గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, మే 2010, మంగళవారం

लॊकाभिरामम् श्रीरामम् भूयॊ भूयॊ नमाम्यहम्

 Sri-Sita-Rama-Lakshmana-Han.gif image by siri_me
लॊकाभिरामम् श्रीरामम् भूयॊ भूयॊ नमाम्यहम्.
శ్లో:- 
రామం విశ్వమయం వందే -  బ్రహ్మ విష్ణు శివాత్మకమ్
శాంతం సనాతనం సత్యం -  చిదానంద పరాత్పరమ్.
ఆ:- 
శాంత సత్య సనాతన సచ్చిదాత్మ;
సంతతానందమయుఁడును; సకల మగు ప
రాత్పరుఁడు జగన్మయుఁడును; బ్రహ్మ విష్ణు
శంకరుండగు శ్రీరాము సన్నుతింతు.
భావము:-
శాంత స్వరూపునికి; సనాతనునికి; సత్యమైనవానికి; చిదానంద మూర్తియైన పరాత్పరునకు; బ్రహ్మ-విష్ణు మహేశ్వరులను త్రిమూర్తి స్వరూపునికి; విశ్వమంతటా వ్యాపించిన వానికి; రామునకు-నమస్కరింతును.
జైహింద్.
Print this post

4 comments:

durgeswara చెప్పారు...

jai sri raam

రవి చెప్పారు...

అందమైన శ్లోకం, అందమైన అనువాదం. ధన్యవాదాలు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శ్రీ రామ అను శబ్ధమును అప్రయత్నము గా పలికినను ముక్తి పొందెదము అటువంటప్పుడు బుద్ధి పూర్వకము గా ఉచ్చరించిన చొ చెప్ప గలిగిన దేమున్నది ? హేట్సాఫ్ తమ్ముడు
" శ్రీ రామ ప్రాతి పదిక మవశేనాపి సంగృణన్
ముక్తిం ప్రాప్నోతి మనుజః కింపున ర్భుద్ధి పూర్వకం

కథా మంజరి చెప్పారు...

జైశ్రీరామ్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.