గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, మార్చి 2010, సోమవారం

శ్రీ వికృతి ఉగాది శుభాకాంక్షలు.అందుకోండి యీ కంద గీత గర్భ ఉత్పలమాల.


http://lovelysunrise.files.wordpress.com/2009/03/mamidi.jpg
శ్రీ వికృతి ఉగాది శుభాగమనం సందర్భంగా పుణ్యమూర్తులైన ఆంధ్రామృత పాఠకాళికీ; యామ దాంధ్రులకూ; సమస్త భారతీయులకూ ఆయురారోగ్య ఐశ్వర్యాలు; సుఖ శాంతులు; వర్థిల్లుతూ; ఆనందామృతాన్ని పంచే ఆంధ్రామృతం గ్రోలుతూ; చిరకాలం వర్థిల్లాలని ఆకాంక్షిస్తూ; ఆ పరమాత్మను ప్రార్థిస్తున్నాను. 
శ్రీ గుణ శోభనీ వికృతి క్షేమ నయంబుల వెల్గఁ జేయ మా
బాగెముగా నిటే వెలుగు పంటలఁ జేరెను; ప్రేమఁ జూపి; సే
వా గుణ మిచ్చుతన్! పరమ భ్రాంతి; నిరంతర భక్తి గొల్పు; నీ
బాగు గనున్! సదా సిరుల ప్రాప్తిని వర్ధిలఁ జేయు మిమ్ములన్.

గుణ శోభనీ వికృతి క్షే
మ నయంబుల వెల్గఁ జేయ మాబాగెముగా!
గుణ మిచ్చుతన్! పరమ భ్రాం
తి; నిరంతర భక్తి గొల్పు; నీబాగు గనున్!

వికృతి క్షేమ నయంబుల వెల్గఁ జేయ
వెలుగు పంటలఁ జేరెను; ప్రేమఁ జూపి;
పరమ భ్రాంతి; నిరంతర భక్తి గొల్పు;
సిరుల ప్రాప్తిని వర్ధిలఁ జేయు ముమ్ము!  
జైహింద్.

Print this post

6 comments:

Vasu చెప్పారు...

ఉగాది శుభాకాంక్షలు మాష్టారూ మీకు మీ కుటుంబ సభ్యులకు

Unknown చెప్పారు...

మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Unknown చెప్పారు...

మీకూ మీవాళ్ళకూ నాయొక్క తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలండోయ్!!

మాలా కుమార్ చెప్పారు...

మీకు , మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు .

తెలుగుకళ చెప్పారు...

http://telugukala.blogspot.com/2010/03/blog-post_16.html

అమృతవాక్కుల ఆశీస్సులు
ఉత్పలమాల ఒరవడులు
ఆనందపు మాధుర్యాల కానుకలుగా మీ పద్యతోరణాలకివే మా అంజలులు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఉగాది శుభాకాంక్షలతొ మీరు వ్రాసిన కంద గీతాలతొ పొందుపరచిన ఉత్పల మాల అందమైన మాల నిజంగా " మీరు ఒకనిధి. యశస్సుకు సన్నిధి " చాలా సంతో.sham

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.