గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, ఏప్రిల్ 2014, బుధవారం

శిరాకదంబం లో అంతర్జాల శ్రవ్య కవిసమ్మేళనం అత్యద్భుతం

జైశ్రీరాం.
ఆర్యులారా! శ్రీ జయ నామ సంవత్సరంలో భారతదేశంతో పాటు లోకమంతా సంతోషంతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను.
శ్రీ యస్సెస్ రావుగారు నిర్వహిస్తున్న అంతర్జాల మాస పత్రిక శిరాకదంబంలో  అంతర్జాల శ్రవ్య కవిసమ్మేళనం  నిర్వహించి ప్రకటించారు.
అందు గానం చేసిన కవి కోకిలలు
మీరూ వినే విధంగా ఇందు పొందుపరచి యున్నాను.
శిరాకదంబం https://sites.google.com/site/siraakadambam/home/03015ugadipratyekaanubandham
ఇటువంటి చక్కని కార్యక్రమములను సిరాకదంబంద్వారా పాఠకులకు ఉత్సాహం కలిగిస్తున్న శ్రీ రావు గారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నాను.
జైహింద్.
Print this post

3 comments:

అజ్ఞాత చెప్పారు...

PANTULA JOGARAO
ఆడియో పూర్తిగా విన్నాను. చాలా బాగుంది. మంచి ప్రయత్నం.శిరా కదంబానికి నా అభినందనలు. నీ పద్య ధార అనుపమేయం. వివిధ ఛందస్సులలో వ్రాసిన పద్యాలు అలరించాయి. కవీ నీకు జయోస్తు !

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అన్నా! నమస్తే. నీ అభిమానపూర్వక ప్రశంసాత్మక ఆశీస్సులకు ధన్యవాదములు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఆలస్యంగా నైనా చూడ గలిగి నందుకు ఆనందంగా ఉంది
ఉగాది కవిసమ్మేళనం చాలా బాగుంది. శ్రీ చింతా వారి వివిధ చందస్సుల పద్య గానం , ఆచార్య ఫణేంద్ర గారి కవితలు ఇంకా ఇతర దేశములనుండి సోదర సోదరీ మణుల కవితలు చాలా ఆనందాన్ని కలిగించాయి శిరా కదంబం వారికి మాకందించిన శ్రీ చింతా వారికి ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.