గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఏప్రిల్ 2011, ఆదివారం

భక్తుల ఆత్మలలో స్థిర నివాసుఁడైన భగవాన్ శ్రీ సత్య సాయి బాబా.

కలియుగ ప్రత్యక్ష దైవం భగవాన్ శ్రీ పుట్టపర్తి సత్య సాయి బాబా.
జ్ఞాన దీప్తి ప్రసరింప చేయటం ద్వారా అజ్ఞాన మూఢుల లోని మాయా చీకటులను  పార ద్రోలి, ప్రశాంత జీవనానికి కారకులైన మన సాయిబాబా తననే నమ్ముకొన్న భక్తుల హృదయాలలో స్థిర నివాసం ఏర్పరచుకొని తన భౌతిక జీర్ణ పాంచ భౌతిక దేహాన్ని పరిత్యజించారు.  
జీవాత్మయే తానైన బాబాకు మృత్యువెక్కడిది. 
భక్తకోటి తమకు దివ్య దర్శనం యిచ్చే బాబా ఇక లేరనే భావంతో అజ్ఞానంలో ఉండక తమ భక్తికి ప్రతిఫలంగా తమలొ జీవమై అక్లిసిపోయాడనే దివ్య భావన కలిగి ప్రశాంత చిత్తులై బాబాను తమ ఆత్మలలోనే దర్శించుతూ, బాబాగారి ఆశయ సాధనలో నిమగ్నులవాలని ఆశిస్తున్నాను.
దివ్య జ్యోతిస్స్వరూపులైన భగవాన్ శ్రీ సత్య సాయిబాబాకు ప్రణతులు.
లోకాః సమస్తాః సుఖినో భవంతు.
Print this post

3 comments:

Lakshmi Raghava చెప్పారు...

sai baba మా ప్రేమలోనే...మన సేవలోనే

అజ్ఞాత చెప్పారు...

మాస్టారు, అరసున్నలు అవసరం లేనిచోట వాడేస్తున్నట్టున్నారు!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అర సున్నలు ప్రయోగం అలవాటైపోయి పొరపాటు చేస్తున్న విషయాన్ని గుర్తింప చేసిమ మీకు ధన్యవాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.