గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, సెప్టెంబర్ 2011, సోమవారం

దుర్గానవరాత్రులలో ఆ అమ్మ కటాక్షం పొందుదాం.

ప్రియ సాహితీబంధువులారా!
సృష్టికి మూలాధార శక్తి ఐన ఆ జగన్మాత కటాక్షం మనకు పరిపూర్ణంగాలభింప జేసుకో గలిగడానికి వీలైన 
సుప్రశస్త శరన్నవరాత్రులు  ప్రారంభమౌతున్నాయి.
"యాదేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై    నమస్తస్యై  నమో నమః"
అని మనం ప్రతీ జీవిలోనూ ఆ జగన్మాత శక్తిని చూస్తూ  ఎంతగానో ఆరాధిస్తూ ఉంటాము. ఆ జగన్మాతయే మనలను  కటాక్షించే అమృత   ఘడియలు వచ్చెస్తున్నాయి.
మనం మనసారా ఆ జగన్మాతను ఆరాధించి, ఆ తల్లిపై మనకున్న భక్తి భావంతో ఆమె మాహాత్మ్యాన్ని వర్ణిస్తూ, ఆమెను ఆరాధిస్తూ  మనం అభ్యసించిన పద్య కవతా పాటవము చరితార్థమయే విధంగా పద్యములు వ్రాద్దాం.
నవదుర్గలు 
1 శైలపుత్రి 
2 బ్రహ్మచారిణి
3 చంద్రఘంట
4 కూష్మాండ
5 స్కందమాత
6 కాత్యాయని
7 కాళరాత్రి
8 మహాగౌరి
9 సిద్ధిధాత్రి 
మీరు మీ సామర్ధ్యానుసారం నవ దుర్గలపై పద్యామృతాన్ని సిద్ధం చేసి పంపండి .
శారదాంబకు ఆంధ్రామృతం ద్వారా వినిపిద్దాం.
జై శ్రీరాం.
జైహింద్.
Print this post

1 comments:

Pandita Nemani చెప్పారు...

వాగ్దేవతా వరివస్య గావించే వారికి ఈ స్తోత్రము నిత్య పారాయణకు ఉపకరించును.
సరస్వతి దశ శ్లోకీ స్తోత్రము

యా వేదాంతార్థ తత్త్వైక స్వరూపా పరమార్థతః
నామ రూపాత్మికావ్యక్తా సామాం పాతు సరస్వతి

యా సాంగోపాంగ వేదేషు చతుష్వేకైవ గీయతే
అద్వైతా బ్రహ్మణః శక్తిః సామాం పాతు సరస్వతి

యా వర్ణ పద వాక్యార్థ స్వరూపేణ ప్రవర్తతే
అనాది నిధనానంతా సామాం పాతు సరస్వతి

అధ్యాత్మ మధిదైవంచ దేవానాం సమ్యగీశ్వరి
ప్రత్యగాస్తే వసంతీయా సామాం పాతు సరస్వతి

అంతర్యామ్యాత్మనా విశ్వం త్రైలోక్యం యాధి గఛ్ఛతి
రుద్రాదిత్యాది రూపస్థా సామాం పాతు సరస్వతి

యా ప్రత్యగ్దృషిభిర్ జ్ఞానైః వ్యజ్యమాసానుభూయతే
వ్యాపినీ జ్ఞప్తి రూపైకా సామాం పాతు సరస్వతి

వ్యక్తావ్యక్త గిరస్సర్వే వేదాంతా వ్యాహరంతి యాం
సర్వ కామ దుఘా ధేనుః సామాం పాతు సరస్వతి

నామ జాత్యాదిభిర్ భేదై రష్టధా యా వికల్పితా
నిర్వికల్పాత్మికావ్యక్తా సామాం పాతు సరస్వతి

యాం విదిత్వాఖిలం బంధం నిర్మధ్యాఖిల వర్త్మనాం
యోగీ యాతి పరం స్థానం సామాం పాతు సరస్వతి

నామ రూపాదికం సర్వం యస్యామావేశ్యతాం పునః
ధ్యాయంతి బ్రహ్మణోరూపం సామాం పాతు సరస్వతి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.