గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, జులై 2012, శుక్రవారం

శ్రావణ శుక్రవారం సందర్భంగా పాఠకులకు శుభాకాంక్షలు.

శ్రీ లక్ష్మీదేవీమ్ భజామ్యహమ్.
సాహితీ ప్రియ సోదరీ సోదరులారా!
ఈ రోజు పరమ పవిత్రమైన శ్రావణ శుక్రవారము. అష్టస్వరూపిణియైన ఆ జగన్మాత శ్రీ మహా లక్ష్మి అపార కరుణామృతాన్ని తనను సేవించు భక్తులపై పొంగించు రోజు. ఆ జగన్మాత యనుగ్రహం అపురూపమైనది.
ఆ కరుణాంతరంగిణి యొక్క అమృత దృక్కులు మీపైన, సహృదయులందరిపైనా అపారంగా ప్రసరించాలని మనసారా కోరుకొంటున్నాను.
కంద గీత గర్భ చంపకమాల:-
సురహిత కార్యముల్. సుగుణ శోభిత సన్మది, శుద్ధ వాక్కు, ప్రే
మ రస సుధన్, సదా సుజన మాన్యత, భక్తి, యశోగుణార్తియున్,
వర నుత భావనల్, విజయ వర్ధిత శక్తి, సువేద్య యిచ్చు ధీ
వర తమకున్ గృపన్, సుగుణ వర్ధిత లక్శ్మియశోగుణ్యాఢ్యయై.
క:- హిత కార్యముల్. సుగుణ శో
భిత సన్మది, శుద్ధ వాక్కు, ప్రేమ రస సుధన్,
నుత భావనల్, విజయ వ
ర్ధిత శక్తి, సువేద్య యిచ్చు ధీవర తమకున్
గీ:- సుగుణ శోభిత సన్మది, శుద్ధ వాక్కు, 
సుజన మాన్యత, భక్తి, యశోగుణార్తి
విజయ వర్ధిత శక్తి, సువేద్య యిచ్చు 
సుగుణ వర్ధిత లక్శ్మియశోగుణ్యాఢ్య!
జైశ్రీరామ్.
జైహింద్.


Print this post

1 comments:

Pandita Nemani చెప్పారు...

జయ విష్ణు హృదీశ్వరి శాంతమయీ!
జయ చంద్ర సహోదరి! స్వర్ణమయీ!
జయ భార్గవి మాధవి సాగరజా!
జయ శ్రీవరలక్ష్మి! ప్రసన్నముఖీ!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.