గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, ఏప్రిల్ 2015, మంగళవారం

నక్షత్ర బంధ శార్దూలము.

జైశ్రీరామ్.
ఆర్యులారా! నక్షత్ర బంధ శార్దూలము తిలకించండి.
(కోణములందు రామారావయ    కేంద్రములందు ననుకావగ)
నక్షత్రబంధ శార్దూలము.
రా ! నా రాఘవ! జ్ఞాన బోధను కృపన్ రక్షించ రా దేవరా !
రా ! నన్ కావగ. వర్ధిఁ జేయ, విజయ ప్రామాణ్యమై వేగ రా!
జ్ఞానజ్యోతిని గొల్పి మా ప్రభువనంగానుర్విపై కావరా !
కానన్, ధీర నీవు నాకు వసుధన్ న్నార కన్పించరా !
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
నక్షత్ర బంధ శార్దూలము చాలా బాగుంది శ్రీ చింతా వారికి అభినందన మందారములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.