గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, జులై 2012, ఆదివారం

విశ్వంభరుఁడైన "సి.నా.రె". గారికి 82వ జన్మ దిన శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
విశ్వంభరుఁ డా.సి. నారాయణ రెడ్డి.
82 వ జన్మ దినోత్సవం జరుపుకొంటున్న మన విశ్వంభరుఁడు తన పాటల పరిమళాలను జగాన గుబాళింప చేసే కర్పూర వసంతరాయలు. 
అనన్య సామాన్య అసాధారణ ప్రతిజ్ఞా పాటవాలతో తెలుగు జాతికే వెలుగై నిలిచిన మహనీయ కవితా మూర్తి మన డా. సి.నారాయణ రెడ్డి. 
జ్ఞాన పీఠాన్ని చేజిక్కించుకొన్న మన నారాయణ రెడ్డి సజీవ తెలుగు సాహితీ స్వరూపానికి నిలువెత్తు  నిదర్శనం.
ఆ మహనీయునికి  జన్మదినం సందర్భంగా ఆంధ్రామృతం శుభాకాంక్షలందజేస్తోంది.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శ్రీ నారాయణ రెడ్డిగారి మధుర మైన పాటలు ' ఘంట సాల వారి గళంలో " ఎప్పడికీ మై మరపిస్తాయి . గుర్తు చేసిన శ్రీ చింతా వారికి అభినందలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.