గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, జూన్ 2014, శనివారం

అక్రోధేన జయేత్ క్రోధం...మేలిమి బంగారం మన సంస్కృతి, 214.

జైశ్రీరామ్.
శ్లో. అక్రోధేన జయేత్ క్రోధం, అసాధుం సాధునా జయేత్ 
జయేత్ కదర్యం దానేన , జయేత్ సత్యేన చానృతం. 
గీ. కోప విరహిత బుద్ధిచే కోపి మనసు,  
సాధు గుణమున దుష్టునసాధు మతిని, 
లోభినీవిని, మరియు నీ లోని సత్య 
మున నసత్యమున్ విజయించి ముక్తి గనుడు.
భావము. కోపరాహిత్యంతో కోపాన్ని జయించాలి.అసాధువును సాధు బుద్ధితో జయించాలి. లోభిని దానంతో జయించాలి. అసత్యాన్ని సత్యంతో జయించాలి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఇవన్నీ కష్ట పడి సాధించ డానికి ప్రయత్నించినా ముఖ్యంగా ఈరోజుల్లో ఎంతమంది మారగలరు ? కాకపోతే మనప్రయత్నం మనం చేయాలి కదా ! తర్వాత వారివారి అదృష్టాలు మనం కొంతైనా సాధించ గలిగామన్న తృప్తి బాగుం ఇలాంటి ఆణి ముత్యాలను కొన్నైనా ఏరుకోగలిగితే ఎవరికి వారే మారవచ్చును .ధన్యవాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.