గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, మే 2011, ఆదివారం

మా మనుమరాలు చిరంజీవి శ్రీ విజయ లహరి కి మీ ఆశీస్సులంద జేసినందుకు ధన్యవాదములు

సహృదయ పాఠకులారా! నాప్రార్థనలు విన్న జగన్మాత నాకు పౌత్రిగా మా కంటి వెలుగుగా తే.28.01-2011 న జనించింది.
తే.25-4-2011. న నా కుమారుడు చిరంజీవి వేంకట సన్యాసి రామ శర్మ, కోడలు చిరంజీవి సైభాగ్యవతి లక్ష్మీ శైలజల పుత్రిక యైన నా మనుమరాలికి నామకరణ జరిగింది.
శ్రీ విజయ లహరి 
అని పేరు పెట్టాము. అంతర్జాల మిత్రులు శ్రీమాన్ కంది శంకరయ్యగారు వారి శ్రీమతి ఆది దంపతుల వలె విచ్చేసి చిరంజీవిని దీవించారు.
శ్రీ గొల్ల పూడి రాజేశ్వర రావు గారు, శ్రీ పంతుల జోగారావు నాకు ప్రియ మిత్రులు. వారూ విచ్చేసి మా చిన్నారిని దీవించారు.
ప్రత్యక్షంగాను పరోక్షంగాను అందిస్తున్న మీ అందరి శుభాశీస్సులే మా మనుమరాలికి బంగారు బాట. అవ్యాజానురాగం మాపై చూపుతున్న మీ అందరికీ నేను ఋణ పడి ఉంటాను.
వ్యవహార నామకరణము చేయుచున్న సి.వి.యస్. రామ శర్మ.శైలజ దంపతులు

మా మనుమరాలికి శ్రీ విజయ లహరి అను వ్యవహార నామమును ఉచ్చరించుచు వ్రాయుచున్న మా కోడలు, మా అబ్బాయి. 

శ్రీ లంక గిరిధర్, శ్రీ శ్రీపతి సనత్, శ్రీ నేమాని అభిరామ్, .బ్లాగ్మిత్రుల ఆశీస్సులందుకొన్న మా మనుమరాలు శ్రీ విజయ లహరితో పాటు నేను, శ్రీ కంది శంకరయ్య, డాక్టర్ గన్నవరపు నరసింహ మూర్తి.
నా ఆహ్వానాన్ని మన్నించి ఎన్నో శ్రమ దమాదులకోర్చి తే.30-4-2011.న  మాయింటికి విచ్చేసి మా మనుమరాలికి వారి శుభాశీస్సులందించిన డాక్టర్ గన్నవరపు నరసింహ మూర్తి (అమెరికా)గారు, శ్రీ లంక గిరి, శ్రీమాన్ శ్రీపతి సనత్ కుమార్, శ్రీ కందిశంకరయ్య గారు, నా ప్రియ మిత్రులు శ్రీ నేమాని అభిరామ్.
ఇంకా దూర దేశాలలో ఉండి కూడా పండిత నేమాని రామ జోగి సన్యాసిరావు గారు, శ్రీమతి నేదునూరి రాజేశ్వరి అక్క గారు, శ్రీమతి మంగిపూడి సుబ్బ లక్ష్మి అక్క గారు ఇంకా  ఎందరో మిత్రులూ, సహృదయులూ మున్నగు వారు అనేక మంది తమ అమూల్యమైన సెల్ ఫోన్ ల ద్వారా ఆశీస్సులను అందించిన, అవ్యాజానురాగామృత వృష్టిని మా పై కురిపించినందుకు మాకు చాలా ఆనందం కలిగింది.మీ అందరికీ నేను, నాకుటుంబ సభ్యులందరమూ మా హృదయ పూర్వక కృతజ్ఞతలను తెలియ జేసుకొంటున్నాము.
సహృదయులైన మీ అందరి శుభాశీస్సులే మా మనుమరాలికి శ్రీరామ రక్ష. 
నమస్తే.
జైశ్రీరాం.
జైహింద్
Print this post

3 comments:

Sanath Sripathi చెప్పారు...

మీ మనుమరాలి మా ఆశీస్సులు.. మీ అబ్బాయికి మా శుభాకాంక్షలు, మీకు నమస్కృతులు

Pandita Nemani చెప్పారు...

శుభాశీస్సులు

తే. ప్రేమ రసమయ వాగ్ఝరి విజయ లహరి
మందహాస సుశోభితానంద లహరి
సకల సౌభాగ్య సంపత్ప్రశస్తి గాంచి
వర్ధిలుత శతవర్ష శోభాప్రదీప్తి

ఇట్లు నేమాని రామజోగి సన్యాసి రావు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

మనుమరాలు చిరంజీవి " విజయ లహరికి ,అబ్బాయికి , ఛి.సౌ. కోడలు శైలజకి ఇంకా మీ దంపతులకి అందరికి హృదయ పూర్వక శుభా కాంక్షలు. + దీవెనలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.