జైశ్రీరామ్.
26, ఏప్రిల్ 2024, శుక్రవారం
మా తమ్ముఁడు దత్తాత్రేయ ప్రతిభార్ణవం.
1 comments
25, ఏప్రిల్ 2024, గురువారం
ఈ ప్రశ్నకు మీరు జవాబు చెప్పగలరాTelugu Sahitya kathalu | | @SWADHARMAM
0 comments
తెలుగు సాహిత్య కథలు. | ఈ ప్రశ్నకు మీరు జవాబు చెప్పగలరా ?
0 comments
పంచ పాషాణాలు
0 comments
జైశ్రీరామ్.
మహా కవి భారవి పద్యం
షడ్జామడ్జ ఖరాడ్జ వీడ్జ వసుధాడ్జాలాంశ్చ మడ్గాఖరే
జడ్జట్కిట్కి ధరాడ్జరేడ్ఫణ ఘణః ఖడ్జోత వీడ్యద్భ్రమా
వీడ్యాలుడ్భ్రమ లుట్ప్రయట్రియపదాడ్గ్ర్య డడ్గ్రడ్గ్రహా
పాదౌ టేట్పర్బటట్ప్రటప్రటట్రసప్రఖ్యాస సఖ్యోదయా.
వాశ్శ్చారేడ్వజధగ్ధృతోడ్వధిపతిఃకుద్రేడ్జజానిర్గణే
ల్గోరాడారురుడురసరస్సరేడురుతరగ్రైవేయకభ్రాడరమ్
ఉడ్వీడ్దృగ్నరకాస్థిదృత్ త్రిదృగిభేడార్రాజినాఛ్ఛాదనః సస్యాదంబునుదంబుదాభగళరుగ్దేవోముదేవోమృడః
తిగ్మత్విట్సితరుక్సుదృగ్యుగలధృద్వక్షోధృతాబ్జాక్షియుక్
పక్ష్యారుట్ఫణిరాటయోధృతమహీభృద్రాణ్ మహాచక్రవాట్
పాయాన్నో ఘధగంబుముఘునరుచి:ద్యోద్విడ్వదబోవిత్
భక్తాభీష్ట గ కామగుక్కునవసృట్టహ్మాండరట్రీ విరాట్.
దైత్యేడ్డ్విట్వజవీడృతాద్రిరఘధగ్ధర్మప్రరీడ్విశ్వసృట్
రక్షఃప్రేక్షణభీర్ధనుర్ధధృణిభేడ్రట్కైటభద్విడ్రమేట్
దేవేడీడితపత్సునాతువిహగేడారుట్లయావాడ్విరాట్
స్వస్వద్దృగ్జ్బహురుగి సౌహ్యుడుపనేడ్రుగ్మృడ్వరత్విడ్విభుః
శ్రీభ్వీట్కుధ్రభృదబ్రుఙుద్భవశివేట్ఛక్రాదిలేఖేడ్య పచ్ఛార్జ్లచ్ఛి
న్నరిపుచ్ఛిదిద్ధవిశిఖాచ్ఛన్నచ్ఛవిద్విటి ్ఛరాః
శాక్తార్థ్యాస్వహసం స్ఫురత్సవఘథర్భేష క్షితిథ్రక్షయో
దద్యాత్స్వస్యదరీదరీలసదరీనీలస్సనీలస్స నః .
పాల్కుర్కి సొమనాధకవి పద్యాలు
టటకిట టట్టకిట్టటట కిట్టటటట్ట టకిట్టటట్టకి
ట్టటకిట టట్టకిట్టట కిటట్టట టోన్ముఖటింక్రుతిస్ఫుటో
త్కటపటహాదినిస్వన వియత్తలదిక్తటతాటితార్భటోద్భట
పటుతాండవాటన "ట" కారనుత బసవేశ పాహిమాం
డమరుగజాత డండడమ్రుడండ మ్రుడండ మ్రుడండ
మ్రుండమ్రుం డమ్రుణ మ్రుడండడండ మ్రుణడండడ
డండ మ్రుడం డమ్రుం డమ్రుం డమ్రుణమ్రుడండడంక్రుతి
విడంబిత ఘూర్ణిత విస్ఫురజ్జగ త్ప్రమధన తాండవాటన
"డ" కారనుత బసవేశ పాహిమాం!
ఢణ ఢణ ఢం మ్రుఢం మ్రుఢణఢం మ్రుణఢం మ్రుణ
ఢంఢణోద్ధణం ధణనటన త్వదీయడమరూత్థ
మదార్భట ఢంక్రుతి ప్రజ్రుంభణ త్రుటితాభ్రతార గణరాజ
దినేశముఖగ్రహప్రఘర్ క్షణగుణతాండవాటన
"డ" కారనుత బసవేశ పాహిమాం!
ణణ్మ్రుణ ణణ్మ్రుణ ణ్మ్రు ణణ ణణ్మ్రుణ ణ ణ్మ్రుణ ణణ్మ్రుణ
ణ్మ్రుణణ్ణ ణ్మ్రుణ న్రుత్వదీయసుఖ విక్రమ జ్రుంభణ
సంచలన్నభో ణ్ణ ణ్మ్రుణ ది క్క్వణ ణ్మ్రుణణ ణణ్మ్రుణ
ణణ్మ్రుణ ణణ్మ్రుణ స్వనణ్ణ ణ్మ్రుణ తాండవాటన
"ణ" కారనుత బసవేశ పాహిమాం!
జైహింద్.
మూకపంచశతి ప్రవచనము 1వ భాగము .. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ. Mookapanchasathi Part 1 Video | Samavedam Shanmukha Sarma Pravachanam |...
0 comments
బ్రహ్మశ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ TTD Asthana Vidwamsulu G.Balakrishna Prasad Exclusive Interview | iDream...
0 comments
విలోమ చిత్ర శ్లోకము
0 comments
జైశ్రీరామ్
ఈ శ్లోకం మొదటి నుండి తుది వరకు చదివినా, తుది నుండి మొదటి వరకు చదివినా, అర్థం చెడకుండా అవే అక్షరాలు.
భోజరాజ మహ దేవ - కాళిదాస మనోహర
రహనోమ సదాళికా - వదేహ మజరాజభో.
జైహింద్.
తలకట్ల కందము.
0 comments
జైశ్రీరామ్
తలకట్ల కందము.
పరమదయాకర శుభకర
నరవరనుత గరుడగమన నగధరపరమా
మురహర భవహర మాధవ
ధరధరనుత ధవళనయన దశరధతనయా॥.
జైహింద్.
23, ఏప్రిల్ 2024, మంగళవారం
యావత్స్వస్థో హ్యయం దేహో ... మేలిమి బంగారం మన సంస్కృతి.
0 comments
జైశ్రీరామ్
శ్లో. యావత్స్వస్థో హ్యయం దేహో - యావన్మృత్యుశ్చ దూరతః |
తావదాత్మహితం కుర్యాత్ - ప్రాణాన్తే కిం కరిష్యతి ||
తే.గీ. స్వస్థతన్య్గల్గునన్నాళ్ళు సన్మనమున
మృత్యువొందకమునుపె సత్ స్తుత్యముగను
ధర్మమాచరించుట మన ధర్మమౌను,
మృతుఁడు చేయలేడేమియు క్షితిని దలప.
భావము. ఈ శరీరమెంతకాలము రోగము లేనిదై సాస్థ్యము కలదై యుండునో,
యంతవఱకు తనకు మేలు కలిగించు శుభకర్మలను, ధర్మాచరణము,
పుణ్యకర్మలు చేయవలెను. మరణించిన తరువాత యేమి చేయలేముకదా.
జైహి<ద్.
22, ఏప్రిల్ 2024, సోమవారం
షష్టిపూర్త్యుత్సవములు .. నోరి నరసింహ శాస్త్రి.[ఆంధ్రపత్రిక_ఖరసంవత్సరాది సంచిక 1951.52]
0 comments
జైశ్రీరామ్.
షష్టిపూర్త్యుత్సవములు .. నోరి నరసింహ శాస్త్రి.
విజ్ఞులైనవారు షష్ఠిపూర్తికి ఉత్సవ మేమని ప్రశ్నింపవచ్చును. అయితే యీనాడుపలువురు పెద్దలకు జరిగిన, జరుగుచున్న, జరుగనున్న షష్ట్యబ్దపూర్త్యుత్సవములను గూర్చి పత్రికలలో తరుచుగా చదువు చున్నాముగదా! కాబట్టి యామాట మనకు పరిపాటియైపోయినది. అందుచే దానిలోన సంబద్ధ మేమియుస్ఫురింపదు ఐనను గోకులాష్టమికిని, పీర్ల పండుగకును కల సంబంధమే షష్ఠిపూర్తికిని, ఉత్సవములకును గలదనుట సత్యము !
గోకులమున లోకసంగ్రహమునకై శ్రీకృష్ణభగవాను అవతరించిన మహాపర్వమును ఏటేట స్మరించుచు నానందముతో భారతీయులు జరుపు కొను నుత్సవము గోకులాష్టమి. బర్బరదేశములో వీరులు చనిపోయిన వేళను స్మరించుచు ఏటేట ముసల్మానులు దుఃఖముతో వాపోవునది మొహరము. ఒకటి ఆనందకారణమును స్మరించునది, మరియొకటి దుఃఖకారణమును స్మరించునది; ఒంటి భారతీయులది, మరియొకటి ముసల్మానులది. దుబకారణము కనబడినప్పుడు ఉత్సవము చేసికొను వారెవరైన నున్నచో, నట్టివారు షష్ఠిపూర్తిని ఉత్సవవేళగా భావింప వచ్చును.
మూలానక్షత్రముననో, జ్యేష్ఠయందో, కాక ఆ రెండు నక్షత్రముల సంధికాలమగు అభుక్తమూలమందో దంపతులకు కుమారుడు కలిగినచో వారేమి చేయుదురు: అట్టి దంపతులు లోకపూజ్యు అనుకొందము. అట్టి పుత్రు డట్టి వేళ వారికి జన్మించి నందుకు, వారి యదృష్టమునకు వారి నభినందించుచు ఆంధ్రదేశములోని పెద్దలందరును విరాళము లొసగి మహాసభ కావించి గౌరవించి యుత్సవ మొనర్తురా? అట్లు చేసినచో నది యెంత యసంబద్ధముగా నుండునో, షష్ట్యబ్దపూర్తి సమయమున ఉత్సవము జరుపుటయు నంత యసందర్భమే !
మా చిన్నతనములో షష్టిపూర్తికి ఉత్సవములు చేయునాచారము కనిగాని వినిగాని యెరుగము. అప్పటి కింకను ఉత్సవాదులు నిర్ణయించునది తద్విదులగు పండితులే కాని ఉత్సాహోద్రేకపూరిత మగు జనసామాన్యము కాదు. ఇప్పుడు మాత్రము ఈ యుత్సవములు సర్వసామాన్యమైనవి. నామకుడ ననుకొను ప్రతి వ్యక్తియు అరవదియవ పడిలోపడగనే, నా షష్ట్యబ్దపూర్తి యెప్పుడా, యని వృద్ధవరుడు వివాహోత్సవమునకు వలెనే ఉవ్విళ్ళూరుచుండుట చూచుచున్నాము.
ఈ మార్పుకు కారణ మేమి? శ్రీ పానుగంటివారి 'కంఠాభరణమే దీనికి మూలమని నా విశ్వాసము. ఆ నాటకము చదివిన వారును, ప్రదర్శింపగా చూచినవారును షష్టిపూర్త్యుత్సముల కుపక్రమించినట్లు. తోచును. అందులో సుబ్బిసెట్టికి అరవై యేళ్ళు నిండినవి. పాప మాతనికి.. ఉత్సవము చేయువా రెవరును ఊరిలో లేకపోయిరి. అంతట నాతడు, 'ఈ కాస్త భాగ్యానికి ఇంకొకరు చేసే దేమిటి? మనమే చేసికొందామని’ ఉపక్రమించినాడట !
‘షష్టిపూర్తి’ నిజముగా తానే యేదో చేసికొనవలెగానీ, ఇతరులు తన కిప్పు డుత్సవము చేయదగినదికాదని శ్రీ పానుగంటివారు తెలియకవ్రాసిరో, తెలిసియు చమత్కారమునకు వ్రాసిరో, మనము చెప్పజాలము కాని, ఆ భాగము చదివినప్పుడు గాని, ప్రదర్శింపగా చూచినప్పుడు గానీ పాఠకులును, ప్రదర్శకులును కడుపుబ్బ నవ్వకుండ నుండరు. కానివా స్తవ మెరింగినచో, అట్లా పాఠకులును, ప్రేక్షకులును నవ్వుట చూచి, నవ్వుకొన దగినవాడు సుబ్బిసెట్టియే !
షష్టిపూర్తికి చేయదగినది యుత్సవము కాదు, శాంతి. మూలా నక్షత్రాదులలో పుత్రజననమైనచో చేయదగిన దానికంటే తీవ్రతరమగు శాంతి, షష్ట్యబ్దపూర్తికి చేయవలెను. ఏ శాంతికర్మలలోనై నను ప్రధాన మైనవి దానములు, జపములు, హోమములు: దానము లనగానితరులకు ద్రవ్యము తామే యిచ్చుటగాని, యితరుల యొద్దనుండి పరిగ్రహించుట కాదు !
శాంతీకర్మలు ప్రదర్శించు గ్రంథములు పరిశీలించినవారికి ఉగ్రరథశాంతి, భీమరథశాంతి, విజయరథశాంతి అను మూడు శాంతులు గోచరించియుండును. వానిలో అరువదవయేట ఉగ్రరథ శాంతియు, డెబ్బదియవయేట భీమరథశాంతియు, డెబ్బదియెనిమిదవ యేట విజయరథశాంతియు, నాచరింపదగినవి. అందులో షష్టిపూర్తికి చేయవలసిన ఉగ్రరథశాంతినిగూర్చి యొకింత విచారింతము.
నాకు తెలిసినంతవరకు ఈ ఉగ్రరథశాంతికర్మ చేయుటకు మూడు విధానము లున్నవి. ఒకటి శౌనకోక్తము, ఇంకొకటి బోధాయనోక్తము, మరియొకటి శై వాగమోక్తము. ఈ మూడింటి ప్రక్రియలును, మూలసూత్రముల నొకటియేయైనను, తంత్రము న లోనను విశేషభేదము లున్నవి. వానిలో నెల్ల బహువిస్తృతమైనది. దాని నున్నదున్న మహారాజో చక్రవర్తియో! ఐనను యథాశక్తిగా ఆచరింపవచ్చును. అట్టిది ఒకసారి చూడగలిగి యద్భుతరూపము, లీలామాత్రముగనైనను, గో యోక్తి కానేరదు.
ప్రయోగవి స్తృతిలో నెన్ని భేదము విధించినది శాంతియే యనుట కెట్టి సందేహము లేదు. శౌనికుఁడిట్లు చెప్పుచున్నాడు.
‘`జన్మత ష్షష్టి మే వర్షే మృత్యు రుగ్రరథోనృణామ్
షాణ్మాసాన్మృత్యు మాప్నోతి ధనహానిశ్చ జాయతే
పుత్రనాశోదారనాశో ధననాశ స్తథైవ చ
తద్దోష శమనార్థాయ శాంతిం కుర్యాద్విచక్షణః
జన్మాల్దే జన్మమాసేచ స్వజన్మదివసే తథా
జన్మర్జేచైవ కర్తవ్యా శాంతి రుగ్రరథాహ్వయా
దేవాలయే నదీతీరే స్వగృహేవా శుభస్థలే....'”
జన్మాదిగా నరువదియవయేట నరులకు, మృత్యువు ఉగ్రరథ రూపమున నావేశించి, వారికేకాక వారి పుత్రులకు పత్నులకు నాశమును ధనక్షయమును కలిగించును !
అదియే శైవాగమములో నిట్లు చెప్పబడియున్నది. ఈశ్వరుని గుహుడు దానినిగూర్చి ముం దిట్లు ప్రశ్నించినాడు:
స్వామి న్నుగ్రరథి నామ సర్వప్రాణిభయంకరః పుత్రిపౌత్రక్షయకరో ధనధాన్య వినాశనః రాజ్యభ్రంశకరో రాజ్ఞాం ఇత్యేవం బహుశశ్ర్శుతమ్.”
అది నిజమే యని యీశ్వరు డిట్లు వర్ణించెను.
'సాధుతే కథయిష్యామి తముగ్రరథమాదరాత్
మహామృత్యుసమః ప్రోక్తః ప్రాణినాం సర్వనాశనః .
మహాకాయో మహాదంష్టో ఘోరరూపే భయానకః
ఆవిర్భావే యస్యపుత్ర ధనధాన్యాది నాశసమ్
భవేత్పీడాచ మహతీ రాజ్ఞాం రాజ్యవినాశనమ్
అనావృష్టిశ్చమహతీ శత్రుపీడా తథై వచ
గజాశ్వరథనాశశ్చ స్వరాజ్యాద్య్రంశనం తథా
ప్రొ దుర్భావే భవస్త్యేతే దోషా ఉగ్రరథస్యవై
ఉత్పత్త్యబ్ది రుగ్రరథ ష్షష్ఠిమేద్దే ప్రకీర్తితః
యస్యావిర్భావమాత్రేణ సంసారీ భయమాప్నుయాత్.’
వీనినిబట్టి చూడగా అరువదియవయేడు ప్రవేశించుటయే భయంకర మైనది. అప్పుడు మహామృత్యుసముడగు ఉగ్రరథుడు ఆవిర్భవించును• కావున వెంటనే యథాశక్తిగా నుగ్రరథశాంతి యాచరించుట శ్రేయస్క రము.
ప్రయోగములతో మృత్యుంజయ దేవతా కలశ కలశస్థాపనము, తత్ప్రతిమాస్థాపన పూజనములు ముఖ్యములు. అట్లే దుర్గను, గణేశుని,
విష్ణువును, సముద్రములను, నదులను, దిక్పాలురను, నవగ్రహములను, చిరజీవులను కలశములలో నావాహన మొనర్చి త త్తత్ప్రతిమలు
సువర్ణముతో నొనర్చి పూజాదికము చేయవలెను, మరియు కలశములలో నావాహనచేసి పూజింపదగినవారు — అరువదిమంది సంవత్సర దేవతలు, ఆయన దేవత లిద్దరు, ఋతువులు, మాసములు, పక్షములు, తిథులు, వారములు, తారలు, యోగములు, కరణములు, రాసులు పండ్రెండు, పంచబ్రహ్మలు, స ప్తవాయువులు, అష్టవసువులు, దశదిక్కులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు' — ఈ యధిష్ఠానదేవత లందరిని వేరువేరుగా కలశములలో నావాహన మొనర్చి సువర్ణప్రతిమలుంచి పూజాజపములు వేర్వేర నొనర్చి తిలదూర్వాంకురాదులతో హోమములు చేయవలెను. తుదకు యజమానిని ఆయుస్సూ క్తము, మృత్యుసూక్తము ఇత్యాది
మంత్రములతో కలశోదకముల నభిషేకింపవలెను. ఆ పిమ్మట యజమాని ఆచార్యునకు, ఋత్విక్కులకు ప్రతి మాదికములు దానమొనర్చి, మరియు కంబళదానము, గోదానము, కార్పాసదానము, ఆయసదానము, దశదానములు, నవగ్రహ ప్రీతికరములగు నవధాన్యదానములు ఇత్యాది దానము లొనర్చి, బ్రాహ్మణుల భుజింపజేసి దీనులను అనాధులనుగూడ తుష్టి నొందింపవలయును. ఇట్లు చేసినచో నరువదియవయేట నావేశించు నుగ్రరథుడు శాంతించును; దీర్ఘాయుర్దాయము కలిగి పుత్రపౌత్ర వంతుడై సుఖముండును. ఇట్టిది ముఖ్యముగా షష్టిపూర్తికి చేయవలసిన క్రియ !
యుత్సవ సమయమని ప్రవర్తించుట మాత్ర మంతకంటె వేయిమడుగు లెక్కువ తప్పు; పై పెచ్చు, ఇది ఎంతో ప్రమాదకరమైన పొరపాటు ! నవ్వుకొనునట్టిది కాదు.
శత సంవత్సరములు జీవించినవారును. సహస్ర చంద్రదర్శనము చేసిన వారును గూడ శతాభిషేకమను నొక శాంతి చేసికొనవలెను. అనియు శాంతులే యైనను అందులో ఉత్సవ విశేషము కూడ నున్నది. వానివలన ఫలముకూడ పీడానివృత్తిమాత్రమే కాదు. అందులో శతాభిషేకమైన తర్వాత యజమాని ంథమెక్కి, స్వస్తి వాచనములతో దుందుభిశబ్ద పురస్పరముగా గ్రామము ప్రదక్షిణము చేయును. ఇది`
యొనర్చినచో నాతనికి లభించు ఫలమొక్క పీడానివృత్తియే కాదు. అట్టివాడు తనకు పూర్వులగు పదితరముల వారిని, తన్ను, తన తర్వాత పచ్చు మరి పదితరముల వారిని పునీతుల నొనర్చి, తాను పుత్రపౌత్రు లతో షష్ఠివర్ష సహస్రములు స్వర్గలోకమున నుండి, యా పిమ్మట బ్రహ్మసాయుజ్య సాలోక్యముల నందునట. ఇవి బోధాయన భగవానుల వాక్యములు !
5
నా మిత్రులలో పలువుర షష్టిపూర్తి సమీపించు చున్నది. వారును
ఆ సమయమున తమ్ము ఆంధ్రలోక మెట్టి యుత్సవ మొనర్చి సమ్మా
నించునో యని నిరీక్షించుచు ఉవ్విళ్ళూరుచుండ వచ్చును. వారిలో
కొందరికి, అది యొక వేడుకయేకాక, అవసరమగు ధనసంపాదనకు
మూలమగు మార్గమును కావచ్చును. అట్టివారు ముఖ్యముగా ఈ వ్యాస
రచయితను ప్రత్యక్షముగా గాకున్న మనస్సులోనైన నిందింపకపోరు.
అందుచే నాకు కొంత ప్రత్యవాయ ముండవచ్చును. కాని షష్టిపూర్తి
సమ్మాన సంఘములవారు చేయు బలవంతములకు మోమోటపడి
విరాళము లిచ్చు వారిలో పలువురుమాత్రము అది తప్పిపోయినందుకు,
ఆనంద పూర్వకముగా నాశీర్వదింతురు గదా !
షష్టిపూర్తి దగ్గరపడిన మిత్రు లందుచే దాని స్వరూప మెరిగి, యథాశ క్తిగా తమ ద్రవ్యము వ్యయ మొనర్చి శాంతి గావించుకొని,చిరజీవులై, సహస్రచంద్ర దర్శనులు, శత సంవత్సర జీవులునై, అప్పుడు చేయవలసిన యుత్సవము చూచి యానందింప మా కావకాశ మిత్తురుకాకః వారును పునీతులై ముందు ముందు ఉత్తమలోకములు ప్రాపింతురు గాక !
[ఆంధ్రపత్రిక_ఖరసంవత్సరాది సంచిక 1951.52]
జైహింద్.
నా క్షీరాబ్ధి పుత్రీ!రమా! శతకమున వీణా బంధము.
0 comments
శాII శ్రీమన్మంగళరూపిణీ! జయమగున్
జింతింప తోపెల్లకున్,
శ్రీమన్మంగళమౌత
దీనులకు, వాసిన్ గన్న స్త్రీ జాతికిన్,
శ్రీమన్మంగళమౌత
మాకు, నిలపై శ్రీదేవి వెల్గొందగా,
శ్రీమన్మంగళ
భాగ్యదాయిని! మహా క్షీరాబ్ధి పుత్రీ! రమా! ౧౦౮.
జైహింద్.
21, ఏప్రిల్ 2024, ఆదివారం
మాలికాబంధ స్రగ్ధర వృత్తము. ... రచన చింతా రామకృష్ణారావు.
0 comments
జైశ్రీరామ్.
మాలికాబంధ స్రగ్ధర వృత్తము.
శ్రీరామా! రావ! రాజా! శ్రిత నుత మత! రాజీవభావస్థవర్య్ణా!
కోర న్నిన్ రక్ష, రమ్యా! గుణ
గణ చణ! నేఁ గోర నే రమ్యరత్నాల్,
శ్రీరాశుల్, రామరాజా! చిర పర మరయన్ జేరనీ, రమ్య రక్షన్,
మారాకారా! వరాంగా! మనమున గన నిమ్మా! రమారమ్య రత్నా!
బంధ నిర్మాత శ్రీమతి మోతె హరిప్రియ గారికి,
రంగులు దిద్దిన శ్రీమతి హంసగీతి గారికి నా ధన్యవాదములు.
ఈ చిత్రమును వీరిని ప్రేరేపించి వేయించిన బ్రహ్మశ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మ సహోదరులకు అమ్మవారి ఆశీస్సులను అర్ధిస్థున్నాను.
జైహింద్.
శ్రీమన్నారాయణుండా!
0 comments
జైశ్రీరామ్.
స్ర. శ్రీమన్నారాయణుండా! శ్రితజనవరదా! చిత్త సంభాస దేవా!
ప్రేమాంభోధీ! నుతింతున్, విమతజనహరా! విశ్వసంసేవ్య దేవా!
క్షేమంబిచ్చున్ సతంబున్ శ్రితజనతతికిన్, శ్రీకరంబైననీదౌ
నామంబయ్యా! మురారీ! ననుగనుమఖిలా! నామనోనాయకుండా!
జైహింద్.
20, ఏప్రిల్ 2024, శనివారం
అంశం:- దత్త పది ఇడ్లీ, పూరీ, ఉప్మా, కాఫీ, ఈ పదాలాతో, ముంబయి మారణ కాండని, గజేంద్ర మోక్షానికి అన్వయిస్తూ, మత్తేభంలో పద్యం చెప్పాలి. నా పూరణ.
0 comments
జైశ్రీరామ్.
సోమవారం 26 జూలై 2010
అంశం:- దత్త పది
ఇడ్లీ,
పూరీ,
ఉప్మా,
కాఫీ,
ఈ పదాలాతో, ముంబయి మారణ కాండని, గజేంద్ర మోక్షానికి అన్వయిస్తూ,
మత్తేభంలో పద్యం చెప్పాలి
ఈ సమస్య అడగదగినదేనా? ఒక వేళ అయినచో మీరు పూరించగలరా?
నేను ఏవో చిన్న చిన్న కంద పద్యాలు వ్రాయగలను గానీ, వృత్తాలు కష్టం.
దయచేసి సహాయము జేయఁ గలరు. ఒకవేళ ఇది కష్టతరమైనచో, కొన్ని
మార్పులు చేసి, పద్యమునందించగలరు.
This mattebhamu, does not permit the avadhani to use any of
these words to begin the poem as all of them start with a
guruvu and to my knowledge, there are no words that star
with డ్లీ and ప్మా.
So, it will be interesting to see how the avadhani can
crack this?
Any thought? Please let me know at your earliest. I am consulting
some people to see if this is possible.
కృతజ్ఞలతో,
ధవళ సోమశేఖర్.
నా పూరణ
మll
కసభుక్కీల దురంత నక్ర మిచటన్ "కాల్చుండిదిడ్లీ యనన్"
ముసుగుల్ దాలిచి పట్టె మమ్ము గనుడీ! పూరీ జగన్నాయకా!
ఉసురుల్ తీయగ నుండె కావు డిలలో ఉప్మాక దేవా మమున్!
విషమంబియ్యది. ఇట్టి చిన్న పనికా ఫిర్యాదటం చెంచకన్!
(ఇక్కడ నా మనోగతమును మీకు కొంచెం వివరిస్తున్నాను.
కాల్చుండు + ఇది + ఈ + ఢిల్లీ + అనన్ > కల్చుండిది +ఇడ్డిల్లీ + అనన్ >
కాల్చుండిదిడ్లీ యనన్ = ఇదే ఢిల్లీ; కాల్చేయండి అని సందేశమివ్వగానే)
భావము:-
టెఱ్ఱరిష్టులు వేసే గడ్డి తినే కసబ్ అనెడి పేరు గల అగ్ని జ్వాల యనెడి మొసలి
ఇక్కడ " ఇది ఈ ధిల్లీయే; కాల్చుఁడు " అని పలుకగానే చెలరేగిన పొగ యనెడి
ముసుగులు ధరించి మమ్ము పట్టుకొనెను. ఓ పూరీ జగన్నాయకా!
ఓ ఉప్మాక వెంకటేశ్వరా! ఇది చూడండి. మాప్రాణములు తీయుటకు
సిద్ధముగా నుండెను. ఇది మాకు మిక్కిలి విషమ మయిన సమయము.
" ఇటువంటి చిన్న పనికేనా ఇలా ఈ మానవకుంజరములు పిర్యాదు
చేయుచున్నవి " అని మాత్రము భావించక భూలోకములో మమ్ములను కాపాడండి.
ఇదండీ నామెదడుకు తోచిన ముంబాయ్ కాల్పుల గజేంద్ర మోక్షం.
ఇది గొప్పగా ఉందని నేననుకోను. ఆ విషయంలో లోపాలోపాలను సూచించే
పాఠకులే నా కవితకు మెఱుగులు దిద్దే నిపుణులు.
ఏది యేమైనా సరే ఒకటి యదార్థమండి నావిషయంలో. ఆశారదామాత
కనికరించిందా. పద్య రచన ; పూరణ; పెద్ద పనికాదు. ఆమె కటాక్షమే లేకుంటే
చాలా చిన్న పదమైనా; తప్పే వ్రాయడం జరుగుతుంది. అంతా ఆ
సరస్వతీదేవి కటాక్షం చేతనేనండీ యీ జరుగుతున్న దంతా.
ఇక మీరూ ప్రయత్నించారంటే ఈమాత్రం పద్యం రచించ లేకపోతారా!
ఇంతకన్నా అద్భుతంగా పూరించ గలరని నా ప్రగాఢ విశ్వాసం.
నా నమ్మకం ఒమ్ము కాదని నా విశ్వాసం. ఇంకెందుకు ఆలస్యం?
వెంటనే ప్రయత్నించండి. మీ పూరణలను కామెంట్ ద్వారా అందఁ
జేయమని నా మనవి.
శనివారం 24 జూలై 2010
జైహింద్.