గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, ఏప్రిల్ 2011, బుధవారం

PSLV 16 ప్రయోగం విజయవంతమైనందుకు అభినందనలు.

శ్రీకరమైన మన భారత మాత ముద్దు బిడ్డలైన శాస్త్ర వేత్తల అకుంఠిత దీక్షా ఫలితంగా సిద్ధమైన అంతరిక్షనౌక PSLV16 యావత్ భారతీయుల హృదయాలను రంజింప చేస్తూ అత్యద్భుతంగా నిరాటంకంగా గగన తలంలో ప్రయాణించి, తన గమ్యాన్ని చేరుకొంటూ మూడు ఉపగ్రహాలను తమ కక్ష్యలలోకి చేర్చి, శాస్త్రజ్ఞులను యావద్భార జాతినీ ఆనంద పారవశ్యంలో ముంచిందంటే అది మన శాస్త్రవేత్తల నైపుణ్యానికీ, దేశ భక్తిభావానికీ నిదర్శనం.
ఇస్రో చైర్మన్ శ్రీ రాధా కృష్ణన్ గారిని, వారి సూచనలను పొల్లువోవకుండా అనుసరిస్తూ, తమ జ్ఞాన నైపుణ్యాలను జోడించి,ఐక్యతతో పనిచేసి,ఈ విజయానికి కారకులైన, భారతాంబకు ముద్దుబిడ్డలైన శాస్త్రవేత్తలను, ప్రత్యక్షంగాను, పరోక్షంగాను సహాయ సహకారాలందించిన ప్రతీ ఒక్కరినీ మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.
ఈ సందర్భంగా మన ప్రియతమ భారత రాష్ట్రపతికీ, కేంద్ర రాష్ట్ర పభుత్వాలకు, మహోన్నత భావ ప్రపూర్ణులైన యావద్భారతీయులకు నాహృదయ పూర్వక అభినందనలు తెలియ జేస్తున్నాను.
మన శాస్త్రీయ పురోగతి ప్రపంచాన్నే ఆశ్చర్యపరచేలా దినదినాభి వృద్ధి చెందుతూ, యావత్సృష్టికీ మంగళప్రదంగా అకుంఠితంగా కొనసాగేలా చేయాలని ఆ పరమాత్మను మనసారా ప్రార్థిస్తున్నాను.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

1 comments:

చంద్రశేఖర్ చెప్పారు...

PSLV Launching ని పొగుడుతూ మీరు ఆంధ్రామృతంలో వ్రాయటం ముదావాహము. నేను కూడాఒకప్పుడు ISRO Scientist ని కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఆనందించాను. ధన్యవాదాలతో, చంద్రశేఖర్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.