గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, సెప్టెంబర్ 2012, మంగళవారం

వినాయక చతుర్థి సందర్భముగా భక్తకోటికి శుభాకాంక్షలు.


గణపతి పప్పా మోరియా.
జైశ్రీరామ్.
ప్రియ సాహితీ సన్మిత్రులారా!
వినాయక చతుర్థి సందర్భముగా మీ అందరికీ  హృదయ పూర్వక శుభాకాంక్షలు. 
మీరు తలపెట్టే ప్రతీ మంచి పనీ నిరాటంకంగా జరిగే విధంగా ఆ వరసిద్ధి వినాయకుఁడు చేయుఁ గాక.
శ్రీ గణ నాథ! చేకొనుమ చేసెడి పూజలు నిన్నుఁ గూర్చి.  నా
బ్లాగు పఠించు భక్తులకు బాగు, సు యోగము గూర్చుమయ్య! నే
సాగిలి మ్రొక్కెదన్ ఘన విశాల హృదీశ్వరపుత్ర రత్నమా!
జాగది యేలనయ్య? విలసద్గుణసంపదలిచ్చి కావగా!
వరసిద్ధి వినాయకుఁడు నా మొర తప్పక వినగలఁడు.
మిత్రులారా! ఒక చిన్న గమనిక.
రేడియో జోష్ మీద క్లిక్ చేయండి చాలు 
ఆన్ లైన్ రేడియో "రేడియో జోష్" ప్రసారాలు నెట్ ద్వారా విన వచ్చును. 
దానిలో ఉదయం ఏడు గంటలనుండి పది గంటల వరకు, 
సాయంత్రం ఏడు గంటల నుండి పది గంటల వరకు 
" వినాయక చవితి ప్రాశస్త్యాన్ని గూర్చిన" నా మాటలు ప్రసారమవతాయి. 
విని 
మీ అభిప్రాయాన్ని తెలియ జేయ గలరని ఆశిస్తున్నాను.
జై శ్రీరామ్,
జైహింద్.
Print this post

2 comments:

Pandita Nemani చెప్పారు...

అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు:

వందే గంధగజాననం సురనుతం వందే గిరీశాత్మజం
వందే విఘ్నవినాశకం కవివరం వందే కృపాసాగరం
వందే మోదకరం ప్రసన్న వదనం వందే జగత్పూజితం
వందేహం శ్రిత వాంఛితార్థ ఫలదం వందే గణేశం విభుం

అజ్ఞాత చెప్పారు...

Can't say enough about this website – its alot better than mine.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.