గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, ఏప్రిల్ 2015, సోమవారం

గర్భిణీ స్త్రీ నాలుగవ నెలలో.....

జైశ్రీరామ్
గర్భిణీ స్త్రీ నాలుగవ నెలలో లలితా సహస్ర నామాలను చదివి, తేనె, ఆవునెయ్యి, పంచదార కలిపిన మిశ్రమాన్ని(త్రిమధురాలు లేదా మధువు) అమ్మకి నైవేద్యంగా పెట్టి నెలంతా రోజుకి చెంచా చొప్పున త్రాగడం గాని, అన్నంలోకలుపుకొని తినడం గానీ చేయవలెను.
ఒట్టి తేనే అనారోగ్యకరం. అలాగే ఒట్టి ఆవునెయ్యి, పంచదారలు కూడా అనారోగ్యాన్ని కలుగజేస్తాయి. 
గర్భిణికి ఈ మూడింటినీ కలిపినట్లయితే ఒకదానిలో దోషాన్ని మరొకటి తొలగించి మూడూ కలిపి ఔషధంగా ఏర్పడి గర్భిణికి సహాయపడతాయి. దీనితో పాటు ఒక ముద్దా పెరుగన్నాన్ని రోజూ తినాలి.
'అధ చతుర్థే మాసే జఠరకటిప్రదో భవతః' 
అని ఉపనిషత్తు చెప్తోంది. కాబట్టి గర్భస్థ శిశువుకి జఠరం కటి ప్రదేశాలుఏర్పడేదీ - శిరస్సులో తెల్లగా ఉండే మెత్తని మాంసం (మేధస్సు) బుద్ధి శక్తిని పెంపొందించేందుకుగా తోడ్పడేదీ ఈనెలలోనే కాబట్టి ఈ త్రిమధురాలని సేవించవలెను. నెలపొడుగునా. దానితో పాటు పెరుగాన్నమును తినవలయును.
ఈనాలుగవ నెలంతా ఈ క్రింది స్తోత్రాన్ని వీలయినన్ని ఎక్కువమార్లు పఠించినచో మంచిది.
స్వాధిష్టానాంబు జగతా చతుర్వక్త్ర మనోహరా
శూలాద్యాయుధ సంపన్నా పీతవర్ణాతి గర్వితా!
మేధోనిష్ఠా మధుప్రీతా బంధిన్యాది సమన్వితా!
దధ్యన్నాసక్త హృదయా కాకినీ రూపధారిణీ!!
పెరుగన్నమనగానే మనం ఇళ్ళలో చేసుకునే దధ్యోదనమనుకోకూడదు. దాన్ని ఈ కింది పద్ధతిలోనే చేయాలి.
దధ్నా చాన్విత శుద్ధాన్నం లవణేణ సమన్వితం
ఆర్ద్ర మరీచి సంయుక్తం ధానకీ పాత్ర సంయుతం
తథా నాగరఖండాఖ్యం దధ్యన్నమితి కీర్తితం!!
మిరియాల పొడి, తగు మాత్రపు ఉప్పు, కరివేపాకులు కలిసిన అప్పటికప్పుడు వండిన అన్నం పెరుగు మిశ్రమాన్ని
మాత్రమె దధి (పెరుగు_, ఓదనం (అన్నం), దధ్యోదనం అనాలి (దద్దోజనం అనరాదు). ఈ నాలుగవ నెలంతా
శిశువును రక్షించే తల్లి పేరు 'కాకినీ దేవి'.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఏడాక్టరు దగ్గరకీ వెళ్ళవలసిన అవుసరం లేకుండా ఇంట్లోనే ఉండి పాటించ వలసిన జాగ్రత్తలను చక్కగా వివరించారు .చాలా మంచి విషయాలు .ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.