గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, డిసెంబర్ 2013, ఆదివారం

శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజికి ఘన సత్కారం

0 comments

జైశ్రీరాం.
ఆర్యులారా!డా. కోడూరి ప్రభాకర రెడ్డి సాహితీ పీఠం. ప్రొద్దుటూరు. వారు  శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజిని ఘనంగా సత్కరించారు.   సభాధ్యక్షులుగా:  డాడీ .వీజీ యేసోమయాజులు. వ్యవహరించారు.. పూర్తి వివరాలతో చిత్రాలతో మళ్ళీ వివరింగా ప్రచురించగలను. వారిని అభినందిన పద్యములు చూడండి.

శ్రీరస్తు                    శుభమస్తు.           అవిఘ్నమస్తు.
అభినందన మందార మాల.
రసవత్ కళా నిధీ! శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి పెన్నిధీ!
మా సాహితీ పురస్కారమును అంగీకరించి విచ్చేసిన మీకుమా స్వాగతం.
ప్రశంసార్హమైన మీ సాహితీ సంసేవనమునకు మిమ్ము మనసారా అభినందిస్తున్నాము.

సహృదయా!
శా. శ్రీ కల్యాణ మనోజ్ఞ పద్య రచనా శీలుండ! సన్మాన్య! సు
శ్లోకుండా! వర పూల వాడ జనితా! శుద్ధాత్ముఁడా! తిక్కనా!
మీ కావ్యామృతమద్భుతంబనదగున్. మీ యామ్రపాలిన్ గనన్
లోకుల్ మెచ్చెడి సత్ కవిత్వగతి నాలోకించితిన్. సత్కవీ!

ఆ. తెనుగు తోట శోభ విని వీధికిన్ జేరె.
నాటి కవులు మెచ్చినారు నిన్ను.
హరువునొప్పునట్టి యక్షర ధామమ్ము
నిలిపెనయ్య జాను తెనుగు కీర్తి.

(కం. గీ. గర్భ) ఉ. 
తొలి రస రమ్యమౌ తెనుగు తోట సుమావళి తేనె చిందుటన్
కల గనితో మహాకవుల కమ్మని భావన గానఁ జేయు మం
జుల సుసరజ్ఝరీ హరువు చూపు సుధాక్షరి అమ్రపాలివో!
తెలుపుమయా కృపన్. ధరణి తేజసమక్షర ధామమయ్యెనా!

గర్భస్థ కం.
రస రమ్యమౌ తెనుగు తో
ట సుమావళి తేనె చిందుటన్కల గనితో
సుసరజ్ఝరీ హరువు చూ
పు సుధాక్షరి అమ్రపాలివో! తెలుపుమయా!

గర్భస్థ గీ.
తెనుగు తోట సుమావళి తేనె చిందు
కవుల కమ్మని భావన గానఁ జేయు 
హరువు చూపు సుధాక్షరి అమ్రపాలి
ధరణి తేజసమక్షర ధామమయ్యె.

మ. రసవత్ కావ్య కళా నిధీ యనుచు నిన్ శ్రావ్యంబుగా పిల్తురే!
దెసలందున్ ఘన కీర్తి చంద్రికలు నీ తేజంబునే జూపునే! 
అసమానుండవటంచు నిన్ను కవులాప్యాయంబుగా జూతురే!
విషయంబేమిటి ఇట్టి కీర్తి మనకున్  దీపించునెట్లేక్రియన్.

ఉ. తిక్కన గూర్చి పల్కు తమ తీయని పల్కుల మర్మ మెన్నగా 
నొక్కటి తోచె నాకు మహిమోన్నత సత్కవి తిక్కనార్యుఁడే
చక్కని పూల వాడ విలసన్నుత తిక్కన సోమయాజిగా
మక్కువతోడ బుట్టెనని. మాన్యుఁడ! నిక్క మెఱుంగ నిద్దియే.
ఇట్లు
డా. కోడూరి ప్రభాకర రెడ్డి సాహితీ పీఠం. ప్రొద్దుటూరు. దీ.29-12-2013.
మంగళం.                మహత్.                శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ 
జైహింద్

22, డిసెంబర్ 2013, ఆదివారం

సాహితీ పురస్కార ప్రదానోత్సవము కార్యక్రమమునకు మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.

1 comments

జై శ్రీరాం.
ఆర్యులారా!
కోమల సాహితీ వల్లభ,డా.కోడూరు ప్రభాకర రెడ్డి ( సెల్ నెంబర్.9440170808 ) గారి
అధ్యక్షతన నిర్వహింప బడుచున్న
డా.కోడూరు ప్రభాకర రెడ్డి సాహితీ పీఠము. ప్రొద్దుటూరు వారు  చేయుచున్న
సాహితీ పురస్కార ప్రదానోత్సవము
కార్యక్రమమునకు మీ అందరికీ ఇదే మా 
ఆహ్వానం.
పురస్కార గ్రహీత
రసవత్ కావ్య కళానిధి శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి (విజయవాడ)
తేదీ. 29-12-2013.  సమయం: సాయంత్రం గం.4.00 లకు
వేదిక: గుత్తి నారాయణ రెడ్డి సాహిత్య పీఠం, ( శ్రీ గుత్తి చంద్రశేఖర రెడ్డి గారి స్వగృహమున )
(సెల్ నెంబర్ 9177945559 )
"15 – మొదటొ దశ( 1st phase). జయప్రకాశ నారాయణ్ నగర్, మియాపూర్, హైదరబాద్ 49."
సభాధ్యక్షులు:  డా. డీ .వీ. జీ . యే. సోమయాజులు.
ముఖ్య అతిథిడా. ఎల్లూరి శివారెడ్డి. ఉప కులపతి. తెలుగు విశ్వ విద్యాలయం, హైదరాబాద్.
సహృదయ సాహితీ వేత్తలకు, సాహితీ ప్రియులకు అందరికీ ఇదే మా ఆహ్వానం.
ఇట్లు
గుత్తి (జోళదరాశి) చంద్రశేఖర రెడ్డికార్యదర్శి
డా.కోడూరు ప్రభాకర రెడ్డి సాహితీ పీఠము.
హైదరాబాదు.
తే. 21 - 12 - 2013.
జైహింద్.

20, డిసెంబర్ 2013, శుక్రవారం

సుఖ దుఃఖాలకు మూలం కోరికలు.వాటిని జయించాలి

2 comments

జైశ్రీరాం 
ఆర్యులారా!
శ్రీ కే.బీ.నారాయణ శర్మ గారు 
కోరికలను గూర్చి వివరించిన సదంశాలను గ్రహించుటకు వీలుగా మీ ముందుంచుతున్నాను.
కోరికలు అంతులేని ఆనందాన్నిచ్చే శారికలే కాదు, బుసకొట్టి కాటేసే కాల సర్పాలు కూడా.  పాములు విషం కక్కుతాయి.  కాటు వేస్తాయి.  కానీ కోరికలు లేకుండా,  ఉంటాయా? అనునిత్యం  జీవితంతో పెనవేసుకొని ఉన్నాయి కదా! అంటే జీవితానికి కోరికలు ముఖ్యమన్న మాట.  అందుకే కోరికలే అన్నిటికన్నా ప్రథమ స్థానం ఆక్రమిస్తున్నాయి.  వాంచలన్నీ చంపేసుకుని బ్రతుకును వెళ్ళదీయాల్సిన పని లేదు.  కోరికల కోరలు పీకి విషం పిండి బయట పారేయండి.  వాటితో సరదాగా ఆడుకోండి.  ఆశలు ఆనందాన్నీ వాటితో పాటు ఆవేదనని కూడా ఇస్తాయి.  అయితే వాటిలోని ప్రమాదకరమైన అంశాలను పక్కన పెడితే మిగిలినదంతా సంతోషమే! మొత్తం కోరికలనే చంపేస్తే సుఖ సంతోషాలను కూడా చంపినట్లే.  కృష్ణుడు కోరికలు లేకుండా బ్రతికాడా? కోరికల పడగలలోని గరళాన్ని కక్కించి, నిర్వీర్యం చేసి ఆ పడగలపై విలాసంగా నాట్య విన్యాసాలు చేశాడు.  ఆనందలీలగా మలచాడు.

ఏ వస్తువును పైకి విసిరినా మళ్ళీ భూమిపైనే పడినట్టుగా పదే పదే అదే ప్రాథమిక సూత్రం, 'ప్రకృతి ద్వంద్వ స్వభావం' దగ్గరకే రావలసి వస్తోంది.  సృష్టించడమే కాదు, సంహరించడం కూడా ప్రకృతి ధర్మం.  ప్రవేశ ద్వారం, నిష్క్రమణ ద్వారం రెండూ ఉంటాయి.  బయటి దొంగలే కాదు, లోపలి దొంగలు కూడా ఉన్నారు.  బయటి దొంగలు నగా, నట్రా దోచుకుంటే, లోపలి దొంగలు సుఖ సంతోషాలను అపహరిస్తారు.  బయటి దొంగల పని పట్ట గలమేమో గాని, లోపలి దొంగలను తరిమికొట్టలేం.  జగన్నాధుడు శరీర సౌధాన్ని నిర్మిస్తాడు, నిర్మూలిస్తాడు కూడా.  కూల్చుతున్నాడని క్రూరుడని పిలవకండి.  అకౄర వరదుడు ఎన్నటికి కౄరుడు కానేరడు.  అందమైన కొత్త భవనాన్ని ఆవిష్కరించేందుకు పాత ఇల్లు పడగొడుతున్నాడు.

ఒకే వస్తువు సుఖాన్ని, దుఃఖాన్నిఇస్తుంది .  నీరు వరదలా ముంచెత్తి భీభత్సం చేస్తుంది.  ప్రాణాలుతీస్తుంది . దప్పికతో అలమటిస్తున్న వేళ దాహార్తిని తీరుస్తుంది.  ప్రాణాలు నిలుపుతుంది.

కోరికలను పూర్తిగా తృప్తి పరచి తుడిచివేయలేం.  అవి నిరంతర సౌఖ్హ్యానికి ముడి సరుకులు.  ఆకలి ఉంటేనే రుచులు ఆస్వాదిస్తాం.  భోజనం తృప్తిగా తినాలి.   అరిగి మళ్ళీ ఆకలి పుట్టాలి.  మరిన్ని కొత్త రుచులతో మళ్ళీ భోజనం చెయ్యాలి.  కోరికలూ అంతే!

నిరంతర సుఖప్రాప్తి కోసమే, అప్పుడప్పుడు దుఃఖం కలుగుతుంటుంది.  'ఆనందాన్ని' శాశ్వతం చేయడం కొరకు పరమేశ్వరుడు దయతో 'ఆవేదన' అనుగ్రహించాడు.  దుఃఖం మాయమైతే సుఖం కూడాకనుమరుగవుతుంది .  సుఖదుఃఖాలు ఒకే జల నుండి ఊరిన రెండు నీటి ధారలు.  ఒకదానిపై ఒకటి ఆధారపడే ఈ వైరుధ్యాలే మన ఉనికికి కారణమవుతున్నాయి.  మన మనుగడను అర్థవంతం చేస్తున్నాయి.  ఎడతెగకుండా ఎండ మాత్రమే కాస్తే, అంతా ఎడారిగా మారుతుంది.  ఎప్పుడూ వర్షమే కురిస్తే జల ప్రళయం సంభవిస్తుంది.  వానలు అస్సలు వద్దు, ఎండలు మాత్రమే ముద్దు అనుకుంటే రాళ్ళు రప్పలు, బీడు నేలలే మిగులుతాయి.  నిరంతర సౌఖ్యాలు జీవితాన్ని ఎడారిగా మారుస్తాయి.  మనం ప్రకృతిని సరిగ్గా అర్థం చేసుకొం.  అందుకే ఇన్ని సందేహాలు, అపార్థాలు.

సరళరేఖను ఎంత పొడవుగా గీసినా, అందులో అందమేముంటుంది! చిత్ర విచిత్ర గతుల వక్రరేఖల్లోనే చిత్రకళ రంజిల్లుతున్నది.  సెలయేటి సౌందర్యం, దాని వంపులలోనే దాగి ఉంటుంది.  నిశ్సబ్దంగా ప్రవహించే నీటి గమనంలో ఒక విధమైన స్తబ్దత చోటు చేసుకుంటుంది.  కానీ అడుగడుగునా అడ్డుపడే రాళ్ళ తాకిడితోనే గలగలల సరిగమలు జనిస్తున్నాయి.  కడలి అలలు బండరాళ్ళను ఢీకొన్నప్పుడు ఎంత కమనీయ దృశ్యం రచింపబడుతున్నది!

సృష్టిలోని అన్ని వస్తువులూ అపార మేధస్సు నుండి ఉద్భవించాయి.  కనుక ప్రతి వస్తువూ పరిపూర్ణమైనది.  లోపాలు లేనిది.  ఏది ఎందుకున్నదో  అర్థం చేసుకునే శక్తి మనకు లేకపోవచ్చు.  మనకు అన్యాయంగా, అధర్మంగా కనిపించేదంతా, మనం అపార్థం చేసుకున్న భగవంతుని ప్రజ్ఞ.

కోరికలు కలగడం, అవి సంతృప్తి చెందక పోవడం రెండూ ప్రకృతి చమత్కారమే.  ఇది సృష్టి ప్రతిభా విశేషం.  ప్రతి వస్తువూ, ప్రతి సంఘటనా సుఖ, దుఃఖ కారకమే.  కాబట్టి ఒక ముఖ్య మిషయం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి.  కోరికలోని ఆనందాన్ని మితిమీరకుండా, అదుపు తప్పకుండా అనుభవిస్తూ వాంఛలను దుఃఖ సాగరంగా మార్చేయకుండా, ఆనందామృతాన్ని తోడుకునే ఊటభావిగా మలచుకోవాలి.  తీరని కోర్కెల బరువుమూటను వేడుకల పెన్నిధిగా, అక్షయపాత్రగా ఆవిష్కరించండి.
ఇంత చక్కటి అభిప్రాయాన్ని పంచిన శ్రీ శర్మ గారికి ధన్యవాదములు.
జైహింద్ 

18, డిసెంబర్ 2013, బుధవారం

ఓం భద్రం కర్ణేభి: శృణుయామ దేవా (మేలిమి బంగారం మన సంస్కృతి)

3 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా!మంచి భావన మనకున్నట్లైతే అది మన మంచి నడవడికి మూలమౌతుంది. మంచి నడవడి మనకున్నట్లైతే అది మన మంచి జీవనానికి హేతువౌతుంది. తద్వారా మన జీవితము ఆనందమయమౌతుంది. కాబట్టి మనము మంచెని ప్రసాదించమని, మనలను మంచిగా నడిపించమని మహనీయులైన దేవతలను ప్రార్థించవలసిన అవసరముంది. ఈ ప్రార్థనను మనం చేస్తున్నాము. ఐతే ఆ విషయం మనకు తెలియకపోవుట బాధాకరం.
మన గృహాలలో శుభకార్యాలు జరిపించే సందర్భాలలో మన బ్రాహ్మణులు తత్సంబంధమైన వేద మంత్రాలను పఠించడం మనం వింటుంటాము. ఐతే వాటి అర్థం తెలియని కారణంగా మనం గ్రహించ లేకపోతున్నామంతే.
ముణ్డకోపనిషత్ ఏమి చెప్పుతోందో చూడండి
ఓం భద్రం కర్ణేభి: శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా: | స్థిరైరఙ్గైస్తుష్టువా సస్తనూభి- ర్వ్యశేమ దేవహితం యదాయు:||
భావము:- ఓం! దేవతలారా! మేమెల్లప్పుడు పవిత్ర శబ్దములనే వినుచుందుము గాక;
యజ్ఞాది సత్కర్మలనాచరించుచు పవిత్రమైన వస్తువులనే కనులతో కనుచుందుము గాక;
దృఢమైన మా శరీరములను దైవ సంకీర్తనకు నియోగించు
మేము దేవతలకు ప్రీతికరమైన జీవనమునానందింతుము గాక.
శా:-ఓంకారాశ్రిత దివ్యులార! వినగానొప్పారు సచ్ఛబ్దముల్,
ఓంకారాశ్రిత యజ్ఞకర్తల వగా, ఓంకారరూపున్ గనన్,
ఓంకారాశ్రితమైన దేహములమే మోంకారునే గొల్వగా,
ఓంకారాశ్రిత దేవతా హితముగా నొప్పారగాఁ జేయరే!
స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా: | స్వస్తి న: పూషా విశ్వవెదా: | స్వస్తి నస్తార్ క్ష్యో అరిష్టనేమి: స్వస్తి నో బృహస్పతిర్దధాతు ||
భావము:- ఇంద్రదేవుడు మమ్ము పవిత్రీకరించుగాక. అతి సంపన్నుడగు పూష (పృథ్వి) భగవానుడు మాకు సంపదలనొసగు గాక. పాపనాశకుడగు గరుడ భగవానుడు మా పట్ల ప్రసన్నుడగుగాక. బృహస్పతి మా సంక్షేమమును సదా పర్యవేక్షించుచుండును గాక.
గీ:-మము పవిత్రులఁ జేయుత సుమతి యింద్రుఁ
డమర సంపద పూషచేనమరు గాత.
సన్నుతుఁడు గరుఁడుడుసు ప్రసన్నుడగుత     
ప్రేమగ బృహస్పతిమనదు క్షేమముఁ గను.
గుర్తుకు తెచ్చుకోండి. ఈ వేద వచనాలు మనం వింటున్నవే కదా! మరి వాటి అర్థం తెలిస్తే మన భావన స్పష్టంగా ఉంటుందికదా! అందుకే మీదృష్టికి తీసుకు వస్తే ప్రయోజనకరంగా ఉంటుందని ఇక్కడ మీ ముందుంచాను.
జైహింద్. 

15, డిసెంబర్ 2013, ఆదివారం

14-12-2013 న జరిగిన భువన విజయం చూడండి.

3 comments

జై శ్రీరాం. 
ఆర్యులారా!
తేదీ 14-12-2013 న జరిగిన భువన విజయం చూడండి.
 See event details పై క్లిక్ చెయ్యండి.
జైహింద్.

మరి కాస్సేపట్లో డా. గరికిపాటి వారి అష్టావధానం ఆన్ లైన్ లో ప్రత్యక్షంగా చూడ వచ్చును

1 comments

జైశ్రీరాం.

ఆర్యులారా! మరి కాస్సేపట్లో డా. గరికిపాటి వారి అష్టావధానం ఆన్ లైన్ లో ప్రత్యక్షంగా  చూడ వచ్చును.http://www.ustream.tv/channel/garikapati-avadhanam-15-dec-2013 క్లిక్ చెయ్యండి.
జైహింద్.

14, డిసెంబర్ 2013, శనివారం

నిత్య సాధన చంద్రిక

2 comments

జైశ్రీరాం.
ఆర్యులారా! మనము నిత్యమూ జీవితాన్ని ఆనందంగా ఆరోగ్యంగా సౌఖ్యంగా గడపాలని ప్రతీ ఒక్కరం ఆశిస్తుంటాం. ఆ ఆశ నెరవేర్చుకొనుట కొఱకు తెలిసినంత వరకూ మాత్రమే మన ప్రయత్నం మనం చేస్తూనే ఉంటాం. మన పెద్దలు తాము గడించిన దివ్యాతిదివ్యానుభవ సారాన్ని సూక్తులుగా మనకందించారు. అట్టి అవశ్యాచరణీయములైన అంశాలను ప్రవచనాల ద్వారా అనేక మంది  మహత్ ప్రవక్తలు మానవ జాతికి నిత్యమూ అందిస్తూనే ఉన్నారు. అందుకొంటూనే ఉంటాము, మరల మర్చిపోతూనే ఉంటాము. ఇది ఆ విధంగా జరగ కూడదంటే మనం ఆచరణలో వాటిని పెట్టితీరాలి.అప్పుడు మాత్రమే మన నడవడిక కూడా ఇతరులకు అనుసరణీయంగా ఉండి తీరుతుంది.
ఇక అట్టి నిత్యము అనుసరణీయమైనవి మనకు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారు ప్రవచించి యున్నారు అవి ఈ క్రింది ఆడియో మూలమున విననగును.అవి విని నిత్యము  సాధన చేస్తూ మనము కోరుకొనే సన్మార్గంలో మన జీవన యానాన్ని ఆనంద భరితం చేసుకొంటూ సాగిద్దాం. ఇక వినండి.
విన్నారుకదండీ! ఇక ఆలస్యమెందుకు సాధన చేద్దామా! ఐతే కానివ్వండి. శుభమస్తు. 
జైహింద్. 

13, డిసెంబర్ 2013, శుక్రవారం

గీతా జయంతి సందర్భముగా మీకు శుభాకాంక్షలు.రేపు భువన విజయం, ఎల్లుండి అష్టావధానం.Don`t miss.

3 comments

జైశ్రీరాం.
ఆర్యులారా! శ్రీమద్భగవద్గీతా జయంతి సందర్భముగా మీ అందరికీ నా శుభాకాంక్షలు.
సాహితీ ప్రియులారా!
Bhuvana vijayamu is been organized at satish dhavan auditorium, iisc ,Bangalore on 14th evening 4.00pm.
Mallapragada Srimannarayanamurty - Timmarasu,
Dhulipala Mahadevamani- Peddana,
Garikapati - Tenali Rama Krishna
Palaparti Syamalananda - Timmana
Kommu Subrahmanyavaraprasad - Bhattumurti
Kota Vankata Lakshmi Narasiha - Dhurjati,
Errapragada Rama Krishna - Madayyagari Mallana,
Kovela Malayavasini - Molla,
Ganesh - Lolla Lakshmi Dharudu,
T.V Narayanarao - Krishna Deva Rayalu 
Dr. Garikipati Narasimha Rao garu is going to perform "Ashtavadhanam" 
at RV Dental College Auditorium, JP Nagar 1st Phase, Bangalore, 
on 15-Dec-2013 at 10:00 AM.
Arranged for a live streaming of the event.
The link is 
Short link : http://bit.ly/1gw2FLE

One can also look up www.live.shaale.com for the webcast..
The recording will be done in Full HD, but live streaming may only be in 240p quality...

This is due to the poor network signal strength in the auditorium..
But, in any case, a Full HD video will be hosted on the same website after the event.
Don`t miss.
జైహింద్

12, డిసెంబర్ 2013, గురువారం

భువన విజయం ఆన్ లైన్లో కంప్యూటర్ ద్వారా ప్రత్యక్షంగా తిలకించండి.

1 comments

జైశ్రీరామ్. 
ఆర్యులారా! సాహితీ ప్రియులార! 15-12-2013 న బెంగుళూరులో జరుపఁబడుచున్న  అష్టావధానము కంటే ముందుగా ముందురోజు జరుపఁబోవుచున్న భువన విజయమును కూడా మనము ఆన్ లైన్ లో ప్రత్యక్షముగా కంప్యూటర్లో చూడ వచ్చును. ఆసక్తి గలవారు ముందుగా సంసిద్ధులయి ఈ కార్యక్రమము ఆన్ లైలో తిలకించుచూ ఆనందానుభూతిన్ పొందుటకు వీలుగా మీకీ విషయమును తెలియ జేయుటకు సంతసించుచున్నాను. 
Aditya
Bhuvana vijayamu is been organized at satish dhavan auditorium, iisc , Bangalore on 14th evening 4.00pm.
Mallapragada Srimannarayanamurty - Timmarasu,
Dhulipala Mahadevamani- Peddana,
Garikapati - Tenali Rama Krishna
Palaparti Syamalananda - Timmana
Kommu Subrahmanyavaraprasad - Bhattumurti
Kota Vankata Lakshmi Narasiha - Dhurjati,
Errapragada Rama Krishna - Madayyagari Mallana,
Kovela Malayavasini - Molla,
Ganesh - Lolla Lakshmi Dharudu,
T.V Narayanarao - Krishna Deva Rayalu 

Both the events (Bhuvana vijayam on 14th and Ashtavadhanam on 15th) are open to all. everyone is welcome.
swasti,
aditya

From: Pavan Kumar Hari <pavankumarhari@gmail.com>
Date: Tue, Oct 8, 2013 at 4:48 PM
Subject: Bhuvana Vijayamu - Poster

namaskAramulu
The event page for "Bhuvana Vijayamu" programme has been created. Below is the link 


Short link : http://bit.ly/1gw2FLE

One can also look up www.live.shaale.com for the webcast..
The recording will be done in Full HD, but live streaming may only be in 240p quality...
This is due to the poor network signal strength in the auditorium..
But, in any case, a Full HD video will be hosted on the same website after the event.
Thanks and regards


Pavan.
V S S Pavan Kumar Hari
Research Student (Ph.D.)
Power Electronics Group
Department of Electrical Engineering
Indian Institute of Science
Bangalore-560012
ఈ విషయమును మనకు తెలియపరచిన ఆదిత్య గారికి, పవన్ కుమార్ హరి గారికీ ప్రత్యేక ధన్యవాదములు తెలియ జేయుచున్నాను. 
జైహింద్. 

11, డిసెంబర్ 2013, బుధవారం

ఆన్ లైన్ లో ప్రత్యక్షంగా చూడండి శ్రీ గరికిపాటి నరసింహారావు గారి అష్టావధానం

2 comments

జైశ్రీరామ్. 
ఆర్యులారా! సాహితీ ప్రియులారా! శ్రీ గరికిపాటి వారు చేయుచున్న అష్టావధానం మనం ఆన్ లైన్ లో ప్రత్యక్షప్రసారాన్ని చూచే అవకాశం కల్పింప బడింది. ఈ క్రింది వివరాలు చదివి ఔత్సాహికులు ప్రత్యక్ష అవధానం ఆన్ లైన్ లో చూచి దివ్యానుభూతిని పొంద గలరని ఆశిస్తున్నాను. మన మిత్రిలకు కూడా ఈ వార్త తెలియ జేయ వలసినదిగా మనవి.
From: Pavan Kumar Hari <pavankumarhari@gmail.com>
Date: Tue, 10 Dec 2013 13:00:19 +0530
Subject: Ashtavadhanam by Dr. Garikipati Narasimha Rao - Live Streaming Details
namaskAramulu
Dr. Garikipati Narasimha Rao garu is going to perform "Ashtavadhanam" at RV
Dental College Auditorium, JP Nagar 1st Phase, Bangalore on 15-Dec-2013 at
10:00 AM.

We have arranged for a live streaming of the event and the link is given
below..

http://www.ustream.tv/channel/garikapati-avadhanam-15-dec-2013
Kindly circulate this among your friends who are interested.
Thanks and regards,
Pavan.
జైహింద్.

7, డిసెంబర్ 2013, శనివారం

కుండలి నాగబంధ చంపకము. శ్రీవల్లభవఝలకృతము

1 comments

జైశ్రీరాం.
ఆర్యులారా! శ్రీ వల్లభవఝల కృత కుండలి నాగబంధ చంపకము పరిశీలించండి.
జైహింద్

6, డిసెంబర్ 2013, శుక్రవారం

జుత్తాడ శ్రీరామ చంద్ర శతకము.శ్రీ వల్లభ వఝల కవి కృతము.

1 comments

జైశ్రీరాం.
ఆర్యులారా! శ్రీ వల్లభ వఝల కవి కృత జుత్తాడ శ్రీరామ చంద్ర శతకమును పఠన యోగ్యముగా మీ ముందుంచుచున్నందులకు ఆనందంగా ఉందు. ఇక పఠించండి.
జైహింద్.