గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, జూన్ 2017, శనివారం

యస్య నాస్తి స్వయం ప్రజ్ఞ ... మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. యస్య నాస్తి స్వయం ప్రజ్ఞా శాస్త్రమేవ కరోతి కిమ్
లోచనాభ్యాం విహీనస్య దర్పణం కిమ్ కరిష్యతి.
గీ. ఎట్లు తలకెక్కు విద్య విహీన ప్రజ్ఞు.
ముకుర ఫలమేమి లోచనములవి లేక.
తనకు తానుగ యోచించి తగినదెంచు
శక్తి వృద్ధికి యత్నంబు సలుప వలయు.
భావము.. స్వయం ప్రజ్ఞ అనేదే లేకుంటే వాడు ఎన్ని శాస్త్రాలు చదివినా వాటి జ్ఞానం వంట పట్టదు. దానికి సుభాషితకారుడు చెప్పిన ఉదాహరణ కళ్ళు లేనివాడికి దర్పణం అంటే అద్దం ఇస్తే దానివల్ల ఉపయోగం ఏమీ వుండదు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
కొంత స్వతహాగా ప్రాజ్ఞుడైన వానికి చేయూత నిచ్చిన ఉపయుక్త మగును .నిజమె అంధునకు అద్దమిచ్చిన ప్రయోజనము లేనట్లే ఎంత చదివినను ఒంటబట్టని చో నిష్ప్రయోజనమె కదా . మంచి సూక్తి .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.