గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, ఏప్రిల్ 2011, శనివారం

మేలిమిబంగారం మన సంస్కృతి 109.

శ్లో:-
దుర్జనేన సమం వైరం - ప్రీతించాపి నకారయేత్.
ఉష్ణో దహతిచాంగారః - శీతః కృష్ణాయతే కరమ్.
గీ:-
దుర్జనుల తోడ స్నేహము దుష్ఫలంబు
దుర్జనుల తోడ వైరము దుష్టఫలము.
బొగ్గు తాకిన వేడిని బొబ్బలెక్కు.
చల్లనౌ బొగ్గు మసి చేత నల్ల బరచు.
భావము:-
దుర్జనునితో విరోధమూ వలదు, స్నేహమూ వలదు. బొగ్గులు వేడిగా ఉన్నపుడు చేతులను కాలుస్తాయి. చల్లగా ఉన్నప్పుడు తాకితే చేతులను మసి చేస్తాయి.
జై శ్రీరాం.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

అవును ! బొగ్గు బొగ్గే . దుర్జనుడు ఎప్పుడూ దుర్జనుడే .దూరం గా ఉండటం మంచి లక్షణం. మంచి సూక్తి .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.