గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, ఏప్రిల్ 2013, శుక్రవారం

అవధాన సుధాకర బిరుదు ప్రతిగ్రహీత అయిన చిరంజీవి పార్వతీశ్వర శర్మకు అభినందనలు.

జైశ్రీరామ్.
సోదరీ సోదరులారా! మన అవధాన బాల చంద్రుడయిన చిరంజీవి రాంభట్ల పార్వతీశ్వర శర్మకు విశాఖ సాహితీ సమితి "అవధాన సుధాకర ’ బిరుదు ప్రదానము చేసి సాహితీ జగత్తుకు ఆనందం కలిగించింది. సముచితమైన వ్యక్తికి సముచితమైన బిరుదు ప్రదానము చేయుట ద్వారా వారి అసాధారణ వివేచనా పటిమను లోకంలో చాటుకున్నారు. ఇట్టి చక్కని బిరుదు ప్రదానము చేసిన విశాఖ సాహితీ సమితిని అభినందిస్తూ, చిరంజీవి అవధాని సుధాకరునకు శుభాశీస్సులు తెలియ జేస్తున్నాను.
జైహింద్.
Print this post

4 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

అవధాన సుధాకర బిరుదు పొందిన చిరంజీవి శర్మకు శుభాభి నందనలు

Pandita Nemani చెప్పారు...

మిత్రులారా! శుభాశీస్సులు.
చిరంజీవి రాంభట్ల పార్వతీశ్వర శర్మ ఇప్పటికి 32 అష్టావధానములు విజయోత్సాహముతో నిర్వహించెను. వాని ప్రపితామహులు, పితామహులు కూడా మంచి పద్య కవులే. ఆలాగుననే వాని అన్న కూడా మంచి పద్య కవియే. చిరంజీవి శర్మ ప్రస్తుతము తెలుగులో డాక్టరేట్ కొరకై కృషి చేయుచున్నాడు. అవధాన సుధాకర బిరుదమును వానికి ఇచ్చు ప్రతిపాదన శ్రీ శ్రీ శ్రీ కుర్తాళం సిద్ధేశ్వరీ పీఠాధిపతి - సిద్ధేశ్వర ఆనంద భారతీ మహాస్వామి వారి (పూర్వాశ్రమములో డా. ప్రసాదరాయ కులపతి) అనుగ్రహ పూర్వకమైన ఆమోదము కూడ కలదు. ఆంధ్ర సాహితీ జగత్తులో ఈ చిరంజీవి సమున్నత స్థానము అలంకరించ గలడని మా ఆశీస్సులు. స్వస్తి.

"అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ చెప్పారు...

సాహితీదిగ్గజములకు, మిత్రులకు, రసజ్ఞులకు నమస్సులు.

మీ ఆశీర్వర్షమునకు కృతజ్ఞతలు.

"అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ చెప్పారు...

సాహితీదిగ్గజములకు, మిత్రులకు, రసజ్ఞులకు నమస్సులు.

మీ ఆశీర్వర్షమునకు కృతజ్ఞతలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.