గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, సెప్టెంబర్ 2011, శనివారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(దత్త పది5)

ఆర్యులారా!
శ్రీ కట్టమూరి పూరించిన దత్తపదిని మీ  ముందుంచుతున్నాను.
"కరణము - వరణము - తరణము - చరణము".
స్వేచ్ఛా ఛందము లో రాముని గుణ గణములు వర్ణన.
ఈ దత్తపదికి నా పూరనము వ్యాఖ్యలో చూడవచ్చును.
మీ పూరణలతో పాఠకులనలరింపగలరు.
శుభమస్తు.
జైశ్రీరాం.
జైహింద్.

Print this post

13 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

చరణము నమ్మితి రామా!
తరణముఁ జేయగ భవమును తారక మంత్రా
వరణము ననుంటి; సత్యము
కరణము గా నిలను జేరు ఘనుడా! శ్యామా!

కంది శంకరయ్య చెప్పారు...

సుందరాకార మతనిది శుభకరణము
సదయుఁ డాతని నామము జనవరణము
రఘుకులోత్తముని స్మరణ మఘతరణము
దైవ మిఁక మాకు శరణ మాతని చరణము.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

నరుల 'జీవరచన' నవ్య వ్యాకరణము
ఆర్త జనుల రక్ష కావరణము
రామచంద్ర స్వామి రమ్యమౌ చరణము
భక్తు లెల్లరకును భవ తరణము.

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:

నీలకరణము నిండైన నిగ్రహమ్ము
చేవ రణమున జూపిన శ్రేష్టుడతడు
తరణమును జూపి కైవల్యదరిని జేర్చు
శరణు యని మ్రొక్క రామునిచరణములను

కరణము = శరీరము, తరణము = దాటటం{సంసారసాగరాన్ని దాటించి}

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

కరణము వజ్రసన్నిభము, గాచును భక్తజనావళీ తతుల్,
తరణము బంధి సాగరము దాటగ జేయును,భక్తకోటి యా,
వరణము,పాదధూళి శిల,భామగ మార్చినయట్టిదైన నీ
చరణము ఘోరపాపహర సాయకమై వెలుగున్ ధరిత్రిలోన్.

తరణము = నావ
సాయకము = ఖడ్గము
పాపసంహరణము జేయు ఖడ్గము అనే భావనతో...

Pandita Nemani చెప్పారు...

అలరె జయ పతాక రణమునందు నభ్ర సీమలో
చెలగె నావరణములెల్ల శ్రీవిభున్ నుతించుచున్
జలజ నేత్రు చరణ మంటి శరణమంది భక్తితో
కొలిచిరి భవ తరణ మాత్మ గోరుచున్ తదాశ్రితుల్

పండిత నేమాని

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈ దత్త పదికి నా పూరణమును చూడండి.
చూచి ఇది ఏ ఛందస్సులో వ్రాయబడిందో తెలియ జెప్పండి.

ధార్మికరణమందు తారకరాముని గెల్వ గల్గు నెవరు క్షితిజులందు?
సద్వివరణమన్న సన్మూర్తి రాముని కానగానగునిల జ్ఞాన పరులు.
సద్వితరణమన్న సౌందర్య రాముఁడు సల్పినట్టులుగనె సలుప వలయు.
రామ చరణమద్ది రక్షించు జగతిని రామ నామమె తగు రక్ష కొఱకు.
రామసుధనుగ్రోలి రాజిల్లిరెందరో రామ భక్తులకును ప్రాణమతఁడు.
జానకి మది లోన స్థానమొందిన రామ భద్రుఁడే కద భువి ప్రభువనఁబడు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈ దత్త పదికి అవధాని చంద్రశేఖరం గారి పూరణము.

కరణముల యందు నతఁదు త్రికరణ శుద్ధి
వరణముల లోన మిగుల మేల్బంతి యగుచు
తరణములను భక్త జన సంతర్పు యగుచు,
చరణముల సేవ భక్త వత్సలుఁడు నయ్యె.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మందాకిని గారు, కంది శంకరయ్య గారు, గోలి హనుమచ్ఛాస్త్రి గారు, శ్రీపతిశాస్త్రి గారు, సంపత్ కుమార్ శాస్త్రి గారు, ఫందిత ణెమని వారు ఒకరిని మించి మరొకరు అద్భుతమైన పూరనలందించినందుకు నా ధన్యవాదములు.

Pandita Nemani చెప్పారు...

Sir, aataveladulu, seesapaadaalu kanipistunnaayi.
Sanyasirao

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
" చింతా వారు వ్రాసిన పద్యము " అశ్వధాటి " అనుకుంటున్నాను .
" త , భ , య ,జ , స , ర , న ,గ . " ౧ , ౮ , ౧౫ " ప్రతి పాదానికి యతి స్తానములు
యతికి బదులు ప్రాసయతిని వాడ వచ్చును .

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

గురువుగారికి నమస్సులు. మీ పద్యం సీస పద్యంగా అగుపించుచున్నది.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రాజేశ్వరి అక్కయ్యా! శ్రీ నేమాని వారు, శ్రీపతి గారు చెప్పినట్టు ఈ పద్యం సీసము. దానిలో మూడు ఆటవెలదులు ఉన్నాయి.
నేమాని వారికీ, శ్రీపతి గారికి, అక్కా నీకు కూడా నా ధన్యవాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.