గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, జులై 2013, బుధవారం

మేలిమి బంగారం మన సంస్కృతి 140.

జైశ్రీరామ్.
శ్లో: మాతరమ్ పితరంచైవ  -  సాక్షాత్ ప్రత్యక్ష దేవతామ్.
మత్వా గృహీ నిషేవేత  -  సదా సర్వ ప్రయత్నతః.
గీ: తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవములిల  
దాని భావించి గేస్తు సద్భక్తితోడ
సేవలను చేసి నిరతము బ్రోవ వలెను.
సత్య, సత్వర్తనాదులు శ్రద్ధనొదవు.
భావము: కుటుంబి తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవముగా భావించుచు, అన్ని విధముల వారిని సేవింప యత్నించవలెను.
జైహింద్.
Print this post

3 comments:

Pandita Nemani చెప్పారు...

ధరణిన్ దల్లియు దండ్రియే సుమి సదా దైవస్వరూపుల్ మహా
దరమొప్పన్ గడు సేవలా కవకు నిత్యంబున్ బొనర్పన్ దగున్
పరమానందము నొంది వారొసగు భవ్యాశీస్సులే నిత్యమున్
పరిరక్షించు గృహస్థు నెల్ల యెడలన్ భావ్యంబదే ధీనిధీ!

Unknown చెప్పారు...

బావి లో కప్పా లా వుంది.పశ్చస్ట దేశాల లో కి వెళ్లి చూడండి.మన సంస్కృతీ లో చెప్పేదొకటి చేసేదొకటి.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

విదేశీయ అనుకరణతో వృద్ధాశ్రమాలకు పంపకుండా ఉంటే అదే పదివేలు . గౌరవ మరియాద లేలేని నేటి వ్యవ స్థలో పూజించటం హాస్యాస్పదం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.