గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, సెప్టెంబర్ 2008, సోమవారం

21-9- 2008 గురజాడ147 వ జయంతి.

గురజాడ వేంకట అప్పారావు
21-9-1862 -నుండి-30-11-1915

సీ:-ఆంధ్రామృతము గ్రోలనాసక్తి తో నున్న
అంధ్రులార! సుగుణ సాంద్రులార!
భువి సర్వసిద్ధిరాయవరము గ్రామాన
మాతామహులయింట మానితముగ
ప్రఖ్యాతమైనట్టి పద్ధెందివందల
యరువదిరెండులో నాంధ్రులలర
స్థిరముగ సెప్టెంబ రిరువ దొకటి నాడు
ప్రజల కవి గురజాడ జనియించె.
గీ:-ప్రజల భాషకు సాహితీ ప్రతిభ గొలిపె.
సంఘ సంస్కర్తగా పేరు సంతరించె.
మనము గురజాడ పుట్టిన దినమునాడు
గేయ కవితలనంజలి చేయ దగును.Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.