ్య మౌచున్?
మేటివారిం ముంచు నీటను!మేటి సంస్కారంబు మాయున్?

8.గర్భగత"-పుల్ల వెల్గు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.త.భ.ర.త.మ.జ.య.లల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమము గలదు.
భూటకంబౌ!భారతమ్మున!పూట భుక్తం పుల్ల వెల్గై!పొక్కువారల దిక్కేదిర?
కాటకంబుల్గాక!నేమగు?కాటువేసే!నాగులౌచుం?కక్కుచుండగ!ప్రత్యేకత!
వేటు వేయం ప్రజ్ఞ గీడ్పడు!పేటరౌడీ!రాజ్య మౌచోం?పెక్కుకోర్కెలు!నీఱౌనిక?
మేటివారిం!ముంచు నీటను!మేటి సంస్కారంబుమాయుం!మెక్కు కుంటిగ! ప్రాబల్యము!

9,గర్భగత"-రసభర"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.స.భ.ర.త.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
పొక్కువారల దిక్కేదిర?పూట!భుక్తం!పుల్ల వెల్గై!
కక్కు చుండగ ష్రత్యేకత!కాటు వేసే!నాగు లౌచున్?
పెక్కు కోర్కెలు నీఱౌనిక?పేటరౌడీ!రాజ్య మౌచోన్?
మెక్కు కుంటిగ ప్రాబల్యము!మేటి సంస్కారంబు మాయున్?

10,గర్భగత"-కుంటియ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.భ.ర.త.మ.య.ర.లల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
పొక్కు వారల దిక్కేదిర?పూటభుక్తం పుల్లవెల్గై!భూటకంబౌ!భారతమ్మున!
కక్కు చుండగ ప్రత్యేకత!కాటు వేసే!నాగులౌచుం!కాటకంబుల్గాక!నేమగు?
పెక్కు కోర్కెలు నీఱౌనిక!పేట రౌడీ రాజ్య మౌచోన్?వేటువేయం!ప్రజ్ఞ గీడ్పడు!
మెక్కు కుంటిగ ప్రాబల్యము!మేటి సంస్కారంబు మాయుం!మేటివారిం ముంచు నీటను!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఇంతటి అద్భుత మైన వృతములను తెలుసుకొన గలగడం మా అదృష్టము.
గర్భగత వృత్తము లన్నియు అలరించు చున్నవి . శ్రీ వల్లభ వఝులవారి ప్రతిభను మాకందించిన శ్రీ చింతా సోదరులు ధన్యులు . పాండితీ స్రష్ట లిరువురికీ వందనములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.