గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, జనవరి 2011, సోమవారం

ఎందుకయ్యా అంత కోపం? అది చాలా ప్రమాదం సుమా!


శ్లోll
ఉత్తమే క్షణకోప స్స్యాత్, మధ్యమే ఘటికాద్వయం
అధమే స్యా దహోరాత్రం, పాపిష్ఠే మరణాంతకమ్
తే.గీll
ఉత్తముని కోప మొక క్షణ ముండు. నిజము.
మధ్యమునకు రెండుఘడియల్మసలు కోప
మధమునకురాత్రి పగలుండి యంతమగును.
పాపిమరణించు వరకును కోపముండు.
భావము:-
ఉత్తమునకు వచ్చెడి కోపము ఒక్క క్షణ కాలముండి పోవును. మధ్యమునకు వచ్చు కోపము రెండు ఘడియల కాలము మాత్రమే ఉండి పోవును. అధమునకు వచ్చుయ్ కోపమైతే ఒక రాత్రి, ఒక పగలు ఉండును. కాని పాపాత్ములకు వచ్చు కోపము మాతర్ము వారు మరణించు వరకూ ఉండును.
తన కోపమె తన శర్తువు. అన్నారు పెద్దలు. కావున మనం పై విషయం గ్రహించి శాంతాత్ములమై వర్తించే ప్రయత్నం చేయడం ఎంతైనా అవసరం.
జై శ్రీరాం.
జైహింద్.
Print this post

4 comments:

కథా మంజరి చెప్పారు...

చాలా బాగుంది. మీకు నా అభినందనలుసనా టపా చూడ లేదా ?

లింక్: http://kathamanjari.blogspot.com/2011/01/blog-post_16.html

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఈ కోపం ఫొటో ఎక్కడ దొరికిందబ్బా ? భలేగా ఉంది.నిజమె కోపమంతటి శత్రువు వేరొకటి లేదు.అది మనిషిని కడ వరకు దహించి వేస్తుంది.అందుకె కోపం వచ్చినపుడు ఏదో విధంగా మనసుని మళ్ళించు కోవాలి.మంచి సూక్తి

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

సుగుణ సుమాల వాసనలు సూనృతవాగ్ఝరి వెల్లడించు.మీ
ప్రగణిత వాక్ప్రభావమదిప్రస్ఫుటమౌ తమ వ్యాఖ్యలందు నో
నిగమ ప్రదృష్ఠ సార మతి!నీదగు తమ్ముడు నేనెయౌట నా
సుగతికి మార్గదర్శకము.సూనృత వాక్ పరిపూర్ణ సోదరీ!

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఇంత చక్కని అమృతపు స్రవంతిని కలంలొ కుమ్మరిస్తుంటే నా చిన్న కలం ఇచ్చే అభినందనలు సరిపోవు తమ్ముడూ !. ఆ దేవి కటాక్షంలొ నీ సాహితీ సంపద మరింతగా వెల్లి విరియాలి
" దీర్ఘాయుష్మాన్ భవ " ప్రియమైన అక్క

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.