గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, ఫిబ్రవరి 2013, సోమవారం

శ్రీ వల్లభ వఝల కృత ‘పిడికిలి బంధ కందము - నారికేళ బంధ ఆటవెలది’

జైశ్రీరామ్.
ప్రియ ఆంధ్రామృతాస్వాదనా తత్పరులారా!
మన ఆంధ్రభాషలో పద్యరచనలో చిత్ర బంధ, గర్భ కవిత్వములు భాషకే భూషణములనిన అతిశయోక్తి కానేరదు. అట్టి కవితాసక్తిని పెంపొందించుకొని రచనలు సలుపుచూ పాఠకులమదికెక్కుచున్న మహనీయులెందరో ఉన్నారు. అట్టి వారిలో శ్రీ వల్లభ వఝల నరసింహమూర్తి కవిమిత్రులు ముఖ్యులని చెప్పుకొనవలయును. ఎందుచేతననగా వారి కంట బడిన ఎటువంటి చిత్ర కవిత్వమయినా సరే మరుక్షణంలో వారి కలము నుండి నూతనోత్తేజముతో జాలువారుతుంది. అట్టి కవివరులు వ్రాసిన
పిడికిలి బంధ కందము - నారికేళ బంధ ఆటవెలది చూడండి.
ఇంత చక్కటి ప్రయత్నంతో కృతకృత్యులగుచున్న శ్రీ వల్లభవఝలవారిని మనసారా అభినందిస్తున్నాను.
మీరు కూడా ఎందుకు ఇలా వాసే ప్రయత్నం చేయ కూడదు? ఒక్కసారి ఆలోచించండి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ వల్లభ వఝుల వారి పద్య సంపద పిడికిలి నుంచి పింగళుని వరకు , గజము నుంచి గగనము వరకు అత్యద్భుతము గా వెల్లి విరియుట ముదావహం అభినందన మందారములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.