గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, ఏప్రిల్ 2014, శనివారం

జిహ్వాగ్రే మరణం ధృవమ్ మేలిమి బంగారం మన సంస్కృతి.181.

జైశ్రీరామ్.
శ్లో. జిగ్వాగ్రే వర్తతే లక్ష్మీ ,జిహ్వాగ్రే మిత్ర బాంధవాః
జిహ్వాగ్రే బంధనప్రాప్తిః ,జిహ్వాగ్రే మరణం ధృవమ్.
గీ. మంచి మాటను లక్ష్మి సంప్రాప్తమగును.
మంచి మాటాడ బంధువుల్ మనను విడరు.
మాట బాగోనిచో కల్గు బంధనంబు.
మాట బాగోనిచో మృతియు మనకు కలుగు.
భావము. నాలుక చివరనే సంపదలు, మిత్రులు, బంధువులు, బంధనం ,చివరకు మరణం కూడా ఉంటాయి. (అందువల్ల నాలుకనుఅదుపులో ఉంచుకొని మాట్లాడాలి.)
జైహింద్.
Print this post

3 comments:

కందుల వర ప్రసాద్ చెప్పారు...

శ్రీ చింతా రామ కృష్ణా రావు గురుదేవులకు పాదాభి వందనములతో ...

గురువుగారికి బ్లాకు వీక్షకుల పక్షము నుండి పద్య మాల
=======*===========
మేలిమి బంగార మనుచు
మూలము లను దెలియ జెప్ప పొంక మలరగన్
కాల హరణమ్ము జేయక
మాలగ వేయరె ప్రణతుల మందారములన్ !

మంచి మంచి విషయములు తెలియ జేయు చున్న మీకు ధన్యవాదములు .

శిష్య పరమాణువు
వరప్రసాదు .

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

సుందర భావ స్పందన
మందరికీ రాదుచెప్పనరయునుదీనిన్
కందులవరపుత్రుఁడు మా
కందులకే సంతసంబునద్భుతమయ్యా.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మాటల చేత దేవతలు మన్ననజేసి వరంబు లిత్తురు అన్నారు కావున వాక్కు చాలా గొప్పది నాలుకను అదుపులో ఉంచు కోవడం ప్రధాన కర్తవ్యం . అందరు గ్రహించ వలసిన మంచి విషయం ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.