గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, ఏప్రిల్ 2011, శుక్రవారం

శ్రీ పం.జో.జన్మ దిన సందర్భంగా 1971లోరచించిన నామ గోపన చిత్రము.

18 . 11 . 1971 వ తేదీన నా మిత్రులు శ్రీ పంతుల జోగారావు జన్మ దినం సందర్భంగా ఆనాడు రచించిన పద్యం.
సీ:-
శ్రీమంత మగునట్టి కృతికి పుట్టిన రోజు...... శ్రీకాంతుడొచ్చి చరించు రోజు.
చింతలన్నియు కూడ చితిని కాల్చిన రోజు. పంత మొప్పగ కైత పలుకు రోజు.
తారతమ్యమొకింత తరలించు యీ రోజు... తుల లేని యనురక్తి వెలయు రోజు.
రారాజు చిన్నెల రహి పెంచు యీ రోజు...... లిత గాన మదేదొ వెలయు రోజు.
లయ మారుతమది మదిం బాడె ..........జోల.
కృపను కాల మొకింత సత్కృతులఁ...........గా
ష్ణాక్షరంబటు మమ్ముంచ నయత............. రావు
రావు దుస్థితుల్ మా మధ్య రావటంచు.
ప్రభుత్వ మహారాజా సంస్కృత కళాశాల విద్యాథిగా భాషాప్రవీణ చదువుకొనే ఆ రోజుల్లో గురువుల, మిత్రుల ప్రేరణతో చిన్న చిన్న పద్య కవితలు చేసే ఉత్సాహంతో వ్రాసిన నామగోపన చిత్రము అనే చిత్ర కవిత్వాన్ని పైనగల సీసపద్యంలో చూడ వచ్చును.
ఐతే బాల్య చాపల్యంతో ఆనాడు వ్రాసేటప్పుడు నా పేరుకు ముందు శ్రీకారం చేర్చుకోవడం అనుచుతం అన్న చిన్న విషయపరిజ్ఞానం కూడా ఆ నాడు నాకు లేదనే విషయాన్ని పై పద్యం స్పష్టం చేస్తోంది. అన్యధా భావించకండీ?
వీలైతే మీరూ ఒక చిన్న ప్రయత్నం చేసి చక్కని పద్యరచన చేసి మీ వ్యాఖ్యద్వారా పంపడం ద్వారా మీరు ప్రేరణపొందడంతో పాటు తోటి పాఠకులకూ ప్రేరణ నిచ్చినవారవగలరని ఆశిస్తున్నాను.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

4 comments:

జ్యోతి చెప్పారు...

మీ ఇద్దరి స్నేహానికి అభినందనలు..

పంతుల జోగారావుగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు..

రవి చెప్పారు...

ముచ్చటగా ఉన్నాయండి, మీరూ మీ మిత్రుల ఛాయాచిత్రమూ పద్యమూ కూడానూ. :))

కథా మంజరి చెప్పారు...

మిత్రమా, ఆనాటి మన ఛాయా చిత్రం, నా పద్యం, నీవు వ్రాసిన నామ గోపన చిత్రము మరొక్క తూరి గుర్తునకు తెచ్చినందుకు నీకు నా ధన్యవాదాలు.

ఆ రోజులేమిటో ... ఆ ఫోజు లేమిటో ... కదూ?

Sudha Rani Pantula చెప్పారు...

ఇద్దరు మిత్రులు చిత్రం బావుంది.
చిన్నారిపొన్నారి చిరుతకూకటినాడు..లా మీ అలనాటి పద్యరచన ప్రయత్నం కూడా బావుంది.
పం.జో.గారూ భలే పోజుగా కూర్చున్నారండీ.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.