గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, జూన్ 2017, శనివారం

"వాగ్దండో೭థ మనోదండ . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.

శ్లో. "వాగ్దండో೭థ మనోదండ కాయదండ స్తథైవచ, 
యస్యైతే నిహతా బుద్ధౌ త్రిదండీతి స ఉచ్యతే" [మనుస్మృతి 12-10]
గీ. మౌన వర్తియె వాగ్దండి,మహినిఁ గనఁగ,
మనసులో కోర్కె లేకున్న మనసు దండి.
కాయకర్మస్వధర్ముఁడే కాయ దండి,
దండములు మూడు కల్గి, త్రి దండియగును.
భావము. 1. వాగ్దండము (మౌనము), 2. మనోదండము (ఆశ లేకుండుట), 3. కాయదండము (స్వధర్మాచరణము).ఈ మూడింటియందును ఎవరు బుద్ధి నిలుపుదురో వారు త్రిదండి యనఁబడుదురు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
" త్రిదండి " అనేపదాన్ని చక్కగా వివరించి నందులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.