గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, సెప్టెంబర్ 2012, ఆదివారం

మూగవాణ్ణి పలికించే బృందావనం ఇది. భాస్కరానందానంద నాధ ఉవాచ.

జైశ్రీరామ్.
ఆర్యులారా! బ్రతికేది ఊరు. మానేది మందు అన్నారు కదండి. 
మాటలు రాని పిల్లలు వారి తల్లితండ్రులు ఎంతటి మానసిక వేదనకు గురి ఔతారో చెప్పనలవి కాదు. అలాంటి వారికో శుభవార్తే ఔతుంది శ్రీ భాస్కరానంద నాధ గారి ఈ క్రింది సూచన. 
యత్ సారభూతం తదుపాసితవ్యం -  హంసో యథా క్షీరమివాంబు మిశ్రం.
అన్న పెద్దల మాటలు కొట్టిపారేయకుండా మనం అనుసరిస్తే మంచిది కదండీ! 
ఫలిస్తుందనే ఆశిద్దాం. 
యత్నే కృతే యది నసిధ్యతి కోzత్ర దోష:?
కాబట్టి ఈ క్రింది విషయాన్ని మీరు చదివి ఇతరులకు తెలియఁజేయటం ద్వారా ఎవరికైనా ఉపయోగపడ గలరేమో ప్రయత్నించండి.
ఇంక చదవండి.
మూగవాణ్ణి పలికించే బృందావనం ఇది. 
మీ పిల్లలకు మాటలు రావడం లేదు అని భాధపడవద్దు. మూగ వాడు అని క్రుంగి పోవద్దు. మాటలు తప్పక వస్తాయి.
ఆ పరబ్రహ్మ మహిషిని ఆర్తితో వేడుకోమని జగద్గురువులు శ్రీ శంకరభగవత్పాదులు విరిచించిన సౌందర్య లహరి లోని శ్లోకము ఇది. మహా మంత్రములతో కూడినదై ఉపాసించగానే వరములు ఇచ్చే మా తల్లి కనక దుర్గై,  పాయస పాత్రతో మన ముందు నిలబడే అన్నపూర్ణయై, వాక్కును నొసగే వాగ్దేవినియై మీ ముందు ప్రత్యక్షము అయి మీ బిడ్డలకు వాక్కును ఇవ్వగలదు. ఇందు సందేహము ఎంతమాత్రమూ లేదు. భక్తితో, ఆర్తితో అమ్మ కాళ్ళు పట్టుకోండి.

శ్లో:  త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం
      కవీంద్రా: కల్పంతే కథమపి విరించి ప్రభృతయః
      యదా లోకౌత్సుక్యా దమర లలనాయాన్తి మనసా
      తపోభి ర్దుష్ప్రా పామపి గిరి సాయుజ్య పదవీమ్.
 (12 వ శ్లో.)
     సౌ:     సౌ:   అని జలమునందు వ్రాసి 45 రోజులు నిష్టతో అర్చించి, జలమును స్పృశించి ఈ శ్లోకమును ప్రతి దినము వేయి మార్లు పఠించి, ఆ జలమును పిల్లలకు పట్టవలెను. దీనిచే మూగ వాడు సైతము కవియగును.     
నైవేద్యము ... మధువు, తేనె.
ఇది ఆది శంకరుల వాక్కు.
నగురోరధికం నగురోరధికం నగురోరధికం నగురోరధికం 
మీ
భాస్కరానంద నాధ
చదివారు కదండి! సంతోషం. మీ ఆలోచనతో ముందుకు సాగండి.
జైహింద్.
Print this post

2 comments:

Pandita Nemani చెప్పారు...

మిత్రులారా!
అమ్మ దయను పొందగలిగిన వానికి లభ్యము కానిది యేముండును? అన్ని అక్షరములు అమ్మ నామములే. అన్ని అక్షరములు అమ్మ మంత్రములే. పిల్లలకు మాటలు వచ్చుటకు ఒక మంచి విధానమును తెలియజేసేరు. చాల సంతోషము. పురాణ గాథలలోకి వెళ్ళితే ఉతథ్యుడు అనే ముని కుమారుడు "ఐం" అనే మంత్ర బీజమును ఉపాసించి అంతకు పూర్వము మానసికముగా ఎదుగుదల లేని మూఢుడు,మంచి వాగ్వైభవము గల మహా జ్ఞాని అయేడుట. అమ్మను ఆరాధించితే మంచి మంచి యోగములను పొందవచ్చు. శుభం భూయాత్.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు .
అవును అమ్మ దయ ఉంటే పొంద లేనిది ఏమి ఉంది ? పూర్వం మాటలు రాని పిల్లలకి " సరస్వతీ లేహ్యం " అని తిని పించే వారు కదా !
మరి మూకశంకరులు ౫౦౦ పద్యాలు వ్రాసింది అమ్మ దయ వల్లనే ! చదవు రాని కాళి దాస మహాకవి అంత గొప్పవాడు కాగలిగింది అమ్మ కటాక్షమే . భక్తి తో నమ్మి కొలిచిన వారికి కొంగు బంగారమే . చక్కని విషయాన్ని తెలిపి నందుకు అభినందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.