గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, సెప్టెంబర్ 2012, మంగళవారం

శివ ప్రదక్షిణ విధానము. శ్రీ రాజ శేఖరుని విజయ్ వివరణ.

జైశ్రీరామ్.
ఆర్యులారా! నమస్సులు.
కాశీ లోనే కాదండి. ఎక్కడ శివాలయంలో ప్రదక్షిణ చేయాలన్నా ఒక సూత్రం పూర్వీకులు నిర్దేశించారండి. అనుశ్రుతముగా నేను గ్రహించిన శ్లోకము ఈ క్రింద వివరిస్తున్నాను.
శ్లో:-
ధ్వజాత్ పృష్టం - పృష్టాత్ పృష్టమ్,
పృష్టాత్ పృష్టం - పృష్టాత్ ధ్వజమ్.
భావము:-
శివాలయములో ధ్వజ స్తంభము నుండి ఆలయము వెనుక శివుని పృష్ట భాగము వరకు వెళ్ళి, అక్కడి నుండి వెను తిరిగి నడచు కొనుచు మరల ఆ పృష్ట భాగము వరకు వెళ్ళి, అక్కడి నుండి వెను తిరిగి మరల నడచుకొనుచు పృష్ట భాగము వరకు వెళ్ళి, అక్కడి నుండి వెను తిరిగి ధ్వజ స్తంభము వరకు వెళ్ళ వలెను అని శ్లోక భావము.
ఇక శ్రీ రాజశేఖరుని విజయ్ గారు సేకరించిన శ్లోకము దానికి వారు ఇచ్చిన వివరణ చూద్దాము.

                                                                     శివ ప్రదక్షిణ విధి
మిగిలిన దేవాలయాలలో వలే ఈశ్వరుని దేవాలయంలో ప్రదక్షీణ చేయకూడదు. దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. దీనిని చండీ ప్రదక్షిణమని, సోమసూత్ర ప్రదక్షిణమని కూడా అంటారు.
ఈ క్రింది విధంగా చేయాలి. 
వృషంచండంవృషంచైవ సోమసూత్రం పునర్వృషం|
చండంచ సోమసూత్రంచ పునశ్చండం పునర్వృషం||
శివప్రదక్షిణేచైవ సోమసూత్రం నలంఘయేత్|
లంఘనాత్సోమసూత్రస్య నరకే పతనం ధృవం||  
నందీశ్వరుని వద్ద ప్రారంభించి - కుడిచేతి వైపు చండీశ్వరుని చేరి - అక్కడనుండి మళ్లీ వెనుకకు ( నందీశ్వరుని మీదుగా )సోమసూత్రం చేరి - మళ్లీ వెనుదిరిగి నందీశ్వరుని-   నేరుగా చండీశ్వరుని వద్దకు వెళ్లి - అక్కడ వెనుదిరిగి  ( నందీశ్వరుని మీదుగా ) సోమసూత్రం చేరి - మళ్లీ వెనుదిరిగి ( నందీశ్వరుని మీదుగా ) చండీశ్వరుని చేరి - వెనుదిరిగి నందీశ్వరుని వద్దకు చేరుకుంటే ఒక "శివ ప్రదక్షిణ" పూర్తి చేసినట్లు. శివ ప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదు. దాటితే నరకంలో పడి పతనమౌతనమవడం తథ్యం.కొద్దిగా సాధన చేస్తే ఇది పెద్ద కష్టం కాదు. 
చూచాము కదండీ!  ఆత్మ బుద్ధిః సుఖంచైవ అన్నారు మన ఒఎద్దలు. ఈ ప్రదక్షిణ ఆచరణ మన విజ్ఞతపైనే ఆధారపడి ఉంది. శుభమస్తు.
జైహింద్.    
Print this post

5 comments:

Pandita Nemani చెప్పారు...

హర హర! దేవ దేవ! యని యాలయమందు ప్రదక్షిణమ్ము నే
తెరగున జేయు టొప్పగునొ తెల్పితివయ్య! మహానుభావ! యీ
సరణి ననేక పద్ధతులు చక్కగ సేకరణం బొనర్చు నో
నిరుపమ భవ్య శీల! నిను నెమ్మది మెచ్చుచు గూర్తు దీవెనల్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు .
శివాలయము నందు ప్రదక్షిణా విధానమును " చండీ ప్రదక్షిణము , సోమ సూత్ర ప్రదక్షిణ ములను " చిత్రీక రించి వివరించి నందులకు శ్రీ రాజశేఖరుని విజయ శర్మ గారికి ధన్య వాదములు. [ అసలు అటువంటి పేర్లతో ప్రదక్షిణములు ఉంటాయన్న సంగతి ఇప్పుడే తెలుసు కోగలిగి నందుకు ఛాలా ఆనంధం గా ఉంది ]మాకందిం చిన శ్రీ చింత వారు ధన్యులు .

Unknown చెప్పారు...

సోమసూత్రం లో కొందరు ఎడమవైపు నుంచి మొదలుపెట్టాలి అని ,, కొందరు కుడిచేతి వైపు నుంచి మొదలుపెట్టాలి అని రకరకాల sites లో వుంది .

ఏది సరిఅయినదొ దయచేసి వివరించ గలరు .

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రాజశేఖరుని విజయ్ శర్మ

శివుడు తూర్పు ముఖముగా ఉన్నాడా? పశ్చిమ ముఖముగా ఉన్నాడా అన్న దానిని బట్టి ఉంటుంది. తూర్పు ముఖముగా ఉంటే కుడివైపు చండీ శ్వరుడు ఉంటాడు. శివుడు పశ్చిమ ముఖంగా ఉంటే ఎడమ వైపు చండీశ్వరుడు ఉంటాడు. సోమసూత్రం దాటకుండా చండీశ్వరుని ఏవైపునుండి చేరుకోవచ్చో ఆవైపు వెళ్ళాలి.

Krishna Anandhamayi చెప్పారు...

చక్కని విషయం తెలియ చేశారు.🙏🏼

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.